NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

దువ్వాడ వాణికి షాకిచ్చిన దివ్వెల మాధురి..! ఈ ఇల్లు నాది.. ఏమైనా ఉంటే బయట చూసుకో..
వివాదాస్పదంగా మారిన ఆ ప్రాపర్టీ నాదే అంటూ ఓ వీడియో విడుదల చేశారు దివ్వెల మాధురి.. ఈ బిల్డింగ్ నా పేరు మీద ఉంది.. నా ఇంటిలోకి ఎవరూ రావడానికి వీలులేదని స్పష్టం చేశారు.. అంతేకాదు.. దువ్వాడ శ్రీనివాస్‌తో ఏమైనా ఇష్యూ ఉంటే వాణి బైట తేల్చుకోవాలంటూ సలహా ఇచ్చారు. ఇక, ఈ ఇల్లు నేను కోనుక్కున్నాను.. పోలీసులు నాకు రక్షణ కల్పించాలని కోరారు.. నేను ఓక్కదాన్నే ఉన్నా.. నాకు సెఫ్టీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. అయితే, నేను గతంలో 2 కోట్ల రూపాయలు దువ్వాడ శ్రీనివాస్‌కి అప్పుగా ఇచ్చాను.. నా డబ్బులు తిరిగి ఇవ్వాలని శ్రీనును అడిగాను.. కానీ, డబ్బులు ఇచ్చే పరిస్థితిలో నేను లేను అంటూ బిల్డింగ్ రాసిచ్చారని తెలిపింది.. సెల్ఫ్ ప్రాపర్టీ ఎవరు ఎవరికైనా అమ్మోచ్చు అని వెల్లడించారు దివ్వెల మాధురి.. అయితే, గతంలో నేను దువ్వాడ శ్రీనివాస్‌కు రెండు కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చాను.. నేను ఏమీ ఆశించి ఆ డబ్బులు ఇవ్వలేదు అన్నారు దివ్వెల మాధురి.. రీసెంట్‌గా మరో రూ.50 లక్షలు కూడా శ్రీనివాస్‌ తీసుకున్నారని తెలిపారు..

కోర్టు ఆర్డర్‌ వచ్చింది.. నా ప్రాణం పోయినా ఈ ఇల్లు విడిచిపెట్టను..
నా ప్రాణం పోయినా ఈ ఇల్లు విడిపెట్టేది లేదంటున్నారు దువ్వాడ వాణి.. ఎమ్మెల్సీ దువ్వాడ ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆందోళన చేస్తున్నారు వాణి‌, కుమార్తె హైందవి.. ఈ సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన వాణి.. కేసు కోర్టులో ఉంది.. మాకు ఆర్డర్‌ కూడా వచ్చింది.. ఇంటిలో ప్రవేశానికి కోర్టు అనుమతి ఇచ్చిందన్నారు.. కోర్టు ఆదేశాలు ఉండగా.. మాధురి చేసుకున్న రిజిస్ట్రేషన్‌ చెల్లదు అంటున్నారు.. ఇది కోర్టు ధిక్కారం కిందకి వస్తుందంటున్నారు.. ఇక, మా ఆస్తి తీసుకొని, రకరకాల ఇల్లీగల్ పనులు చేస్తుంది అంటూ దివ్వెల మాధురిపై మండిపడ్డారు. నా ఆస్తి ఐదున్నర ఎకరాలు అమ్మి ఇల్లు కొన్నాం.. నా ప్రాణం పోయినా ఈ ఇల్లు విడిచిపెట్టను అంటున్నారు దువ్వాడ వాణి.. నా పలాస ఆస్తి అమ్మి కొన్న ఇల్లు ఇది.. బగవంతుడు ఉన్నాడు.. మోసం చేయడు.. పిల్లలకు ఇల్లు చెందుతుందని బావిస్తున్నాను అన్నారు. మరోవైపు పోలీసుల రక్షణ అడుగుతున్నాం.. పొలీసుల సహకారంతోనే ఆ ఇంట్లోకి అడుగుపెడతాను అన్నారు.. ఇక, నా భర్త నన్ను మోసం చేస్తాడని భావించలేదు.. నా పిల్లలకు చీట్ చేస్తారని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. పితృఅర్జితం ఒక్క రూపాయి రాలేదు.. మా అస్తులు అమ్మి సంపాదించిన ప్రాపర్టీ ఇది అన్నారు.. నా పిల్లల కోసం ఒక ఇంటిలోనే ఉండాలని కోరుకున్నానని తెలిపారు దువ్వాడ వాణి..

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం.. అధికారులకు మంత్రి ఆదేశం
ఈరోజు మధ్యాహ్నం నుంచి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కుండపోతగా వర్షం కురుస్తుంది. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైన వర్షం భారీ ఎత్తున కురుస్తుండతో ఆందోళన మొదలైంది. ఎగువన కూడా బయ్యారం, గార్ల, మహబూబాబాద్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల మున్నేరుకి వరద వస్తుంది. దీంతో.. మున్నేరు ముంపు బాధితులను మళ్లీ పునరావాస కేంద్రాలకు తరలించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. ఖమ్మం, వైరా, తల్లాడ, సత్తుపల్లి ఈ ప్రాంతంలో భారీగా వర్షం కురుస్తుంది. దీంతో మళ్లీ మున్నేరు ఉధృతి పెరుగుతుందా అనే ఆందోళన కొనసాగుతుంది. ఈ క్రమంలో.. మళ్ళీ వరద వస్తుందని ఆందోళనతో పునరావాస కేంద్రాలకి తరలించాలని అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఆదేశాలు జారీ చేశారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి, కల్లూరు మండలాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో‌ కూడిన భారీ వర్షం కురిసింది. గంటపాటు ఏకదాటిగా కురిసిన కుండపోత వర్షానికి వీ.ఎం.బంజర్ రింగ్ సర్కిల్ వద్ద విజయవాడ టూ చతీస్త్ఘడ్ నేషనల్ హైవే పైకి భారీగా వరద పోటెత్తింది. నేషనల్ హైవే పైకి మోకాళ్ళ లోతు వరద రావటంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వీ.ఎం.బంజర్ లోని పలు ఇళ్ళలోకి నీరు చేరాయి. లోతట్టు ప్రాంతాల రహదారులపై మోకాళ్ళ లోతు వరద ప్రవహిస్తుంది. దీనికి తోడు ఈదురు గాలులు బలంగా వీస్తుండటంతో ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు.

వరదబాధితులకు ప్రభుత్వం కీలక సూచన.. ఇంటి దగ్గర ఉంటే బెటర్‌..
విజయవాడను బుడమేరు ముంచేసింది.. ఇప్పటికీ విజయవాడ పూర్తిస్థాయిలో తేరుకోలేదు.. అయితే.. విజయవాడలో వరదలు మిగిల్చిన నష్టంపై అంచనా వేసేందుకు సిద్ధం అవుతోంది ప్రభుత్వం.. సోమవారం నుంచి మూడు రోజుల పాటు వరద నష్టం అంచనా వేస్తామని తెలిపారు ఏపీ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆర్‌పీ సిసోడియా.. అయితే, ఈ సమయంలో బాధితులు ఇళ్లలో ఉంటే పూర్తిస్థాయి వివరాల నమోదుకు అవకాశం ఉంటుందన్నారు.. 32 వార్డుల్లో రెండు లక్షల ఇళ్లలో వరద నష్టం ఎల్లుండి నుంచి లెక్కించనున్నట్టు వెల్లడించిన ఆయన.. ఈ వరద నష్టం అంచనాలో 149 మంది తహసీల్దార్లు పాల్గొంటారని తెలిపారు.. 32 వార్డులలో 149 సచివాలయాల పరిధిలో రెండు లక్షల నివాసాలలో నష్టం గణన ఉంటుంది.. దీనిపై ఆదివారం ఆ టీమ్‌లకు విజయవాడలో ఒక రోజు శిక్షణ ఇస్తాం అన్నారు.. ప్రతి వార్డుకు ఒక జిల్లా స్ధాయి అధికారి నేతృత్వం వహిస్తారు.. ప్రతి రెండు వార్డులకు ఒక ఐఏఎస్ అధికారి పర్యవేక్షణ ఉంటుందన్నారు.. ఒక వార్డు లేదా గ్రామ సచివాలయానికి 10 గణన బృందాలు ఉంటాయి.. కమర్షియల్ ఎస్టాబ్లిష్ మెంట్ ల నష్టం గణన కోసం 200 బృందాలు రంగంలోకి దిగుతాయని పేర్కొన్నారు ఏపీ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆర్‌పీ సిసోడియా..

హర్యానాలో సునీతా ఎన్నికల ప్రచారం.. మోడీకి కేజ్రీవాల్ తలవంచరని వ్యాఖ్య
ప్రధాని మోడీ ముందు తన భర్త కేజ్రీవాల్ ఎప్పటికీ తలవంచరని సునీతా కేజ్రీవాల్ అన్నారు. హర్యానాలో సునీతా కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కాంగ్రెస్‌తో పొత్తు కుదరకపోవడంతో ఒంటరిగా బరిలోకి దిగుతున్నట్లు శనివారం ఆప్ ప్రకటించింది. అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో శనివారం సునీతా కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. బీజేపీ రాజకీయ ప్రతీకారానికి పాల్పడుతోందని విమర్శించారు. హర్యానా కోడలుగా సునీతా కేజ్రీవాల్ పరిచయం చేసుకున్నారు. బీజేపీ కేవలం అధికారదాహంతో ప్రత్యర్థులను జైలులోకి నెడుతోందని, పార్టీలను చీల్చడం ఎలాగో వారికి బాగా తెలుసునని విమర్శలు గుప్పించారు. జ్రీవాల్ చేసిన పనుల వల్లే హర్యానా పేరు ప్రపంచమంతా చెప్పుకుంటున్నారని గుర్తుచేశారు. హర్యానా బాలుడు ఢిల్లీ సీఎం అవుతాడని ఎవరూ ఊహించలేదన్నారు. కృష్ణ జన్మాష్టమి రోజున కేజ్రీవాల్ పుట్టారని, ప్రత్యేక పనికి భగవంతుడు ఆయనను ఉద్దేశించాడని చెప్పారు. కానీ హర్యానాలో బీజేపీ పదేళ్లుగా అధికారంలో ఉండి ఏమి చేసిందని సునీత నిలదీశారు. ప్రభుత్వ పాఠశాలలు కానీ, పిల్లల విద్య కానీ మెరుగైందా అని సునీత ప్రశ్నించారు. కనీసం మంచి ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయా? మందులు, చికిత్స ఉచితంగా అందుతోందా? అని ప్రశ్నించారు. అక్టోబర్ 5న జరిగే ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా బీజేపీకి వెళ్లకూడదని, ప్రతి ఒక్కరూ ఆప్‌కు ఓటు వేసి కేజ్రీవాల్‌ను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు.

సోమవారం భారతదేశానికి రానున్న యూఏఈ క్రౌన్ ప్రిన్స్..
అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సెప్టెంబర్ 9-10న తన అధికారిక పర్యటన నిమిత్తం భారతదేశానికి రాబోతున్నారు. ఈ పర్యటనతో భారత్-యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) మధ్య సంబంధాలు మరింత బలోపేతం కానునన్నాయి. ఆయనతో పాటు ఆ దేశ అగ్రమంత్రులు, వ్యాపార ప్రతినిధి బృందం కూడా ఉన్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చెప్పింది. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్(63)కి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్(42) కుమారుడు. అబుదాబి క్రౌన్ ప్రిన్స్, తదుపరి రాజు సోమవారం ప్రధాని నరేంద్రమోడీని కలవనున్నారు. యూఏఈ నుంచి భారతదేశాని తర్వాతి తరం రాజు రాబోతుండటం ఇదే మొదటిసారి. భారతదేశం, యూఏఈతో తన సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని ఈ పర్యటన హైలెట్ చేస్తోంది. ప్రధాని నరేంద్రమోడీతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కూడా కలవనున్నారు. సెప్టెంబర్ 09న, మహాత్మా గాంధీకి నివాళులర్పించేందుకు యువరాజు రాజ్‌ఘాట్ వెల్లడంతో ఆయన పర్యటన ప్రారంభమవుతుంది. ఆ తర్వాతి రోజు ఆయన పీఎం మోడీతో భేటీ కానున్నారు. ఇరు నేతలు ద్వైపాక్షిక సహకారానికి సంబంధించి చర్చలు జరుపుతారు. ఆ తర్వాత ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. ఈ భేటీలో పలు ఒప్పందాలు, ఎంఓయూలు కుదరనున్నాయి.

ఓటీటీలో రచ్చ రేపుతున్న వరుణ్‌సందేశ్‌ ‘నింద’
థియేటర్‌లో సందడి చేసిన సినిమాలు ఓటీటీలో ఎప్పుడెప్పుడు వస్తాయా?అని ఎదురుచూస్తుంటారు ప్రేక్షకులు. అలా ఎదురుచూసిన సినిమాల్లో ఒకటి వరుణ్‌ సందేశ్‌ తాజా చిత్రం ‘నింద’. ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం దర్శకత్వం వహించి నిర్మించిన ఈ ‘నింద’ సినిమాలో వరుణ్ సందేశ్‌ నటన హైలైట్‌గా నిలిచింది. థియేటర్‌లో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద కూడా మంచి విజయాన్నే సాధించిన ఈ చిత్రం వినాయక చవితి సంధర్భంగా ఈ నెల 6 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఓటీటీలో కూడా ఈ చిత్రానికి మంచి అనూహ్య స్పందన వస్తోంది. కేవలం ఒక్క రోజులోనే 1.4 మిలియన్‌ స్ట్రీమింగ్‌ మినిట్స్‌తో నింద చిత్రం టాక్‌ ఆఫ్‌ ద ఓటీటీగా మారిందని వెల్లడించారు మేకర్స్. ఇక ఈ ట్రెండ్ చూస్తుంటే నింద ఓటీటీలో మరింత వేగంగా దూసుకెళ్లే అవకాశం వుందని కూడా అంటున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో వచ్చిన నింద చిత్రం వరుణ్ సందేశ్‌ నటనలోని కొత్తకోణాన్ని ఆవిష్కరించిందని చెబుతున్నారు. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో వుండే ఈ చిత్రం ఓటీటీలో మరింత మంది ప్రశంసలు అందుకుంటుందనే నమ్మకం ఉందని నిర్మాత తెలిపారు. ఇక యానీ, శ్రేయ, తనికెళ్ల భరణి, భద్రం, సూర్య కుమార్, చత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్ధార్థ్ గొల్లపూడి, అరుణ్ దలై ఇతర ముఖ్య తారాగణంగా నటించిన ఈ చిత్రానికి రమీజ్ నవీత్ కెమెరా, సంతు ఓంకార్ సంగీతం అందించారు.

హైదరాబాద్ ఎయిర్ పోర్టులో జైలర్ విలన్ అరెస్ట్?
శంషాబాద్ ఎయిర్పోర్టులో జైలర్ సినిమా విలన్ వినాయకన్ ను పోలీసులు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్పోర్టులో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ని వినాయకన్ కొట్టినట్టు తెలుస్తోంది. స్వతహాగా మళయాళ సినీ పరిశ్రమలో ఎక్కువ సినిమాలు చేసిన వినాయకన్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా లో వర్మ పాత్రతో పాపులర్ అయ్యాడు. ఇక మద్యం మత్తులో ఉన్న వినాయకన్ కానిస్టేబుల్ పై దాడి చేసినట్లు ఫిర్యాదు అందింది. దీంతో వినాయకన్ ను అదుపులోకి తీసుకొని ఆర్.జి.ఐ పోలీసులకు సీఐఎస్ఎఫ్ అప్పగించినట్టు తెలుస్తోంది. మరోపక్క మద్యం మత్తులో ఉండి తమపై దాడి చేశారని అధికారులు కూడా ఫిర్యాదు చేశారు. ఇక గత ఏడాది అక్టోబర్ 23న కూడా దురుసు ప్రవర్తనతో వినాయకన్ అరెస్ట్ అయ్యాడు. ఇక కొచ్చిన్ లో సినిమా షూటింగ్ ముగించుకుని గోవా కనెక్టింగ్ ఫ్లైట్ కోసం హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో వెయిటింగ్ లో ఉన్న సమయంలో వినాయకన్ దాడి చేసినట్టు చెబుతున్నారు. ఇక వినాయకన్ ప్రస్తుతానికి గోవాలో సెటిల్ అయినట్టు తెలుస్తోంది. ఇక వినాయకన్ ను అదుపులోకి తీసుకుని ఆర్జిఐ పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

దసరా బరిలో యాటిట్యూడ్ స్టార్
ఈటీవీ ప్రభాకర్ కుమారుడు, యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్, మేఘన ముఖర్జీ హీరో హీరోయిన్లుగా ఒక సినిమా తెరెక్కుతోంది. Cc క్రియేషన్స్ పతాకంపై సంపత్. వి. రుద్ర దర్శకత్వంలో గెడా చందు ,గాయత్రీ చిన్ని, వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మిస్తున్న లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాకి ‘ బరాబర్ ప్రేమిస్తా’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇప్పటికే షూట్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ”బరాబర్ ప్రేమిస్తా” చిత్రం ప్యూర్ విలేజ్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా నిలుస్తుంది. మా హీరో చంద్రహాస, మేఘనా ముఖర్జీ యూత్ ని ఆకట్టుకునే లవర్స్ గా అద్భుతంగా నటించారు. ఆర్ఆర్ దృవన్ అందించిన సంగీతం ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుంది .అలాగే సురేష్ గంగుల మంచి లిరిక్స్ అందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకుంటూ దసరా కానుకగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం. మా సినిమాను ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాము. చంద్రహాస్ ,మేఘన ముఖర్జీ, అర్జున్ మహి, మురళీధర్ గౌడ్, రాజశేఖర్ అనింగి , మధు నందన్, అభయ్ నవీన్, మీసాల లక్ష్మణ్, బతిని కీర్తి లత, సునీత మనోహర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్టోరీ: తిరుపతి ఎంఏ, స్క్రీన్ ప్లే: సంపత్. వి . రుద్ర, తిరుపతి,డైలాగ్స్: రమేష్ రాయ్, అందిస్తున్నారు.