Site icon NTV Telugu

రూ.3,520 కోట్లకు చేరిన ‘కార్వీ’ మోసం.. 5 వేల పేజీలతో ఛార్జీషీట్..

సంచలనం సృష్టించిన కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ వ్యవహారంపై కోర్టులో ఛార్జిషీట్‌ దాఖలు చేశారు సీసీఎస్‌ పోలీసులు… కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ మోసం రూ.3,520 కోట్లకు చేరినట్టు సీసీఎస్‌ పేర్కొంది.. ఈ వ్యవహారంపై నాంపల్లి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది సీసీఎస్‌.. 5 వేల పేజీల ఛార్జ్‌సీట్‌లో కార్వీ సంస్థ మోసాలను పొందుపర్చారు.. 8 ఏళ్ల నుండి బ్యాంక్‌ల ద్వారా రుణాలు పొందిన ఆ సంస్థ.. కస్టమర్ల షేర్లను తమ షేర్లుగా చూపించి బ్యాంక్‌ల నుంచి రుణాలు తీసుకున్నట్టు పేర్కొంది.

Read Also: మాజీ మంత్రి ఇంటిపై డీవీఏసీ దాడులు.. ఏకకాలంలో 69 ప్రాంతాల్లో సోదాలు..

కస్టమర్ల షేర్లలోని రూ. 720 కోట్లను కార్వీ ఇతర సంస్థలకు మళ్లించిందని ఛార్జీషీట్‌లో పేర్కొన్న సీసీఎస్‌… ఈ వ్యవహారంలో రెండేళ్ల క్రితం సెబీకి ఫిర్యాదులు వెళ్లాయని తెలిపింది… ఇక,చ బ్యాంక్‌ల నుండి తీసుకున్న రూ.2800 కోట్ల రుణాన్ని షెల్ కంపెనీలకు కార్వీ అధినేత పార్థసారథి మల్లించారని చెప్పుకొచ్చింది… కార్వీపై పలువురు బ్యాంక్ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారని ఛార్జీషీట్‌లో రాసుకొచ్చింది సీసీఎస్‌.. కాగా, కార్వీ కేసులో.. ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్‌ చేశారు పోలీసులు.. ఇతర రాష్ట్రాల్లోనూ కార్వీపై కేసులు నమోదు అయ్యాయి… ఈ కేసులో అరెస్ట్‌ అయిన పార్థసారథి ప్రస్తుతం బెంగళూరు జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

Exit mobile version