Site icon NTV Telugu

కోర్టుల్లో భారీగా ఏపీ పెండింగ్‌ కేసులు.. రోజుకు సగటున 450 పిటిషన్లు..!

ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పెండింగ్‌ కేసులు దాదాపు 2 లక్షలుగా ఉన్నాయి… ప్రస్తుతం హైకోర్టు, సుప్రీంకోర్టులో కలిపి వివిధ కోర్టుల్లో 1.94 లక్షల మేర పెండింగ్‌ కేసులు ఉన్నట్టు గుర్తించింది ప్రభుత్వం.. ఇక, దీనికి తోడు ప్రస్తుతం రోజూ సగటున 450 కొత్త దావాలు దాఖలవుతున్నాయని చెబుతున్నారు.. ఈ కొత్త పిటిషన్లకు సమాధానమివ్వడానికే ప్రతి రోజూ కనీసం 40 వేల పేజీల పేపర్‌వర్క్‌ చేయాల్సి వస్తోంది. మాపై లిటిగేషన్ల భారం ఎంత ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనం అంటున్నాడు ఓ అధికారి.. రాష్ట్ర వ్యాప్తంగా 8 వేల కోర్టు ధిక్కారణ కేసులు ఉన్నట్టు గుర్తించారు అధికారులు. గ్రామ కార్యదర్శి స్థాయి నుంచి ప్రధాన కార్యదర్శి వరకు కోర్టు ధిక్కరణ కేసులున్నాయంటున్నారు అధికారులు. 100కు పైగా పిటిషన్లకు కౌంటర్‌ అఫిడవిట్లు కూడా ఆర్థికశాఖ దాఖలు చేయలేదని చెబుతున్నారు.. సుదీర్ఘ కాలంగా కేసులు పెండింగ్‌లో ఉండడం ఇబ్బందిగా మారిందని అధికారులు చెబుతున్నారు.. పెండింగ్‌ కేసుల క్లియరెన్స్‌ కోసం ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్‌ పెట్టాలని అధికారులు సూచిస్తున్నాఉ.. శుక్రవారం రోజు విజిలెన్స్‌ కమిషనర్‌ వీణా ఈష్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పెండింగ్‌ కేసుల అంశాలను వివిధ శాఖల ఉన్నతాధికారులు వివరించారు.

Exit mobile version