7.5 లక్షలకు పైగా ఉద్యోగాలు లక్ష్యం.. 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి..
ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నాం అన్నారు మంత్రి నారా లోకేష్.. వైజాగ్‌లో త్వరలో సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ నిర్వహిస్తున్నాం.. పెట్టుబడులే ప్రధాన అజెండాగా ఈ సదస్సు జరుగుతుంది.. సీఐఐ సదస్సుల్లో 48 సెషన్స్ జరుగుతాయి.. 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి.. 7.5 లక్షలకు పైగా ఉద్యోగాలు లక్ష్యంగా పెట్టుకున్నాం అన్నారు.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల ఏపీకి పెట్టుబడుల వెల్లువ సాధ్యమవుతోందన్నారు లోకేష్.. 16 నెలల్లో రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయన్న ఆయన.. అనకాపల్లిలో ఆర్సెల్లార్ మిత్తల్ రూ.1.5లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతోందన్నారు. బీపీసీఎల్ రూ.లక్ష కోట్లు, ఎన్టీపీసీ రూ.1.60లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతున్నాయని వెల్లడించారు.. ఏపీకి సమర్థ నాయకత్వం ఉంది.. మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న సీఎం ఆధ్వర్యంలో సదస్సు జరగబోతుంది.. పెట్టుబడిదారులు, ప్రభుత్వం, ప్రజలు కలిస్తేనే సీఐఐ సదస్సు.. 16 నెలల్లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు..
ఏపీలో మరోసారి భారీ వర్షాలు..!
ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో మొంథా తుఫాన్ బీభత్సం సృష్టించింది.. ఏపీలో జరిగిన నష్టాన్ని కేంద్రానికి నివేదిస్తూ.. ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. అయితే, మొంథా తుఫాన్ నుంచి తేరుకోక ముందే.. మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరశాఖ పేర్కొంది.. ఏపీలో మరోసారి వర్షాలు ఉధృతం కానున్నాయి. ఈనెల 5వ తేదీ నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమలో ప్రభావం పెరుగుతుంది. దీనికి స్థానిక వాతావరణ పరిస్థితులు కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో రైతుల్లో కలవరపాటు మొదలైంది. తీవ్ర తుఫాన్ కారణంగా జరిగిన పంటనష్టం కళ్ళ ముందే వుండగా మళ్ళీ వర్షాల హెచ్చరికలతో భయపడుతున్నారు. ప్రస్తుతం వాతావరణంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మోంథా తుఫాన్ తర్వాత తేమశాతం తగ్గిపోవడంతో పొడి వాతావరణం నెలకొంది. ఫలితంగా ఎండతీవ్రత పెరిగింది. అసలు వింటర్ సీజన్లో వున్నామా…?. అనే అనుమానం కలిగే స్ధాయిలో ఉక్కపోతలు ఎక్కువయ్యాయి. సాధారణం కంటే మూడు డిగ్రీలు అంత కంటే ఎక్కువ పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడేందుకు వాతావరణం సహకరిస్తోంది. మరోవైపు, ఉత్తర భారతంలో వెస్ట్రన్ డిస్రబెన్స్ వుంది. ఇప్పటికే ఏలూరు, అల్లూరి,అనకాపల్లి సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అటు, మయన్మా ర్ తీరం దగ్గర ఒక అల్పపీడనం ఏర్పడనుండగా దాని ప్రభావం ఏపీ వైపు వచ్చే చాన్స్ కనిపించడం లేదు. ఈనెల 10 తర్వాత ఈ శాన్య రుతుపవన గాలులు మళ్ళీ యాక్టివేట్ అయ్యే సూచనలు వున్నాయి.
లండన్‌లో పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు వరుస భేటీలు.. కీలక ఒప్పందాలు..
ఏపీకి పెట్టుబడులు ఆహ్వానించేందుకు లండన్ పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. లండన్ లో ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ క్రిస్ ఫిట్జార్ల్డ్ తో చంద్రబాబు భేటీ అయ్యారు.. లండన్ లో అతిపెద్ద విద్యుత్ సరఫరాదారు సంస్థగా ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ ఉంది.. పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆక్టోపస్ ఎనర్జీని ఆహ్వానించారు.. అమరావతి, విశాఖలలో నూతన టెక్నాలజీ ద్వారా విద్యుత్ సరఫరా నియంత్రణ రంగంలో పనిచేసేందుకు అవకాశాలు ఉన్నాయని వివరించారు.. క్లీన్ ఎనర్జీ, స్మార్ట్ గ్రిడ్, డేటా అనలిటిక్స్ రంగాల్లో ఏపీలో పని చేసేందుకు అవకాశాలు ఉన్నాయని ఆక్టోపస్ ఎనర్జీ ప్రతినిధులకు స్పష్టం చేశారు.. 160 గిగావాట్లు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసేలా ఏపీ లక్ష్యం పెట్టుకుందని తెలిపారు.. విద్యుత్ రంగంలో ప్రభుత్వ పాలసీలు వివరించారు ముఖ్యమంత్రి. ఈ రంగంలో ఏపీ నిర్దేశించుకున్న మన లక్ష్యాలను వివరించి.. రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు సీఎం చంద్రబాబు నాయుడు.. లండన్‌లో హిందుజా గ్రూప్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు.. విశాఖలోని హిందుజా పవర్ ప్లాంట్ సామర్థ్యాన్ని మరో 1,600 మెగావాట్లు పెంచేందుకు ఒప్పందం కుదిరింది.. ఇక, రాయలసీమలో విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు హిందుజా గ్రూప్ ఒప్పందం చేసుకుంది.. మల్లవల్లిలో ఎలక్ట్రిక్ బస్సులు, తేలికపాటి వాహనాల తయారీ ప్లాంట్‌కు ఒప్పందం జరిగింది.. ఏపీవ్యాప్తంగా విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్ల నెట్వర్క్ ఏర్పాటుకు ఒప్పందం కుదురింది.. గ్రీన్ ట్రాన్స్‌పోర్టు ఎకో సిస్టమ్ అభివృద్ధి చేసేలా హిందుజా గ్రూప్ ఒప్పందం చేసుకున్నట్టు వెల్లడించారు..
గూగుల్ ఏపీకి తీసుకెళ్లారు ఎలా సాధ్యం..? ఏదో మ్యాజిక్ జరుగుతోంది అంటున్నారు..!
ప్రభుత్వం.. ప్రజలు కలిస్తేనే… సీఐఐ సదస్సు అన్నారు మంత్రి నారా లోకేష్.. నిన్న మహిళా క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు ముంబై వెళ్లిన ఆయన.. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా చాలా మంది పారిశ్రామిక వేత్తలను కలిశాను. ఏపీలో ఏదో మ్యాజిక్ జరుగుతోంది అంటున్నారు.. గూగుల్ ఏపీకి తీసుకెళ్లారు..? ఎలా సాధ్యం..? అని అడిగారని తెలిపారు.. మా హయాంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చాం.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పోటీపడి పనిచేస్తున్నాం.. యువతకు ఉపాధి కల్పిస్తే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.. 16 నెలల్లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి.. పెట్టుబడుల ఆకర్షణకు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం తీసుకొచ్చాం.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల పోటీపడి పెట్టుబడులు సాధిస్తున్నాం అన్నారు.
రేపు మొంథా తుఫాన్ బాధిత ప్రాంతాలకు వైఎస్ జగన్..
మొంథా తుపాను కృష్ణా జిల్లా రైతులను తీవ్రంగా దెబ్బతీసింది.. వరి సాగు చేస్తున్న రైతులపై తుఫాన్ ఎఫెక్ట్ భారీగా పడింది.. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 25 మండలాల్లో ఈ ఖరీఫ్ సీజన్లో 1.54 లక్షల హెక్టార్లలో వరి, 24 వేల హెక్టార్లలో వివిధ రకాల ఉద్యాన పంటలను రైతులు సాగు చేశారు. వరి సాగుకు రైతులు ఎకరాకు 25 వేల నుంచి 30 వేల వరకూ పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం వరి పొలాలు పొట్ట దశలో కొన్ని.. కంకులు గట్టి పడే దశలో మరికొన్ని ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో కోత దశకు కూడా చేరాయి. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో వచ్చి పడిన మొంథా తుఫాన్ రైతులను తీవ్రంగా నష్టపరిచింది. వరుసగా మూడు రోజులు పాటు కురిసిన వర్షాలతో రైతులు కుదేలయ్యారు.. చేతికందే తరుణంలో ఉన్న వరిపైర్లు నేల వాలాయి. పైరుపై వర్షపునీరు నిలిచిపోయింది. దీంతో కంకులు దెబ్బతిని తాలు వస్తుందని.. తెగుళ్లు విజృంబించి దిగుబడులు గణనీయంగా పడిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
రేపు టీడీపీ క్రమశిక్షణా సంఘం ముందుకు కొలికపూడి, కేశినేని.. ఏం జరగబోతోంది..?
టీడీపీ అంటే క్రమశిక్షణకు మారుపేరుగా చెబుతారు.. అయితే, తాజాగా, పార్టీలో కొందరు నేతల వ్యవహారం టీడీపీకి ఇబ్బందికి కరంగా మారింది.. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, ఎంపీ కేశినేని చిన్ని వ్యవహారం.. టీడీపీ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు కు ఇబ్బందిగా మారింది.. అసలు వీళ్లకి టికెట్లు ఎందుకు ఇచ్చాను దేవుడా అనే పరిస్థితి వరకు వచ్చింది.. గత కొన్ని నెలలుగా కొలికపూడి వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.. గతంలో తిరువూరు లో స్థానిక నేతలతో వివాదం.. ఒక మహిళ ఆత్మహత్యాయత్నం.. ఇవన్నీ వివాదంగా మారాయి.. గతంలో మూడు సార్లు క్రమ శిక్షణా సంఘం ముందు హాజరయ్యారు .. రేపు ఉదయం 11 గంటలకు.. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్.. సాయంత్రం 4 గంటలకు కేశినేని చిన్ని హాజరవుతున్నారు.. వర్ల రామయ్య అధ్యక్షతన టీడీపీ క్రమశిక్షణా సంఘం విచారణ చేయనుంది.. పంచమర్ధి అనురాధ.. కొనకళ్ల నారాయణ.. షరీఫ్.. రామరాజు.. సభ్యులు గా ఉన్నారు.. పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా రేపు ఉండనున్నారు.. మంత్రి నారా లోకేష్ రేపు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. అవసరం అయితే లోకేష్ కూడా వీరిద్దరితో మాట్లాడే అవకాశం ఉందంటున్నారు.. మరోవైపు, తిరువూరు ఎపిసోడ్ ముగిసిన తర్వాత మరి కొంతమందితో కూడా క్రమ శిక్షణా సంఘం మాట్లాడే అవకాశం ఉంది.. ఎమ్మెల్యే ఎంపీల మధ్య విభేదాలు.. కొంతమంది ఎమ్మెల్యేల వైఖరితో సీఎం చంద్రబాబు అసహనంతో ఉన్నారు.. దీంతో మరి కొందర్ని పిలిచే అవకాశం ఉంది.. చంద్రబాబు మాత్రం అవసరం అయితే చర్యలు తీసుకోడానికి కూడా వెనకాడే పరిస్థితి లేదన్నారు.. మరి క్రమశిక్షణా సంఘం సమావేశం ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఎలాంటి చర్యలు ఉంటాయనేది చూడాలి.
రేపటి నుండి పరీక్షలు బంద్.. ప్రభుత్వం దిగిరావాల్సిందే..!
ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య (Federation of Private Educational Institutions) ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రేపటి నుండి అన్ని పరీక్షలను బహిష్కరించనున్నట్లు ప్రకటించింది. సమాఖ్య చైర్మన్ రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం తక్షణం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే బంద్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. “రేపటి నుండి పరీక్షలు బహిష్కరిస్తున్నాం. ప్రభుత్వం దిగివచ్చి మా డిమాండ్ ను పరిష్కరించే వరకు బంద్ కొనసాగుతుంది,” అని రమేష్ బాబు తెలిపారు. ఈ నెల 8న కాలేజీ సిబ్బందితో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించనున్నట్లు, 11న రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల మంది విద్యార్థులతో భారీ సభ నిర్వహించే ప్రణాళిక ఉందని ఆయన వెల్లడించారు. “ఏ పరిణామాలు జరిగినా ప్రభుత్వం దే బాధ్యత,” అని ఆయన హెచ్చరించారు.
చేవెళ్ల ఘోర రోడ్డు ప్రమాదంపై టీజీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన
చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 19 మంది కుటుంబాలకు సానుభూతి ప్రకటిస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని టీజీఎస్ఆర్టీసీ ఆకాంక్షించింది. తాండూరు నుంచి తెల్లవారుజామున 4.40 గంటలకు బయలుదేరిన ప్రైవేట్ హైర్ ఎక్స్‌ప్రెస్ బస్సు (TS 34TA 6354), చేవెళ్ల సమీపంలోని ఇందిరా రెడ్డి నగర్ వద్ద ఎదురుగా వచ్చిన కంకర లోడ్ టిప్పర్ (TG06T 3879) ను ఢీకొట్టింది. టిప్పర్ అతి వేగంతో బస్సు ముందు భాగాన్ని బలంగా ఢీ కొట్టడంతో, బస్సు ఎడమవైపు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఢీ కొట్టిన టిప్పర్ బస్సుపై ఒరిగి పడటంతో, బస్సులోని పలువురు ప్రయాణికులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. డ్రైవర్ దస్తగిరి కూడా ఈ ప్రమాదంలో మృతి చెందారు.
భారత్ శక్తి ముందు పాక్ అణ్వాయుధాలను తోకముడుస్తాయా! దాయాది అణు సామర్థ్యం ఎంత?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రష్యా, చైనా, ఉత్తర కొరియా మాదిరిగానే పాకిస్తాన్ కూడా రహస్యంగా అణు పరీక్షలు నిర్వహిస్తోందని అన్నారు. భారతదేశం – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు ఇప్పటికీ ఎక్కువగా ఉన్న సమయంలో ఈ వాదన పెద్ద సంచలనం సృష్టించింది. పాకిస్థాన్‌ను ఆపరేషన్ సింధూర్ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే. ఉగ్రవాద దాడికి ప్రతిస్పందిస్తూ, భారతదేశం డజనుకు పైగా పాకిస్థాన్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ నాలుగు రోజుల ఆపరేషన్ పాకిస్థాన్‌ను మోకరిల్లేలా చేసింది. పాకిస్థాన్ వద్ద ఉన్న అనేక అణ్వాయుధ సామర్థ్య క్షిపణులు భారతదేశాన్ని ఢీకొట్టగలవు. ఈ క్షిపణులను పాకిస్థాన్ లోపలి నుంచే ప్రయోగిస్తారు కాబట్టి వాటి పరిధిని బట్టి అవి భారతదేశంలోకి ఎంత దూరం వస్తాయో అర్థం చేసుకోవడం సులభం. ఉదాహరణకు ఢిల్లీ పాకిస్థాన్ నుంచి దాదాపు 500-600 కి.మీ. దూరం, ముంబై 1,000 కి.మీ కంటే ఎక్కువ, కోల్‌కతా 1,500 కి.మీ కంటే ఎక్కువ దూరంలో ఉంటుంది.
పాకిస్తాన్లో ‘‘జై శ్రీ రామ్’’ నినాదాలు చేసిన రష్యా వ్యక్తి.. రియాక్షన్ వీడియో వైరల్..
‘‘జై శ్రీ రామ్’’ అని మన దేశంలో నినదిస్తే, అందరూ కూడా గొంతు కలుపుతారు. అయితే, పాకిస్తాన్లో ఈ నినాదాలు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. మనం ఊహించిన దాని కన్నా భిన్నంగా జరిగితే అది అద్భుతమే అవుతుంది. తాజాగా, రష్యాకు చెందిన కంటెంట్ క్రియేటర్ పాకిస్తాన్‌లోని సందడిగా ఉన్న వీధిలో ‘‘జై శ్రీ రామ్’’ అంటూ నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారుతోంది.
ఆటలో ఆధిపత్యం, పాటలో పరవశం – టీమిండియా విక్టరీ సాంగ్..!
నవీ ముంబైలో ఆదివారం భారతీయుల కలను టీమిండియా మహిళా జట్టు నిజం చేసింది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ODI ప్రపంచ కప్‌ను ఫైనల్లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి ముద్దాడింది. అనంతరం నాలుగు సంవత్సరాల క్రితం రూపొందించిన జట్టు పాటను హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం మైదానంలో ఆవిష్కరించారు. ఆటగాళ్లు, జట్టు సహాయక సిబ్బంది, ఇతర సభ్యులు ఆనందోత్సాహాలతో పాటను హృదయపూర్వకంగా పాడారు. ఈ సందర్భంగా భారత సెమీఫైనల్ హీరో జెమిమా రోడ్రిగ్స్ మాట్లాడుతూ.. నాలుగు సంవత్సరాల క్రితం తాము ఒక ఈ పాటను రూపొందించామని అన్నారు. కానీ ప్రపంచ కప్ గెలిచిన రోజున దానిని ప్రదర్శించాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు.
మహేశ్ మూవీకి టైటిల్ ఇష్యూ.. రాజమౌళికి ఏం చేస్తాడో..?
సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి తీస్తున్న SSMB 29 మూవీ షూటింగ్ స్పీడ్ గా జరుగుతోంది. అయితే నవంబర్ లోనే ఈ మూవీ టైటిల్ ను అనౌన్స్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఈ నెల 15న రామోజీ ఫిల్మ్ సిటీలో టైటిల్ ఈవెంట్ కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మూవీకి వారణాసి అనే టైటిల్ పెడుతారని ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. ఇలాంటి టైమ్ లో అది సాయి కుమార్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రఫ్ అనే మూవీ తీసిన CH సుబ్బారెడ్డి.. తన కొత్త మూవీకి వారణాసి టైటిల్ ను రిజిస్టర్ చేసుకున్నట్టు ప్రకటించాడు. అఫీషియల్ గా టైటిల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. దీంతో ఇప్పుడు రాజమౌళికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. మరి రాజమౌళి వేరే టైటిల్ చూసుకుంటాడా.. లేదంటే ఇదే వారణాసి టైటిల్ కు ఏదైనా హ్యాష్ ట్యాగ్ లాంటిది ఇచ్చి టైటిల్ లో మార్పులు చేస్తాడా అన్నది తెలియట్లేదు. సాధారణంగా రాజమౌళి తన సినిమాల విషయంలో చాలా ముందు జాగ్రత్తతో ఉంటాడు. టైటిల్స్, రిలీజ్ డేట్స్, సీన్లు, డైలాగుల్లో ఎలాంటి వివాదాలు లేకుండా చూసుకుంటాడు. అలాంటి జక్కన్నకు వారణాసి టైటిల్ విషయంలో ఫస్ట్ టైమ్ ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి. ఒకవేళ సుబ్బారెడ్డి మూవీ టీమ్ కు డబ్బులు ఇచ్చి టైటిల్ కొనేస్తాడా అనే ప్రచారం కూడా ఉంది. కానీ నవంబర్ 15కు ఇంకా టైమ్ ఉంది కాబట్టి.. తన స్టోరీకి తగ్గట్టు వేరే టైటిల్ ను కూడా ఆలోచించుకోవచ్చు. ఎంతైనా ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవడంలో జక్కన్న దిట్ట. మరి ఏం చేస్తాడో చూడాలి.
బాహుబలిపై మణిరత్నం షాకింగ్ కామెంట్స్
రాజమౌళి తీసిన బాహుబలి సినిమా ఎంతటి చరిత్ర సృష్టించిందో మనం చూశాం. ఆ సినిమా వల్లే ఎన్నో పాన్ ఇండియా సినిమాలు సౌత్ ఇండస్ట్రీ నుంచి వస్తున్నాయి. ఇప్పుడు తెలుగు సినిమా స్థాయి కూడా దీని వల్లే పెరిగింది. అందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. అలాంటి బాహుబలి సినిమాపై తాజాగా సీనియర్ డైరెక్టర్ మణిరత్నం షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. బాహుబలి సినిమా లేకపోతే తాను ఎమోషన్స్ బలంగా ఉండే కథలు చేయలేనని తెలిపాడు. మరీ ముఖ్యంగా పొన్నియన్ సెల్వన్ మూవీని తాను అస్సలు డైరెక్ట్ చేసేవాడిని కాదన్నాడు. రాజమౌళి బాహుబలిని రెండు పార్టులుగా తీసి పాన్ ఇండియా మార్కెట్లో సక్సెస్ అయ్యాడు. ఆయన స్ఫూర్తితోనే నేను పొన్నియన్ సెల్వన్ ను రెండు పార్టులుగా చేశా అన్నాడు మణిరత్నం.