ఆ ప్రకటనలకు ఇక దూరం.. అమితాబ్ నిర్ణయంపై ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ సంచలన ప్రకటన చేశారు. ఆయన ఒక పాన్ మసాలా ప్రొడక్ట్ తో కుదుర్చుకున్న బ్రాండ్ అంబాసిడర్ కాంట్రాక్టును రద్దు చేసుకున్నారు. అలాగే ప్రమోషనల్ డబ్బులను కూడా వాపసు ఇచ్చేశారు. ఈ పాన్ మసాలా ప్రకటనను చట్టం నిషేధించిన సరోగేట్ యాడ్స్ గా పరిగణిస్తారని బిగ్ బీకి తెలియక ఒప్పుకున్నట్లు ఆయన టీమ్ చెబుతోంది. గుట్కాకి బదులుగా పాన్ మసాలా అని ప్రకటనలో రూపంలో అందరికీ తెలియచేయడం జరుగుతుంది. అయితే ఇలాంటి పాన్ మసాలాను అమితాబ్ బచ్చన్ ప్రమోట్ చేస్తుండడంతో ఓ యాంటీ-టొబాకో సంస్థ ప్రచారం ఆపాలని అతనికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. అమితాబ్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ప్రజారోగ్యం కోసం బిగ్ బి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాయి సలాం బాంబే, ఇండియన్ క్యాన్సర్ సొసైటీ, ఇండియన్ డెంటల్ అసోసియేషన్, హీలీస్ షేక్ శారియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వంటి సంస్థలు.
పొగరాకుండా నమిలే ఖైనీ, గుట్కా ఉత్పత్తుల వల్ల క్యాన్సర్ వస్తోంది. ఇలాంటి పాన్ మసాలాను ప్రమోట్ చేయకూడదని బిగ్ బీ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. భారతదేశంలో సంభవిస్తున్న మరణాలకు, వ్యాధులకు పొగాకు వాడకం ఒక ప్రధాన కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వేలో తెలిపింది. పొగాకు వినియోగం ప్రతి సంవత్సరం దాదాపు 1.35 మిలియన్ల మరణాలకు కారణమవుతుందని సంస్థ తెలిపింది. వీటినుంచి యువతను రక్షించేందుకు యాంటీ టొబాకో ఆర్గనైజేషన్ నడుం బిగించింది. ఈ నేపథ్యంలో గత నెలలో భారత సినీ దిగ్గజం అమితాబ్ బచ్చన్ కు నేషనల్ యాంటీ టొబాకో ఆర్గనైజేషన్ సంచలన లేఖ రాసింది. పాన్ మాసాలాను ప్రచారం చేసే వాణిజ్య ప్రకటన నుంచి వైదొలగాలని లేఖలో కోరింది.
Also Read
- Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
- Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
- Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
- DK.Shivakumar: డీకే.శివకుమార్ కేబినెట్‌పై విమర్శలు.. మహిళలకు చోటు లేకపోవడంపై నిలదీత
ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రకటనల నుంచి అంగీకరించవద్దని కోరింది. ఈ మేరకు నేషనల్ యాంటీ టొబాకో ఆర్గనైజేషన్ అధ్యక్షుడు శేఖర్ సల్కర్ బిగ్‌బీకి లేఖ రాశారు. అమితాబ్ హై ప్రొఫైల్ పల్స్ పోలియో ప్రచారానికి ప్రభుత్వం తరపున బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్నారని… అలాంటి వ్యక్తి ప్రజల ఆరోగ్యాన్ని క్షీణింపజేసే పాన్ మసాలా యాడ్ లో నటించడం సరికాదని లేఖలో శేఖర్ సల్కర్ అన్నారు. వీలైనంత త్వరగా అమితాబ్ ఈ యాడ్ నుంచి తప్పుకోవాలని… అప్పుడు పొగాకు వ్యసనానికి యువత దూరమయ్యేందుకు దోహదపడినట్టవుతుందని చెప్పారు. ఈ లేఖపై స్పందించిన అమితాబ్ పాన్ మసాలా ప్రకటనలనుంచి వైదొలిగారు.
తాజావార్తలు
-
RCB Player: అభిమానులకు బిగ్‌షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన కీలక ప్లేయర్..
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
-
MS Dhoni: ఇన్వెస్టర్లకు అదిరే న్యూస్.. ధోని మద్దతిస్తున్న కంపెనీ ఐపీఓకు రెడీ.. రూ.1500 కోట్లే లక్ష్యంగా..
-
Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!