బద్వేలు ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి ఎవరు అనే దానిపై చర్చలు జరుపుతున్నారు. ఈరోజు లేదా రేపటిలోగా ఈ వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నది. ఇక ఉప ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు రావాలని పవన్‌ను కోరతామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. భవిష్యత్తులో బీజేపీ, జనసేన పార్టీల పొత్తు కొనసాగుతుందని అన్నారు. పవన్‌పై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు. విమర్శలు చేసేటప్పుడు గౌరవప్రదమైన పదజాలాన్ని వినియోగించాలని, వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని, కులాలను రాజకీయాల్లోకి లాగొద్దని అన్నారు. టీడీపీ, జనసేన పార్టీలు దగ్గరవుతున్నాయనే ప్రచారంపై తాను స్పందించనని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Read: ఇది మామూలు ఉడత కాదు… కారులో 152 కేజీల వాల్‌నట్స్ దాచింది…