NTV Telugu Site icon

బల్దియా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగేనా?

బల్దియా స్టాండింగ్ కమిటీ ఎన్నికలంటే ఎప్పుడూ ఉత్కంఠే. తాజాగా బల్దియా స్టాండింగ్ కమిటీ ఎన్నికల నామినేషన్లు రసవత్తరంగా మారాయి. మరికొద్ది గంటల్లో ముగియనున్న నామినేషన్ల గడువు ముగియనుంది. చివరిరోజు కావడంతో ఇవాళ 7 నామినేషన్లు వేశారు ఎంఐఎం కార్పొరేటర్లు. ఇప్పటివరకు టిఆర్ఎస్ నుంచి ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. అవి కూడా పార్టీ నిర్ణయం మేరకు కాకుండా సొంతంగా వేసినట్లు సమాచారం అందుతోంది.

పార్టీ నిర్ణయానుసారం ఇవాళ టీఆర్ఎస్ నుంచి 9 నామినేషన్లు వేయనున్నారు కార్పొరేటర్లు. 15 నామినేషన్లకు మించి వస్తే ఎన్నికలు అనివార్యం అవుతాయి. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల మధ్య సఖ్యత లేక అభ్యర్థుల ఖరారుపై చివరివరకు సస్పెన్స్ ఏర్పడింది. ఎంఐఎం 7 నామినేషన్లు దాఖలు చేయడం, టీఆర్ఎస్ కు 8 స్థానాలు ఇచ్చారు. 9-6 చొప్పున టిఆర్ఎస్-ఎంఐఎం మధ్య ఒప్పందం జరిగినట్లు సమాచారం. జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ 15 స్థానాలకు ఈ నెల 20న ఎన్నికలు జరగాల్సి వుంది.