సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
విశాఖపట్నం వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. విశాఖలో నిర్వహించిన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. 11వ ఆర్థిక వ్యవస్థ నుంచి మూడో స్థానంలోకి వచ్చాం… రియల్ టైమ్ గవర్నెన్స్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. ఒకప్పుడు జాబ్ వర్క్ కి పరిమితం అయ్యే ఐటీ కంపెనీలు, ఇప్పుడు అద్భుతాలు సృష్టిస్తున్నాయి.. ప్రపంచంలో ఎక్కడకి వెళ్లినా భారతీయులు ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించిన వారిలో ఉండడం మనకు గర్వ కారణంగా చెప్పుకొచ్చారు.. 2047 మన ఆర్థిక వ్యవస్థ మొదటి స్థానంలో ఉండాలన్న లక్ష్యం ఎంతో దూరంలో లేదు. ఖచ్చితంగా మనం సాధించ గలం అనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.. ఇక, ఇంగ్లాండ్ పర్యటన కు వెళ్తే మ్యూజియంలోకి నన్ను అనుమతించలేదు… కోహినూరు ను క్లైమ్ చేస్తున్న కారణంగానే ఆ విధంగా వ్యవహరించి ఉంటారని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు.. అయితే, బ్రిటీష్‌వాళ్లు అన్ని కొల్లగొట్టినా ఇంగ్లీష్ మనకు వదిలిపెట్టారని వ్యాఖ్యానించారు.. ఓపెన్ స్క్రై పాలసీ కారణగంగా మొదటి సారి హైదరాబాద్ కు ఇంటర్నేషనల్ కనెక్టివిటీ, గ్రీన్ ఫీల్డ్ రహదారి తెచ్చాం అన్నారు.. ఏపీకి వున్న 1000 కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఆర్థిక అభివృద్ధికి చోదకంగా మారుతుందన్నారు.. ఆగస్టు నాటికి ఇంటర్నేషనల్ విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందని తెలిపారు సీఎం చంద్రబాబు.. ఐటీ రంగంలో భారత్ చాలా బలంగా ఉంది.. గణితం, ఆంగ్లంలో ముందుండడం కలిసి వస్తోందన్నారు.. వివిధ వ్యాపార ఆలోచనలతో యువత ముందుకొచ్చింది.. ఉద్యోగాలు ఇచ్చే విధంగా యువత తయారు కావాలని పిలుపునిచ్చారు.. ఇటీవల ఓ సర్వేలో మహిళల భద్రతకు సురక్షితమైన నగరంగా విశాఖ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఓ వైపు సముద్రం, మరోవైపు అందమైన కొండలు. అన్నింటికీ మించి మంచి మనసున్న మనుషులు ఈ నగరం ప్రత్యేకత అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..
రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు..
రేపట్నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి… రేపు ఉదయం 9 గంటలకు శాసన సభ… 10 గంటలకు మండలి సమావేశాలు ప్రారంభం అవుతాయి… సభ ఎన్ని రోజులు జరగాలి.. అనే అంశంపై బీఏసీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా.. ఉదయం 10 గంటలకు మండలి సమావేశం ప్రారంభం అవుతుంది… అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుంది…. అసెంబ్లీ సమావేశాలు నిర్మాణకు సంబంధించి స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.. సీఎస్, డీజీపీలతో కీలక సమీక్ష చేశారు అయ్యన్న పాత్రుడు… పోలీస్ యంత్రాంగం ఎక్కడెక్కడ ఉండాలి విధుల నిర్వహణ పై చర్చించారు… ఒక వారం రోజులు పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది.. కాబట్టి దానికి సంబంధించి భద్రత వ్యవహారం మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు డీజీపీకి సూచించారు…. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశం జరగనుంది.. అసెంబ్లీ సమావేశాలు.. ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి అనే అంశం పై నిర్ణయం తీసుకోనున్నారు… అసెంబ్లీ కి వైసీపీ ఎమ్మెల్యే లు హాజరయ్యే పరిస్థితి లేదు.. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతామని వైసీపీ చెబుతోంది.. గతంలో మాదిరిగానే కేవలం మండలి సభ్యులు మాత్రమే హాజరు కానున్నారు.. ఇక, అసెంబ్లీ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని.. లేకపోతే ఎమ్మెల్యేలకు జీతాలు కట్ చెయ్యాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి… స్పీకర్.. ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీకి రావాలని చెబుతున్నారు… దీంతో రేపు ఎంతమంది హాజరు అవుతారు అనేది కూడా హాట్ టాపిక్ అయింది.
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఏ రోజు.. ఏ టికెట్లు విడుదల చేస్తారంటే..?
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్తామనుకుంటున్నారు.. డిసెంబర్ నెలలో శ్రీవారి దర్శనం కోసం ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఇది మీ కోసమే.. ఎందుకంటే? డిసెంబర్ నెల దర్శనాలకు సంబంధించిన టికెట్ల విడుదల షెడ్యూల్ విడుదల చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన డిసెంబర్ నెల కోటాను సెప్టెంబర్ 18న ఉదయం 10 గంటలకు విడుదల. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం సెప్టెంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. అంగ ప్రదక్షిణ టోకెన్లను ఈ నెల నుండి ఆన్ లైన్ లో ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా జారీ చేయనున్న టీటీడీ. అంగ ప్రదక్షిణ టికెట్ల కోసం సెప్టెంబర్ 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరు.కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను సెప్టెంబర్ 22న ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల..
కూటమి పాలన అంటూ ఏమీ లేదు.. ఆది కేవలం టీడీపీ పాలనే..!
కూటమి ప్రభుత్వంపై సెటైర్లు వేశారు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు.. కూటమి పాలన అంటూ ఏమీ లేదు… ఆది కేవలం టీడీపీ పాలనే అన్నారు.. టీడీపీ వాళ్ల ఒక్కరి పైనే పాపం పడిపోకుండా.. కూటమి అని చెప్పుకుంటున్నారు.. కానీ, సమాజంలో ఉండే అట్టడుగు వర్గాల కోసం పని చేసే పార్టీ వైసీపీ మాత్రమే అన్నారు.. ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా రాజ్యాంగబద్ధంగా పని చెయ్యాల్సిందే.. కానీ, రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా పాలన జరగడం లేదన్నారు.. ఒక రాజధాని కోసం లక్ష కోట్లు అప్పు చేసి ఖర్చు పెడితే అది రాజ్యాంగ బద్ద పాలన ఎలా అవుతుంది? ఆ అప్పు తీర్చడానికి మిగతా ప్రాంతాల వారు కొన్ని సంవత్సరాలు కష్టపడాల్సి వస్తుందన్నారు.. అయితే, సంపదని అన్ని వర్గాలకు సమానంగా పంచితేనే రాజ్యాంగ బద్ద పాలన అవుతుందన్నారు ధర్మాన. రాజధాని ఒక చెరువులా తయారైతే దాన్ని చూపించకుండా చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందన్నారు ధర్మాన.. గత 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా రైతులు కొట్టుకోవడం చూసామా? అని ప్రశ్నించారు.. చదువు ఒక్కటే పేద కుటుంబాన్ని నిలబెట్టగలదు అని నమ్మిన వ్యక్తి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. అందుకే, పేద విద్యార్థులు చదువుకునేందుకు విలువగా అనేక సంస్కరణలు తీసుకువచ్చారు.. అది ఇప్పటి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది.. దానిపై మనం పోరాడాలి అని పిలుపునిచ్చారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు.
మున్సిపల్ ఎన్నికలపై మంత్రి కీలక వ్యాఖ్యలు.. ఒకేసారి అన్ని..!
మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఒకేసారి ఎన్నికల నిర్వహించాలని ఆలోచనలో ఉన్నట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు.. రానున్న మార్చి నాటికి మునిసిపాలిటీల పదవీకాలం పూర్తి కానున్నాయని అన్నారు. అనంతరం ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. రాజమండ్రిలో మున్సిపల్ మంత్రి నారాయణ పర్యటించారు. మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.. కొర్పొరేషన్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు, 2027లో జరిగే గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి పొంగూరు నారాయణ. పుష్కర పనులపై డిసెంబర్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహిస్తారని ప్రకటించారు.. అనంతరం గోదావరి పుష్కర పనులను ప్రారంభిస్తారని అన్నారు. 590 కోట్ల రూపాయలతో గోదావరి పుష్కరాల పనులు చేపడతామని వెల్లడించారు. 456 కోట్లుతో రోడ్లు, డ్రైనేజీల నిమిత్తం ఖర్చు అవుతుందని ప్రజాప్రతినిధులు నా దృష్టికి తీసుకుని వచ్చారని తెలిపారు. దీన్ని సీఎం దృష్టికి తీసుకుని వెళ్తానని అన్నారు. ఇక, ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పై వచ్చే ఆదాయంలోని 50 శాతం స్థానిక సంస్థలకు కేటాయిస్తామన్నారు. మరోవైపు, గత ప్రభుత్వం చెత్తపై 80 కోట్లు పన్నులు వసూలు వేసి 80 శాతం చెత్తను వదిలేశారని విమర్శించారు ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ..
ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగింపు.. సమ్మెకు దూరంగా ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు
ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సేవలపై ప్రైవేట్ ఆసుపత్రులు సమ్మెకు దిగుతాయన్న వార్తల నేపథ్యంలో, రాష్ట్రంలో 87 శాతం ఆసుపత్రులు యథావిధిగా సేవలు అందిస్తున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఆరోగ్యశ్రీ కింద నమోదైన 477 ఆసుపత్రులలో కేవలం 62 ఆసుపత్రులు మాత్రమే సేవలను నిలిపివేశాయి. మిగతా 415 ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్ మాట్లాడుతూ, సమ్మెకు పిలుపునిచ్చినప్పటికీ ఎక్కువ శాతం ఆసుపత్రులు రోగులకు వైద్య సేవలు అందిస్తున్నాయని తెలిపారు. గత రెండు వారాలుగా ఆరోగ్యశ్రీ కింద రోజుకు సగటున 844 సర్జరీలు నమోదయ్యాయని, సమ్మె పిలుపునిచ్చిన రోజున కూడా 799 సర్జరీలు జరిగాయని ఆయన వెల్లడించారు. సేవలు నిలిపివేసిన ఆసుపత్రులకు మరోసారి విజ్ఞప్తి చేసిన సీఈవో, రోగులకు ఇబ్బందులు కలగకుండా తక్షణమే సేవలను పునరుద్ధరించాలని కోరారు. అదేవిధంగా, ప్రైవేటు ఆసుపత్రుల సమ్మె నేపథ్యంలో రోగులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ ఆసుపత్రులలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని తెలిపారు. ఈ చర్యల వల్ల రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని పేర్కొన్నారు.
పహల్గామ్ బాధితుల కోసం రాజకీయ, సినీ ప్రముఖుల క్రికెట్.. HCAకు సీవీ ఆనంద్ కౌంటర్
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు అండగా నిలిచేందుకు హైదరాబాద్‌లో ఒక గొప్ప కార్యక్రమం చేపట్టారు. అక్టోబర్ 9, 10 తేదీలలో ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ‘ఎలైట్ క్రికెట్ లీగ్’ ద్వారా సేకరించిన నిధులను అమరవీరుల కుటుంబాలకు అందజేయనున్నారు. చామల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ చారిటీ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ లీగ్‌లో రాజకీయ, సినిమా, టీవీ, పోలీస్, వ్యాపార రంగాల ప్రముఖులు భాగస్వాములవుతున్నారు. దీనికి సంబంధించిన జెర్సీలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. టాలీవుడ్ తరపున హీరోలు తరుణ్, సుధీర్ బాబు జెర్సీ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ, ఇలాంటి మంచి కార్యక్రమాలను చూసైనా హెచ్‌సీఏ (హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) తమ తీరును మార్చుకోవాలని హితవు పలికారు. తెలంగాణ జిల్లాల్లో ఎంతోమంది ప్రతిభ గల క్రికెటర్లు ఉన్నప్పటికీ, హెచ్‌సీఏ లీగ్‌లను నిర్వహించడం లేదని ఆయన ఆరోపించారు.
రైతులకు షాక్.. యూరియా కొరతపై తెలంగాణ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. యూరియా సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సరైన ముందుచూపు లేదని ఆయన ఆరోపించారు. దేశంలో యూరియా ఉత్పత్తి తక్కువగా ఉందని, దానివల్ల యూరియా కోసం చైనా, జపాన్, జర్మనీ వంటి ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తోందని ఆయన అన్నారు. దేశంలో కేవలం 30 శాతం మాత్రమే యూరియా ఉత్పత్తి అవుతుందని, మిగిలిన 70 శాతం ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతుందని ఆయన వెల్లడించారు. ఈ ఏడాది రామగుండం, నాగార్జున వంటి ఎరువుల కర్మాగారాలు పనిచేయకపోవడంతో ఉత్పత్తి మరింత తగ్గిందని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రష్యా నుంచి రావలసిన యూరియా రాలేదని, యూరప్ నుండి రావాల్సిన యూరియా ఎర్ర సముద్రం ద్వారా రావాలి కానీ, యుద్ధం కారణంగా ఎర్ర సముద్రం వద్ద నౌకలను నిలిపివేశారని కేంద్ర అధికారులు తమకు చెప్పారని ఆయన వివరించారు. దీనివల్ల నౌకలు చుట్టూ తిరిగి రావాల్సి వస్తోందని, అందువల్ల రెండు మూడు నెలల పాటు యూరియా రాక ఆలస్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ ఏడాది టెండర్లు కూడా చాలా ఆలస్యమయ్యాయని, చైనా నుంచి ఒక్క బస్తా యూరియా కూడా రాలేదని అన్నారు.
పదే పదే కరిచే వీధి కుక్కలకు “జీవిత ఖైదు”..యూపీ సర్కార్ నిర్ణయం..
ఉత్తర్ ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్కడి బీజేపీ ప్రభుత్వం మాఫియా, ఉగ్రవాదులు, గ్యాంగ్‌స్టర్లు, నేరస్తులకు వణుకు పుట్టిస్తోంది. ఇప్పటికే, పలువురు గ్యాంగ్‌స్టర్లు పోలీస్ ఎన్‌కౌంటర్లలో హతమయ్యారు. నేరాలు చేయాలంటే భయపడే పరిస్థితికి తీసుకువచ్చారు. అయితే, ఇప్పుడు యోగి ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం సంచలనంగా మారింది. కుక్కలు కూడా ప్రజలకు ఇబ్బందులు కలిగిసే కటకటాల్లో పెడతామంటూ కొత్త నిబంధనల్ని ప్రకటించింది. దేశంలో వీధి కుక్కల దాడులు ఎక్కువ అవుతున్న తరుణంలో, యోగి ప్రభుత్వం ఈ నియమాలను తీసుకువచ్చింది. పదే పదే కరిచే కుక్కల్ని జీవితాంతం షెల్టర్లలో బంధిస్తామని ప్రభుత్వం గత వారం నిబంధనల్ని ప్రకటించింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలోని అన్ని కుక్కలకు స్టెరిలైజ్ చేసి, వాటిని షెల్టర్ హోమ్స్‌లో పెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించిన కొన్ని వారాల తర్వాత యూపీ సర్కార్ నుంచి ఈ ఉత్తర్వులు వచ్చాయి. గతంలో, సుప్రీంకోర్టు తీర్పుపై ‘‘యానిమల్ లవర్స్’’ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చాలా మంది సుప్రీంకోర్టు నిర్ణయాన్ని సమర్థించారు.
యోగితో అట్లుంటది.. దిశా పటానీ ఇంటి ముందు కాల్పులు జరిపిన ఇద్దరి ఎన్‌కౌంటర్..
బాలీవుడ్ నటి దిశాపటానీ ఇంటి ముందు కాల్పులు జరిపిన ఇద్దరు షూటర్లను ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతం చేశారు. ఉత్తర్ ప్రదేశ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్(ఎస్‌టీఎఫ్) మంగళవారం ఘజియాబాద్‌లోని ట్రోనికా సిటీలో ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. బరేలిలోని దిశా పటానీ ఇంటి వెలుపల కాల్పులు జరిపిన ఇద్దర్ని అధికారులు కాల్చి చంపారు. నిందితులను రోహ్‌తక్‌కు చెందిన రవీంద్ర అలియాస్ కల్లు, హర్యానాలోని సోనిపట్ నివాసి అరుణ్‌లుగా గుర్తించారు. ఇద్దరూ రోహిత్ గోదారా-గోల్డీ బ్రార్ గ్యాంగ్‌లో యాక్టివ్ మెంబర్లుగా ఉన్నారని, అనేక క్రిమినల్ కేసులు వీరిపై ఉన్నాయని పోలీసులు తెలిపారు. సెప్టెంబర్ 12న తెల్లవారుజామున 3.45 గంటల ప్రాంతంలో పటాని ఇంటి ముందు కాల్పుల సంఘటన జరిగింది. దీంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళన ఏర్పడింది. దీనిపై బరేలీలోని కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నేరాల పట్ల జీరో-టాలరెన్స్ విధానంతో, వెంటనే కేసును ఛేదించాలని ఆదేశించారు.
ఛీ.. ఛీ.. ఆటే కాదు.. నిరసన చేయడం కూడా చేతకాదా? ఆసియా కప్ 2025లో హైడ్రామా!
ఆసియా కప్ 2025లో అనుకొని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ‘హ్యాండ్ షేక్’ వివాదం నేపథ్యంలో పాకిస్తాన్ జట్టు హైడ్రామా చేస్తోంది. నేడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో జరగాల్సిన మ్యాచ్ సమయానికి పాకిస్తాన్ జట్టు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకి రావాల్సి ఉండగా ఆటగాళ్లు అందరూ హోటల్ రూమ్ కే పరిమితమైంది. భారత్ తో జరిగిన మ్యాచ్ లో.. మ్యాచ్ ముగిసిన తర్వాత హ్యాండ్ షేక్ ఇవ్వని కారణంగా పాకిస్థాన్ జట్టు ఈ విధంగా నిరసన తెలుపుతోందని అర్థమవుతుంది. నేడు జరగాల్సిన మ్యాచ్ కు మొదట పాకిస్తాన్ జట్టు దూరంగా ఉందని అందరు భావించారు. అయితే, ఇక్కడ ఓ కొత్త ట్విస్ట్ జరిగింది. ఏమైందో ఏమో తెలియదు కానీ.. పాకిస్తాన్ జట్టు మళ్లీ మనసు మార్చుకుని మ్యాచ్ ఆడటానికి సిద్ధమయింది. దీంతో పాకిస్తాన్ జట్టు బసచేస్తున్న హోటల్ నుండి దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకు బయలుదేరింది. అధికారిక వార్తల ప్రకారం మ్యాచ్ ఎనిమిది గంటలకు మొదలవ్వాల్సి ఉండగా గంట సమయం ఆలస్యంగా 9 గంటలకు ప్రారంభమవుతుందని ధ్రువీకరించారు.
తగ్గేదేలే.. 77 బంతుల్లోనే శతకం సాధించిన Smriti Mandhana.. రికార్డ్స్ బ్రేక్
భీకర ఫామ్ లో ఉన్న టీం ఇండియా ప్లేయర్ స్మృతి మందాన మరోసారి సెంచరీ సాధించింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్లో కేవలం 77 పంతుల్లోనే స్మృతి మందాన సెంచరీ చేసి చరిత్ర సృష్టించింది. టీమిండియా తరఫున రెండో అత్యంత వేగమైన సెంచరీని స్మృతి నమోదు చేసింది. మొహలి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో స్మృతి మందాన సెంచరీ సాధించింది. ఇక్కడ విశేషమేమిటంటే.. టీమిండియా తరఫున అత్యధిక తక్కువ బంతులతో సెంచరీ చేసిన రికార్డు కూడా స్మృతిదే కావడం.. ఇదివరకు ఐర్లాండ్ పై రాజ్‌కోట్‌లో కేవలం 70 బంతుల్లో సెంచరీ సాధించి రికార్డు సాధించింది.
రీతూ చౌదరి ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. తనూజ అతనితో.. అరేయ్ ఏంట్రా ఇది..
బిగ్ బాస్ సీజన్-9 ప్రస్తుతం ఫుల్ ట్రెండింగ్ లో నడుస్తోంది. ఈ సీజన్ లో ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉంటున్నారు. అయితే బిగ్ బాస్ లో లవ్ స్టోరీలు చాలా కామన్ అనే విషయం మనకు తెలిసిందే. అది లేకపోతే అసలు బిగ్ బాస్ కు క్రేజ్ ఎక్కడి నుంచి వస్తుంది కదా.. అందుకే ఈ సారి సీజన్-9లో చాలానే లవ్ ట్రాక్ లు కనిపిస్తున్నాయి. అసలు ఎవరు ఎవరితో లవ్ ట్రాక్ లు నడిపిస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. రీతూ చౌదరి అయితే ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిపిస్తూ.. డీజే టిల్లు సినిమాలో రాధికకు కంటే డేంజర్ పోరిలా తయారైంది. మొదట్లో జవాన్ పవన్ కల్యాణ్ తో రొమాంటిక్ ట్రాక్ నడిపింది. మధ్యలో డిమాన్ పవన్ ను కూడా వలలో వేసుకుంది. ఇద్దరికీ పులిహోర కలుపుతూ రచ్చ లేపుతోంది. నువ్వు వద్దన్నా నిన్నే చూడాలనిపిస్తోంది అంటూ పవన్ కల్యాణ్ కు బిస్కెట్లు వేస్తోంది. అటు డిమాన్ పవన్ వద్దకు వెళ్లి.. నువ్వు చాలా క్యూట్ గా ఉంటావ్.. అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది అంటూ క్రీమ్ బిస్కెట్లు వేసింది. ఇంకేముంది ఇద్దరు కుర్రాళ్లు ఈ పిల్ల మాటలకు గింగిరాలు తిరిగిపోతున్నారు. మరీ దారుణం ఏంటంటే.. వీరు ముగ్గురూ ఒకే దగ్గర ఉంటూ ఇలాంటివి మాట్లాడేసుకుంటున్నారు. ఇద్దరు పవన్ లకు ఈ విషయం తెలిసి కూడా రీతూతో రాసుకుని తిరుగుతున్నారు. మరి ఇందులో ఎవరు బకరా అవుతారో తెలియాలి. ఇక అటు ఇమ్మాన్యుయెల్ అయితే తనూజ వెంట పడుతున్నాడు. తనూజ కూడా ఇమ్మాన్యుయెల్ మాటలకు తెగ ఫీల్ అయిపోతోంది. ఇద్దరూ కామెడీగా మాట్లాడుకుంటూ కొంత ఎంటర్ టైన్ చేస్తున్నారు. అదే టైమ్ లో కామెడీ లవ్ ట్రాక్ ఎక్కుతున్నారు. అసలే బిగ్ బాస్ కు ఇలాంటివి బాగా ఇష్టం కదా. అందుకే వీళ్ల ట్రాక్ లకు బీజీఎంలు వేస్తూ ప్రోమోలు వేస్తున్నాడు. మరి ఈ లవ్ ట్రాక్ లతో ఈ సీజన్ ఆపుతాడా.. లేదంటే కొత్త ట్రాక్ లు క్రియేట్ చేస్తాడా.. అంతా బిగ్ బాస్ మాయ.
ఏపీలో ఓజీ బెనిఫిట్ షోకి ప్రభుత్వం ఓకే
పవన్ కల్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఓజీ’ సినిమా విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 25న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్ర బృందం విజ్ఞప్తి మేరకు సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతిస్తూ జీవో జారీ చేసింది. ఈ జీవో ప్రకారం, ‘ఓజీ’ సినిమా విడుదలైన రోజు నుంచి అక్టోబర్ 4 వరకు (10 రోజుల పాటు) టికెట్ ధరలు పెంచుకోవచ్చు. సింగిల్ స్క్రీన్‌లలో టికెట్‌కు రూ.125, మల్టీప్లెక్స్‌లలో రూ.150 అదనంగా పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. అలాగే, ఈ నెల 25న తెల్లవారుజామున ఒంటిగంటకు ప్రదర్శించే బెనిఫిట్ షో టికెట్ ధర రూ.1000గా నిర్ణయించారు. ఈ నిర్ణయంపై నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైనర్స్ ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌లకు థాంక్స్ చెప్పింది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ ‘ఓజాస్ గంభీర’గా కనిపించనున్నారు. ప్రియాంక మోహన్ కథానాయికగా నటించగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. తమన్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. జపాన్ వాయిద్య పరికరం కోటోను ఉపయోగించి కొన్ని సన్నివేశాలకు ప్రత్యేకమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ క్రియేట్ చేశారు.
