Site icon NTV Telugu

వైరల్ అవుతున్న ఆనంద్ మహీంద్రా ట్వీట్..ఏంటా సంగతి?

ఆనంద్ మ‌హీంద్రా నిత్యం సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటారు. ప్రతి చిన్న విషయంపై స్పందిస్తారు. కొన్ని ఫోటోలు చూసి ఆయ‌న పెట్టే పోస్టులు కూడా చాలా కొత్త‌గా, ఆలోచింప చేసే విధంగా ఉంటాయి. ఆయనకున్న ఫాలోయింగ్‌తో అవి క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతుంటాయి. వ్యాపార వేత్త కావ‌డంతో ఆయ‌న ఆలోచ‌నలు, సోష‌ల్ మీడియాలో చేసే పోస్టులు కూడా అదేవిధంగా ఉంటాయి. తాజాగా ఆనంద్ మ‌హీంద్రా ట్వీట్ చేశారు.

అనురాగ్ చిరిమార్ కి అమితాబ్ బచ్చన్ అంటే ఎంతో ఇష్టం. ఎంతిష్టమంటే తన కారునిండా అమితాబ్ ఫోటోలే. ఇంకా చెప్పాలంటే అమితాబ్ సినిమాల పేర్లు కారునిండా వుంటాయి. అమితాబ్ డైలాగ్స్ అన్నీ ఆ కారుపై రాసి వుంటాయి. ఆయన వేసుకునే షర్ట్ నిండా అమితాబ్ నటించిన సినిమాలే కనిపిస్తాయి.

అంతేకాదు, మరో విశేషం ఏమిటంటే.. కారు డోర్ ఓపెన్ చేయగానే అమితాబ్ ఫ్యామస్ డైలాగ్స్ మనకు వినిపిస్తాయి. 12 నుంచి 15 లక్షల విలువ చేసే మహీంధ్రా థార్ ఎస్‌యూవీ నిండా అమితాబ్‌కి సంబంధించిన గురుతులే వుంటాయి. ఈ కారుని చూసి అమితాబ్ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. దానికి సంబంధించిన ఫోటోలే ఈ ట్వీట్‌లో కనిపిస్తాయి. మహీంధ్రా థార్ కారులో ఈ సీన్ ఆనంద్ మహీంద్రాకు ఎంతో ఇష్టంట.

అందుకే ఓ డైలాగ్ కూడా కోట్ చేశారు ఆనంద్ మహీంద్రా …
ఆజ్ మేరే పాస్ గాడీ హై
బంగ్లా హై, పైసా హై …
తుమ్హారే పాస్ క్యా హై?

అనురాగ్‌:మేరే పాస్ థార్ పర్ బిగ్ బి కా ఆటోగ్రాఫ్ హై అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానం అంటే అదే మరి.

Exit mobile version