సూర్య జీవిత నాయిక… జ్యోతిక!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముద్దుగా బొద్దుగా ఉన్నా, నటనతోనూ, నర్తనంతోనూ మురిపించారు జ్యోతిక. తమిళ స్టార్ హీరో సూర్యను పెళ్ళాడిన తరువాత కూడా తనకు తగ్గ పాత్రలలో ఆమె నటిస్తూ అలరిస్తున్నారు. తెలుగునాట మెగాస్టార్ చిరంజీవి ‘ఠాగూర్’తో తొలిసారి మెరిసింది జ్యోతిక. తరువాత జ్యోతిక నటించిన అనేక అనువాద చిత్రాలు తెలుగువారిని ఆకట్టుకున్నాయి. ఇప్పటికీ తనదైన బాణీ పలికిస్తూ సాగుతున్నారు జ్యోతిక.
ఓ నాటి అందాలతార నగ్మాకు సవతి సోదరి జ్యోతిక. ఇక మరో నాయిక రోషిణికి కూడా జ్యోతిక చెల్లెలు. 1977 అక్టోబర్ 18న జ్యోతిక జన్మించారు. ఆమె తండ్రి చందర్ సాదనా సినిమా నిర్మాత. ‘డోలీ సజా కే రఖ్నా’ హిందీ చిత్రంలో తొలిసారి జ్యోతిక మెరిసింది. తరువాత తమిళ చిత్రం ‘వాలి’లో నటించింది. ‘వాలి’ మంచి విజయం సాధించడంతో జ్యోతిక తమిళ చిత్రాలలోనే సాగింది. ప్రభుదేవా ఆయన సోదరులు రాజు సుందరం, నాగేంద్రప్రసాద్ కలసి నటించిన ‘1 2 3’ చిత్రంలో జ్యోతిక నటించింది. ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రూపొందింది. అంతకు ముందే ఆమె నటించిన ‘వాలి’ వంటి కొన్ని అనువాద చిత్రాలు తెలుగువారిని పలకరించాయి. ఇక చిరంజీవితో వి.వి.వినాయక్ తెరకెక్కించిన ‘ఠాగూర్’ చిత్రంలో ఓ నాయికగా నటించి మురిపించారు జ్యోతిక. ఆ సినిమాలో చిరంజీవితో కలసి జ్యోతిక చేసిన డాన్స్ ఆ రోజుల్లో జనాన్ని భలేగా ఆకట్టుకుంది. ఈ చిత్రం అనూహ్య విజయం సాధించింది. దాంతో జ్యోతికకు తెలుగులోనూ అవకాశాలు దక్కాయి. నాగార్జునతో కలసి జ్యోతిక నటించిన ‘మాస్’ సైతం జనాన్ని భలేగా ఆకట్టుకుంది. తరువాత రవితేజ జోడీగా “షాక్, విక్రమార్కుడు” వంటి చిత్రాలలో నటించారు. అయితే ఎందుకనో జ్యోతిక తమిళ చిత్రాలపైనే దృష్టి సారించారు.
Also Read
జ్యోతిక, సూర్య జోడీ తమిళ జనాన్ని భలేగా అలరించింది. వారిద్దరూ కలసి ఏడు చిత్రాలలో నటించారు. “పూవెల్లాం కెట్టుప్పార్, ఉయిరిలే కలందతు, కాక్క కాక్క, పేరళగన్, మాయావి, జూన్ ఆర్, సిల్లునుమ్ ఒరు కాదల్” వంటి చిత్రాలలో జ్యోతిక, సూర్య కనువిందు చేశారు. 2006 సెప్టెంబర్ 11న జ్యోతిక, సూర్య వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు – కూతురు పేరు దియ, కొడుకు పేరు దేవ్. పెళ్ళయ్యాక కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న జ్యోతిక 2015లో ’36 వయదినిలే’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రాన్ని ఆమె భర్త సూర్య నిర్మించారు. తరువాత నుంచీ తనకు తగ్గ పాత్రల్లో నటిస్తూనే ఉన్నారు జ్యోతిక. నిజజీవితంలో జ్యోతికకు కార్తీ మరిది అవుతాడు. కానీ, ‘దొంగ’ చిత్రంలో వీరిద్దరూ అక్కాతమ్ముళ్ళుగా నటించడం విశేషం. తన భర్త సూర్య ప్రోత్సాహంతో నటనలో మళ్ళీ రాణించడమే కాదు, ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ ఉంటారు జ్యోతిక. ఆమె మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగాలని ఆశిద్దాం.
తాజావార్తలు
-
BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
-
Astrology: అక్టోబర్ 02 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అంతా శుభమే..!
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?