షాకింగ్ విషయం చెప్పిన సీఎం..! ఇద్దరు కంటే తక్కువ పిల్లలుంటే ఎన్నికల్లో పోటీకి అనర్హులు..
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతోన్న వారికి షాకింగ్ లాంటి న్యూస్ చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు… ఇద్దరు కంటే తక్కువ పిల్లలుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు అంటూ ప్రకటించారు.. సుపరిపాలనలో తొలి అడుగు పేరిట ఏడాది పాలనపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సదస్సు నిర్వహించారు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి, లోకేష్ సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎస్, ఉన్నతాధికారులు, హెచ్‌వోడీలు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ కార్పోరేషన్ల ఛైర్మన్లు.. డైరెక్టర్లు హాజరయ్యారు.. ఏడాది సంక్షేమంపై సమీక్ష… అభివృద్ధిపై అవలోకనం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.. ఈ సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఏడాది కాలంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని వివరించారు.. మరోవైపు, జనాభా పెరగాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ప్రస్తావించారు.. యూపీ, బీహార్‌లో జనాభా బాగా పెరుగుతోంది.. యూపీ, బీహార్ మినహా మిగతా రాష్ట్రాల్లో జనాభా పెరగడం లేదన్నారు.. పిల్లలు భారం కాకూడదు.. వారిని ఆస్తిగా పరిగణించాలని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు.. ఇదే సమయంలో ఇద్దరు కంటే తక్కువ పిల్లలుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు అంటూ ప్రకటన చేశారు..
అమరావతిలో భూ కేటాయింపులు.. కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూముల కేటాయింపు సంబంధించి మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం అయింది… సచివాలయంలో మంత్రి నారాయణ నేతృత్వంలో ఈ సమాశేం జరిగింది.. రాజధాని ప్రాంతంలో పలు సంస్థలకు భూకేటాయింపులపై ఈ సమావేశంలో చర్చించారు.. సమావేశానికి మంత్రులు నారాయణ, భరత్, అధికారులు హాజరయ్యారు.. వర్చువల్ గా ఈ సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్ హాజరయ్యారు. 16 అంశాలకు గాను 12 అంశాలు మంత్రివర్గ ఉప సంఘంలో ఆమోదం జరిగింది అని మంత్రి పొంగూరి నారాయణ వెల్లడించారు.. 2014- 19 కాలంలో రాజధానిలో భూములు కేటాయించిన సంస్థల్లో నాలుగు సంస్థలకి కొనసాగిస్తూ ఆమోదం తెలిపినట్టు పేర్కొన్నారు.. సెంటర్ బ్యూరో ఆఫ్ ఇన్విసిగేషన్ కు రెండు ఎకరాలు కేటాయింపు కొనసాగిస్తూ ఆమోదం తెలిపినట్టు మంత్రి నారాయణ తెలిపారు.. జుయాలజీకల్ ఆఫ్ సర్వే సంస్థకు రెండు ఎకరాలు కేటాయింపు కొనసాగిస్తూ.. స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు ఐదు ఎకరాలు కేటాయింపు కొనసాగిస్తూ.. ఆంధ్రప్రదేశ్ కోపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ కు మూడు ఎకరాలు కేటాయింపు కొనసాగిస్తూ.. ఈ నాలుగు సంస్థలకు గతంలో కేటాయించిన భూ కేటాయింపులను రివైజ్ చేసి ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు.. ఇక, 2014- 19లో కేటాయించిన రెండు సంస్థలకు భూ కేటాయింపులను రద్దు చేశాం. గెయిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అంబికా అగర్బత్తి కి భూ కేటాయింపులు రద్దు చేయగా.. కొత్తగా ఆరు సంస్థలకు భూ కేటాయింపులు చేశాం అన్నారు.. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ కు రెండు ఎకరాలు.. ఏపీ గ్రామీణ బ్యాంక్ కు రెండు ఎకరాలు.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు 0.4 ఎకరాలు.. ఇంటిలిజెన్స్ బ్యూరో (SIB). కి 0.5 ఎకరాలు. బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ కి 0.5 ఎకరాలు.. బిజెపి పార్టీకి రెండు ఎకరాల చొప్పున కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నాం.. భూములు కేటాయించిన సంస్థలకు టైమ్ లైన్ ప్రకారం నిర్మాణం చేయాలి. 2014- 2019 కాలంలో 130 సంస్థలకు 1270 ఎకరాలు ఇచ్చాం. ఈ సంస్థల్లో కొంతమంది మాత్రమే నిర్మాణాలు చేపట్టారు. గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వలన మిగిలినవారు ఎవరు నిర్మాణాలకు ముందుకు రాలేదు.. అందరూ భయపడి వెనక్కి వెళ్ళిపోయారని వ్యాఖ్యానించారు.
ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ రికార్డు మెజార్టీలతో గెలుస్తుంది..!
ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ రికార్డు మెజార్టీలతో గెలుస్తుంది.. ప్రజల్లో, పార్టీ క్యాడర్ లో ఇదే చర్చ జరుగుతోందన్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది.. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పార్టీ సజ్జల.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీలో క్రియాశీలక విభాగంలో ఉన్న అందరి పాత్ర చాలా కీలకమైంది.. గతంలో అసెంబ్లీ ఎన్నికలకు మించి స్థానిక సంస్ధల ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టారు.. అందరూ సమిష్టిగా పనిచేయడం వల్ల అరుదైన విజయం సాధించాం.. రాష్ట్ర అభివృద్ది జరగాలంటే గ్రాస్ రూట్ లెవల్‌లో బలంగా ఉండాలని సూచించారు.. కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు, కక్షసాధింపు చర్యలు, వేధింపులు, రెడ్‌బుక్ రాజ్యాంగం ఇలా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతుంది.. కానీ, ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ రికార్డు మెజార్టీలతో గెలుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
జగన్‌పై హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు..
వైఎస్ జగన్ పల్నాడు జిల్లా పర్యటన, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తి.. సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. సమాజంలో ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉంటుంది.. అలాగే రాజకీయ జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరికి సామాజిక బాధ్యత ఉండాలి.. రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ఉంటే 175 మందికే అధ్యక్షా అనే అవకాశం వచ్చిందన్నారు.. అయితే, జగన్ వారి పార్టీ వ్యవహారాలు చూస్తుంటే రాజకీయాలు దిగజారాయా అనిపిస్తుంది.. కనీసం, మానవత్వం లేకుండా హింసకు ప్రేరేపించి అరాచకం సృష్టించారని ఫైర్ అయ్యారు.. జగన్ తన పల్నాడు పర్యటనలో ఎంతమంది వస్తారు అని పోలీసులు అడిగారు.. అయినా సరైన సమాధానం లేదన్న ఆమె.. పరామర్శ కు వెళ్లే వ్యక్తి రోడ్ షో చేశారు.. అందరికి అభివాదాలు.. షేక్‌హ్యాండ్‌లు ఇచ్చుకుంటూ ముందుకు వెళ్లారని విమర్శించారు.
జగన్ రప్పా.. రప్పా.. వ్యాఖ్యలు..! పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ వార్నింగ్..!!
వైసీపీ రప్పా.. రప్పా.. ఫ్లెక్సీలు తీవ్ర వివాదాన్నే సృష్టించాయి.. అయితే, ఆ వ్యాఖ్యలను వైఎస్ జగన్ సమర్థించారంటూ కూటమి నేతలు మండిపడుతున్నారు.. ఇక, జగన్.. రప్పా.. రప్పా.. వ్యాఖ్యలకు పవర్ ఫుల్ వార్నింగ్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. సుపరిపాలనలో తొలి అడుగు పేరిట ఏడాది పాలనపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సదస్సును జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి, లోకేష్.. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎస్, ఉన్నతాధికారులు, హెచ్‌వోడీలు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు హాజరయ్యారు.. అయితే, వైసీపీ వాళ్లు రోడ్డు ఎక్కి పిచ్చి బ్యానర్స్.. రప్పా రప్పా.. గొంతు నరుకతాం.. అంటే.. కాలుకి కాలు, మక్కెళ్లు విరగకొట్టి ఇంట్లో కూర్చో పెడతామని వార్నింగ్ ఇచ్చారు.. ఇది ఆషామాషీ వ్యవహారం కాదు అంటూ.. జగన్ రప్పా రప్పా వ్యాఖ్యలపైకు కౌంటర్ ఇచ్చారు పవన్ కల్యాణ్.. వైసీపీ మళ్లీ అధికారంలోకి రాదు, రావట్లేదు అని వ్యాఖ్యానించిన ఆయన.. గొంతులు కొసేస్తాం అని పిచ్చి బెదిరింపులు చేస్తే మక్కెలు విరగ్గొట్టి కింద కూర్చోబెడతాం అన్నారు.. అవన్నీ సినిమాల్లో బాగుంటాయి, నేను కూడా సినిమాల్లో నుండి వచ్చిన వాడినే అన్నారు.. ఏడాది కాలంలో బ్రాండ్ ఏపీ పునరుద్ధరణ జరిగింది. రాష్ట్రంలో 20 వేల కిలోమీటర్ల రోడ్ల మరమ్మతులు జరిగాయి. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాం.. గత ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దుర్వినియోగం జరిగాయి. కుదేలైన ఆర్ధిక వ్యవస్థను చంద్రబాబు గాడిలో పెడుతున్నారని తెలిపారు.
అది రాష్ట్ర చరిత్రను మార్చిన రోజు.. ప్రజాస్వామ్యం గెలిచిన రోజు..
అది రాష్ట్ర చరిత్రను మార్చిన రోజు.. ప్రజాస్వామ్యం గెలిచిన రోజు.. జూన్ 4వ తేదీ చరిత్రలో నిలిచిపోయే రోజు అన్నారు మంత్రి నారా లోకేష్.. రాజధాని అమరావతిలో సచివాలయం వెనుక భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై “సుపరిపాలనలో తొలి అడుగు” పేరిట నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. గెలిచింది కూటమికాదు.. ప్రజలు అని పేర్కొన్నారు.. విధ్వంసపాలనపై ప్రజా తిరుగుబాటుగా అభిర్ణించారు.. అయితే, ఐదేళ్లలో సాధించలేనిది ఏడాదిలోనే సాధించాం.. ఉద్యోగులే ప్రభుత్వానికి గుండెకాయ.. ప్రజలకు చేరువగా వెళ్లి సేవలందించండి.. అంటూ సుపరిపాలన – తొలిఅడుగు సభలో మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు..
పాస్‌పోర్ట్ ప్రక్రియలో.. తెలంగాణ పోలీస్ దేశంలోనే నెంబర్ 1
పాస్‌పోర్ట్ దరఖాస్తుదారుల పోలీసు ధృవీకరణ ప్రక్రియలో తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగం అత్యుత్తమ ప్రదర్శనతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ విజయానికి కారణం తెలంగాణ పోలీసులు అభివృద్ధి చేసిన VeriFast యాప్. ఇది పాస్‌పోర్ట్ ధృవీకరణ ప్రక్రియను వేగవంతంగా, ఖచ్చితంగా, పారదర్శకంగా, అత్యుత్తమమైన ప్రజాప్రయోజనకారిగా రూపుదిద్దుకుంది. విదేశాంగశాఖ తాజా జాతీయ గణాంకాల ప్రకారం, తెలంగాణ పోలీసులు దేశంలోనే అత్యంత వేగంగా పాస్‌పోర్ట్ ధృవీకరణను పూర్తి చేస్తూ, తక్కువగా మూడు పని దినాల్లోనే ఎక్కువశాతం కేసులను పరిష్కరిస్తున్నారు.
వందేభారత్‌లో గూండాయిజం.. సీటు మారలేదని ఎమ్మెల్యే అనుచరులు పిడిగుద్దులు
ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాల్సిన ఓ ప్రజాప్రతినిధి గూండాయిజం ప్రదర్శించాడు. సాటి ప్రయాణికుడి పట్ల సహృదయంతో ఉండాల్సిన ఓ ఎమ్మెల్యే రౌడీయిజం చూపించాడు. రైల్లో సీటు మారనందుకు విచక్షణ మరిచి ఎమ్మెల్యే అనుచరులు పిడుగుద్దుల వర్షం కురిపించారు. ఈ ఘటన ఢిల్లీ-భోపాల్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో తన నియోజకవర్గానికి వెళ్తున్నాడు. కుటుంబ సభ్యులకు వేర్వేరు చోట్ల సీట్లు వచ్చాయి. అందరూ ఒకేచోట కూర్చుని ప్రయాణించేందుకు ఒకరిని సీటు మారమని ఎమ్మెల్యే అడిగాడు. అందుకు అతడు నిరాకరించాడు. అంతే ప్రజాప్రతినిధికి కోపం వచ్చినట్లుంది. అంతే ఎమ్మెల్యే తన అనుచరులను పురమాయించాడు. ఝాన్సీ స్టేషన్ రాగానే ఎమ్మెల్యే మనుషులు ట్రైన్ ఎక్కి ప్రయాణికుడిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు.. 10 మంది మృతి.. భారీ భవంతులు ధ్వంసం
ఓ వైపు ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఇంకోవైపు రష్యా-ఉక్రెయిన్ మధ్య కూడా యుద్ధం కొనసాగుతోంది. ఓ వైపు శాంతి చర్చలు జరుగుతుండగా రష్యా.. ఉక్రెయిన్‌పై విరుచుకుపడింది. తాజాగా డ్రోన్లు, క్షిపణులతో మాస్కో విరుచుకుపడింది. తాజాగా దాడుల్లో 10 మంది చనిపోగా.. నివాసాలు, ఆస్పత్రులు, వాహనాలు ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద ఉన్న వారిని బయటకు తెచ్చేందుకు భద్రతా బలగాలు సహాయ చర్యలు చేపట్టినట్లు ఉక్రెయిన్ తెలిపింది. క్షతగాత్రులకు చికత్స అందిస్తున్నామని.. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. తాజా దాడుల్లో ఉత్తర కొరియాకు చెందిన ఆయుధాలను ప్రయోగించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. ఇదిలా ఉంటే రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాలని జెలెన్‌స్కీ పశ్చిమ దేశాలను కోరారు. నివాస భవనాలే లక్ష్యంగా రష్యా దాడి చేస్తోందని.. వాటిని ధ్వంసం చేసిందని పేర్కొన్నారు. అమెరికా మౌనం వల్ల తమ దేశంలో పెద్ద ఎత్తున ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని జెలెన్‌స్కీ ఆవేదన వ్యక్తం చేశారు.
లీడ్స్ టెస్ట్‌లో సెంచరీల మోత.. ఒకే టెస్ట్‌లో రెండు సెంచరీలు చేసిన వికెట్ కీపర్‌గా పంత్ రికార్డ్
లీడ్స్‌లోని హెడింగ్లీలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో 4వ రోజు రెండవ సెషన్‌లో కెఎల్ రాహుల్ భారత్ తరపున తన తొమ్మిదవ టెస్ట్ సెంచరీని పూర్తి చేశాడు. రిషబ్ పంత్ మరో ఎండ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. లీడ్స్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ సెంచరీ సాధించాడు. కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ఔటైన తర్వాత వచ్చిన రిషబ్ పంత్ 130 బంతుల్లో తన 8వ టెస్ట్ సెంచరీని సాధించాడు. మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో పంత్ 134 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్‌లో భారత వైస్ కెప్టెన్‌కు ఇది నాల్గవ టెస్ట్ సెంచరీ. రిషబ్ పంత్ ఒక టెస్ట్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీ చేసిన తొలి భారత వికెట్ కీపర్ గా రికార్డు క్రియేట్ చేశాడు. ఇంగ్లాండ్‌లో ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడు పంత్. దీనితో పాటు, ఇప్పటివరకు ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో ఏ భారతీయ బ్యాట్స్‌మన్ సెంచరీ సాధించలేకపోయాడు.
రామోజీ ఫిలిం సిటీ ‘Haunted’ వ్యాఖ్యలపై కాజోల్ U Turn
రామోజీ ఫిలిం సిటీ తాను చూసిన అత్యంత భయంకరమైన ప్రదేశాలలో ఒకటని హీరోయిన్ కాజల్ కామెంట్స్ చేసిన నేపథ్యంలో, ఆమె మీద తెలుగు వారందరూ ఫైర్ అవుతున్నారు. ఎంతో గొప్ప సినిమాల షూటింగ్‌లకు వేదికగా ఉన్న రామోజీ ఫిలిం సిటీ మీద ఇలాంటి ప్రచారం తగదని, ఆమెపై విమర్శల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో ఆమె స్పందించారు. నేను నటించిన ‘మా’ సినిమా ప్రమోషన్స్ నేపథ్యంలో రామోజీ ఫిలిం సిటీ గురించి నేను మాట్లాడిన విషయం మీద ఇప్పుడు స్పందిస్తున్నాను. నా కెరీర్‌లో రామోజీ ఫిలిం సిటీలో ఎన్నో సినిమాల షూటింగ్‌లలో పాల్గొన్నాను. ఇన్నేళ్లలో ఎన్నోసార్లు అక్కడ స్టే చేశాను కూడా. అది ఫిలిం మేకింగ్ విషయంలో చాలా ప్రొఫెషనల్ ఎన్విరాన్‌మెంట్. అలాగే, అక్కడికి వచ్చిన టూరిస్టులు కూడా చాలా ఎంజాయ్ చేస్తారని నేను పరిశీలించాను.
ఐకాన్ లో అల్లు అర్జున్ లేడు?
అల్లు అర్జున్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ అనే సినిమాను అనౌన్స్ చేశారు. అయితే, ఆ తర్వాత అల్లు అర్జున్ ఇతర సినిమాలతో బిజీ అవడంతో ఈ సినిమా ఆగిపోయిందని అందరూ అనుకున్నారు. అయితే, సినిమా ఆగలేదని, తర్వాత తీస్తామని దిల్ రాజు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే, ఆ సినిమా ఎప్పుడు ఉంటుంది అనే విషయంపై దిల్ రాజు తాజాగా స్పందించారు. తమ్ముడు సినిమా ప్రమోషన్స్ లోభాగంగా మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తున్న సందర్భంగా దిల్ రాజుని ఇదే విషయం గురించి ప్రశ్నించారు. పుష్ప 1, పుష్ప2, అట్లీతో సినిమా తర్వాత అల్లు అర్జున్కి ఈ సినిమా కథ రెలెవెంట్‌గా ఉంటుందా అని అడిగితే, ఐకాన్ వచ్చిన తర్వాత ఆయనతో సినిమా చేయాలని అనుకోవడం లేదని, కాకపోతే స్క్రిప్ట్ మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉందని చెప్పారు.
గేమ్ చేంజర్ విషయంలో ఏం చేయలేక పోయాను!
గేమ్ చేంజర్ విషయంలో తనకు రిగ్రెట్స్ ఉన్నాయని దిల్ రాజు వెల్లడించారు. దిల్ రాజు నిర్మాతగా, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో, నితిన్ హీరోగా తమ్ముడు అనే సినిమా రూపొందింది. ఈ సినిమా జూలై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు దిల్ రాజు. అయితే, ఆ సంగతి పక్కనపెడితే, ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో రామ్ చరణ్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ RRR తర్వాత గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్‌తో గేమ్ చేంజర్ సినిమాతో వచ్చారు, కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ విషయంలో రిగ్రెట్స్ ఉన్నాయా అంటే, 100% రిగ్రెట్స్ ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో నేను ఎక్కువగా ఫీల్ అవుతాను, ఎమోషనల్‌గా కూడా ఫీల్ అవుతాను, కానీ ఈ విషయంలో నా చేతుల్లో ఏమీ లేదని అన్నారు.
