Site icon NTV Telugu

Razor Blades In Stomach: వ్యక్తి కడుపులో 56 రేజర్ బ్లేడ్‌లు!

Blades New

Blades New

రాజస్థాన్ లో ఓ వ్యక్తి రేజర్లు బ్లేడ్లు మింగి ఆస్పత్రి పాలైయ్యాడు. వైద్యుల శస్త్ర చికిత్సలో వ్యక్తి కడుపులో 56 రేజర్ బ్లేడ్‌లు బయటపడ్డాయి. రాజస్థాన్‌కు చెందిన యశ్‌పాల్ సింగ్ అనే 26 ఏళ్ల వ్యక్తి అకౌంటెంట్ గా పని చేస్తున్నాడు. అతను 56 రేజర్ బ్లేడ్‌లను ఒక్కొక్కటిగా మింగేశాడు. జలోర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుంది. కడుపునొప్పితో రక్తపు వాంతులు చేసుకోవడంతో బాధపడ్డాడు. ఇది గమనించిన యశ్ పాల్ రూమ్ మేట్స్ అతన్ని మెడిప్లస్ ఆస్పత్రికి తరలించారు.
Alsor Read:Nizamabad Ragging: తిరుమల విద్యాసంస్థలో ర్యాగింగ్.. పోలీసుల తీరుపై ఆగ్రహం

వైద్యులు అతనికి సోనోగ్రఫీ చేశారు. దీంతో శరీరం లోపల బ్లేడ్‌లను గుర్తించారు వైద్యులు. ఎండోస్కోపీ కూడా నిర్వహించి వెంటనే శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. కడుపు లోపల, మెడ భాగంలో కోసుకున్న గాయాలున్నట్లు గ్రహించారు. వెంటనే సర్జరీకి సిద్ధమయ్యారు. డాక్టర్ నర్సీ రామ్ దేవసి నేతృత్వంలో ఏడుగురు బృందంలో కూడిన వైద్యులు సర్జరీ నిర్వహించారు. మూడు గంటలు శ్రమించి 56 బ్లేడ్‌ ముక్కలను అతడి కడుపు నుంచి బయటకు తీశారు. పొట్టలోని బ్లేడ్లన్నీ బయటకు తీశారు.

Alsor Read:World Sleep Day: ఉద్యోగులకు కంపెనీ ‘సర్‌ప్రైజ్ గిఫ్ట్’.. ఈ రోజంతా హాయిగా నిద్రపోవాలంటూ..
ఆ వ్యక్తికి మెడపై తీవ్ర కోతలు ఉన్నాయని, శరీరమంతా వాపులు ఉన్నాయని శస్త్ర చికిత్స చేసిన వైద్యుల బృందానికి నేతృత్వం వహించిన డాక్టర్ నర్సీ రామ్ దేవసి తెలిపారు. శరీరం లోపల చాలా చోట్ల కోతలు ఉన్నాయని డాక్టర్ దేవసి వెల్లడించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఆ వ్యక్తి బ్లేడ్‌లను విడదీసి ప్లాస్టిక్ కవర్‌తో పాటు మూడు ప్యాకెట్లను మింగినట్లు తెలుస్తోందని డాక్టర్ దేవసి తెలిపారు. బ్లేడ్‌ల చుట్టూ ఉన్న ప్లాస్టిక్ కవర్ అతని కడుపుకు చేరడంతో కరిగిపోయి తీవ్రమైన కోతలు, అంతర్గత రక్తస్రావం కలిగింది. సదరు యువకుడు ఆందోళన లేదా డిప్రెషన్ లో బ్లేడ్లు మింగి ఉంటాడని వైద్యులు చెబుతున్నారు. కాగా, బ్లేడ్లు మింగిన విషయం తెలుసుకుని యశ్ పాల్ కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు.

Exit mobile version