వైజాగ్ మెట్రో ప్రాజెక్టుపై ఎలాంటి ప్రతిపాదనలు రాలేదు.. కానీ,
వైజాగ్ మెట్రో ప్రాజెక్టుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, డా. బి. వెంకట సత్యవతి అడిగిన ప్రశ్నలకు లోక్‌సభలో సమాధానం ఇచ్చారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రి కౌశల్ కిషోర్.. అయితే, 75.3 కిలోమీటర్ల పొడవుతో 15,993 కోట్ల రూపాయల వ్యయ అంచనాలతో వైజాగ్ మెట్రో ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని స్పష్టం చేశారు.. 2018లో 42.55 కిలోమీటర్ల పొడవుతో 8,300 కోట్ల రూపాయల వ్యయ అంచనాలతో “లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టు” కోసం మాత్రమే ప్రతిపాదనలు వచ్చాయన్నారు.. “పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్” (పీపీపీ) విధానంలో “కొరియన్ ఎగ్జిమ్ బ్యాంక్” ఆర్థిక సహాయానికి కేంద్రం ప్రయత్నించింది. కానీ, “కొరియన్ ఎగ్జిమ్ బ్యాంక్” ఈ ప్రాజెక్టును పరిశీలించిన తర్వాత ఆర్థిక సహాయానికి నిరాకరించిందని.. పట్టణ రవాణా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశంగా తేల్చేశారు. ఇక, మెట్రో రైల్ ప్రాజెక్టులు, సమగ్ర రవాణా ప్రణాళికలు, ప్రత్యామ్నాయ విశ్లేషణ నివేదికలు, డీపీఆర్‌ల రూపకల్పన పూర్తిగా రాష్ట్రాల పరిధిలో ఉంటుందన్నారు కేంద్ర మంత్రి.. రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనలను, సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి వనరుల లభ్యతను బట్టి వీలైనంత మేరకు ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్రం పరిశీలిస్తుందననారు.. విశాఖపట్నంతో పాటు ఏపీలోని మరో 9 నగరాలు (ఏలూరు, కాకినాడ, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు)కు “కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్” రూపకల్పనకు కేంద్రం నిధులిచ్చిందని తెలిపారు.. అలాగే, విజయవాడ మెట్రో రైల్ కోసం “నాన్-మోటరైజ్డ్ ట్రాన్స్‌పోర్ట్ ఇంటిగ్రేషన్ ప్లాన్”, “ఇంటిగ్రేడెట్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ప్లాన్” రూపకల్పనకు 2018-19లో కేంద్రం 78.44 లక్షల రూపాయలు ఇచ్చిందని పార్లమెంట్‌లో సమాధానం ఇచ్చారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రి కౌశల్ కిషోర్.
హీట్ పెంచిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. అనిల్ కుమార్ యాదవ్ రాజీనామా సవాల్..
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వైసీపీలో కలకలం రేపాయి.. చంద్రబాబు, లోకేష్‌తో టచ్‌లోకి వెళ్లిన కోటంరెడ్డి.. ఉద్దేశ్యపూర్వకంగానే ఈ ఆరోపణలు చేస్తున్నారని అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. అయితే, అది ట్యాపింగ్ కాదు.. ఫోన్ రికార్డింగ్ అని కొట్టిపారేస్తున్నారు.. ఇక, ఈ వ్యవహారంలో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ రాజీనామా సవాల్ విసిరారు.. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరూపిస్తే తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరిన అనిల్ కుమార్.. మరి, ఫోన్ ట్యాపింగ్ జరగలేదని నిరూపిస్తే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? అని నిలదీశారు. ఇదే సమయంలో.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెబుతున్న ఆడియో సంభాషణ పూర్తిగా విడుదల చేయాలని డిమాండ్ చేసిన అనిల్ కుమార్.. అసలు ఫోన్ ట్యాపింగ్ జరగలేదని స్పష్టం చేశారు.. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై తన సవాల్ కు స్వీకరించాలి.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. స్పీకర్ ఫార్మెట్‌లో రాజీనామా లేఖలను తీసుకెని స్పీకర్ దగ్గరకు రావాలి.. నేను కూడా రాజీనామాతో వస్తా.. ఫోన్ ట్యాపింగ్ నిజమని నిరూపిస్తే.. నేను రాజీనామా చేస్తాను.. జరగలేదని నిరూపిస్తే కోటంరెడ్డి సిద్ధమా? అని సవాల్ చేశారు.. ఇక, 15 సెకండ్ల ఆడియో విడుదల చేయడం కాదు.. మొత్తం 51 సెకండ్ల ఆడియోను విడుదల చేయాలి… అది రాష్ట్ర ప్రజలు వింటారు.. అందులో మీ ఉద్దేశం ఏంటో తెలిసిపోతుందని.. వెంటనే ఆ పని చేయాలని డిమాండ్ చేశారు.. వైఎస్ జగన్ అవకాశం ఇస్తేనే.. నువ్వైనా.. నేనైనా ఎమ్మెల్యేం అయ్యాయం.. జగన్ అనే వ్యక్తి లేకపోతే.. మన పక్కన 70-80 వేల ఓట్లు ఉండబోవన్నారు.. నమ్మకద్రోహం చేస్తే పాపం పిల్లలకు కొడుతుందంటూ వ్యాఖ్యానించారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.
బెయిల్‌పై జైలు నుంచి వచ్చాడు.. కోరిక తీర్చేందుకు తిరస్కరించిన మహిళ గొంతు కోశాడు..
రెండు రోజుల క్రితమే జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యాడు.. తనలైంగిక వాంఛ తీర్చాలంటూ ఓ వివాహితపై ఒత్తిడి తెచ్చాడు.. అందుకు ఆ వివాహిత మహిళ తిరస్కరించడంతో.. ఆగ్రహంతో ఊగిపోయిన కామాంధుడు.. కత్తితో వివాహతపై దాడి చేశాడు.. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో కలకలం సృష్టించింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రోలుగుంట మండలం, బలిజపేటకు చెందిన వివాహితపై కోడి రమణ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు.. ఈ ఘటనలో వివాహిత మెడపై గాయం అయ్యింది.. ఆ తర్వాత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు రమణ.. ఇది గమనించిన స్థానికులు.. వెంటనే ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు.. ప్రస్తుతం నిందితుడు, బాధితురాలు ఇద్దరూ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ఇంతకీ, ఆ వివాహితపై దాడి ఎందుకు చేశాడనే వివరాల్లోకి వెళ్తే.. గంజాయి కేసులో అరెస్ట్ అయిన రమణకు జైలు శిక్ష పడింది.. అయితే, సోమవారమే బెయిల్ పై జైలు నుంచి విడుదలయ్యాడు.. జైలుకు వెళ్లి వచ్చినా.. అతడి బుద్ధిమాత్రం మారలేదు.. శారీరకంగా తన కోర్కెను తీర్చాలంటూ వివాహితను బెదిరించాడు.. కానీ, అతడి కోర్కెను తీర్చేందుకు వివాహిత తిరస్కరించింది.. దీంతో.. ఒక్కసారిగా ఆమెపై కత్తితోదాడికి దిగాడు.. ఈ ఘటనలో ఆమె మెడపై గాయం అయ్యింది.. ఆ తర్వాత భయాందోళనకు గురైన రమణ.. పురుగుల మందు తాగి తాను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు.. ప్రస్తుతం ఇద్దరూ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. రమణపై 309,307 సెక్షన్ల కింద కేసులు పెట్టారు.. విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న ఇద్దరినీ పరామర్శించారు ఎస్పీ గౌతమశాలి.
ఎమ్మెల్యే ఆనం రక్షణ బాధ్యత డీజీపీదే..
నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. వెంకటగిరి నియోజకవర్గ బాధ్యతల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆనంను తప్పించి ఆ పదవిని నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డికి అధిష్టానం అప్పగించినప్పటి నుంచి పార్టీకి.. ఎమ్మెల్యేకు మధ్య గ్యాప్ పెరుగుతూనే ఉంది.. ఇక, తన భద్రతను కుదించడంపై ఆన ఆవేదన వ్యక్తం చేశారు.. అయితే, ఆనం రామనారాయణ రెడ్డి ప్రాణ రక్షణ బాధ్యత డీజీపీ తీసుకోవాలని డిమాండ్ చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. శాసనసభ్యులే ప్రాణ హానితో భయపడే పరిస్థితులు వచ్చాయంటూ ఓ ప్రకటన విడుదల చేశారు జనసేనాని.. ఆనం రామనారాయణ రెడ్డి తనకు ప్రాణ హాని ఉందని ఆందోళన చెందటం చూస్తుంటే రాష్ట్రంలో ప్రతీకార రాజకీయాలు పరాకాష్టకు చేరాయనిపిస్తోందని ఆరోపించిన పవన్.. ప్రజా జీవితంలో సుదీర్ఘ అనుభవం, హుందా అయిన రాజకీయ నాయకుడిగా పేరున్న ఆనం రామనారాయణ రెడ్డే ఆందోళన చెందుతున్నారంటే మిగిలిన ప్రజా ప్రతినిధుల పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు. శాసనసభ్యులే ప్రాణ హానితో భయపడే పరిస్థితులు రాష్ట్రంలో వచ్చాయని విమర్శించారు పవన్.. మేం నెల్లూరులో ఉన్నప్పటి నుంచి ఆనం కుటుంబంతో పరిచయం ఉందన్న ఆయన.. ప్రభుత్వ వ్యవహార శైలి గురించీ, తన నియోజక వర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడం గురించీ రామనారాయణ రెడ్డి తన అభిప్రాయాలు వెల్లడించడమే నేరం అని ప్రభుత్వ పెద్దలు భావించినట్లున్నారని మండిపడ్డారు. ఆనంకు కేటాయించిన రక్షణ సిబ్బందిని సైతం తగ్గించారు.. ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకొని రామనారాయణ రెడ్డి ప్రాణ రక్షణ బాధ్యతను రాష్ట్ర డీజీపీ తీసుకోవాలని తన ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆనంకు తగిన రక్షణ ఏర్పాటు చేయాలి.. ఈ విషయంలో రాష్ట్ర డీజీపీ బాధ్యత తీసుకోకపోతే కేంద్ర హోమ్ శాఖకు లేఖ రాసి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని తెలియజేస్తానన్నారు..
ఏపీకి ఐదు సోలార్ పవర్ ప్లాంట్లు.. కేంద్రం ఆమోదం..
ఆంధ్రప్రదేశ్‌లో 4,100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఐదు సోలార్ పార్కులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.. ఈ విషయాన్ని పార్లమెంట్ వేదికగా కేంద్రమే ప్రకటించింది.. ఇవాళ లోక్‌సభలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వల్లభనేని బాలశౌరి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్ర విద్యుత్తు, పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ఆర్కే సింగ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.. ఏపీలో 4,100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఐదు సోలార్ పవర్ ప్లాంట్లకు ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు. వీటిలో 1,400 మెగావాట్ల సామర్థ్యం కలిగిన అనంతపురం-1 సోలార్ పార్క్ పూర్తి అయ్యింది.. పూర్తి సామర్థ్యంతో విద్యుదుత్పత్తి జరుగుతోందన్నారు. 1,000 మెగావాట్ల సామర్థ్యంతో కర్నూల్ సోలార్ పార్క్ కూడా పూర్తి కావడంతో.. విద్యుదుత్పత్తి జరుగుతోందని వెల్లడించారు. ఇక, 1,000 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మాణం జరుపుకుంటున్న కడప సోలార్ పార్కులో ఇప్పటికే 250 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతోందని వెల్లడించారు మంత్రి ఆర్కే సింగ్.. 500 మెగావాట్ల సామర్థ్యం గల అనంతపురం-2 సోలార్ పార్కులో 400 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతోందని.. 200 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్, “విండ్ హైబ్రిడ్” పార్కు నిర్మాణం జరుగుతున్నట్టు పేర్కొన్నారు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో 4,100 మెగావాట్ల సోలార్ పార్కులకు 3,050 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోంది. నిర్మాణంలో ఉన్న పార్కులను పూర్తిచేయడం కోసం 2024 వరకు “సోలార్ పార్క్ పథకాన్ని” కేంద్రం పొడిగించినట్టు తన సమాధానంలో తెలిపారు కేంద్ర విద్యుత్తు, పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ఆర్కే సింగ్.
యూనిఫాం సివిల్ కోడ్‌పై కేంద్రం క్లారిటీ..
దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలుపై ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం గురువారం రాజ్యసభకు తెలియజేసింది. యూనిఫాం సివిల్ కోడ్ కు సంబంధించిన వివిధ అంశాలను పరిశీలించి సిఫారసులు చేయాలని ప్రభుత్వం 21వ లా కమిషన్ ను కోరిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సభకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 21వ లా కమిషన్ పదవీకాలం 2018 ఆగస్టు 31తో ముగిసిందని.. లా కమిషన్ నుంచి అందిన సమాచారం ప్రకారం, దీన్ని 22వ లా కమిషన్ పరిశీలనకు తీసుకోవచ్చని ఆయన చెప్పారు. అందువల్ల యూనిఫా సివిల్ కోడ్ అమలుపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన అన్నారు. ప్రస్తుత లా ప్యానెల్ పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగుస్తోంది. ప్యానెల్ పదవీ కాలాన్ని మరో మూడేళ్ల పాటు పొడగించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు సూచించాయి. ప్రస్తుత లా ప్యానెల్ ఫిబ్రవరి 21, 2020న ఏర్పాటైంది, అయితే దాని చైర్‌పర్సన్ మరియు సభ్యులు గత ఏడాది నవంబర్‌లో అంటే ప్యానెల్ పదవీకాలం ముగియడానికి కొన్ని నెలల ముందు నియమించబడ్డారు. 21వ లా కమిషన్ యూనిఫా సివిల్ కోడ్ కు సంబంధించి వివిధ సమస్యలను పరిశీలించేదుకు, విస్తృత చర్చల కోసం తన వెబ్ సైట్ లో ‘‘ రిఫామ్ ఆఫ్ ఫ్యామిలీ లా’’ పేరుతో ఒక కన్సల్టేషన్ పేపర్ ను అప్‌లోడ్ చేసింది. 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ యూనిఫా సివిల్ కోడ్ అమలు చేస్తామని హామీ ఇచ్చింది.
పాకిస్తాన్‌లో నెయ్యి, వంట నూనెల కొరత..
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ పై రోజుకో పిడుగు పడుతోంది. ఇప్పటికే అక్కడ గోధుమ సంక్షోభం నెలకొంది. ప్రజలకు నిత్యాసరం అయిన పిండి అందుబాటులో లేదు. తాజాగా మరో సంక్షోభం కూడా రాబోతున్నట్లు అంచనా వేస్తున్నారు అక్కడి వ్యాపారులు. రానున్న రోజుల్లో దేశంలో నెయ్యి, వంటనూనెల కొరత ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. బ్యాంకులు నిత్యావసరాల దిగుమతి కోసం లెటర్ ఆఫ్ క్రెడిట్(ఎల్సీ)లను విడుదల చేయకపోతే పరిస్థితి మరింతగా దిగజారుతుందని అక్కడి మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి. 20 నుంచి 30 రోజుల్లో దేశంలో పెద్ద ఎత్తున వంటనూనెల సంక్షోభం ఏర్పడుతుందని తెలుస్తోంది. ఓడరేవుల్లో ఉన్న నిత్యావసర వస్తువుల పత్రాలను క్లియర్ చేయడంలో అక్కడి బ్యాంకులు విఫలం అవుతున్నాయని ట్రేడ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షేక్ రెహాన్ తెలిపారు. పరిస్థితి చేయిదాటిపోతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రానున్న రోజుల్లో వంట గ్యాస్ సంక్షోభం కూడా పాకిస్తాన్ లో ఏర్పడే అవకాశం ఉంది.
చాహల్ అలా చేస్తే డేంజర్ జోన్‌లో ఉన్నట్లే: మాజీ స్పిన్నర్
యుజ్వేంద్ర చాహల్.. కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అతడు పేలవ ప్రదర్శనతో జట్టులో స్థానాన్ని క్లిష్టతరం చేసుకుంటున్నాడు. ఇదే సమయంలో అతడి సహచర ఆటగాడు కుల్దీప్ యాదవ్ తన స్పిన్ మాయాజాలంతో అదరగొడుతుండగా చాహల్ మాత్రం వెనుకబడ్డాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన ఆరు మ్యాచ్‌ల్లో (వన్డేలు, టీ20లు కలిపి) అతడు కేవలం రెండింటిలోనే ఆడాడు. దీంతో అతడి ఫామ్‌పై మాజీలు కూడా విమర్శలు సంధిస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ స్పిన్నర్ సునీల్ జోషి.. చాహల్ ఫామ్‌పై స్పందించాడు. “సుదీర్ఘ కెరీర్‌లో ప్రతి బౌలర్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటాడు. ప్రస్తుతం చాహల్ కూడా అదే ఫేజ్‌లో ఉన్నాడు. మిడిల్‌లో చాహల్ లాంటి బౌలర్లకు గేమ్ టైమ్ దొరకపోతే బహుశా దేశవాలీ క్రికెట్‌లోనైనా ఆడతానని జట్టు మేనేజ్‌మెంట్‌ను అడగాలి. ఎందుకంటే ఈ సమయం అతడు తిరిగి ఫామ్‌లోకి రావడానికి ఉపయోగపడుతుంది. చాహల్‌కు అదే మంచి ప్రిపరేషన్. నేను ఈ రోజు బాగా ఆడాను. కొంచెం రిలాక్స్ అవుతాను అనుకోవచ్చు. కానీ ఆ సమయమే మీపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశముంటుంది. ఈ విషయంపై చాహల్ కూడా ఫోకస్ పెట్టాలి. ముఖ్యంగా బంతి ఫాలో త్రూపై దృష్టి సారించాలి. అతడి ఆర్మ్ స్పీడ్ ఎక్కువ. కాబట్టి బంతిని స్పిన్ చేయడం చాలా ముఖ్యం. కొన్ని సార్లు అతడు బంతిని పుష్ చేయడం వల్ల దారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు” అని సునీల్ తెలిపాడు.
ఆ నడుము మడతలతోనే కుర్రాళ్లను మడతపెట్టేస్తోందే
బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న అనసూయ.. షోలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళంలో కూడా అమ్మడు వరుస అవకాశాలను అందుకొంటూ జోరుపెంచేసింది. ఇక షోలు లేకపోతేనేం.. సోషల్ మీడియా ఉందిగా.. అనసూయ అభిమాన గళం మొత్తం అందులోనే ఉంటారు. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లతో అనసూయ చేసే రచ్చ అంతా ఇంత కాదు. ఇక వాటికి ట్రోలర్స్ ట్రోల్స్ చేస్తారు.. వాటి గురించి పెద్దగా పట్టించుకోని ముద్దుగుమ్మ తన పని తానూ చేసుకుంటూ పోతోంది. ఇక అనసూయ అందచందాల గురించి, అందాల ఆరబోత గురించి అసలు చెప్పనవసరం లేదు. చీరకట్టినా, మోడ్రన్ డ్రెస్ వేసినా అందాల ఆరబోత ఉండాల్సిందే. తాజాగా హాట్ యాంకర్ నీలం రంగు చీరలో తళుక్కున మెరిసింది. బ్యాక్ అందాలను చూపిస్తూ కుర్రాళ్ళ గుండెలను గుభేలు అనిపించింది. ఆ వీపందం తో పాటు ఆ నడుము మడతలను చూపిస్తూ పిచ్చెక్కించింది. ఈ రేంజ్ లో అనసూయ అందం చూసిన నెటిజన్లు ఊరకనే ఉంటారా.. ఈ ఫోటోలను వైరల్ చేసి పడేసారు. నీలి రంగు చీరలోనా చందమామ నువ్వే జాణ అని కొందరు పొగిడేస్తుంటే.. ఆ నడుము మడతలతోనే కుర్రాళ్లను మడతపెట్టేస్తోందే అని మరికొందరు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అనసూయ మైఖేల్, పుష్ప 2 చిత్రాల్లో నటిస్తోంది.
బ్లడ్ షేడ్ పోస్టర్ తోనే హైప్ ఎక్కిస్తే.. టైటిల్ తెలిస్తే తట్టుకోలేరేమో
ఒక కాంబో హిట్ అయ్యాకా.. అదే కాంబో రీపీట్ అయితే అంచనాలు ఆకాశానికి తాకుతాయి. ప్రస్తుతం దళపతి 67 పై అంచనాలు అభిమానులు అంతకన్నా ఎక్కువే ఉన్నాయి. కోలీవుడ్ స్టార్ విజయ్- స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తున్న చిత్రం దళపతి 67. ఇప్పటికే ఈ కాంబోలో వచ్చిన మాస్టర్ సూపర్ హిట్ ను సొంతం చేసుకొంది. దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. నిన్ననే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష నటిస్తుండగా ప్రియా ఆనంద్, అర్జున్ కీలక పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్.. విజయ్ కు ధీటైన విలన్ గా కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. కాగా, తాజాగా అనిరుద్.. విజయ్ పోస్టర్ ను ఒకటి షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్ చెప్పుకొచ్చాడు. ఫిబ్రవరి 3 .. అనగా రేపు సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. దాంతో పాటు అనిరుధ్ షేర్ చేసిన ఫోటో బిహ్మణులకు హైప్ ఎక్కిస్తోంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బ్లడ్ షేడ్ ఆర్ట్ తో పబ్లిసిటీ డిజైనర్ గోపీ ప్రసన్న ఈ పోస్టర్ ని బ్రష్ తో డిజైన్ చేసిన ఈ పోస్టర్ చూస్తూనే అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు. ఒక పోస్టర్ కే ఇంతలా హైప్ ఎక్కిస్తే.. టైటిల్ తెలిస్తే తట్టుకోలేరేమో అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఆ టైటిల్ ఎలా ఉంటుంది.. దానికి అభిమానులు ఎలా స్పందిస్తారు అనేది చూడాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.