బాల్యంలో మనల్ని ప్రభావితం చేసే అంశాలే వారి జీవితాల్ని నిర్ధేశిస్తాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రజల జీవన విధానం ఎలా మారిపోయిందో చెప్పక్కర్లేదు. తాలిబన్లనుంచి తప్పించుకొని పొట్ట చేతపట్టుకొని పిల్లలతో కలిసి దొరికిన విమానం పట్టుకొని శరణార్ధులుగా వివిధ దేశాలకు వెళ్లిపోతున్నారు. ఆఫ్ఘనిస్తానీయులకు ఆశ్రయం ఇస్తున్న దేశాల్లో బెల్జియం కూడా ఒకటి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అనేక మంది శరణార్ధులుగా బెల్జియంకు వెళ్తున్నారు. అక్కడ ఆర్మీ ఏర్పాటు చేసిన క్యాంప్‌లలో నివశిస్తున్నారు. ఇలా ఆఫ్ఘనిస్తాన్ నుంచి బెల్జియం చేరుకున్న ఓ చిన్నారి తన కుటుంబంతో కలిసి వెళ్తూ ఆనందంతో గంతులు వేసింది. నిత్యం బాంబుల మోత, రక్తపుటేర్లతో నిండిపోయిన దేశం నుంచి ప్రశాంతతకు చిహ్నంలా కనిపించే బెల్జియంకు వచ్చినందుకు ఆ చిన్నారి ఆనందానికి అవథులు లేవు. దీనికి సంబందించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మామూలు నెటిజన్లనే కాదు ఈ ఫొటో బెల్జియం ప్రధానికి కూడా బాగా నచ్చింది. ఆ ఫొటోను ఆయన కూడా షేర్ చేయడం విశేషం
Read: కాబూల్‌లో చిరువ్యాపారులపై తాలిబాన్ల ప్రభావం: అంతా బాగుంది కానీ…
