ప్రపంచంలో అత్యంత పురాతనమైన నగరాల్లో ఒకటి జెరూసలెం. ఈ నగరంలో జరిపిన తవ్వకాల్లో అనేక ఓ పురాతనమైన టాయిలెట్ ఒకటి బయటపడింది. ఈ పురాతనమైన టాయిలెట్ 2700 సంవత్సరాల క్రితం నాటిది అని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పురాతనమైన టాయిలెట్‌కు చెందిన ఫొటోను ఇజ్రాయిల్ యాంటిక్విటీస్ అథారిటీ సంస్థ రిలీజ్ చేసింది. పురాతన కాలంలోనే ఈ నగంలో అధునాతనమైన టాయిలెట్ వ్యవస్థ అభివృద్ధి చెంది ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మృదువైన రాయిపై సున్నపురాయితో నిర్మించిన దీర్ఘచతురస్రాకార క్యాబిన్‌లో ఉన్న ఈ టాయిలెట్ ఓ విశాలమైన నగరంలో బయటపడింది. అప్పట్లో ధనవంతులు మాత్రమే టాయిలెట్ లు వినియోగించేవారని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
Read: భారత్‌లో జియో సేవల్లో అంతరాయం…