Site icon NTV Telugu

పీఆర్సీపై గుడ్‌న్యూస్‌ చెప్పిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ కోసం ఉద్యోగ సంఘాలు ఆందోళనబాట పట్టాయి… ఇందులో భాగంగా భవిష్యత్ కార్యాచరణపై సీఎస్ సమీర్ శర్మకు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. వారంలోగా ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమంలోకి వెళ్తామని హెచ్చరించాయి.. అయితే, ఇవాళ పీఆర్సీపై కీలక ప్రకటన చేశారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం జగన్‌ను తిరుపతిలోని సరస్వతీ నగర్‌లో ఉద్యోగుల తరపున కొందరు ప్రతినిధులు కలిశారు.. ఈ సందర్భంగా.. పీఆర్సీపై సీఎంకు విజ్ఞప్తి చేశారు.. దీనిపై స్పందించిన సీఎం వైఎస్‌ జగన్.. పీఆర్సీ ప్రక్రియ పూర్తి అయినట్టు తెలిపారు.. ఇక, పదిరోజుల్లో ప్రకటన చేస్తామని తెలిపారు.. ఈ మేరకు సీఎం జగన్‌ హామీ ఇచ్చారని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. కాగా, ఎంతో కాలంగా పీఆర్సీ కోసం ఉద్యోగుల ఎదురుచూస్తుండగా.. మరో పది రోజుల్లో ప్రకటిస్తామని హామీ ఇచ్చి.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పారు సీఎం వైఎస్‌ జగన్.

Read Also: ‘జవాద్’ ముప్పు.. ఆ జిల్లాల అధికారులకు కీలక సూచనలు

Exit mobile version