మరో 48 గంటలు జాగ్రత్త.. జిల్లా కలెక్టర్లకు మంత్రి నారా లోకేష్ కీలక సూచనలు
మొంథా తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సచివాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.. హోంమంత్రి అనిత, సీఎస్ కె.విజయానంద్, ఆర్టీజీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. వచ్చే 48 గంటల పాటు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. వర్షాలతో రహదారులపై పేరుకుపోయిన మట్టి, బురదను తొలగించేందుకు అగ్నిమాపక శాఖ తగిన చర్యలు చేపట్టాలి.. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో గృహాలు, వాణిజ్య సముదాయాలకు వందశాతం విద్యుత్ ను పునరుద్ధరించాలి.. వర్షాలకు దెబ్బతిన్న వివిధ పంటలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు పంటనష్టం అంచనాలను రూపొందించండి.. మొంథా తీవ్ర తుఫాను ప్రభావంతో జరిగిన ప్రాణనష్టం, దెబ్బతిన్న నిర్మాణాలను నివేదించాలని ఆదేశించారు.
వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్‌లోకి 9 కి.మీ. మేర వరద నీరు.. టన్నెల్‌లో 250 మంది కార్మికులు..!
మొంథా తుఫాన్ విధ్వంసం సృష్టించింది.. భారీ నష్టాన్ని మిగిల్చింది.. మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.. తుఫాన్ అనంతర పరిస్థితులపై ఇరిగేషన్ అడ్వైజర్, ఈఎన్సీ, సీఈలు, ఎస్ఈ లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించాం మంత్రి నిమ్మల రామానాయుడు.. ఆత్మకూరు, డోర్నాలా ప్రాంతంలో భారీ వర్షాలతో వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ కు గండి పడి నీరు చేరినట్టు తెలిపారు.. వెలిగొండ టన్నెల్ ఎగ్జిట్ ప్రాంతానికి నీరు రావడంతో 2 టన్నెల్స్ లోకి 9 కిలో మీటర్ల మేర లోనికి నీరు ప్రవేశించిందని తెలిపారు.. టన్నెల్ లో 250 మంది కార్మికులు పనిచేస్తుండగా.. వారిని వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించామని వెల్లడించారు.. ఇక, టన్నెల్ లో డీ వాటరింగ్ పనులు వెంటనే చేపట్టాలని అధికారులకు ఆదేశించారు మంత్రి నిమ్మల..
అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపుపై క్లారిటీ ఇచ్చిన మంత్రి నారాయణ
అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపు, వాటి రిజిస్ట్రేషన్లపై క్లారిటీ ఇచ్చారు మంత్రి నారాయణ. అమరావతి రైతులకు ప్లాట్ ల కేటాయింపు, రిజిస్ట్రేషన్లపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ ఆయన.. సోషల్ మీడియాలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా పోస్టులు పెడుతున్నారు.. రైతులకు రిటర్నబుల్ ప్లాట్ ల కేటాయింపు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ దాదాపు తుది దశకు చేరుకొంది.. ల్యాండ్ పూలింగ్ కింద మోట్ 30,635 మంది రైతులకు కేటాయించాల్సి ఉంది.. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 2727 మంది రైతులకు ప్లాట్ ల కేటాయింపు పూర్తయింది.. ఇంకా 991 మంది రైతులకు మాత్రమే ప్లాట్ లు కేటాయించాల్సి ఉందన్నారు.. రిటర్నబుల్ ప్లాట్ లలో ఇంకా 2501 మందికి 8441 ప్లాట్ లు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది.. వివిధ కారణాలతో రిజిస్ట్రేషన్ లు పెండింగ్ లో ఉన్నాయి అని తెలిపారు.. రైతులతో మాట్లాడి పెండింగ్ రిజిస్ట్రేషన్ లు పూర్తి చేస్తున్నాం.. రాబోయే నాలుగు నెలల్లో ప్లాట్ ల కేటాయింపు, రిజిస్ట్రేషన్ లు మొత్తం పూర్తి చేస్తాం అన్నారు.. సాంకేతిక సమస్యలతో 484 మంది రైతులకు 3.15 కోట్ల కౌలు చెల్లింపులు కూడా పెండింగ్‌లో ఉందన్నారు.. రైతులకు అవాస్తవాలు చెప్పి గందరగోళానికి గురి చేయవద్దు అని విజ్ఞప్తి చేశారు మంత్రి నారాయణ..
రాయచోటిలో వైసీపీకి షాక్.. టీడీపీలో భారీగా చేరికలు..
అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది.. వైసీపీకి గుడ్‌బై చెప్పిన పార్టీ నేతలు, కార్యకర్తలు.. పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరారు.. సంబేపల్లి, లక్కిరెడ్డిపల్లి మండలాలకు చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆ పార్టీకి బైబై చెప్పేసి.. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గురిగింజకుంట, దప్పేపల్లి గ్రామాలకు చెందిన వైసీపీ సర్పంచ్ లు రఘునాథ రెడ్డి, కేశవప్ప ఆధ్వర్యంలో 180 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు.. వారికి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి… అయితే, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసే చాలా మంది టీడీపీ వైపు చూస్తున్నారని.. ఈ నేపథ్యంలో.. సంబేపల్లి, లక్కిరెడ్డిపల్లి మండలాలకు చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు.. ఆ పార్టీకి రాజీనామా చేసి.. టీడీపీలో చేరుతున్నారని వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి..
మొంథా తుఫాన్‌తో భారీ నష్టం.. ఏపీలో ప్రాథమిక అంచనాలు ఇవే..!
తుఫాన్ తీరం దాటడంతో రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయని ముఖ్యమంత్రి చంద్రబాబుకి వివరించారు అధికారులు.. రాష్ట్రంలో 1,209 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి… 1.16 లక్షల మందికి ఆశ్రయం కల్పించామని తెలిపారు.. రాష్ట్రంలో మొత్తం 249 మండలాలు, 1,434 గ్రామాలు, 48 మున్సిపాలిటీల్లో 18 లక్షల మందిపై తుఫాన్ ప్రభావం పడిందని.. తుఫాన్ నష్టంపై తాజా వివరాలను సీఎంకు వివరించిన అధికారులు. రాష్ట్రంలోని 304 మండలాల్లోని 1,825 గ్రామాల్లో 87 వేలహెక్టార్లలో పంటకు నష్టం జరిగిందని తెలిపారు.. 59 వేలకు పైగా హెక్టార్లలో నీట మునిగిన వరి పంట, పత్తి, మొక్కజొన్న, మినుము పంటలకు నష్టం జరిగిందన్నారు.. భారీ వర్షాలతో 78,796 మంది రైతులు నష్టపోయారు.. రాష్ట్ర వ్యాప్తంగా 42 పశువులు చనిపోయాయి.. రాష్ట్రంలో పంచాయతీరాజ్ రోడ్లు, 14 బ్రిడ్జిలు, కల్వర్టులు దెబ్బతిన్నాయి.. 2,294 కిలో మీటర్ల పొడవున ఆర్ అండ్ బీ రహదారులు దెబ్బతిన్నాయి… రూ.1,424 కోట్ల నష్టం జరిగింది.. రూరల్ వాటర్ సప్లయ్‌కు సంబంధించి రూ.36 కోట్లు వరకు, ఇరిగేషన్ పనుల్లో రూ.16.45 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అంచనా వేశారు.. మరోవైపు సురక్షిత ప్రాంతాలకు 3,175 మంది గర్భిణీలను తరలించాం.. 2,130 మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నాం.. 297 రహదారులపై వరద నీరు పొంగి ప్రవహిస్తుండగా, వాటిని దారి మళ్లించేలా చర్యలు తీసుకున్నాం.. రాష్ట్రంలో మొత్తం 380 చెట్లు రహదారులపై విరిగిపడగా, అన్నింటినీ తెలిగించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వివరించారు అధికారులు..
తెలంగాణలో అక్కడ నిలిచిన రాకపోకలు.. ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్
మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని అనేక జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వరంగల్–ఖమ్మం ప్రధాన రహదారి మీదుగా వరద నీరు భారీగా చేరింది. ప్రధాన రహదారిపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఆ రహదారిని తాత్కాలికంగా మూసివేశారు. వరంగల్ నగరంలోని శివనగర్, మైసయ్య నగర్, ఎన్‌ఎన్ నగర్, లక్ష్మీగణపతి కాలనీ, విశ్వనాథ్ కాలనీ, కాశీబుగ్గ, వివేకానంద కాలనీ, స్టేషన్ రోడ్, బట్టలబజార్ ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు చేరింది. రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద భారీగా నీరు నిలిచిపోవడంతో వాహన రాకపోకలు కష్టంగా మారాయి. ముఖ్యంగా శివనగర్ ప్రాంతంలో రహదారిపై నీరు నిలిచి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరంగల్ బస్టాండ్ పరిసరాలు చెరువును తలపించే స్థితికి చేరాయి. భారీ వర్షాల నేపథ్యంలో హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సహాయక చర్యల కోసం ప్రజలు 79819 75495 నంబర్ ద్వారా సంప్రదించాలని అధికారులు సూచించారు. వరంగల్ జిల్లాలోని కల్లెడ్ ప్రాంతంలో అత్యధికంగా 34 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
అలర్ట్.. ఈ జిల్లాల్లో రేపు విద్యాసంస్థలకు సెలవు
మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా సిద్దిపేట, హన్మకొండ, ములుగు జిల్లాల్లో బుధవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో నదులు, వాగులు పొంగిప్రవహిస్తున్నాయి. రహదారులపై నీరు చేరి రాకపోకలు అంతరాయం ఏర్పడింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టర్లు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు సంయుక్తంగా సమీక్ష నిర్వహించి, వర్షపాతం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రేపు (గురువారం) సిద్దిపేట, హన్మకొండ, ములుగు జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేట్ విద్యాసంస్థలు ఈ నిర్ణయానికి లోబడుతాయి. అలాగే వాతావరణ శాఖ హెచ్చరికలను పరిగణనలోకి తీసుకుని అధికారులు ప్రజలను జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తుఫాన్ ప్రభావం కొనసాగుతున్నందున అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని విజ్ఞప్తి చేశారు. తక్కువ ఎత్తు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సమీపంలోని సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. హన్మకొండ పట్టణంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం, గోవిందరావుపేట, తాడ్వాయి, వెంకటాపురం మండలాల్లో వాగులు పొంగి రహదారులు తెగిపోయాయి.
“ఆ పోస్టులు ఖాళీగా లేవు”.. కాంగ్రెస్, ఆర్జేడీపై అమిత్ షా కామెంట్స్..
బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు వ్యాఖ్యల పదును పెరిగింది. ఎన్డీయే సీఎం అభ్యర్థి ఎవరని ప్రశ్నిస్తున్న ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలను ఉద్దేశిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏన్డీయే సీఎం అభ్యర్థి నితీష్ కుమార్ అని స్పష్టం చేశారు. ‘‘బీహార్‌లో సీఎం పోస్టు, ఢిల్లీలో పీఎం పోస్టు ఖాళీగా లేవు. నితీష్ కుమార్ ఇక్కడ, మోడీ అక్కడ ఉన్నారు’’ అని బీహార్‌లో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా అన్నారు. లాలూ, సోనియా గాంధీలకు అవకాశం లభించదని చెప్పారు. జింగిల్ రాజ్ నుంచి బీహార్‌ను రక్షించుకోవడానికి ఈ ఎన్నికలు చాలా కీలమని, ఒక్క తప్పు చేసినా రాష్ట్రం 20 ఏళ్ల వెనక్కి వెళ్తుందని అమిత్ షా ప్రజల్ని హెచ్చరించారు. ‘‘బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి చాలా మంది యువకులకు టిక్కెట్లు ఇచ్చింది, కానీ ఆర్జేడీ మరియు కాంగ్రెస్ టిక్కెట్లు ఇవ్వలేదు. లాలూ జీ తన కుమారుడు తేజస్వి (యాదవ్) ను ముఖ్యమంత్రిని చేయాలని కోరుకుంటున్నారు. సోనియా జీ తన కుమారుడు రాహుల్ (గాంధీ) ను ప్రధానమంత్రిగా చేయాలని కోరుకుంటున్నారు. రెండు పదవులు ఖాళీగా లేవని నేను వారికి తెలియజేయాలనుకుంటున్నాను’’ అని దర్భాంగా ర్యాలీలో ఆయన అన్నారు.
“కారు” లేని అబ్బాయిలకు అమ్మాయిలను ఇవ్వడం లేదు.. బీజేపీ రెస్పాన్స్ ఇదే..
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రస్తుతం కాలంలో ‘‘కార్లు లేని అబ్బాయిలకు అమ్మాయిలను ఇచ్చి పెళ్లి చేయడం లేదు’’ అని అన్నారు. బెంగళూర్‌లో టన్నెల్ రోడ్ ప్రాజెక్టును సమర్థిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ నేను ఎవరికీ వాహనాలు తెచ్చుకోవద్దని చెప్పులేను. కుటుంబంతో ప్రయాణం చేసే సమయంలో చాలా మంది తమ సొంత కారులో వెళ్లాలనుకుంటారు. ఇది సామాజిక అలవాటు. ఎంపీలు ప్రజలను కార్లు వదిలి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాడుకోమని చెప్పవచ్చు. కానీ ఎంత మంది పాటిస్తారు..? నేటి పరిస్థితుల్లో చాలా కుటుంబాలు కారు ఉన్న అబ్బాయిలకే అమ్మాయిలను ఇచ్చే పరిస్థితి ఉంది’’ అని శివకుమార్ అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. ఆ పార్టీ ఎంపీ తేజస్వీ సూర్య డీకే శివకుమార్‌పై వ్యంగ్యంగా మాట్లాడారు. ‘‘నేనను ఇప్పటి వరకు టన్నెల్ రోడ్ ప్రాజెక్ట్ ట్రాఫిక్ సమస్య పరిష్కరించడానికి అనుకున్నాను. కానీ డిప్యూటీ సీఎం గారి ప్రకారం, ఇది కారు లేని అబ్బాయిలకు పెళ్లి కాకపోవడం అనే సామాజిక సమస్య పరిష్కారం. ఎంత అమాయకంగా అనుకున్నానో’’ అని సెటైర్లు పేల్చారు.
ఆరేళ్ళ సెక్యూరిటీ అప్‌డేట్స్, 200MP కెమెరా, 7500mAh భారీ బ్యాటరీతో Oppo Find X9 Pro లాంచ్.. ధర ఎంతంటే..?
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో, తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఒప్పో ఫైండ్ X9 ప్రో (Oppo Find X9 Pro)ను తాజాగా బార్సిలోనాలో జరిగిన హార్డ్‌వేర్ లాంచ్ ఈవెంట్‌లో గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. చైనాలో అక్టోబర్ 16న విడుదలైన ఈ ఫోన్, గ్లోబల్ మార్కెట్‌లోనూ అదే ఫీచర్లతో లాంచ్ అయ్యింది. ఇక ఈ ఫైండ్ X9 ప్రో త్వరలోనే భారత మార్కెట్లోకి కూడా అడుగు పెట్టనుంది. ఇక మరి ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ను చూసేద్దామా.. ఈ కొత్త ప్పో ఫైండ్ X9 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 3nm MediaTek Dimensity 9500 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 16GB LPDDR5x ర్యామ్, 512GB UFS 4.1 స్టోరేజ్‌తో లాంచ్ అయ్యింది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ColorOS 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడిచే ఈ ఫోన్‌కు ఐదు ప్రధాన OS అప్‌డేట్‌లు, ఆరు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను కంపెనీ హామీ ఇచ్చింది. ఇక ఇందులో అధునాతన 36,344.4 చ.మి.మీ. విస్తీర్ణం గల వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ వేడి నియంత్రణను సమర్థవంతంగా నిర్వహిస్తుంది.
కొత్త సీన్స్ యాడ్ చేయడంపై నిర్మాత క్లారిటీ
ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి రెండు పార్టులను ఒకే పార్టుగా బాహుబలి ది ఎపిక్ పేరుతో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 31న మూవీ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే కదా. ఈ సందర్భంగా మూవీపై అనేక రకాల అంచనాలు పెట్టుకుంటున్నారు అభిమానులు. రెండు పార్టీలు కలిపి ఒకే సినిమాగా తీసుకురావడంతో చాలా సీన్లను తీసేస్తారని ముందు నుంచే తెలిసిందే. ఈ క్రమంలోనే మూవీలో కొన్ని కొత్త సీన్స్ యాడ్ చేశారని ప్రచారం జరుగుతుంది. దీనిపై తాజాగా మూవీ నిర్మాత శోభు యార్లగడ్డ క్లారిటీ ఇచ్చారు. ఎన్టీవీ పాడ్ కాస్ట్ లో ఆయన మాట్లాడుతూ.. రాజమౌళి ఒక సినిమా తీస్తే ఎక్కువగా వేస్టేజ్ ఉండదు. ఏది తీయాలి అనుకున్నారు కరెక్ట్ గా అదే సీన్ షూట్ చేస్తారు. అంతేతప్ప ఎక్స్ ట్రా మెటీరియల్ ఏమీ ఉండదు. బాహుబలి రెండు పాటలు తీసినప్పుడు కూడా ఎక్కువ సీన్లు ఏవి మిగిలిపోలేదు. కాబట్టి ఫ్యాన్స్ దీనిమీద పెద్దగా అంచనాలు పెట్టుకోవద్దు. అలా అంచనాలు పెట్టుకుని మూవీకి వెళ్తే నిరాశకు గురవుతారు. కాకపోతే చిన్నాచితక సీన్స్ ఒకటి రెండు సినిమాలో యాడ్ అవుతున్నాయి. చాలావరకు మొదటి పార్టులోనీ సీన్స్ ను రెండో పార్ట్ లోని సీన్స్ కు లింకు చేస్తూ బాహుబలి ది ఎపిక్ సినిమాలు రాజమౌళి తీర్చిదిద్దాడు. కాబట్టి ఇందులో కొత్తగా పెద్దపెద్ద సీన్లు ఏవి ఆడ్ చేయలేదు అంటూ శోభు యార్లగడ్డ చెప్పుకొచ్చారు.
బాహుబలి ది ఎపిక్.. తీసేసిన సీన్లు ఇవే.. ఫ్యాన్స్ కు షాక్
ప్రభాస్ హీరోగా వస్తున్న బాహుబలి రెండు పార్టులను ఒకే పార్టుగా బాహుబలి ది ఎపిక్ పేరుతో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 31న మూవీ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే కదా. రెండు పార్టులను కలపడం అంటే చాలా సీన్లను తీసేయాలి. ఏయే సీన్లను డిలీట్ చేశారో అనే టెన్షన్ అటు ఫ్యాన్స్ లో కూడా ఉంది. ఈ విషయంపై తాజా ఇంటర్వ్యూలో రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు. ప్రభాస్, రానా, రాజమౌళి కలిసి ఓ స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇందులో మూవీకి సంబంధించిన అనేక విషయాలను కూడా పంచుకున్నారు. అయితే ఎడిటింగ్ లో ఏమేం తీసేశారు అనే ప్రశ్న వచ్చినప్పుడు రాజమౌళి ముందే అన్నీ చెప్పేశాడు. అవంతిక లవ్‌స్టోరీ, పచ్చబొట్టేసిన పాట, ఇరుక్కుపో సాంగ్, కన్నా నిదురించరా సాంగ్, యుద్ధానికి సంబంధించిన కొన్ని సీన్లను తీసేశామని తెలిపాడు రాజమౌళి. యుద్ధానికి సంబంధించిన సీన్లు తీసేయడం ఏంటని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. బాహుబలి రెండు పార్టుల్లో యుద్ధాలే హైలెట్ అయ్యాయి. కానీ ఆ సీన్లనే ఎందుకు తీసేశావ్ అంటూ రాజమౌళికి ప్రశ్నలు గుప్పిస్తున్నారు అభిమానులు. ఇక రేపు ప్రీమియర్స్ ఉండటంతో ఫ్యాన్స్ ఓ రేంజ్ లో అడ్వాన్స్ టికెట్లు బుక్ చేసుకున్నారు. డైరెక్ట్ రిలీజ్ మూవీకి వచ్చినట్టే ఈ సినిమాకు కూడా కలెక్షన్లు వస్తాయని మూవీ టీమ్ భావిస్తోంది. మరి ఈ సినిమా రీ రిలీజ్ లో ఎలాంటి ట్రెండ్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
