Site icon NTV Telugu

అమెరికా హెచ్చరిక.. 36 గంటల్లో కాబూల్‌లో మళ్లీ ఉగ్రదాడులు..!

ఆఫ్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌ సహా చాలా ప్రాంతాలు తాలిబన్ల వశం అయిన తర్వాత కూడా హింస సాగుతోంది.. వరుసగా బాంబు పేలుళ్లు కాబూల్‌ వాసులను వణికిస్తున్నాయి.. ఇప్పటికే కాబూల్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఐసిస్‌ జరిపిన దాడుల్లో మృతిచెందిన వారి సంఖ్య 180 దాటిపోగా.. మరోసారి కాబూల్‌లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది అమెరికా.. కాబూల్‌ ఎయిర్‌పోర్టు వద్ద వచ్చే 36 గంటల్లో మరో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. రాగల 24 నుంచి 36 గంటల్లో విమానాశ్రయ పరిసరాల్లో మరోమారు ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.. మరోవైపు.. ఉగ్రవాదుల స్థావరాలపై ఇప్పటికే డ్రోన్ దాడులు ప్రారంభించింది అమెరికా.. మరిన్ని దాడులు తప్పవని కూడా ఉగ్రవాదులకు బైడెన్‌ హెచ్చరికలు జారీచేశారు.. తమ పౌరుల ప్రాణాలను బలిగొన్న ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదని.. వెంటాడి వేటాడి చంపుతామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

Exit mobile version