Site icon NTV Telugu

నిర్ల‌క్ష్యం: ఆ వృద్ధురాలికి అర‌గంట‌లో రెండు డోసులు…

కేర‌ళ‌లో క‌రోనా కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి.  ప్ర‌తిరోజూ 20 వేల‌కు పైగా కేసులు న‌మోద‌వుతున్న సంగ‌తి తెలిసిందే.  కేసులు పెరుగుతుండ‌టంతో వ్యాక్సిన్‌ను వేగ‌వంతం చేశారు.  వేగంగా వ్యాక్సిన్ అందిస్తున్న‌ప్ప‌టికీ కేసులు పెరిగిపోతుండ‌టంతో ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు.  ఇక ఇదిలా ఉంటే, 84 ఏళ్ల వృద్ధురాలికి అర‌గంట వ్య‌వ‌ధిలో కోవీషీల్డ్ రెండు డోసులు ఇవ్వ‌డంతో సంచ‌ల‌నంగా మారింది.  ఎర్నాకులం జిల్లాలోని అలువా ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో ఆ ఘ‌ట‌న జ‌రిగింది.  84 ఏళ్ల తుండ‌మ్మ అనే మ‌హిళ త‌న కుమారుడితో క‌లిసి వ‌చ్చి వ్యాక్సిన్ మొద‌టి డోసు తీసుకున్న‌ది.  అయితే చెప్పులు మ‌రిచిపోవ‌డంతో తెచ్చుకునేందుకు వెళ్ల‌గా, వ్యాక్సిన్ అందించే న‌ర్సు లోప‌లికి పిలిచి మ‌రో డోసు వ్యాక్సిన్ వేసింది.  తాను అర‌గంట క్రిత‌మే డోసు తీసుకున్నానని చెప్పినా వినిపించుకోకుండా రెండో డోసు ఇవ్వ‌డంతో ఆ వృద్ధురాలు ఆందోళ‌న చెందారు.  కాగా, గంట‌సేపు ఆమెను అక్క‌డే ఉంచి ప‌రిశీలించారు.  ఆమెకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేక‌పోవ‌డంతో ఇంటికి పంపారు. 

Read: దేశం కోసం సిద్ధూని వ్య‌తిరేకిస్తా…

Exit mobile version