మనుషులు రోజు రోజుకు మృగాలుగా మారిపోతున్నారు. మూగజీవులను రకరకాల పేరుతో హింసిస్తున్నారు. మానవత్వం మరిచిపోయి కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. ఓ వ్యక్తి రోడ్డుపై ఉన్న ఓ కుక్కను చెవులు పట్టుకొని మెలితిప్పుతూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. పాపం ఆ శునకం నోప్పిని భరించలేక మోరుగుతున్నది. విలవిలలాడిపోతున్నది. అయినా సరే ఆ వ్యక్తి వదిలిపెట్టకుండా అలానే దాన్ని హింసిస్తున్నాడు. అక్కడ ఉన్న వ్యక్తులు ఆ దృశ్యాలను వీడియోగా తీస్తున్నారు తప్పించి అతడిని వారించలేదు.
Read: హుజురాబాద్: భారీగా పతనమైన కాంగ్రెస్ ఓటుబ్యాంక్…
మూగజీవాల బాధ మూగ జీవాలకే తెలుసు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు హఠాత్తుగా అక్కడికి ఓ ఆవు పరుగుపరుగున వచ్చి కుక్కను హింసిస్తున్న వ్యక్తిని తన కొమ్ములతో ఎత్తి అవతల వేసింది. అక్కడితో ఆగకుండా ఆ మృగాడికి కుమ్మేసి కుక్కను రక్షించింది. దీనికి సంబంధించిన వీడియోను ఫారెస్ట్ ఆఫీసర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నది. మూగ జీవాల బాధ మరో మూగజీవానికి మాత్రమే తెలుస్తుందని ట్యాగ్ చేశారు.
Karma 🙏🙏 pic.twitter.com/AzduZTqXH6
— Susanta Nanda IFS (@susantananda3) October 31, 2021