అభినేత్రి రేవతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(జూలై 8న రేవతి పుట్టినరోజు)
చూడగానే బాగా పరిచయం ఉన్న అమ్మాయిలా కనిపిస్తుంది. కాసింత పరిచయం కాగానే యెద చుట్టేసుకుంటుంది. కళ్ళతోనే కోటి భావాలు పలికిస్తుంది. పెదాలు విప్పితే ఆమె ముత్యాల పళ్ళు పలకరిస్తాయి. వెరసి నటి రేవతి నవ్వు ఆకర్షిస్తుంది. అభినయం ఆకట్టుకుంటుంది. భారతీరాజా దర్శకత్వంలో రూపొందిన ‘మణ్ వాసనై’ తమిళ చిత్రం ద్వారా రేవతి తొలిసారి నటిగా గుర్తింపు సంపాదించారు. అనతికాలంలోనే మాతృభాష మళయాళంతో పాటు, తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ నటించేసి ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించారు రేవతి.
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించిన ‘మానసవీణ’ చిత్రంతో తెలుగునాట అడుగుపెట్టింది రేవతి. అదే సమయంలో బాపు తెరకెక్కించిన ‘సీతమ్మ పెళ్ళి’ కూడా రేవతికి మంచి పేరు సంపాదించింది. మణిరత్నం ‘మౌనరాగం’తో రేవతికి మరింత మంచి పేరు లభించింది. తెలుగులో అనువాదమైన ఈ సినిమాతో ఇక్కడి ప్రేక్షకులనూ ఆకట్టుకుంది రేవతి. అప్పటి నుంచీ తమిళంలో రేవతి నటించిన పలు చిత్రాలు తెలుగువారినీ అనువాదరూపంలో పలకరించాయి. ఏయన్నార్ ‘రావుగారిల్లు’లో నటించిన రేవతి తెలుగువారికి మరింత దగ్గరయింది. వెంకటేశ్ తో కలసి ఆమె నటించిన ‘ప్రేమ’ నటిగా మరిన్ని మార్కులు సంపాదించి పెట్టింది. ‘అంకురం’ చిత్రంలో రేవతి నటనకు ఫిలిమ్ ఫేర్ అవార్డు లభించింది. రామ్ గోపాల్ వర్మ’గాయం’లోనూ రేవతి తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు. ప్రభాస్ తొలి చిత్రం ‘ఈశ్వర్’ తర్వాత దాదాపు ఎనిమిదేళ్ళు తెలుగు చిత్రాల్లో కనిపించలేదు రేవతి. అయితే మధ్యలో ఆమె నటించిన అనువాద చిత్రాలు మాత్రం బాగానే జనాన్ని ఆకట్టుకొనేవి. నవతరం కథానాయకుల చిత్రాల్లో తన వయసుకు తగ్గ పాత్రలు పోషిస్తున్నారు రేవతి. “అనుక్షణం, లోఫర్, సైజ్ జీరో, బ్రహ్మోత్సవం, యుద్ధం శరణం, మేజర్” వంటి చిత్రాలలో కనిపించి అలరించారు రేవతి.
కేవలం నటిగానే కాదు, దర్శకురాలిగానూ రేవతి తనదైన బాణీ పలికించారు. ఆమె దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘మిత్ర్, మై ఫ్రెండ్’ ఇంగ్లిష్ సినిమా కావడం విశేషం. ఈ చిత్రానికి బెస్ట్ ఫీచర్ ఫిలిమ్ ఇన్ ఇంగ్లిష్ కేటగిరీలో నేషనల్ అవార్డు లభించింది. శోభన ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని రేవతి భర్త, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సురేశ్ చంద్ర మీనన్ నిర్మించారు. రేవతి, సురేశ్ మీనన్ కొన్నాళ్ళకే అభిప్రాయభేదాల కారణంగా విడిపోయారు. సల్మాన్ ఖాన్, శిల్పా శెట్టి, అభిషేక్ బచ్చన్ తో ‘ఫిర్ మిలేంగే’ హిందీ చిత్రాన్ని రూపొందించారు రేవతి. ఈ సినిమా ఆట్టే ఆకట్టుకోలేకపోయింది. ‘ముంబై కటింగ్’ అనే హిందీ చిత్రం కూడా రేవతి దర్శకత్వంలోనే రూపొందింది. ‘కేరళ కేఫ్’ అనే మళయాళ సినిమాకు కూడా రేవతి దర్శకత్వం వహించారు. అయితే ఇవేవీ ‘మిత్ర్, మై ఫ్రెండ్’ లాగా ఆకట్టుకోలేకపోయాయి. కొన్ని తమిళ, మళయాళ చిత్రాలకు రేవతి వాయిస్ ఓవర్ కూడా వినిపించారు. ‘తిరుప్పావై’ అనే వీడియో ఆల్బమ్ లో నటించడమే కాదు, గాయనిగానూ తన గొంతు సవరించుకున్నారు రేవతి. తన బహుముఖ ప్రజ్జను చాటుకుంటూ సాగుతున్న రేవతి ప్రస్తుతం ‘ఇట్లు అమ్మ’ అనే తెలుగు చిత్రంలో నటిస్తున్నారు.
తాజావార్తలు
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
IND vs AFG 3rd T20I: నేడే మూడో టీ20.. వైభవ్, ఠాకూర్‌కు ఛాన్స్.. స్టార్ ప్లేయర్లకు షాక్.. ప్లేయింగ్ 11 ఇదే!
-
iQOO Pad Ultra: iQOO ప్యాడ్ అల్ట్రా లాంచ్ డేట్ ఫిక్స్.. 8.8-అంగుళాల డిస్‌ప్లే, PC-గ్రేడ్ కూలింగ్ ఫ్యాన్!
-
Road Accident: టిప్పర్ లారీ బీభత్సం.. తండ్రి కూతురు మృతి..!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!