Site icon NTV Telugu

మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ నివాసంలో సీఐడీ సోదాలు

మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ నివాసంలో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్‌లోని లక్ష్మీనారాయణ నివాసంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న సమయంలో.. ఆయన కార్యాలయంలో లక్ష్మీనారాయణ పనిచేశారు.

తన పదవీ విరమణ తర్వాత.. చంద్రబాబు 2014లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థ ద్వారా లక్ష్మీనారాయణ సేవలందించారు. యువకులకు శిక్షణ ఇచ్చే క్రమంలో లక్ష్మీనారాయణ పలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఐడీ అధికారులు లక్ష్మీ నారాయణ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు.

Read Also: విజయవాడలో త్వరలో జీనోమ్‌ స్వీకెన్సింగ్‌ ల్యాబ్‌

Exit mobile version