నేడు భార‌త్ అధ్య‌క్ష‌త‌న బ్రిక్స్‌ దేశాల శిఖ‌రాగ్ర స‌ద‌స్సు… దీనిపైనే చ‌ర్చ…

ఈరోజు నుంచి 13వ బ్రిక్స్‌ దేశాల శిఖ‌రాగ్ర స‌ద‌స్సు జ‌ర‌గ‌నున్న‌ది.  అయితే, క‌రోనా కార‌ణంగా ఈ స‌ద‌స్సును వ‌ర్చువ‌ల్‌గా నిర్వ‌హిస్తున్నారు.  బ్రిక్స్ స‌ద‌స్సులో ఈరోజు ప్ర‌ధాని మోడీ ప్ర‌సంగించ‌నున్నారు.  గ‌తంలో 2012,  2016లోనూ ఇండియా ఈ స‌ద‌స్సుకు అధ్య‌క్ష‌త వ‌హించింది.  ఈ 13 వ స‌ద‌స్సులో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎదుర్కొంటున్న క‌రోనా, ఆర్థికంగా పుంజుకోవ‌డానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌లు, అంత‌ర్జాతీయంగా నెల‌కొన్న ప‌రిస్థితులు, ఆఫ్ఘ‌న్ లో తాలిబ‌న్ పాల‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌లు, అక్క‌డి ప్ర‌జ‌కు అందించాల్సిన చేయూత త‌దిత‌ర విష‌యాల‌పై ఈరోజు బ్రిక్స్ స‌ద‌స్స‌లో చ‌ర్చించ‌బోతున్నారు.  వాతావ‌ర‌ణంలో వ‌స్తున్న మార్పులు, ప‌ర్యావ‌ర‌ణం విష‌యంలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై కూడా ఈ స‌ద‌స్సులో మాట్లాడే అవ‌కాశం ఉన్న‌ది.  అంతేకాకుండా ప్ర‌పంచంలో మ‌హిళ‌ల పాత్ర‌,  బిజినెస్ రంగంలో వారి గుర్తింపుపై కూడా స‌దస్సులో చ‌ర్చించే అవ‌కాశం ఉన్న‌ది.  ఈ స‌ద‌స్సులో బ్రెజిల్ అధ్య‌క్షుడు బోల్సొనారో, రష్యా అధ్య‌క్షుడు పుతిన్‌, చైనా అధ్య‌క్షుడు జిన్‌పింగ్‌, ద‌క్షిణాఫ్రికా అధ్య‌క్షుడు సిరిల్ రామ‌ఫోసా పాల్గొన‌నున్నారు.  

Read: తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్‌: లండ‌న్‌కు నేరుగా…

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-