త్వరపడండి… వచ్చే ఏడాది పెరగనున్న ఇళ్ల ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జీవితంలో సొంతిల్లు కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. అయితే సొంతిల్లు కొనుగోలు చేసేవారు ఇప్పుడే త్వరపడండి. లేకపోతే మీరు ఇల్లు కొనుగోలు చేయడం కష్టతరం కావచ్చు. ఎందుకంటే వచ్చే ఏడాది ఇళ్ల ధరలు పెరగనున్నట్లు ప్రముఖ స్థిరాస్తి కన్సల్టెంట్ సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. కరోనా పరిణామాల వల్ల గత రెండేళ్లుగా నివాస గృహాల ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నా.. వచ్చే ఏడాది మాత్రం 5 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు 2022 అవుట్ లుక్ రిపోర్టులో వివరించింది. నిర్మాణ సామగ్రి ధరలు అధికం కావడంతో ఇళ్ల ధరలు పెరుగుతున్నాయని నివేదికలో పేర్కొంది.
Read Also: అమెజాన్ కీలక నిర్ణయం.. ఇకపై అలెక్సా ర్యాంకులు బంద్
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- Kirti Chakra: అమరవీరుడు సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్‌కు ‘కీర్తి చక్ర’ ప్రదానం.. రాష్ట్రపతి దగ్గర వెక్కి వెక్కి ఏడ్చిన తల్లి
మరోవైపు ఆఫీసు స్థలాలకు కూడా గిరాకీ పెరుగుతుందని నైట్ ఫ్రాంక్ నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం ఐటీ కంపెనీల నియామకాలు అధికంగా ఉన్నందున ఆఫీసు స్థలానికి వచ్చే ఏడాది గిరాకీ పెరుగుతుందని నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది దేశంలోని ఐదు పెద్ద ఐటీ కంపెనీలు 2.60 లక్షల మందిని రిక్రూట్ చేసుకున్నాయి. ప్రస్తుతం ఇంటి నుంచి పని చేస్తున్న వీరు ఆఫీసులకు వస్తే అదనంగా 1.16 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్థలం అవసరం అవుతుందని వివరించింది. దీంతో నాణ్యమైన ఆఫీసు స్థలాన్ని కంపెనీలు, ఉద్యోగులు ఇష్టపడుతున్నందున ఆఫీసు స్థల అద్దెలు స్ధిరంగా ఉండటంతో పాటు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. అటు ఇ-కామర్స్ విస్తరణ వల్ల గోడౌన్ స్థలాలకు ఎన్నడూ లేనంత డిమాండ్ ఏర్పడింది. దీంతో 2023 నాటికి 4.59 కోట్ల చదరపు అడుగుల గోడౌన్‌ల స్థలం అవసరమని నైట్ ఫ్రాంక్ అంచనా వేసింది.
తాజావార్తలు
-
Budhaditya Rajyog 2026: మిథునంలో సూర్యుడు.. 5 రాశుల వారికి రాజయోగాల జాక్‌పాట్.!
-
Dhanush – Siruthai Siva: “ఆ కథ మరెవరికీ ఇవ్వొద్దు”.. ఆ తెలుగు డైరెక్టర్‌కు హీరో ధనుష్ రిక్వెస్ట్! అసలు మ్యాటర్ ఇదే..
-
POK Protest: అసిమ్ మునీర్ ఒక టెర్రరిస్ట్.. పీఓకేలో తిరుగుబాటు..
-
Spicy Idli Chaat Recipe: మిగిలిన ఇడ్లీలతో సూపర్ స్పైసీ చాట్.. 5 నిమిషాల్లో రెడీ..!
-
Akash Goparaju: కోనసీమ బ్యాక్‌డ్రాప్‌లో సింగర్ సునీత కొడుకు ‘కొత్త మలుపు’
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!