అలుపెరుగక సాగుతున్న అమరావతి పాదయాత్ర@24రోజులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి రాజధాని పరిరక్షణే ధ్యేయంగా అమరావతి రైతులు, రైతు సంఘాలు, మహిళలు, వైసీపీయేతర పార్టీలు చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం మహాపాదయాత్ర 24 రోజులుగా అవిశ్రాంతంగా సాగుతోంది. ఏపీ రాజధాని పరిరక్షణ కోసం అలుపెరగని పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులు, మహిళలకు రాజకీయ నేతలు, ప్రజా సంఘాలు, ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. 24 రోజులుగా యాత్ర చేసి కాళ్లు బొబ్బలెక్కిన మహిళలకు నరసరావుపేటలో అపూర్వ గౌరవం లభించింది. టీడీపీ ఇన్‌ఛార్జి చదలవాడ అరవింద్‌బాబు పాలాభిషేకం చేశారు. నిర్విఘ్నంగా ముందుకు సాగాలంటూ కాళ్లను పాలతో అభిషేకించారు.
ఈ పాదయాత్రకు తనవంతుగా రూ.3లక్షల విరాళం అందజేశారు అరవింద్ బాబు. నెల్లూరు జిల్లా టీడీపీ నేత బీద రవిచంద్ర కూడా మహాపాదయాత్రకు రూ.3లక్షలు అందించారు. ఇవాళ నెల్లూరు జిల్లా సున్నంబట్టి నుంచి మొదలైన పాదయాత్ర రాజుపాలెం వరకు 15కి.మీ. మేర సాగనుంది. ఈ యాత్ర 45 రోజుల పాటు కొనసాగనుంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా తిరుమలకు చేరనుంది. మూడు రాజధానులు వద్దు-అమరావతి ఏకైక రాజధాని ముద్దు అంటూ నినదిస్తున్నారు.
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
తాజావార్తలు
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!