ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరలు పెంచేవీలు లేదంటూ జీవో 35ను జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ జీవోపై పలువురు సినీ నిర్మాతలు, డస్ట్రిబ్యూటర్లు హైకోర్టులో ప్రభుత్వ జీవోను సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి ప్రభుత్వం జారీ చేసిని జీవో 35ను రద్దు చేస్తున్నట్లు, టికెట్ల ధరలు పెంచుకునేలా అవకాశం కల్పిస్తూ తీర్పునిచ్చింది. అయితే సింగిల్ జడ్జీ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్ అప్పీల్ చేయడంతో హైకోర్టు ఈ విషయంపై మరోసారి విచారణ చేపట్టింది.
దీంతో ప్రస్తుతం ఏపీలో సినిమా టికెట్లపై రగడ మొదలైంది. తాజాగా రెవెన్యూ, పోలీసు అధికారులు పలు జిల్లాల్లోని సినిమా థియేటర్లను పరిశీలించారు. సినిమా థియేటర్లలో టికెట్ ధరలపై పలు సూచనలు చేసి టికెట్ ధరలు పెంచి అమ్మకూడదని తెలిపారు. దీంతో అధికారులు చెప్పిన ధరలకు సినిమా టికెట్లు అమ్మితే తమకు పైనుండి ఖర్చులు అధికమవుతాయని, తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 50 సినిమా థియేటర్ల యజమానులు స్వచ్ఛందంగా థియేటర్లను మూసివేశారు.