20 లక్షల ఉద్యోగాలు అందించేందుకు సంకల్పించాం..
ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అయినటువంటి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ఆపడంతో పాటు కేంద్రం 11,500 కోట్ల రూపాయల సహాయం అందించిందని, ఒక్కరోజు విశాఖపట్నం పర్యటనలో ప్రధాన నరేంద్ర మోడీ.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రెండు లక్షల కోట్ల నిధులు ఇవ్వటం ఆంధ్రప్రదేశ్ కు వరాల జల్లు కురిపించడమే అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు.. పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలంలోని పలు గ్రామాలలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ విధ్వంస పాలనలో లూలూ, అమర్ రాజా, కియో వంటి పరిశ్రమలు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయాయని ఎగ్దేవా చేశారు. ఉపాధి లేక నిరుద్యోగులు, విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ కు బానిసలైయ్యారని ఆవేదన చెందారు. గతంలో రాష్ట్రం వదిలి వెళ్లిపోయిన పారిశ్రామికవేత్తలందరినీ రాష్ట్రానికి తిరిగి రప్పించి పెట్టుబడులు పెట్టించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు. అలాగే యువతకు 20 లక్షల ఉద్యోగాలు అందించేందుకు సంకల్పించామన్నారు. పోడూరు మండలంలోని ఈ ఒక్క రోజులోనే 34 చోట్ల 10 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టామని పనిచేసే నేటి ప్రభుత్వానికి, పనికిమాలిన గత ప్రభుత్వానికి ఇదే నిదర్శమని ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు ఘాటుగా విమర్శించారు.
ఎవరికైనా నచ్చినా నచ్చక పోయినా.. ఫ్యూచర్ ఈజ్ లోకేష్.. కాబోయే సీఎం..
ఎవరికైనా నచ్చినా నచ్చక పోయినా.. తెలుగుదేశం పార్టీ ఫ్యూచర్ ఈజ్ లోకేష్.. కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అని వ్యాఖ్యానించారు మంత్రి టీజీ భరత్.. జ్యూరిక్‌లోని తెలుగువారితో సీఎం చంద్రబాబు ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు తదితరులతో కలిసి పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంత్రి టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఎవరికైనా నచ్చినా నచ్చక పోయినా ఫ్యూచర్ ఈజ్ లోకేష్.. ఫ్యూచర్‌లో కాబోయే సీఎం లోకేష్ అని పేర్కొన్నారు.. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ ఫ్యూచర్ ఈజ్ సేఫ్ హ్యాండ్ అన్నారు.. పెట్టుబడులు పెట్టేవారికి ఎవరికీ ఎలాంటి భయాలు అవసరంలేదన్నారు.. ఏపీని తెలుగుదేశం పార్టీ కొన్ని దశాబ్దాలు పాలిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. దీ మోస్ట్ డైనమిక్, యంగ్ లీడర్ మా నారా లోకేష్ అన్నారు మంత్రి టీజీ భరత్.. ఉన్నత చదువులు చదివిన వ్యక్తి.. ఏపీ నుంచి ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేల్లో స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి చదవిని వ్యక్తి లోకేష్ మినహా ఎవరూ లేరని తెలిపారు.. ఏం చేయాలి, ఎప్పుడు చేయాలనేది మాకు లాంగ్ విజన్ ఉంది.. ఫ్యూచర్ తెలుగుదేశం పార్టీకి ఉంది.. మా పార్టీలో క్లారిటీ ఉంది.. ఎవరికైనా నచ్చినా నచ్చకపోయినా.. ఫ్యూచర్ ఈజ్ లోకేష్.. కాబోయే ముఖ్యమంత్రి లోకేష్.. ఫ్యూచర్‌లో అని స్పష్టం చేశారు.. ఇక, కేంద్ర కేబినెట్‌లో రామ్మోహన్‌నాయుడు యంగెస్ట్ మినిస్టర్ లని తెలిపారు.. ప్రతి జిల్లాలో ఎయిర్‌పోర్ట్ రావాలనే ప్రణాళికలు పెట్టుకున్నారు.. త్వరలోనే మా కర్నూలు నుంచి కూడా విజయవాడకు విమానంలో వెళ్లేందుకు ఏర్పాటు చేయాలని.. ఈ వేదిక నుంచి కూడా కోరుతున్నట్టు వెల్లడించారు.. అయితే, లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలని ఎవరూ మాట్లాడవద్దు అంటూ టీడీపీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసిన రెండు గంటల్లోనే టీజీ భరత్ ఈ వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. దావోస్ వేదికగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ముందే ఈ వ్యాఖ్యలు చేశారు మంత్రి టీజీ భరత్..
పాదయాత్రలో రెడ్ బుక్ గురించి ఎవరూ పట్టించుకోలేదు.. కానీ..!
పాదయాత్రలో రెడ్ బుక్ గురించి నేను మాట్లాడితే ఎవరూ పట్టించుకోలేదు అన్నారు మంత్రి నారా లోకేష్.. జ్యూరిక్‌లోని తెలుగువారితో సీఎం చంద్రబాబు ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పిలవగానే ఇంత మంది వస్తారని తాను ఊహించలేదు.. ఇక్కడి తెలుగు పారిశ్రామికవేత్తలను చూస్తుంటే.. జ్యూరిక్‌లో ఉన్నామా..? లేక జువ్వలపాలెంలో ఉన్నామా అర్థం కావడం లేదంటూ చమత్కరించారు. ఇక, తెలుగు జాతి సత్తా ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు.. ఆయన.. చేతిలో ఫైళ్లు పట్టుకొని న్యూయార్క్ వీధుల్లో తిరిగారు. ఆనాడు ఆయన విజన్-2020 అంటే ఎంతో మంది ఎగతాళి చేశారని పేర్కొన్నారు.. కేవలం రాజకీయాలే కాదు.. వ్యాపార రంగాల్లోనూ అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు.. ఆయన మూడు సంస్థలు పెట్టి విఫలమైనా.. ఏమాత్రం అధైర్యపడకుండా పట్టుదలతో నాలుగో సంస్థగా హెరిటేజ్‌ను స్థాపించారు.. అనుకున్నది సాధించారని పేర్కొన్నారు.. ఇక, రాష్ట్ర పునఃనిర్మాణం కోసం మన శక్తిని పెట్టాలన్నారు లోకేష్.. ఏపీలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి.. ప్రాధాన్యత క్రమంలో పెట్టుకుని.. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించడానికే చాలా కష్టపడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.. అప్పులపాలయ్యం.. వడ్డిలు కట్టలేకపోతున్నాం.. జీతాలు చెల్లించలేకపోతున్నాం.. ఇలా చాలా ఇబ్బందులు పడుతున్నాం అన్నారు.. తెలుగు వాళ్లు.. రాష్ట్రాన్ని వదిలేసి బాగుపడ్డారు.. కానీ, రాష్ట్రం వెనుకబడింది.. ఇప్పుడంతా సహాయం చేయండి.. ఐదేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిద్దాం.. ఏపీ పునర్నిర్మాణం కోసం అంతా కలిసి పనిచేయాలి. మీ సహకారం, తోడ్పాటు రాష్ట్రానికి అవసరం. రానున్న ఐదేళ్లలో ఏపీ అంటే ఏమిటో ప్రపంచానికి చూపించాలనుకుంటున్నాం అన్నారు.. విదేశాల్లో ఉన్న తెలుగువారి ఫీడ్ బ్యాక్ మాకు చాలా అవసరం, అభివృద్ధి పరంగా.. రాజకీయంగా కూడా మీ సలహాలు అవసరం అన్నారు.. చాలా మంది దగ్గర నా వాట్సాప్ నంబర్ ఉంది.. నాకు ఫీడ్ ఇవ్వొచ్చు అన్నారు.. ఇక, పాదయాత్రలో రెడ్‌బుక్ గురించి ఎవరూ పట్టించుకోలేదన్నా నారా లోకేష్.. చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలను ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టేది లేదని చెప్పాను.. ఇప్పటికే మొదలైది.. పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా తీసుకుంటాం అన్నారు.. కానీ, రాజకీయ కక్షలు ఉండవని స్పష్టం చేశారు మంత్రి నారా లోకేష్..
శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ
శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. అన్నప్రసాద వితరణ కేంద్రంలో భోజనంతో పాటు మసాలా వడలు పెట్టాలని ప్రయోగాత్మకంగా పరిశీలన ప్రారంభించారు.. ఇవాళ అన్నప్రసాద కేంద్రంలో ట్రయల్ రన్ లో భాగంగా దాదాపు 5 వేల మంది భక్తులకు (ఉల్లిపాయ వాడకుండా) చేసిన మసాలా వడలు వడ్డించారు టీటీడీ సిబ్బంఇ.. ఇక, రేపటి నుంచి అంచెలవారిగా సంఖ్యను పెంచాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.. ఈ మసాలా వడలు పూర్తిస్థాయిలో రథసప్తమి నుంచి అమలు చేసేందుకు సిద్ధమవుతోంది టీటీడీ.. మరోవైపు, మసాలా వడలు రుచికరంగా వున్నాయి అని.. తొలిసారి మసాలా వడలు అందిన భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. మొత్తంగా ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి సందర్భంగా మసాలా వడలను పూర్తిస్థాయిలో భక్తులందరికీ వడ్డించేలా చర్యలు తీసుకుంటోంది టీటీడీ..
రేషన్ కార్డుల్లో కొత్త పేర్లు చేర్చడానికి అవకాశం ఇస్తాం
రేషన్ కార్డుల్లో కొత్త పేర్లు చేర్చడానికి కూడా అవకాశం కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంత్రి పొన్నం జీహెచ్‌ఎంసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రేషన్ కార్డులకు సంబంధించి సర్వే కొనసాగుతోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులిస్తామని హామీ ఇచ్చారు. రేషన్ కార్డుల సర్వే నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. సర్వేలో పేర్లు లేని వారు అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. ఇక అర్హులందరికీ రేషన కార్డులతో పాటు ఇందిరమ్మ ఇల్లు కూడా అందుతాయని చెప్పుకొచ్చారు. ఇందిరమ్మ ఇల్లు కేవలం స్థలం ఉన్న వారికే అని అపోహలు వద్దని చెప్పారు. స్థలాలు లేని వారికి కూడా ఎలా ఇవ్వాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు.
రివెంజ్ పాలిటిక్స్‌పై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రివెంజ్ పాలిటిక్స్‌పై జగ్గారెడ్డి మీడియాతో చిట్‌చాట్ చేశారు. కక్ష సాధింపు రాజకీయాలకు తాను వ్యతిరేకం అని చెప్పారు. అయినా రివెంజ్ పాలిటిక్స్ ఏ పార్టీకి మంచిది కాదని సూచించారు. అలాంటి రాజకీయాలు చేసే వాళ్లు అధికారం పోయాక బాధ పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. వైఎస్.రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య.. రివెంజ్ పాలిటిక్స్ చేయలేదన్నారు. ఎవరైనా తనకు నష్టం చేసినా.. తానెవ్వరికీ నష్టం చేయను అని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. కాకపోతే రాజకీయ యుద్ధం మాత్రం చేస్తామని పేర్కొన్నారు. ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా… డబ్బులు తీసుకోకుండా రాజకీయం చేస్తున్నట్లుగా ఎవరైనా ఒప్పుకుంటారా..?, తనతో సహా పైసలు ముట్టుకోకుండా రాజకీయం చేయని నాయకుడెవరూ ఉండరని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.
బాబా రామ్‌దేవ్, బాలకృష్ణకు కేరళ కోర్టు షాక్.. అరెస్ట్ వారెంట్ జారీ
పతంజలి ఆయుర్వేద వ్యవస్థాపకుడు బాబా రామ్‌దేవ్, సంస్థ ఎండీ బాలకృష్ణకు కేరళ కోర్టు షాకిచ్చింది. కేరళలోని పాలక్కడ్ జిల్లా కోర్టు బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ చేసింది. పతంజలి ఆయుర్వేద అనుబంధ సంస్థ దివ్య ఫార్మసీ.. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన కేసులో అరెస్టు చేయాలని ఆదేశించింది. పలు వ్యాధుల నివారణకు దివ్య ఫార్మసీ తప్పుడు ప్రకటనలు ఇచ్చిందని కేరళలో పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి బాబా రామ్ దేవ్, బాలకృష్ణ కోర్టు ముందు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే పాలక్కడ్ జిల్లా కోర్టు వాళ్లిదరిపై అరెస్టు వారెంట్ జారీ చేసింది. బాబా రామ్‌దేవ్, బాలకృష్ణ.. పతంజలి ఆయుర్వేద్ ఉత్పత్తులు మధుమేహం, కోవిడ్-19 వంటి రోగాలు నయం చేయగలవని తప్పుదారి పట్టించే ప్రకటనలతో అభియోగాలు ఎదుర్కొంటున్నారు. కేరళకు చెందిన కేవీ బాబు అనే వైద్యుడు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. అనంతరం కేరళలో పది కేసులు, ఉత్తరాఖండ్‌లో ఒక కేసు నమోదైంది. కేవీ బాబు దాఖలు చేసిన ఫిర్యాదులపై కేరళ ఔషద నియంత్రణ విభాగం చర్యలు మొదలుపెట్టింది. అయితే ఈ కేసులో జనవరి 16న కోర్టుకు హాజరుకాకపోవడంతో పాలక్కాడ్‌లోని జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ II బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.
వాట్ ఏన్ ఆర్ట్.. 4.5క్యారెట్ల వజ్రంపై ట్రంప్ చిత్రాన్ని తయారు చేసిన వ్యాపారి.. ధర తెలిస్తే షాకే
గుజరాత్‌కు చెందిన ఒక వజ్రాల వ్యాపారి అమెరికా కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడి ముఖం చెక్కబడిన అద్భుతమైన వజ్రాన్ని సృష్టించాడు. ఈ వజ్రాన్ని కట్ చేయడానికి 60 రోజులు కష్టపడ్డారు. ఐదుగురు నైపుణ్యం కలిగిన కళాకారులు ఈ అద్భుతాన్ని సృష్టించారు. ఈ వజ్రం ధర లక్షల్లో ఉంటుందని చెబుతున్నారు. గుజరాత్ వజ్రాల వ్యాపారులు ముఖేష్ పటేల్, స్మిత్ పటేల్ సంస్థ ఈ ప్రత్యేకమైన వజ్రాన్ని తయారు చేసింది. ఈ వజ్రం ప్రయోగశాలలో పెరిగిన వజ్రం, దీనిని డోనాల్డ్ ట్రంప్ ముఖం ఆకారంలో చెక్కారు. వజ్రాన్ని చెక్కడం, దానికి ఒక ఆకారం ఇవ్వడం చాలా కష్టమైన పని. దీనికి చాలా శ్రద్ధ , జాగ్రత్త అవసరం. అందుకే అతని కంపెనీకి చెందిన 5 మంది కళాకారులు ఈ ఒక్క వజ్రాన్ని చెక్కడానికి కష్టపడి పనిచేశారు మరియు దాదాపు 60 రోజుల తర్వాత ఈ ఫలితం వచ్చింది. ఈ వజ్రం ధర ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో 10 వేల అమెరికన్ డాలర్లుగా చెబుతున్నారు. అయితే భారత మార్కెట్లో దీని ధర దాదాపు రూ. 8.5 లక్షలు. ఈ ప్రత్యేక వజ్రాన్ని ముఖేష్ పటేల్, స్మిత్ పటేల్ కంపెనీ గ్రీన్‌ల్యాబ్ డైమండ్‌లో తయారు చేశారు. డోనాల్డ్ ట్రంప్ ముఖాన్ని పక్క నుండి చూసినప్పుడు ఏర్పడే ఆకారంలోనే ఈ వజ్రం చెక్కబడింది. వజ్రం పని చాలా జాగ్రత్తగా జరిగింది. వజ్రం ప్రతిబింబం నిలుపుకోవడానికి, దిగువ నుండి సాధారణ వజ్రం లాగా చెక్కబడింది, ఇది వైపు నుండి చూసినప్పుడు సాధారణ వజ్రం లాగా కనిపిస్తుంది. ఈ వజ్రం ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో అనేక ఖాతాలు పోస్ట్ చేశాయి.
ఇకపై సిగ్నల్ లేకపోయినా కాల్ చేయొచ్చు.. ఎలా అంటే?
స్మార్ట్ ఫోన్ వచ్చాక హ్యూమన్ లైఫ్ స్టైల్ మారిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫోన్ లేకుండా నిమిషం ఉండలేని పరిస్థితి. అవతలి వ్యక్తికి ఏదైనా ఇన్ఫర్ మేషన్ ఇవ్వాలన్నా.. పొందాలన్నా.. క్షణాల్లో కాల్ చేస్తుంటాం. అయితే కొన్ని సార్లు సిగ్నల్ ప్రాబ్లం వేధిస్తుంటుంది. మీ మొబైల్ నెట్ వర్క్ సిగ్నల్ సరిగా అందక కాల్ చేయలేకపోతుంటారు. టవర్లు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. మారు మూల ప్రాంతాలు, ఏజెన్సీ ఏరియాల్లో, కొండ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.ఇకపై ఈ సిగ్నల్ సమస్య ఉండదు. సిగ్నల్ లేకపోయినా కాల్ చేయొచ్చు. ఎలా అంటే.. కేంద్ర ప్రభుత్వం ఇంట్రా సర్కిల్ రోమింగ్ ఫీచర్ ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ తో యూజర్లు తాము యూజ్ చేస్తున్న నెట్ వర్క్ సిగ్నల్ లేకపోయినా అందుబాటులో ఉన్న ఇతర నెట్ వర్క్ ల సాయంతో కాల్ చేసుకునే వెసులుబాటు వచ్చింది. జియో, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్), భారతీ ఎయిర్‌టెల్ యూజర్లు సొంత సిమ్ నెట్ వర్క్ లేకపోయినా అక్కడ అందుబాటులో ఉన్న ఏ నెట్ వర్క్ నుంచైనా కాల్ చేసుకోవచ్చు. అంటే మీరున్న ప్లేస్ లో మీ నెట్ వర్క్ కు సంబంధించిన టవర్ లేకున్నా ఐసీఆర్ ఫీచర్ తో ఇతర నెట్ వర్క్ లను యూజ్ చేసుకుని కాల్ చేయొచ్చు. 4జీ సేవలను కూడా పొందొచ్చు. అయితే ఈ ఫీచర్ డిజిటల్ భారత్ నిధి (డీబీఎన్) ద్వారా ఏర్పాటైన 4జీ టవర్ల పరిధిలో అందుబాటులో ఉంటుంది. డీబీఎన్ టవర్లు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో ఈ సేవలను పొందొచ్చు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 35,400 మారుమూల గ్రామాల పరిధిలో 27 వేల టవర్లను ఏర్పాటు చేసింది.
‘భైరవం’ టీజర్.. బెల్లంకొండ సాయి జీవించాడుగా!
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం ఫస్ట్-లుక్ పోస్టర్‌లు, చార్ట్ బస్టర్ ఫస్ట్ సింగిల్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్‌పై డాక్టర్ జయంతిలాల్ గడా సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కెకె రాధామోహన్ నిర్మించారు. అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈరోజు ఈ మూవీ టీజర్‌ను లాంచ్ చేశారు మేకర్స్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పాత్ర తన కలలో సృష్టించిన వైలెన్స్ వివరిస్తూ, అతని యాక్షన్ ని శ్రీకృష్ణుడితో పోలుస్తూ లేడీ వాయిస్‌ఓవర్‌తో టీజర్ ప్రారంభమైంది. ఈ కథ వారాహి గుడి, ముగ్గురు స్నేహితులు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు నారా రోహిత్ చుట్టూ సాగుతుంది. వారు ఒకరి కోసం ఒకరు ఎంతకైనా తెగిస్తారు. ప్రారంభ సన్నివేశాలు శ్రీనివాస్ పాత్ర ఇంటెన్స్ నేచర్ ని హైలైట్ చేయగా, చివర్లో దేవుని ఆశీర్వాదం పొందుతున్నట్లుగా కనిపించడం కథలోని డివైన్ ఎలిమెంట్ ని సూచిస్తోంది. దర్శకుడు విజయ్ కనకమేడల ఈ పవర్ ఫుల్ టీజర్ ద్వారా సినిమా లీడ్ రోల్స్ సెంటర్ కాన్ఫ్లిక్ట్ ని పరిచయం చేస్తూ, సినిమా ప్రిమైజ్ ని రివిల్ చేశారు. టీజర్ విజువల్ గా అద్భుతంగా ఉంది, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ నిర్మాణ విలువలు గ్రాండ్ గా వున్నాయి. హరి కె వేదాంతం ఆకట్టుకునే కెమెరా పనితనం ఆకట్టుకుంది. సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల తన ఇంటెన్స్ స్కోర్‌తో ఎక్స్ పీరియన్స్ ని మరింత ఎలివేట్ చేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రగ్గడ్ రస్టిక్ లుక్‌లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మనోజ్ మంచు, నారా రోహిత్ కూడా ఫెరోషియస్ అండ్ డైనమిక్ రోల్స్ లో కనిపించారు. టీజర్ వారి ఫ్రెండ్షిప్ ని స్ట్రాంగ్ గా ప్రెజెంట్ చేసింది. ఈ చిత్రానికి చోటా కె ప్రసాద్ ఎడిటింగ్, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. సత్యర్షి, తూమ్ వెంకట్ డైలాగ్స్ రాశారు. హై-ఆక్టేన్ టీజర్ తో భైరవం గొప్ప అంచనాలను క్రియేట్ చేసింది.
నైట్ అయితే అలసిపోతా..నా వల్ల కాదు.. నరేష్ పై పవిత్ర లోకేష్ కీలక వ్యాఖ్యలు
హీరో నరేష్ ఎనర్జీ గురించి నటి పవిత్ర లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈరోజు నరేష్ పుట్టినరోజు జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా ఆయన ఒక స్పెషల్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీడియాతో ముచ్చటించారు. నరేష్ మాట్లాడిన తర్వాత స్టేజి మీద మాట్లాడిన పవిత్ర లోకేష్ నరేష్ కి ఉన్న ఎనర్జీ ఒక పదిమందికి ఉండాల్సిన ఎనర్జీ ఆయన ఒక్కడికే ఉంటుందని చెప్పుకొచ్చింది. ఆయన ఎనర్జీని మనమంతా తట్టుకోలేము. నైట్ అయితే అలసిపోతాను ఇక నా పని అయిపోయింది ఆయన్నీ మీరే చూసుకోవాలి అని స్టాఫ్ కి అప్ప చెబుతాను. ఆయనకి అంత ఎనర్జీ ఉంటుంది ఏ పని మొదలుపెట్టిన అంత సిస్టమాటిక్గా డిసిప్లిన్ గా చేస్తారని ఆమె చెప్పుకొచ్చారు. మరోపక్క నరేష్ మాట్లాడుతూ సినీ పరిశ్రమలో సక్సెస్ ఫుల్ గా 52 పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు.
ఆసక్తికరంగా ఐడెంటిటీ తెలుగు ట్రైలర్.. చూశారా?
అఖిల్ పాల్, అనాస్ ఖాన్ రచన దర్శకత్వంలో రాజు మల్లియాత్, రాయ్ సిజె నిర్మాతలుగా టోవినో థామస్, త్రిష ప్రధాన పాత్రలు పోషిస్తూ వినయ్ రాయ్, మందిర బేడి తదితరులు కీలకపాత్ర పోషిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఐడెంటిటీ. మలయాళంలో విడుదలైన ఈ చిత్రం రెండు వారాలలో 50 కోట్లకు పైగా వసూలు చేసి 2025 లో తొలి హిట్ సినిమాగా నిలిచింది. జేక్స్ బెజోయ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా అఖిల్ జార్జ్ సినిమాటోగ్రఫీ చేశారు. ఈ చిత్రానికి చామన్ చక్కో ఎడిటింగ్ చేశారు. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు అత్యంత చెరువుగా మూవీ మాక్స్ శ్రీనివాస్ మామిడాల సమర్పణలో శ్రీ వేదాక్షర మూవీస్ చింతపల్లి రామారావు గారు కలిసి ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలలో విడుదల కానుంది. ఈ నెల 24వ తేదిన తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. నేడు హైదరాబాదులో చిత్ర యూనిట్ సమక్షంలో ఈ చిత్ర తెలుగు టైలర్ లాంచ్ చేయడం జరిగింది. నటుడు వినయ్ రాయ్ మాట్లాడుతూ… “అందరికి నమస్కారం. ముందుగా ఇక్కడ టైలర్ చూసి నన్ను ఎంత సపోర్ట్ చేసిన మీడియా వారందరికీ నా ధన్యవాదాలు. రామారావు గారికి, శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు. తెలుగులో ప్రశాంత్ వర్మ నన్ను ప్రేక్షకులందరికీ ఎంతగా గుర్తుండిపోయిన చేశారో మలయాళం లో కూడా అఖిల్ ఆ స్థాయిలో నాకు గుర్తింపు వచ్చేలా చేశారు. నా 18 సంవత్సరాల కెరియర్ లో ఇటువంటి కథను నేను ఎప్పుడు వినలేదు. ఈ చిత్రంలో యాక్షన్, సస్పెన్స్, మంచి స్టోరీ లైన్ ఇలా అన్నీ ఉన్నాయి. ఈ చిత్రం తెలుగువారికి ఎంతో నచ్చుతుందని అనుకుంటున్నాను. తెలుగు నిర్మాతలకు ఈ చిత్రం మంచి బిజినెస్ చేస్తుందని అనుకుంటున్నాను. జనవరి 24వ తేదీన ఈ చట్టం ప్రేక్షకులు ముందుకు రాబోతుంది” అంటూ ముగించారు.