హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం వైపు దూసుకెళ్తున్నారు.. ఇప్పటి వరకు టీఆర్ఎస్‌కు పట్టుకున్న మండలాల్లో ఓట్ల లెక్కింపు జరిగినా.. ఆధిక్యంలోనే కొనసాగుతూ వచ్చారు ఈటల.. మిగతా మండలాల్లో ఈటలకు అనుకూలమైన ఓటింగే భారీగా ఉందనే అంచనాలున్నాయి.. దీంతో.. ఈటల గెలుపు నల్లేరు మీద నడకే అని అంచనా వేస్తున్నారు. ఇక, ఈటల ఆధిక్యం పెరుగుతున్నా కొద్ది.. బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగిపోతోంది.. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌కు ఫోన్ చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా… హుజురాబాద్ ఎన్నికలపై ఆరా తీసిన ఆయన.. ఉప ఎన్నిక ఫలితాలపై అభినందనలు తెలిపారు.. ఇక, బీజేపీ కార్యకర్తలు కష్టపడి పనిచేయటం వలనే హుజురాబాద్‌లో బీజేపీ గెలుస్తోందని అమిత్ షాకు వివరించారు బండి సంజయ్.
బండి సంజయ్‌కి అమిత్‌షా ఫోన్.. ఎన్నికల ఫలితంపై అభినందనలు
