NTV Telugu Site icon

Al-Qaeda Threatens: అతిక్ అహ్మద్ హత్య.. భారత్‌పై దాడులకు అల్-ఖైదా ప్లాన్!

Atiq Ahmed

Atiq Ahmed

యూపీ గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ హత్యపై భారత్‌పై దాడులు చేస్తామని ఉగ్రవాద సంస్థ బెదిరించింది. కస్టడీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్‌ను హత్య చేసినందుకు భారతపై దాడులు చేస్తామని అల్-ఖైదా (AQIS) హెచ్చరించింది. తన ఈద్ సందేశంలో, ఉగ్రవాద బృందం ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరించింది. అతిక్, అతని సోదరుడు అష్రఫ్‌ను అమరవీరులు అని పిలిచింది. అల్-ఖైదా ప్రచార మీడియా విభాగం అయిన అస్-సహాబ్ విడుదల చేసిన 7 పేజీల మ్యాగజైన్‌లో, ఉగ్రవాద సంస్థ “ముస్లింలను విముక్తి చేస్తామని” హామీ ఇచ్చింది.
Also Read:Siddaramaiah: కచ్చితంగా ముస్లింల ఓట్లు కాంగ్రెస్‌కే.. కర్ణాటక ‘హస్తగతం’

అతిక్ అహ్మద్ మరియు అతని సోదరుడు అష్రఫ్ హత్యపై అల్-ఖైదా మండిపడింది. గ్యాంగ్‌స్టర్‌ అతిక్ అహ్మద్ , అతని సోదరుడు అష్రఫ్‌ను పోలీసులు వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా..గత శనివారం(ఏప్రిల్ 15) రాత్రి జర్నలిస్టులుగా నటిస్తున్న ముగ్గురు వ్యక్తులు పాయింట్-బ్లాంక్ రేంజ్‌లో కాల్చి చంపారు. ప్రయాగ్‌రాజ్‌లో జైలు శిక్ష అనుభవించిన సోదరులు, రాత్రి 10 గంటల సమయంలో కెమెరా సిబ్బంది కళ్లెదురుగా హతమైనప్పుడు సంకెళ్లతో ఉన్నారు.

Show comments