NTV Telugu Site icon

Russia: రష్యాలో ఘోర ప్రమాదం.. 22 మందితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మిస్సింగ్

Helicopter Missing

Helicopter Missing

రష్యాలో ఘోర ప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. విమాన టేకాఫ్ సమయంలో హెలికాప్టర్ Mi-8T అదృశ్యమైంది. అయితే.. హెలికాప్టర్ కూలిపోయే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. హెలికాప్టర్ మిస్సింగ్ అయిన సమయంలో అందులో ముగ్గురు సిబ్బందితో సహా మొత్తం 22 మంది ఉన్నారు. ఈ ఘటనలో ఎంత మంది మరణించారనే సమాచారం తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు విచారణ చేస్తున్నారు.

Peddi Sudarshan Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అవగాహనలేదు.. ఉత్తమ్ జైలుకే..!

మీడియా నివేదికల ప్రకారం.. రష్యా Mi-8T హెలికాప్టర్ రష్యాలోని తూర్పు ప్రాంతంలో ఉన్న కమ్‌చట్కా ద్వీపకల్పం నుండి శనివారం బయలుదేరింది. హెలికాప్టర్‌లో ముగ్గురు సిబ్బందితో సహా మొత్తం 22 మంది ఉన్నారు. రష్యా ఫెడరల్ ఎయిర్ ట్రాఫిక్ ఏజెన్సీ హెలికాప్టర్ వాచ్‌కాజెట్స్ బేస్ నుండి బయలుదేరిందని.. అయితే హెలికాప్టర్ సరైన సమయానికి గమ్యస్థానానికి చేరుకోకపోవడంతో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించామని చెప్పారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఎవరైనా కావాలని చేశారా అనే కోణంలో కూడా సమాచారం సేకరిస్తున్నారు. Mi-8T అనేది ట్విన్-ఇంజన్ హెలికాప్టర్.. దీనిని 1960లో రూపొందించారు. రష్యాతో పాటు.. ఈ హెలికాప్టర్‌ను ఇతర దేశాలు కూడా ఉపయోగిస్తున్నాయి. అయితే ఈ హెలికాప్టర్ క్రాష్‌ల చరిత్ర కూడా ఉంది.

Bandla Ganesh: బండ్ల గణేష్ బుల్లెట్ ఆన్సర్స్.. బన్నీని అంతమాట అనేశాడేంటి..?