1950- 60 తరువాత ఆఫ్ఘనిస్తాన్‌లో ట్రెండీ కల్చర్ మొదలైంది. పాశ్చాత్య దుస్తులు ధరించడం అలవాటు చేసుకున్నారు. అయితే, 1996 నుంచి 2001 మధ్యలో తాలిబన్లు ఆక్రమణలతో తిరిగి బుర్ఖాలు ధరించాల్సి వచ్చింది. 2001 తరవాత తిరిగి ప్రజాస్వామ్య పాలనలోకి రావడంతో ప్రజలు స్వతంత్రంగా జీవించడం మొదలు పెట్టారు. తమకు నచ్చిన దుస్తులు వేసుకుంటున్నారు. కాగా, ఇప్పుడు మరోసారి సడెన్‌గా తాలిబన్ల పాలనలోకి ఆఫ్ఘన్ వెళ్లడంతో అక్కడి మహిళలు ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా దుస్తుల విషయంలో ఆంక్షలు విధించవద్దని, తమ హక్కులను నాశనం చేసే హక్కు ఎవరికీ లేదని మహిళలు ఉద్యమిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆఫ్ఘన్ కల్చర్ పేరుతో హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి ఆఫ్ఘనిస్తాన్ ట్రెడిషనల్ దుస్తులు ధరించి పోస్ట్ చేస్తున్నారు. #Afghanistanculture #DonotTouchMyClothes పేరుతో హ్యాష్ ట్యాగ్స్‌ను క్రియోట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు. నెటిజన్ల నుంచి వీరికి పెద్ద ఎత్తున మద్దతు వస్తుండటం విశేషం.
Read: కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండైన ఫస్ట్ కమర్షియల్ అంతర్జాతీయ విమానం…
