NTV Telugu Site icon

Heavy Rain: బెంగళూరులో భారీ వర్షం.. స్తంభించిన జనజీవనం

Bengaluru Rain

Bengaluru Rain

కర్ణాటక రాజధాని బెంగళూరులో భారీ వర్షం కురుస్తోంది. నగర శివార్లలోని దేవనహళ్లిలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం పడింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేవనహళ్లిలోని కేఐఏలో మంగళవారం సాయంత్రం 45.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షం కారణంగా దేవనహళ్లిలో ట్రాఫిక్ స్తంభించి సాధారణ జనజీవనం స్తంభించింది.
Also Read: Finland joins NATO: దేశ చరిత్రలో కొత్త శకం.. ఫిన్లాండ్ ప్రధాని సౌలి

వాతావరణం కారణంగా కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పద్నాలుగు విమానాలు దారి మళ్లించారు. ఆరు విమానాలు ఆలస్యం నడుస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. సాయంత్రం 4 గంటల నుండి ఐదు గంటల వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. బలమైన ఈదురుగాలులు విమాన కార్యకలాపాలపై ప్రభావితం చూపాయి.
Also Read: Fact Check: ఏపీలో మద్యం అమ్మకాలు పెరిగాయా? నిజమెంత?

మొత్తం 14 విమానాలను దారి మళ్లించారు. వీటి 12 విమానాలను చెన్నైకి, ఒకటి కోయంబత్తూరుకు, మరొకటి హైదరాబాద్‌కు మళ్లించారు. ఏడు ఇండిగో విమానాలు, మూడు విస్తారా, రెండు అకాసా ఎయిర్‌లైన్స్, గో ఎయిర్, ఎయిర్ ఇండియా విమానాలు ఒక్కొక్కటి ఉన్నాయి. సాధారణ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయని అధికారి తెలిపారు. చెన్నైకి మళ్లించిన విమానాలకు ఇంధనం నింపుతున్నామని, కాసేపట్లో బెంగళూరుకు తిరిగి వస్తామని ఆమె చెప్పారు.

Show comments