వై నాట్ 175 అంటే వైసీపీ బట్టలూడదీశారు.. చింతమనేని ఘాటు వ్యాఖ్యలు..
వై నాట్ 175 అంటే వైసీపీ బట్టలు ఊడదీశారు.. జగన్ బట్టలు నైతికంగా ఊడతీశారని వ్యాఖ్యానించారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. అమరాతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీ నేతలు ఎవర్ని బెదిరిస్తున్నారు..? అని ప్రశ్నించారు.. ఇక, మా గొప్పతనం వల్ల మేం గెలవలేదు… వైసీపీ అరాచకాలు వల్ల గెలిచామని చెప్పుకొచ్చారు.. మా లెక్కలు తేలుస్తారా..? ఏ లెక్కలు ఉన్నాయని తేలుస్తారు? అంటూ మండిపడ్డారు.. వైసీపీకి ప్రజలు రాజకీయ గోరి కట్టే రోజు దగ్గరలోనే ఉందన్న ఆయన.. దోపిడీదారులకు తమ అండ దండ ఉందని జగన్ నేతృత్వంలో వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు.. జగన్ కు, అతని అనుచరులకు కాల్చి ఎక్కడ వాతలు పెట్టకూడదో అక్కడ ప్రజలు వాతలు పెట్టినా బుద్దిరాలేదని ఫైర్ అయ్యారు.. తాను చేసిన దోపిడీకి భార్యను కేసులో ఇరికించి పారిపోయిన పేర్ని నాని.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై నోరూపారేసుకుంటున్నాడు.. దోచుకోవడం, దోపిడీ చేయటమే వైసీపీ సిద్ధాంతమని దుయ్యబట్టారు చింతమనేని.. అధికారం ముసుగులో చేసిన అరాచక దాడులు మరిచారా? అని ప్రశ్నించిన ఆయన.. చేపల దొంగతానినికి పాల్పడ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి మద్దతుగా జగన్ అనుచరవర్గమంతా వచ్చింది.. కొల్లేరుకు వలస పక్షులు వచ్చినట్లు అప్పుడప్పుడు దెందులూరుకు అబ్బయ్య చౌదరి వస్తాడు.. ఎప్పుడు ఎప్పుడు టీడీపీలో చేరాలా అని అబ్బయ్య చౌదరి ప్రయత్నిస్తున్నాడు.. ఎన్నికల సమయంలో కూడా నేను గెలిచి టీడీపీలో చేరతానని ప్రచారం చేసుకున్నాడని మండిపడ్డారు.. ఇక, దెందులూరు నియోజకవర్గంలో చేసిన అక్రమాలపై త్వరలో చర్యలు ఉంటాయని హెచ్చరించారు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్..
సూపర్ సిక్స్.. సూపర్ హిట్.. అమరావతిని గాడిన పెడుతున్నాం..
సూపర్ సిక్స్.. సూపర్ హిట్ అయ్యిందన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..కాకినాడ జిల్లా పెద్దాపురంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర సభలో ఆయన మాట్లాడుతూ.. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు.. అంటు వ్యాధులు రావడానికి ప్రధాన కారణం చెత్త, అపరిశుభ్రతేనన్న ఆయన.. గత వైసీపీ ప్రభుత్వం చెత్తపై పన్ను వేసింది.. కానీ, చెత్తను మాత్రం తీయలేదన్నారు.. ప్రజారోగ్యాన్ని వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు.. అక్టోబరు 2వ తేదీ నాటికి అన్ని మున్సిపాలిటీల్లో చెత్తాచెదారం తొలగిస్తామని ప్రకటించారు చంద్రబాబు.. ఇక, మంచి మనస్సు ఉన్న వాళ్లు ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉంటారు.. అటువంటి జిల్లాలో గత ప్రభుత్వంలో రౌడీయిజం జరిగిందన్నారు.. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసి కుక్కలు చింపిన విస్తరి చేశారు.. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని ఎన్నికల్లో నేను , పవన్ కల్యాణ్ చెప్పాం.. ప్రతి మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నాం అని వెల్లడించారు.
300 సినిమాల చరిత్రకు మళ్లీ ఊపిరి..! గోదావరి గట్టున సినిమా చెట్టుకు పునరుజ్జీవం..
కొన్ని ప్రదేశాలు.. ఆలయాలు, గుట్టలు, చెట్లు ఇలా సజీవంగా నిలిచిపోతాయి.. ఎంతో మంది అభిమానాన్ని చురగొంటాయి.. అయితే, అవి కనుమరుగు అయ్యే పరిస్థితి వస్తే.. చాలా మంది జీర్ణించుకోలేదు.. అలాంటివి మళ్లీ మన కళ్లముందు కదలబోతున్నాయంటే ఆ ఆనందమే వేరు.. అలాంటిది ఇది కూడా.. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం, కుమారదేవం గ్రామం గోదావరి తీరంలో ఉన్న ‘సినిమా చెట్టు’ మళ్లీ జీవం పోసుకుంది. తెలుగు సినిమా అభిమానులకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఈ వృక్షం, గతంలో 300కి పైగా చిత్రాలలో కనిపించి దర్శకులు, నటులను ఆకట్టుకుంది. గతేడాది గోదావరి వరదల సమయంలో ఈ మహా వృక్షం రెండుగా చీలి నేలవాలిపోయింది. దీంతో చెట్టును సినిమాలలో చూసిన వారు, స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చెట్టును రక్షించాలని పలువురు విజ్ఞప్తులు చేశారు. ఈ పరిస్థితిలో రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి.. ఐకాన్స్ ఆధ్వర్యంలో గ్రీన్ భారత్ – వనం మనం విభాగం ప్రత్యేక ప్రాజెక్టును ప్రారంభించింది. ప్రాజెక్టు నిర్వాహకులు పర్యవేక్షణలో చెట్టుకు రసాయనాలతో దీర్ఘకాల చికిత్స అందించారు. దీనితో సినిమా చెట్టు పునరుజ్జీవం సాఫల్యం అయ్యింది. వేరు మధ్య కొత్త అంకురానికి ప్రాణం పోశారు. ప్రస్తుతం అది 10 అడుగుల మొక్కగా పెరిగింది. “ఇంకో ఏడాది రోజుల్లో ఈ మొక్క పెద్దదై, నాలుగైదుగురికి నీడనిచ్చే స్థాయికి చేరుకుంటుంది” తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో క్లాసిక్ సినిమాలకు సాక్షిగా నిలిచిన ఈ చెట్టు పునర్జీవం పొంది మళ్లీ సజీవంగా మారడం, సినీ అభిమానులు మరియు పర్యావరణ ప్రియులకు సంతోషకర విషయమైంది. సినిమా చెట్టు మళ్లీ చిగురించడంతో స్థానికల్లో ఆనందం వెల్లివిరుస్తుంది.
అమరావతిపై కీలక వ్యాఖ్యలు.. సెప్టెంబర్ క్లియర్‌గా కనిపిస్తుంది..
సెప్టెంబర్ నుంచి అమరావతి పనులు క్లియర్ గా కనిపిస్తాయన్నారు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.. 40 నుంచి 50 వేల కోట్ల రూపాయల పనులు త్వరలో జరగబోతున్నాయన్నారు.. గత 5 ఏళ్లలో వ్యవస్థలన్నీ సర్వనాశనం చేశారన్న ఆయన.. రెండు మూడు సంవత్సరాల్లో మంచి నగరాన్ని చూస్తారని తెలిపారు.. చిన్న సమస్యలను ఉంటే వాటిని మేం పరిష్కరిస్తాం.. ఏ రాష్టానికి లేని సంస్థలు, ఉద్యోగాలు ఏపీకి మూడు, నాలుగు సంవత్సరాల్లో రాబోతున్నాయి.. మనకంటే అద్భుతమైనటువంటి తెలంగాణలో కూడా ఎటువంటి సానుకూలత లేదు.. నిరంతరం చంద్రబాబు, లోకేష్ ఢిల్లీ వెళ్లే నిధులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని వెల్లడించారు.. అభివృద్ధి సంక్షేమానికి బ్రాండ్ ఇమేజ్ ఉన్న చంద్రబాబుతోనే సాధ్యం అన్నారు..
జూనియర్ కళాశాలల్లో హాజరు కోసం ఇక ఫోటో చాలు.. ఎలా అంటే?
తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి విద్యా రంగంలో మరో ముఖ్యమైన సంస్కరణకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఫేసియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS)ను శనివారం నుంచి విజయవంతంగా అమలు చేసింది. విద్యా రంగంలో డిజిటల్ మార్పుకు ఇది ఒక కీలక అడుగుగా అధికారులు పేర్కొన్నారు. ఈ నూతన విధానం ద్వారా విద్యార్థుల హాజరు పూర్తిగా డిజిటల్ పద్ధతిలో నమోదు అవుతుంది. ప్రాక్సీ హాజరు లేదా రికార్డుల్లో తారుమారు చేసే అవకాశం లేకుండా ఖచ్చితమైన హాజరు నమోదు జరుగుతుందని అధికారులు తెలిపారు. హాజరు వివరాలు వెంటనే కేంద్ర డేటాబేస్‌లో అప్‌డేట్ అవుతాయి. దీంతో విద్యాశాఖకు రియల్-టైమ్‌లో పర్యవేక్షణ సులభమవుతుందని, ప్రిన్సిపాళ్లకు మానవీయ పనిలో తగ్గింపుతో పాలనా సౌలభ్యం కలుగుతుందని వారు పేర్కొన్నారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను విశ్లేషించడంలో కూడా ఈ వ్యవస్థ ఉపకరిస్తుందని అన్నారు.
500 కోట్ల సైబర్ మోసాల వెనుక విజయవాడ యువకుడు.. శ్రవణ్ కుమార్ అరెస్ట్
దేశవ్యాప్తంగా సైబర్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ మోసం బయటపెట్టారు. విజయవాడకు చెందిన సైబర్ క్రిమినల్ శ్రవణ్ కుమార్ను అరెస్ట్ చేశారు. కేవలం రెండు నెలల వ్యవధిలోనే అతను 500 కోట్ల రూపాయల భారీ నగదు లావాదేవీలు జరిపినట్టు విచారణలో తేలింది. పోలీసుల దర్యాప్తులో, శ్రవణ్ కుమార్ 500 మ్యూల్ అకౌంట్స్ సృష్టించి, వాటి ద్వారా 500 కోట్ల పైచిలుకు నగదు బదిలీ చేసినట్టు వెల్లడైంది. సైబర్ లింకుల ద్వారా వచ్చిన డబ్బులను ఈ అకౌంట్లలోకి మార్చి, అనంతరం మరికొన్ని ఫేక్ కంపెనీలకు పంపినట్లు అధికారులు తెలిపారు.
టారిఫ్ ప్రభావం… అమెరికాకు షాక్ ఇచ్చిన భారత్.. ఇక ఆ సేవలు బంద్..!
భారత్‌పై అమెరికా సుంకాలు విధించిన విషయం తెలిసిందే. దీంతో ఇరు దేశాల మధ్య నియమాలు కూడా మారుతున్నాయి. తాజాగా భారత ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 25 నుంచి భారత్ అమెరికాకు పోస్టల్ సేవలను నిలిపివేయనుంది. జూలై 30, 2025న అమెరికా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. జులై 30న అమెరికా యంత్రాంగం జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం.. 800 డాలర్ల విలువైన వస్తువులపై ఉన్న పన్ను మినహాయింపులను ఉపసంహరించుకుంది. ఫలితంగా అమెరికాకు వెళ్లే అన్ని పోస్టల్ సర్వీసులకు వాటి విలువతో సంబంధం లేకుండా సుంకాలకు లోబడి ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే తాజా ప్రకటన వచ్చింది. 100 డాలర్ల విలువైన గిఫ్ట్ ఐటెమ్స్, లేఖలు, దస్త్రాలకు మాత్రం సుంకాల నుంచి మినహాయింపు కొనసాగుతోంది.
పాక్‌లో ఫ్యాక్టరీల కంటే మసీదులు, మదర్సాలే ఎక్కువ..
పాకిస్థాన్‌లో ఫ్యాక్టరీల కంటే మసీదులు, మదర్సాలే ఎక్కువగా ఉన్నాయని తాజాగా చేసిన ఆ దేశ ఆర్థిక జనాభా లెక్కల నివేదిక గణాంకాలు వెల్లడించాయి. ఈ నివేదికల ప్రకారం.. దేశంలో మసీదులు, మదర్సాల సంఖ్య పరిశ్రమల కంటే చాలా ఎక్కువగా ఉందని బహిర్గతం చేశాయి. తాజా నివేదికల ప్రకారం.. పాకిస్థాన్‌లో 6 లక్షలకు పైగా మసీదులు, 36 వేలకు పైగా మదర్సాలు ఉన్నాయని వెల్లడైంది. అయితే దాయాదీ దేశంలో కర్మాగారాల సంఖ్య కేవలం 23 వేలు మాత్రమే ఉన్నాయని పేర్కొంది. నగదు కొరతను ఎదుర్కొంటున్న పాక్.. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)తో US $7 బిలియన్ల బెయిలౌట్ ప్యాకేజీ రెండవ సమీక్షపై చర్చలు జరుపుతున్న సమయంలో ఈ నివేదికలు వెలువడ్డాయి.
ఓరి దేవుడా! ఆన్లైన్ చెల్లింపు విఫలం.. భర్త వివాహేతర సంబంధం బట్టబయలు..
ప్రస్తుతం సర్వం ఆన్లైన్ మయంగా మారింది. ప్రపంచం మొత్తం ఆఫ్‌లైన్ నుంచి ఆన్‌లైన్‌కు మారుతోంది. నగదు చెల్లింపు కోసం ప్రజలు ఆన్‌లైన్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే..చాలా మందికి ఆన్లైన్ నగదు చెల్లింపు ప్రయోజనకరంగా ఉంటోంది. కానీ.. ఓ వ్యక్తికి మాత్రం పెద్ద చిక్కుముడి తెచ్చి పెట్టింది. ఈ ఆన్లైన్ చెల్లింపు ద్వారా భార్యాభర్తలు దూరం కావాల్సి వచ్చింది. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.. ది సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. చైనా గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని యాంగ్జియాంగ్ లో ఈ ఘటన జరిగింది. ఇక్కడ ఒక వ్యక్తి 15.8 యువాన్ల (సుమారు రూ. 200) విలువైన గర్భనిరోధక మాత్రలు కొన్నాడు. కానీ పలు సమస్య కారణంగా ఆన్లైన్ చెల్లింపు విఫలమైంది. దాన్ని మొదట ఫార్మసీ యజమానికి గమనించలేదు. కొంత సమయం తరువాత గమనించిన యజమాని ఆ వ్యక్తి సభ్యత్వ కార్డుతో లింక్ చేసిన ఫోన్ నంబర్‌కు కాల్ చేశాడు. ఇక్కడే ఓ వ్యక్తికి కష్టాలు మొదలయ్యాయి. ఈ ఫోన్ కాస్త గర్భనిరోధక మాత్రలు కొనుగోలు చేసిన వ్యక్తి భార్యకు వచ్చింది. దుకాణదారుడు..” మీ భర్త ఫార్మసీ నుంచి గర్భనిరోధక మాత్రలు కొన్నాడు. అతని చెల్లింపు విఫలమైంది. తిరిగి నగదు చెల్లించండి.”అని తెలిపాడు. దీంతో ఆ మహిళ తన భర్త వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడని అనుమానించింది. తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న భర్త ఒక్కసారిగా షాక్ అయ్యాడు. న్యాయవాది వద్దకు వెళ్లి దుకాణదారుడిపై చట్టపరమైన చర్య గురించి సలహా కోరాడు. దుకాణదారుడు తన వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకున్నాడని ఫిర్యాదు చేశాడు.
ఇంటెలిజెన్స్ బ్యూరోలో జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ జాబ్స్.. నెలకు రూ. 81 వేల జీతం
కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 394 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఇంజనీరింగ్‌లో డిప్లొమా, B.Tech, B.Sc లేదా BCA డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా సంబంధిత రంగాలలో స్పెషలైజేషన్ కలిగి ఉండాలి అభ్యర్థులను టైర్-I ఆన్‌లైన్ పరీక్ష, టైర్-II స్కిల్ టెస్ట్, టైర్-III ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దృశ్యం-3 సస్పెన్స్ థ్రిల్లర్ కాదు.. డైరెక్టర్ క్లారిటీ..
దృశ్యం సినిమా అన్ని ఇండస్ట్రీలలో మంచి పాపులర్ అయింది. ఈ సినిమాను అన్ని భాషల్లో రీమేక్ చేసి మంచి హిట్లు అందుకున్నారు. తెలుగులో వెంకటేశ్ దృశ్యం-1, దృశ్యం-2లో నటించారు. ఇక వీటికి కొనసాగింపుగా పార్టు-3 కూడా వస్తుందనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. అది ఈ రెండింటికన్నా ఎక్కువ సస్పెన్స్ నేపథ్యంలో ఉంటుందన్నారు. వీటిపై తాజాగా డైరెక్టర్ జీతూ జోసెఫ్ క్లారిటీ ఇచ్చారు. అవన్నీ ఉట్టి రూమర్లే.. ఈ సారి సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో తీయట్లేదు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్లు ఇక చాలు. ఇప్పుడు కొత్త కోణంలో మూడో పార్టును తీయాలని చూస్తున్నాం. అది ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుందనే నమ్మకం ఉంది. నేను గతంలో చేసిన సినిమాల కారణంగా ఇదే జోనర్ లో ఇరుక్కుపోయాను. కాబట్టి ఈ సారి డిఫరెంట్ గా ట్రై చేద్దామని ఫిక్స్ అయ్యాను. వాస్తవానికి దృశ్యం-2 తీయాలని నేను అనుకోలేదు. కానీ చాలా మంది ఇచ్చిన సలహా కొద్ది దాన్ని తీశాను. అది బాగానే వర్కౌట్ అయింది. కానీ మూడో పార్టును మాత్రం చాలా రియలస్టిక్ గా ఉండే సీన్లతో తీస్తున్నాం. ఈ సారి థ్రిల్లర్ కాకుండా వేరే ట్రై చేస్తున్నాను. అది వర్కౌట్ అయితే ఇక నుంచి నా జోనర్లు మార్చేస్తాను అంటూ తెలిపాడు డైరెక్టర్.
వార్-2ను ఆ సీన్లు దెబ్బ కొట్టాయి.. ఆర్జీవీ కామెంట్స్
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన వార్-2 ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ మూవీ గురించి చాలా రకాలుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ప్లాప్ కు గల కారణాలపై ఇప్పటికే చాలా రచ్చ జరుగుతోంది. ఇలాంటి టైమ్ లో డైరెక్టర్ ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంట్వ్యూలో పాల్గొన్న ఆయన.. వార్-2లో హృతిక్ రోషన్ ఎంట్రీ సీన్ పై మాట్లాడారు. ఆ సీన్ లో హీరో జపాన్ వాళ్లతో ఎందుకు ఫైట్ చేశాడో అస్సలు అర్థం కాలేదు నాకు. అదే విషయాన్ని సినిమాకు చెందిన ఓ కీలక వ్యక్తిని అడిగా. అంటే జపాన్ వాళ్లతో ఫైట్ చేయడం కొత్తగా ఉంటుందనే కాన్సెప్టుతో దాన్ని పెట్టారు అని చెప్పాడు. అది విని నాకు మైండ్ పనిచేయలేదు. ఎందుకంటే స్పై యూనివర్స్ సినిమాలు అంటే మన ఇండియాకు శత్రుదేశాలతో పోరాడే సినిమాలు ఉండాలి. కానీ మన ఇండియాకు జపాన్ ఎప్పుడు శత్రుదేశం అయింది. ఈ లాజిక్ వాళ్లకు తెలియదా. మన శత్రుదేశాలతో పోరాడటమే వార్-2 సినిమా ఉద్దేశం కదా. కానీ సినిమాలో అసలు సంబంధమే లేకపోయినా జపాన్ వాళ్లతో ఫైట్ పెట్టేశారు. అది ప్రేక్షకులకు కన్విన్స్ గా అనిపించలేదు. ఇలాంటి సీన్లు వార్-2లో చాలా ఉన్నాయి. అందుకే అది ఆడలేదు. హీరో ఇంట్రడక్షన్ సీన్ కొత్తగా ఉండాలనే ఆరాటంతో ఇలాంటివి అన్నీ చేస్తున్నారు. కానీ కథ చచ్చిపోతుందనే విషయాన్ని ఆలోచించట్లేదు అని అన్నాడు ఆర్జీవీ.
