తెలుగు చిత్రాలతోనే నటిగా వెలుగు చూసింది లావణ్య త్రిపాఠి. ‘అందాలరాక్షసి’గా జనం ముందు నిలచిన లావణ్య త్రిపాఠి, తన అందాల అభినయంతో ఆకట్టుకుంటూ సాగింది. తెలుగు సినీజనం లావణ్యకు మంచి అవకాశాలే కల్పించారు. ఆమె కూడా తన దరికి చేరిన ప్రతీపాత్రకూ న్యాయం చేయడానికే తపిస్తున్నారు. లావణ్య త్రిపాఠి 1990 డిసెంబర్ 15న ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో జన్మించింది. ఆమె తండ్రి లాయర్. తల్లి టీచర్. డెహ్రాడూన్ లో లావణ్య విద్యాభ్యాసం సాగింది. ముంబయ్ లో రిషీ…
ముద్దుగా బొద్దుగా ఉన్నా, నటనతోనూ, నర్తనంతోనూ మురిపించారు జ్యోతిక. తమిళ స్టార్ హీరో సూర్యను పెళ్ళాడిన తరువాత కూడా తనకు తగ్గ పాత్రలలో ఆమె నటిస్తూ అలరిస్తున్నారు. తెలుగునాట మెగాస్టార్ చిరంజీవి ‘ఠాగూర్’తో తొలిసారి మెరిసింది జ్యోతిక. తరువాత జ్యోతిక నటించిన అనేక అనువాద చిత్రాలు తెలుగువారిని ఆకట్టుకున్నాయి. ఇప్పటికీ తనదైన బాణీ పలికిస్తూ సాగుతున్నారు జ్యోతిక. ఓ నాటి అందాలతార నగ్మాకు సవతి సోదరి జ్యోతిక. ఇక మరో నాయిక రోషిణికి కూడా జ్యోతిక చెల్లెలు.…