కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండైన ఫస్ట్ క‌మ‌ర్షియ‌ల్ అంత‌ర్జాతీయ విమానం…

ఆఫ్ఘ‌నిస్తాన్‌ను తాలిబ‌న్లు ఆక్ర‌మించుకున్న సంగ‌తి తెలిసిందే.  ఆగ‌స్టు 15 వ తేదీనుంచి ఆగ‌స్టు 30 వ తేదీ వ‌ర‌కు అమెరిక‌న్ ఆర్మీ కాబూల్ ఎయిర్‌పోర్ట్‌ను త‌న ఆధీనంలోకి తీసుకున్న‌ది. ఆగ‌స్టు 31 నుంచి తాలిబ‌న్లు ఎయిర్‌పోర్ట్‌ను త‌మ ఆధీనంలోకి తీసుకున్నారు.  అప్ప‌టి నుంచి ఎలాంటి క‌మ‌ర్షియ‌ల్ విమానాలు కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కాలేదు.  కాగా, ఈరోజు ఉద‌యం పాకిస్తాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన తొలి విమానం కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయింది.  ఇందులో 10 మంది వ‌ర‌కు ప్ర‌యాణికులు ఉన్నార‌ని స‌మాచారం.  ఈ విమానం రాక‌తో క‌మ‌ర్షియ‌ల్ విమానాల రాక‌పోక‌ల‌కు తాలిబ‌న్లు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని అర్థం చేసుకోవ‌చ్చు.  

Read:

Related Articles

Latest Articles

-Advertisement-