Site icon NTV Telugu

మామను చంపిన అల్లుడు. మేడ్చల్ జిల్లాలో దారుణం

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో దారుణం జరిగింది. జగద్గిరిగుట్టలో జరిగిన హత్య కలకలం రేపుతోంది. క్షణికవేశంలో మామను హత్య చేసాడు అల్లుడు. జగద్గిరిగుట్ట సంజయ గాంధీ నగర్ కు చెందిన రాజమౌళి (50) గత రాత్రి పాపి రెడ్డి నగర్ లో నివాసముండే తన అల్లుడు బాలకృష్ణ (23) ఇంటికి వెళ్ళాడు. బాలకృష్ణ తండ్రి అక్రమ సంబంధం విషయమై చర్చించేందుకు వెళ్లగా మాట మాట పెరిగింది. ఇద్దరిమధ్య ఘర్షణచెలరేగింది.

దీంతో కోపోద్రిక్తుడైన బాలకృష్ణ విచక్షణ కోల్పోయాడు. తన మామ నరసింహ మెడపై కత్తితో పొడిచాడు. తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో కుటుంబ సభ్యులు చింతల్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు బాలకృష్ణ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

Exit mobile version