ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పాలన మొదలైంది. అరాచకాలు సృష్టించిన తాలిబన్లు మరోసారి అధికారంలోకి రావడంతో లక్షలాది మంది ప్రజలు ఆఫ్ఘనిస్తాన్‌ను వదిలి వెళ్లిపోయారు. 1996 నుంచి 2001 వరకు ఆ దేశంలో తాలిబన్ల పాలన సాగింది. ఆ సమయంలో ఎలాంటి అరాచకాలు జరిగాయో చెప్పాల్సిన అవసరం లేదు. మహిళల హక్కులను కాలరాశారు. షరియా చట్టాల పేరుతో మహిళలను హింసించారు. ఐదేళ్లపాటు హత్యాకాండ సాగింది. అయితే, 20 ఏళ్ల తరువాత మరోసారి తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను కైవసం చేసుకోవడంతో మరోసారి ప్రతి ఒక్కరిలోనూ తెలియని భయం కమ్ముకుంది. తాము అందరిని సమానంగా చూస్తామని చెబుతూనే కో ఎడ్యుకేషన్‌కు విరుద్దంగా నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడి నుంచే మహిళల హక్కులు కాలరాయడం మొదలైంది. అయితే, హెరాత్ నగరంలో మహిళలు రోడ్డుమీదకు వచ్చి ప్లకార్డులు చేతబూని నిరసనలు చేసిన సంగతి తెలిసిందే. మహిళలు లేకుండా ప్రభుత్వాలు నడవలేవని, తమకు ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేశారు. హెరాత్ లోని మహిళలు ఇచ్చిన స్పూర్తిని తీసుకొని ఇప్పుడు కాబూల్ నగరంలో మహిళలు రోడ్డెక్కారు. పెద్ద సంఖ్యలో మహిళలు ప్లకార్డులు చేతబూని తాలిబన్లకు వ్యతిరేకంగా, ఆఫ్ఘన్ వ్యవహారంలో పాక్ ఐఎస్ఐ జోక్యానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. నిరసనలు చేస్తున్న ఓ మహిళవైపు తాలిబన్ తుపాకి ఎక్కుపెట్టాడు. ఏం చంపుతావా చంపు… నాకేం భయంలేదు… మా హక్కులను కాలరాసే అధికారం ఎవరికీ లేదు అని చెప్పింది. దీనికి సంబందించిన ఫొటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.
Read: నేడు భారత్ అధ్యక్షతన బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సు… దీనిపైనే చర్చ…
