NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

జూనియర్‌ ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ.. నారా లోకేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర తిరుపతి నియోజకవర్గంలో కొనసాగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు లోకేష్‌… అభివృద్ధిలో ఏపీ అగ్రస్థానంలో ఉండాలని ఎవరెవరు కోరుకుంటారో వారందరూ రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో మొదట కావాల్సింది మంచి మనసు అని, 2014లోనే తాను పవన్ కల్యాణ్ లో మంచి మనసును చూశానని లోకేష్‌ చెప్పుకొచ్చారు.. కాగా, నారా లోకేష్‌ పాదయాత్రలో భాగంగా ఈ రోజు ఆటోడ్రైవర్లతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ అసమర్థత వల్లే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని.. దీంతో నిత్యావసరాల ధరలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.. టీడీపీ అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు నారా లోకేష్‌.

ఏపీలో 3 వేల చిన్న తరహా ఆలయాల అభివృద్ధి.. ఒక్కో దేవాలయానికి రూ.10 లక్షలు..!
త్వరలో రాష్ట్రంలో 3 వేల చిన్న తరహా దేవాలయాల అభివృద్ధి చేస్తాం.. ఒక్కో దేవాలయ నిర్మాణానికి రూ. 10 లక్షలు మంజూరు చేస్తామని తెలిపారు దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.. ఆ శాఖ అధికారులతో ఇవాళ సమీక్ష నిర్వహించిన మంత్రి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో వివాదంలో ఉన్న 4,700 ఎకరాలను సంబంధిత దేవస్థానాలకు చెందేలా జీవో తీసుకొస్తున్నాం అని వెల్లడించారు.. డీఐజీ స్థాయి అధికారులతో విజిలెన్స్ సెల్ ఏర్పాటు కాబోతోంది.. దేవాలయాల్లో 3 రకాలుగా టెండర్లు పిలుస్తాం అన్నారు.. పూజలకు కావాల్సిన సామాగ్రికి రూ. కోటి టర్నోవర్ ఉన్నవారు పాల్గొనవచ్చు అని తెలిపిన ఆయన.. అన్న ప్రసాదం తయారీ కోసం రూ. 2 కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థలు టెండర్లు పాల్గొనవచ్చు అన్నారు.. అమ్మవారి ప్రసాదం పోటుకి కావాల్సిన సామాగ్రికి రూ. 5 కోట్ల టర్నోవర్ ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.. ఇక, క్వాలిటీ కంట్రోల్ కోసం స్పెషల్ టీం ఎప్పుడు పర్యవేక్షిస్తుందని తెలిపారు మంత్రి కొట్టు.. రాష్ట్రంలో ప్రధానంగా 175 ఆలయాలు ఆన్ లైన్ చేశామన్న ఆయన.. దీని ద్వారా ఏ రోజు డేటా ఆ రోజు తెలుసుకోవచ్చు అన్నారు. త్వరలో రాష్ట్రంలో 3 వేల చిన్న తరహా దేవాలయాల అభివృద్ధి చేస్తాని.. దాని కోసం ఒక్కో దేవాలయానికి రూ. 10 లక్షలు మంజూరు చేస్తామని తెలిపారు.. మరోవైపు.. ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో ఆర్టీసీ డిపో నిర్మాణానికి 4 ఎకరాల కేటాయించనున్నట్టు వెల్లడించారు. 175 ఆలయాలకు ఐటీకి సంబంధించి స్పెషల్ సెల్ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.

విద్యుత్‌ శాఖపై సీఎం జగన్‌ సమీక్ష.. కరెంట్‌ కోతలు, వ్యవసాయ కనెక్షన్లపై కీలక నిర్ణయం
విద్యుత్‌ శాఖపై సమీక్ష నిర్వహించిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. వేసవిలో విద్యుత్‌ డిమాండ్, రైతులకు విద్యుత్‌ కనెక్షన్లు, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా తదితర అంశాలపై సమీక్ష జరిపారు సీఎం.. ఫిబ్రవరి 2వ వారం నుంచే విద్యుత్‌ డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలో.. మార్చి, ఏప్రిల్‌ నెలలో సగటున రోజుకు 240 మిలియన్‌ యూనిట్లు వినియోగం అంచనా వేస్తున్నారు.. ఇక, ఏప్రిల్‌లో 250 మిలియన్‌ యూనిట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు.. దీంతో, పవర్‌ ఎక్స్‌ఛేంజ్‌లో ముందస్తుగా విద్యుత్‌ను బుక్‌ చేసుకుంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. సమీక్ష సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం వైఎస్‌ జగన్‌.. వేసవిలో విద్యుత్‌ కొరత ఉండకూడదని స్పష్టం చేసిన ఆయన.. కరెంటు కోతల సమస్య రాకూడదన్నారు.. బొగ్గు నిల్వల విషయంలో కూడా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. థర్మల్‌ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.. మరోవైపు.. వ్యవసాయ కనెక్షన్ల పై కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం.. ఏ నెలలో దరఖాస్తు చేసుకుంటే అదే నెలలో కనెక్షన్‌ మంజూరు చేయాలని.. రైతులకు కనెక్షన్ల మంజూరులో ఎలాంటి జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 1.06లక్షల కనెక్షన్ల మంజూరు చేసినట్టు వెల్లడించిన సీఎం.. మార్చి నాటికి మరో 20వేల కనెక్షన్లుపైగా మంజూరు చేయనున్నట్టు తెలిపారు.. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా 100 విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల నిర్మాణం పూర్తి అయినట్టు పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.

ఏపీ టూరిజం బుక్‌ను ఆవిష్కరించిన సీఎం జగన్..
ఆంధ్రప్రదేశ్‌ టూరిజం శాఖ రూపొందించిన ఏపీ టూరిజం కాఫీ టేబుల్‌ బుక్స్‌ను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ 2023 నేపథ్యంలో ఏపీ టూరిజం, హ్యండీక్రాఫ్ట్స్, టెంపుల్స్, బీచ్‌లు, సోల్స్‌ స్పేస్, ఏ టూ జెడ్‌ టేబుల్‌ గైడ్‌ పై ప్రత్యేక పుస్తకాలను ప్రచురించింది ఏపీ ప్రభుత్వం.. ఇంగ్లీష్, జర్మన్, స్పానిష్, చైనీస్‌ బాషల్లో ఈ పుస్తకాలను ముద్రించారు.. ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌లు, వివిధ దేశాల రాయబార కార్యాలయాలు, టూరిజం సెంటర్స్‌లో ఏపీ ప్రత్యేకతలను ఈ పుస్తకాల్లో వివరించారు.. ఇవాళ తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ఆ బుక్స్‌ను ఆవిష్కరించారు సీఎం వైఎస్‌ జగన్‌. ఏపీలో టూరిజం, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణంపై ఈ పుస్తకాలలో ప్రత్యేక కథనాలు పొందుపర్చారు.. బెస్ట్‌ టూరిజం పాలసీ అవార్డును కైవసం చేసుకున్న ఏపీ ప్రభుత్వ టూరిజం శాఖ, ఇతర రాష్ట్రాలు కూడా ఏపీ టూరిజం పాలసీని అధ్యయనం చేస్తున్నాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు టూరిజం శాఖ అధికారులు. దీంతో.. వారిని అభినందించిన ముఖ్యమంత్రి, రానున్న రోజుల్లో టూరిజం డెస్టినేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో నెంబర్‌ వన్‌ గా ఉన్న రాష్ట్రాన్ని అన్ని రంగాలలోనూ అభివృద్ది పథంలో నడిపిస్తూ, పెట్టుబడులకు స్వర్గధామంగా తీర్చిదిద్దేలా ముందుకు సాగాలన్నారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి..

అవినాష్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. సాక్షిగానా? నేరస్తుడిగానా? అర్థం కావడంలేదు..
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది.. ఇవాళ ఎంపీ అవినాష్‌రెడ్డిని ప్రశ్నించింది సీబీఐ.. దాదాపు ఐదు గంటల పాటు అవినాష్‌ని విచారించింది సీబీఐ.. అయితే, సీబీఐ విచారణ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఎంపీ అవినాష్‌రెడ్డి హాట్‌ కామెంట్లు చేశారు.. వాస్తవాలు టార్గెట్‌గా కాకుండా.. వ్యక్తి టార్గెట్ గా విచారణ సాగుతోందని ఆరోపించారు.. సీబీఐ దర్యాప్తు పారదర్శకంగా సాగాలని డిమాండ్‌ చేశారు.. ఈ కేసులోని వాస్తవాలపై నేను సీబీఐ అధికారులకు ఒక రిప్రజంటేషన్‌ ఇచ్చాను అని వెల్లడించారు.. నాకున్న అనుమానాలు ప్రస్తావించాను.. గూగుల్‌ టేక్‌ఔట్‌ అంటూ గతంలో టీడీపీ ప్రస్తావించింది.. మరి ఇప్పుడు ఆ ప్రశ్నలు వస్తున్నాయంటే.. ఇది గూగుల్‌ టేక్‌ఔటో..? టీడీపీ టేక్‌ఔటో బయటపడుతుందన్నారు.. టీడీపీ చెప్పిన అంశాలను సీబీఐ కౌంటర్ లో ప్రస్తావిస్తుందని విమర్శించారు ఎంపీ అవినాష్‌రెడ్డి.. పారదర్శకంగా విచారణ సాగాలని కోరుతున్నాను.. వైఎస్‌ వివేకా ఇంట్లో దొరికిన లెటర్ బయటపెట్టాలని కోరారు.. వివేకా చనిపోయిన రోజు మాట్లాడిన మాటలకు నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.. విచారణ సమయంలో ఆడియో, వీడియో రికార్డు చెయ్యాలని కోరాను.. కానీ, అది జరుగలేదన్నారు.. ఇక, నాకు 160 సీఆర్‌పీసీ నోటీస్ ఇచ్చి విచారిస్తున్నారని తెలిపిన అవినాష్‌రెడ్డి.. కానీ, నన్ను సాక్షిగా విచారిస్తున్నారో, నేరస్తుడిగా విచారిస్తున్నారో అర్థం కావట్లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.. కానీ, ఒక అబద్దాన్ని 0 నుంచి 100కు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది.. ఒక నిజాన్ని 100 నుంచి 0 చేసే ప్రయత్నం జరుగుతోంది.. ఈ విషయంపై సంయమనం పాటించాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి.

మోటార్లకు మీటర్లపై.. కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మోటార్లకు మీటర్ల విషయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఓ సవాల్ విసిరారు. ‘‘రాష్ట్రంలో మోటార్లకు మీటర్లు పెడతాం, మీకు లోన్ ఇవ్వండి అని కేంద్రానికి ఉత్తరం రాసింది నువ్వు కాదా? నువ్వు మగాడివి అయితే నిజం చెప్పు’’ అని ఛాలెంజ్ చేశారు. జయశంకర్ జిల్లాలో మంథనిలో ఆయన మాట్లాడుతూ.. విద్యాసాగర్ రావు సస్యశ్యామల యాత్ర చేపట్టారని, బీజేపీకి యాత్రలు కొత్త కాదు అని అన్నారు. ఆనాడు నక్సలైట్లు భయపెట్టినా, నేడు పోలీసులు భయపెడుతున్నా.. బీజేపీ యాత్రలు ఆగవన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు కోట్లు సంపాదించుకున్నాడని ఆరోపణలు చేశారు. బీజేపీ పేరు చెప్పి సింగరేణిని కేసీఆర్ ప్రైవేటీకరణ చేస్తే.. గల్లా పట్టి కొడుతామని అన్నారు. సింగరేణి కేసీఆర్ సర్కారుకు ఏటీఎమ్ అయ్యిందన్నారు. సింగరేణి కార్మికులకు జీతాలు ఇవ్వలేని స్థితికి కేసీఆర్ తీసుకొచ్చారని ఆరోపించారు. ఇక కేటీఆర్ తండ్రి పేరుతో రాజకీయాల్లోకి వచ్చారని, కేసీఆర్ పేరు పక్కకుపెడితే కుక్కలు కూడా కేటీఆర్‌ని చూడవని బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను దేశం కోసం, ధర్మం కోసం జైలుకు వెళ్లినవాడినని.. సామాన్య కార్యకర్తగా ఎవరి అండదండలు లేకుండా ఎదిగానని అన్నారు. బీజేపీ కుటుంబాల పార్టీ కాదన్న ఆయన.. సామాన్య కార్యకర్త అయిన మోడీ ఇప్పుడు ప్రధాని అయ్యారన్నారు. ‘‘నీ కొడుకు, కూతురు కాకుండా వేరే వ్యక్తులను పార్టీ అధ్యక్షుడు చేసే ధైర్యం ఉందా’’ అంటూ కేసీఆర్‌కు మరో సవాల్ విసిరారు. కేసీఆర్‌వి అన్నీ దొంగ దీక్షలే అని.. ఉద్యమ సమయంలో తిని, తాగి దొంగ దీక్ష చేశాడని విమర్శించారు. ఢిల్లీలో చేసిన దీక్షలోనూ కేసీఆర్ మందు తాగారంటూ వ్యాఖ్యానించారు. ఒక తాగుబోతుని ముఖ్యమంత్రిగా ఎలా ఎన్నుకున్నారంటూ ఇతర రాష్ట్రాల ప్రజలు అడుగుతున్నారని చెప్పారు.

మైనర్‌ కుమార్తెపై లైంగిక దాడి.. కీచక తండ్రికి పదేళ్ల జైలు శిక్ష
కూతురిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే కీచకుడిగా మారాడు. కడుపున పుట్టిన బిడ్డ అనే కనికరం లేకుండా నీచానికి ఒడిగట్టాడు. కన్న కూతురిపై అత్యాచారం చేసిన ఓ కసాయి తండ్రి కటాకటాల పాలయ్యాడు. మైనర్ కూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన కీచక తండ్రికి ప్రత్యేక కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. అపరిపక్వ వయస్సు గల బాలికలతో లైంగిక కార్యకలాపాలు వారి జీవితాలపై బాధాకరమైన ప్రభావాన్ని చూపుతాయని న్యాయస్థానం పేర్కొంది. కన్న తండ్రే ఇలాంటి నేరాలకు పాల్పడితే పిల్లలపై ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని పేర్కొంది. ఐపీసీ సెక్షన్లు 354, 509, పోక్సో చట్టం ప్రకారం తన మైనర్ కుమార్తెపై లైంగిక వేధింపుల కేసులో తండ్రికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రత్యేక పోక్సో జడ్జి సీమా జాదవ్ ఫిబ్రవరి 23న జారీ చేసిన ఉత్తర్వుల వివరాలు శుక్రవారం అందుబాటులోకి వచ్చాయి. ప్రాసిక్యూషన్ ప్రకారం.. 2013, 2017 మధ్య కాలంలో ఆమె తల్లి పని కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో ఆ వ్యక్తి బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని ఆమెను బెదిరించాడు. నిందితుడు అపరిచితుడు కాదని, బాధితురాలి తండ్రే కాబట్టి ఆమె జీవితాంతం ఈ విషయం బాధను కలిగిస్తుంది కోర్టు పేర్కొంది. బాధితురాలి వ్యక్తిత్వాన్ని నాశనం చేస్తుందని న్యాయస్థానం వెల్లడించింది. ఈ కేసులో నిందితుడు, బిడ్డ నమ్మకంగా విశ్వసించగల తల్లి స్థానంలో ఉన్నాడని కోర్టు పేర్కొంది. తల్లిలాగే, పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రధాన బాధ్యత అతనిపై ఉందని తెలిపింది. ఆమె నమ్మకాన్ని మోసం చేయడం కంటే దారుణంగా, అతను ఆమెను పాడుచేసి, జీవితానికి శాశ్వత మచ్చను మిగిల్చాడని కోర్టు చెప్పింది.

రష్యా సభ్యత్వాన్ని రద్దు చేసిన ఫైనాన్షియల్ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్
ఉక్రెయిన్‌పై మాస్కో దాడికి సంబంధించి రష్యా సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు గ్లోబల్ యాంటీ మనీ లాండరింగ్ వాచ్‌డాగ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ శుక్రవారం తెలిపింది. ఫైనాన్షియల్ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్ 200 కంటే ఎక్కువ దేశాలు, అధికార పరిధికి ప్రమాణాలను నిర్దేశిస్తుంది. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా, తీవ్రవాదంతో సహా తీవ్రమైన నేరాలను పరిష్కరించడానికి అధికారులకు సహాయం చేస్తుంది. మనీ లాండరింగ్‌ను ఎదుర్కునేందుకు విధానాలను అభివృద్ధి చేయడానికి జీ7 దేశాల చొరవతో 1989లో స్థాపించబడిన ఒక అంతర ప్రభుత్వ సంస్థ. తీవ్రవాదానికి ఆర్థిక సహాయం అందించే దేశాలపై ఇది కఠిన ఆంక్షలు విధిస్తుంది. రష్యన్ ఫెడరేషన్ చర్యలు భద్రత, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సమగ్రతను ప్రోత్సహించే లక్ష్యంతో ఏర్పాటైన ఎఫ్‌ఏటీఎఫ్ ప్రధాన సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆ సంస్థ పేర్కొంది. ఎఫ్‌ఏటీఎఫ్ ప్రమాణాలను అమలు చేయడంలో రష్యా ఇప్పటికీ జవాబుదారీగా ఉందని పేర్కొంది. ప్యారిస్‌లో ఐదు రోజుల సమావేశం తరువాత ఎఫ్ఏటీఎఫ్ నైజీరియా, దక్షిణాఫ్రికాలను తన పర్యవేక్షణకు లోబడి ఉన్న దేశాల జాబితాలో చేర్చింది. కంబోడియా, మొరాకోలను ఎఫ్‌ఏటీఎఫ్ జాబితా నుంచి తొలగించింది.రష్యా కౌన్సిల్ ఆఫ్ యూరోప్ నుంచి బహిష్కరించబడింది. యూఎన్‌ మానవ హక్కుల మండలి నుంచి కూడా సస్పెండ్ చేయబడింది. కానీ ఇప్పటికీ అనేక అంతర్జాతీయ సంస్థలలో సభ్యదేశంగా ఉంది.

ఏడు అడుగుల పురుషాంగంతో నడిరోడ్డుపై అమ్మాయిల వెంట పడుతూ..
టైటిల్ చూసి.. ఏంటి టైటిల్ తప్పు పడింది.. ఏడు అంగుళాలకు బదులు ఏడు అడుగులను పడిందనుకుంటా అని కంగారు పడకండి.. టైటిల్ లో ఎటువంటి తప్పు లేదు. అసలు విషయం ఏంటంటే.. ఒక వ్యక్తి ఏడడుగుల క్లాత్ తో పురుషాంగం లాంటి డ్రెస్ కుట్టించుకొని మహిళలను వేధిస్తున్నాడు.. ఆ వేధింపులు తాళాల్లేక మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని వెతికి ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబందించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బ్రెజిల్ రియో డి జెనీరో నగరంలో వారాంతంలో కార్నివాల్స్ బాగా జరుగుతూ ఉంటాయి. అక్కడకు చాలామంది మోడల్స్, అమ్మాయిలు వస్తూ ఉంటారు. ఇక ఆ కార్నివాల్స్ జరిగిన ప్రతి చోట ఒక వ్యక్తి పురుషాంగం డ్రెస్ వేసుకొని వారిని వేధించడం మొదలుపెట్టాడు. అమ్మాయిల వెంటపడుతూ వారిని అసభ్యకరమైన పదాలతో హింసించసాగాడు. ఇక దీంతో అతడి చేష్టలను తట్టుకోలేని మోడల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు అతడికోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేవలం కార్నివాల్స్ జరిగే సమయంలోనే అతడు వస్తాడని ఈ వారం ఒక కార్నివాల్ వద్ద మాటువేసి పోలీసుల చేతికి అతడు పట్టుబడ్డాడు. ఆ ఏడడుగుల దుస్తుల్లోనే అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఇంకో విచిత్రం ఏంటంటే.. నిజంగానే ఏడడుగుల పురుషాంగం ఉందని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు.

మార్చిలో బ్యాంకులకు దండిగా సెలవులు..
ఫిబ్రవరి ముగింపునకు వచ్చేసింది.. ఇక, మార్చి నెల ప్రారంభం కాబోతోంది.. నిత్యం బ్యాంకులు చుట్టూ తిరుగుతూ లావాదేవీలు చేసేవారు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చేసింది.. ఎందుకంటే.. ఈ నెలలో ఏకంగా 12 రోజుల పాటు బ్యాంకులు మూతపడున్నాయి.. ఏదైనా అసౌకర్యాన్ని నివారించడానికి, వచ్చే నెలలో రాబోయే బ్యాంక్ సంబంధిత పనులు ఉన్న వ్యక్తులు సెలవు క్యాలెండర్‌ను సమీక్షించి, తదనుగుణంగా వారి బ్యాంక్‌ పనులు ప్లాన్‌ చేసుకుంటే బెటర్‌.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్చి 2023 కోసం బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. వివిధ పండుగలు, రెండో శనివారం, నాల్గో శనివారం మరియు నాలుగు ఆదివారాలతో సహా మొత్తం 12 సెలవులు ఉంటాయని పేర్కొంది.. అయితే, ఈ సెలవుల్లో కొన్ని ప్రాంతీయమైనవి, కాబట్టి బ్యాంక్ సందర్శనను ప్లాన్ చేయడానికి ముందు సెలవుదినం మీ ప్రాంతానికి వర్తిస్తుందో లేదో చెక్‌చేసుకోవడం మంచిది.. అయితే, ఆన్‌లైన్ మరియు నెట్ బ్యాంకింగ్ సేవలు ఈ రోజుల్లో యథావిథిగా పని చేస్తాయి.. ఈ రోజుల్లో ఆన్‌లైన్‌ సేవలపైనే ఎక్కువ మంది ఆధారపుడుతోన్న విషయం విదితమే.. అయితే, పెద్ద మొత్తం ఉన్నప్పుడు గానీ, ఇతర బ్యాంకు లావీదేవీల విషయంలో మాత్రం.. సంబంధిత బ్యాంకు బ్రాంచీలకు వెళ్తున్నారు ఖాతాదారులు.