కడప జిల్లా జమ్మలమడుగు మండలం మోరగుడి గ్రామంలో మద్యం తాగడంపై నిషేధం విధించారు. ఈ మేరకు గ్రామ కమిటీ పేరుతో గ్రామంలో హెచ్చరిక బోర్డులు వెలిశాయి. కొందరు వ్యక్తులు మద్యం తాగిన మత్తులో సీసాలు పగలకొట్టడం, మద్యం బాటిళ్లను పొలాల్లో, రోడ్లపైనే పడేస్తుండటంతో విసుగు చెందిన గ్రామ పెద్దలు మద్య నిషేధంపై నిర్ణయం తీసుకున్నారు.
Read Also: వైరల్: బుడ్డోడి టాలెంట్‌కు ఆనంద్ మహీంద్రా ఫిదా
తమ గ్రామ పరిధిలో పొలాలు, ఖాళీ స్థలాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం పూర్తిగా నిషేధిస్తున్నామని… ఎవరైనా పగలు మద్యం తాగుతూ పట్టుబడితే రూ.500, రాత్రిపూట మద్యం తాగుతూ పట్టుబడితే రూ.వెయ్యి జరిమానా చెల్లించాల్సిందే అంటూ గ్రామ కమిటీ హెచ్చరించింది. కాగా ఈ నిర్ణయం తీసుకున్న తొలిరోజే గ్రామ కమిటీ సభ్యులు రూ.10వేలు జరిమానా వసూలు చేయడం గమనార్హం.