మహిళలకు శుభవార్త చెప్పిన సీఎం.. ఉచిత బస్సు ప్రయాణం అమలుపై ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఉచిత బస్సు ప్రయాణంపై ప్రచారం సాగుతూనే ఉంది.. ముహూర్తం పెట్టేశారు.. ఆ డేట్ నుంచే అమలు చేస్తున్నారు.. ఇలా ఎన్నో ప్రచారాలు సాగుతూ వచ్చాయి.. అయితే, మహిళకు శుభవార్త చెబుతూ.. ఉచిత బస్సు ప్రయాణం అమలుపై కీలక ప్రకటన చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కర్నూలు జిల్లా పర్యటనలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సీఎం.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మహిళలందరికీ ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని వెల్లడించారు.. ఇక, తల్లికి వందనం అమలు చేస్తాం.. ఓ కుటుంబంలో ఎంత అంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం వర్తింపజేస్తామని స్పష్టం చేశారు.
నేను కూడా సీమ బిడ్డనే.. ఫ్యాక్షన్‌ను కూకటివేళ్లతో పెకిలించా..
నేను కూడా రాయలసీమ బిడ్డనే.. రాయలసీమలో ఫ్యాక్టన్ ఉండేది.. ఫ్యాక్షన్ ను కూకటివేళ్లతో పెకిలించాను అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.. కర్నూలు జిల్లాలో పర్యటించిన ఆయన.. కేంద్రీయ విద్యాలయ సమీపంలో ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు.. ప్రజా వేదికలో పీ4 విధానంలో భాగంగా బంగారు కుటుంబాలు, మార్గదర్శులతో ముఖాముఖి నిర్వహించారు.. డ్రోన్, స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర తదితర స్టాళ్లను పరిశీలించారు.. ఆ తర్వాత సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. గతంలో ఐదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు కనీసం రోడ్లు గుంతలు కూడా పూడ్చలేదని దుయ్యబట్టారు.. ఫ్యాక్షన్ తో గ్రామాలు నిర్వీర్యమై ఎగతాలిగా సినిమాలు తీసేవాళ్లు.. రాయలసీమలో ఎక్కడ లేని విధంగా 4 విమానాశ్రయాలు ఉన్నాయి.. గ్రీన్ ఎనర్జీ హబ్ గా రాయలసీమను తీర్చిదిద్దుతాం అని ప్రకటించారు.. ఓర్వకల్, కొప్పర్తి మౌలిక వసతులతో పారిశ్రామిక వాడలు ఏర్పాటు.. రాబోయే రోజుల్లో పోలవరం నుంచి బనకచర్ల పూర్తి చేస్తే గేమ్ చెంజర్ అవుతుంది.. ప్రతి ఎకరాకు నీరు అందించవచ్చు అని వెల్లడించారు.
మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుంది.. ఓపికతో ఉండండి..!
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుంది.. అప్పటి వరకు నాయకులు, కార్యకర్తలు ఓపికతో ఉండాలి అని సూచించారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న ఇచ్చిన హామీలు అమలు చేయలేదని విమర్శించారు.. అయితే, అనుకున్న సమయానికి కమిటీలు పూర్తి చేయాలని ఆదేశించారు.. కూటమి పాలనలో విశాఖ అవినీతికి అడ్డాగా మారింది.. అమ్మఒడి, రైతు భరోసా, ఫీజు రియాంబర్స్ మెంట్ లేదు.. గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారు.. దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఏడాదిలో కూటమి ప్రభుత్వం అప్పు చేసింది. తెచ్చిన డబ్బుకు లెక్క లేదని ఆరోపించారు. రుషికొండ అద్భుత కట్టడమే.. రుషికొండలో అవినీతి జరిగితే బిల్లులు ఎందుకు చెల్లించారు అని ప్రశ్నించారు బొత్స.. కక్ష సాధింపు చర్యలను ప్రజలు హర్షించరన్న ఆయన.. కార్యకర్తలకు, నాయకులకు ఏ సమస్య ఉన్న మా దృష్టికి తీసుకురండి.. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ మీకు అండగా ఉంటుందని నాయకులు, కార్యకర్తలకు సూచించారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ..
ఉచిత ప్రయాణం కోసం మహిళ దగ్గర ఉండాల్సిన గుర్తింపు కార్డులు ఏవి..? ఏ బస్సులకు వర్తింపు..?
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.. ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అంటూ కర్నూలు జిల్లా పర్యటనలో క్లారిటీ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అయితే, బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయాలి అంటే వారి దగ్గర ఎలాంటి గుర్తింపు కార్డులు ఉండాలి.. అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం సాధ్యం అవుతుందా? ఏ బస్సుల్లో ప్రయాణం చేయాలి.. ఏ బస్సులకు మినహాయింపు ఉంటుంది.. అనే విషయాలను తెలుసుకుందాం.. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం స్కీమ్‌పై మంత్రుల బృందాన్ని నియమించింది ఏపీ ప్రభుత్వం.. ఈ పథకం అమలుపై సాధ్యాసాధ్యాలు మంత్రుల బృందం పరిశీలించింది.. బాలికలతో సహా మహిళలకు ఉచిత ప్రజా రవాణాను అందించే కర్ణాటక శక్తి పథకం అమలును గుర్తించి, ఏపీ ప్రభుత్వం మంత్రుల బృందాన్ని (GoM) ఏర్పాటు చేసింది.. రవాణా శాఖామంత్రి చైర్మన్ గా, హోంమంత్రి, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖామంత్రి సభ్యులుగా, రవాణా శాఖ ప్రధానకార్యదర్శి కమిటీ కన్వీనర్ గా ఉన్నారు.. అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ మరియు ఫిస్కల్ పాలసీ ఇన్స్టిట్యూట్ వంటి NGOలు, విద్యాసంస్థలతో సహా స్వతంత్ర సంస్థలు నిర్వహించిన వివిధ అధ్యయనాలు, సర్వేలు నిర్వహించారు.. కర్ణాటక శక్తి పధకం అమలును పరిశీలించి ఏపీలో మరింత మెరుగైన విధంగా “మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ పథకం” అమలు చేయడానికి సూచనలు చేసింది.. ఇక, మహిళలందరూ ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు ID కార్డ్ మొదలైనవి, చూపించి అన్ని నాన్-ఏసీ సిటీ బస్సులు, ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ సర్వీస్ లలో ఉచిత ప్రయాణం చేయవచ్చు అంటుంది మంత్రుల బృందం.. అయితే, ప్రీమియం, అంతర్రాష్ట్ర బస్సులలో ఉచిత ప్రయాణ సేవలకు మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు..
ఏసీబీ కోర్టులో కీలక వాదనలు.. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి రిమాండ్ విధింపు
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో రిటైర్ట్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్ వోఎస్‌డీ కృష్ణమోహన్ రెడ్డికి రిమాండ్ విధించింది ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం.. మద్యం కుంభకోణంలో కేసులో A 31 ధనుంజయ రెడ్డి, A 32 కృష్ణమోహన్ రెడ్డిని శుక్రవారం రోజు అరెస్ట్ చేసిన విషయం విదితమే కాగా.. ఈ రోజు ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు సిట్ అధికారులు.. సుమారు మూడు గంటల పాటు ఇరుపక్షాల న్యాయవాదుల వాదనలు కొనసాగాయి.. ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి.. మద్యం కుంభకోణం కేసులో నిందితులందరితో కలిపి వచ్చేలా రిమాండ్ విధించారు.. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి మూడు రోజులు పాటు రిమాండ్ విధించింది న్యాయస్థానం.. అంటే.. ఇద్దరికీ ఈ నెల 20వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.. దీంతో.. ఇద్దరు నిందితులను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు పోలీసులు.. అయితే, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వయస్సు రీత్యా.. జైలులో ప్రత్యేక వసతులు కల్పించాలని కోర్టు ఆదేశించిందిన.. వెస్ట్రన్ కమోర్డ్, మంచం, దిండు, దుప్పటి, డ్రై ఫ్రూట్స్‌కు అనుమతి ఇచ్చింది.. ధనుంజయరెడ్డికి కావాల్సిన ఇన్సులిన్ ఇంజక్షన్లు స్టోర్ చేసుకునేందుకు ఫ్రిజ్ సదుపాయం కల్పించాలని స్పష్టం చేసింది ఏసీబీ కోర్టు..
ఖబడ్దార్ పాకిస్తాన్.. భారత్ వైపు చూస్తే అంతం చేస్తాం..
పహల్గామ్ ఉగ్ర దాడికి భారత్ ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ పై తిరంగ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే మీ దేశం మిగలదని మన సైనికులు సంకేతం ఇచ్చారు.. ఉగ్రవాదులను, దుండగులను ఐక్యతతో అంతం చేస్తామని తేల్చి చెప్పారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషించే పాకిస్తాన్ కు ఖబర్దార్ బిడ్డ అంటూ సంకేతాలు ఇచ్చిన ఘనత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీది, భారత సైన్యానిధి అన్నారు. అయితే, భారత సైనిక బలగాల త్యాగాలు మరువలేనిది అని ఎంపీ డీకే అరుణ తెలిపారు. దేశ ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతున్నారంటే అందుకు బలగాల త్యాగాలేనని గుర్తు పెట్టుకోవాలి అన్నారు. మహిళల ముందు సిగ్గు లేకుండా తీవ్రవాదులు పాశవికంగా ప్రవర్తించారు.. ఉగ్రవాదుల అంతూ చూసే వరకు వదిలి పెట్టే ప్రసక్తే లేదు.. దేశ ప్రజలు ఐక్యమత్యంతో ముందుకు నడవాలి.. పహల్గంలో ప్రాణాలు కోల్పోయిన అందిరికీ నివాళులు అని డీకే అరుణ చెప్పుకొచ్చారు.
పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ.. కుప్పకూలి వ్యక్తి మృతి..
వివాహ వేడుకలో విషాదం చోటు చేసుకుంది. డీజే పాటలకు స్టెప్పులేస్తూ ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం బాసూరు గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన యువతీ, యువకుడికి గురువారం రాత్రి పెళ్లి జరిగింది. ఈ సందర్భంగా డీజే పాటలకు నృత్యాలు చేశారు. ఈ వేడుకలో పాల్గొన్న బంగారు నాయుడు(38) డీజే పాటలకు ఎంతో ఉత్సాహంగా స్టెప్పులేశాడు. ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటుతో చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. ఏడాది కాలంలో హృద్రోగాలతో భారత్‌లో చాలా మంది మరణించారు. డ్యాన్స్ వేస్తూ, వ్యాయామం చేస్తూ, అలా కూర్చుని చనిపోయిన వీడియోలు ఈ మధ్య కాలంలో చాలా వైరల్ అయ్యాయి. సాధారణంగా కనిపిస్తున్న ప్రజలకు ఒక్కసారిగా గుండెపోటు రావడం, వెంటనే కుప్పకూలడం, ఆ తర్వాత మరణించడం.. ఇలా అన్నీ నిమిషాల్లోనే జరిగిపోతున్నాయి. డీజే శబ్దాలకు గుండెపోటు వస్తుందా? అంటే అవునంటున్నారు నిపుణులు. డీజే శబ్దాలు ఒక్కసారిగా మొదలై.. షాక్‌కు గురయ్యే పరిస్థితి ఎదురైతే గుండెపై ప్రభావం పడుతుంది. అది కూడా అప్పటికే గుండె జబ్బులు లేదా ఏదైనా బ్లాక్స్ వంటివి ఉంటే ఒక్కసారిగా మొదలయ్యే డీజే శబ్దంతో ఆ వ్యక్తిపై ప్రభావం పడుతుంది. ఆ సందర్భాల్లో గుండెపోటు రావడం లేదా గుండె కొట్టుకోవడం ఆగిపోవడం జరగవచ్చు. డీజేల భారీ శబ్దాల వల్ల గుండె దడ మొదలై గుండె ఆరోగ్యంపై పెను ప్రభావం పడుతుంది. కానీ, అప్పటికే గుండెలో ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది.
ఉగ్ర కుట్రలకు ప్రతిఫలం ఏంటో పాకిస్తాన్ చూసింది..
పహల్గామ్ ఉగ్ర దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకోవడంతో.. బీజేపీ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ పై తిరంగ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్యాంక్ బండ్ కిక్కిరిసింది. మువ్వన్నెల జెండాలతో ట్యాంక్ బాండ్ నిండిపోయింది. సమాజంలోని అన్ని వర్గాల పౌరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. భారతదేశం ఎవరి దయా దక్షిణ్యాల మీద లేదన్నారు. భారతదేశ సత్తా ఏందో మోడీ నాయకత్వంలో ప్రపంచానికి చూపాం.. అమరులకు జోహార్లు అర్పిస్తూ భారత్ మాతా కీ జై అన్నారు. ఇక, నరేంద్ర మోడీ పాలనలో భారత జాతి ప్రపంచంలో తలెత్తుకొని తిరుగుతుంది అని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశం అభివృద్ధి చెందుతోంది.. ఉగ్ర కుట్రలకు ప్రతిఫలం ఏంటో పాకిస్తాన్ చూసింది.. మా దేశ సమగ్రతను దెబ్బ తీసే ప్రయత్నం చేస్తే ఎవ్వరిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని సంకేతాలు పాకిస్తాన్ కు ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. మా జాతీ కోసం, మా సార్వభౌమత్వ రక్షణ కోసం ఒక అడుగు కాదు నాలుగు అడుగులు వెనుకకు వేస్తాం అన్నారు. ఉగ్ర కుట్రలను ఉపేక్షించేది లేదు.. పహల్గమ్ మృత వీరులకు ఘన నివాళులు ఆర్పిస్తున్నామని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.
“మేము అణ్వాయుధ బెదిరింపులకు భయపడము”.. పాక్‌కు అమిత్ షా వార్నింగ్..
భారతదేశాన్ని అభివృద్ధి చేయడంలో ప్రధాని మోడీ ఏ అవకాశాన్ని వదిలిపెట్టలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశాన్ని సురక్షితంగా ఉంచే పని ప్రధాని మోడీ చేశారన్నారు. గాంధీనగర్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. 2014 కి ముందు, ప్రతిరోజూ ఉగ్రవాద దాడులు జరిగాయని.. కానీ అప్పటి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదని విమర్శించారు. కానీ ఇప్పుడు అలా కాదని శత్రు దేశానికి తగిన సమాధానం చెబుతామన్నారు. సైన్యం ఇటుకలకు రాళ్లతో ప్రతిస్పందించిందని అన్నారు. సైన్యం కారణంగా తాము గర్వంగా తలలు పైకెత్తామన్నారు. అణు ముప్పుకు తాము భయపడటం లేదని మరోసారి వ్యాఖ్యానించారు.
సల్మాన్ ఖాన్ కృష్ణ జింకల వేట కేసులో కీలక అప్‌డేట్
27 ఏళ్ల నాటి కృష్ణ జింకల వేట కేసుకు సంబంధించి సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ మరికొందరు తారలు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఈ కేసుపై తాజాగా కీలక అప్డెట్ వచ్చింది. ఈ తారలకు సంబంధించిన అప్పీళ్లను విచారణకు జాబితా చేయాలని రాజస్థాన్ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ లతో పాటు సోనాలి బింద్రే, నీలం, టబు పేర్లు కూడా కృష్ణ జింకల వేట కేసుతో ముడిపడి ఉన్నాయి. ఈ కేసు విచారణ జూలై 28న రాజస్థాన్ హైకోర్టులో జరుగనుంది. విచారణకు రానున్న అప్పీళ్లలో సైఫ్, సోనాలి బింద్రే, నీలం, టబులను నిర్దోషులుగా విడుదల చేయడంపై రాష్ట్రం చేసిన అప్పీల్, శిక్షకు వ్యతిరేకంగా సల్మాన్ ఖాన్ చేసిన పిటిషన్లు ఉన్నాయి.
జయం రవి కోసం రూ.100 కోట్లు అప్పు చేశా.. సీన్ లోకి హీరో అత్త..
తమిళ హీరో జయంరవి కుటుంబ గొడవలు రోజు రోజుకూ ముదురుతున్నాయి. ఇప్పటికే జయం రవి వరుసగా స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. అటు ఆయన భార్య ఆర్తి కూడా ఆరోపణలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఆర్తి తల్లి, జయం రవి అత్త అయిన ప్రొడ్యూసర్ సుజాత విజయ్ కుమార్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉంటున్న ఆమె.. తాజాగా జయం రవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జయం రవి వల్లే తాను ఇండస్ట్రీలోకి వచ్చినట్టు ఆమె చెప్పుకొచ్చారు. అతని వల్లే నిర్మాతగా మారనని స్పష్టం చేశారు. ‘జయం రవి నాకు మొదట్లో చాలా సపోర్ట్ చేశారు. నిర్మాతగా మారిన తర్వాత కొన్ని సినిమాలు చేశాను. వాటి తర్వాత జయం రవితో వరుసగా సినిమాలు చేశాను. రవితో చేసిన సినిమాల కోసం నేను ఫైనాన్షియర్ల దగ్గరి నుంచి రూ.100 కోట్ల దాకా అప్పులు చేశాను. అందులో 25 శాతం వరకు అతనికే రెమ్యునరేషన్ కింద ఇచ్చాను. నష్టాలు వచ్చినా కనీసం పట్టించుకోలేదు.
అజిత్ సంచలన నిర్ణయం.. సినిమాలకు బ్రేక్..
తమిళ స్టార్ హీరో అజిత్ మల్టీ ట్యాలెంటెడ్ అని తెలిసిందే. ఆయన సినిమాలతో పాటు కార్ రేసింగ్ లో పాల్గొంటారు. ఇప్పటికే ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. ఎక్కడ కార్ రేసింగ్ జరిగినా సరే అజిత్ పాల్గొంటారు. మొన్న లండన్ తో పాటు బ్రెజిల్ లో కూడా పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే అజిత్ సినిమాలకు బ్రేక్ ఇచ్చేసి కార్ రేసింగ్ లో పాల్గొంటాడు అనే టాక్ నడుస్తోంది. దీనిపై తాజాగా అజిత్ స్పందించాడు. తనకు సినిమాలతో పాటు కార్ రేసింగ్ రెండు సమానమే అన్నారు. ‘కార్ రేసింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎక్కడ జరిగినా పాల్గొంటాను. దాని కోసం ఎంతో మార్చుకున్నాను. గత 8 నెలల్లో దాదాపు 42 కిలోలు తగ్గాను. కార్ రేసింగ్ కోసం చాలా ఫిట్ గా ఉండాలి. రేస్ ఉన్న ప్రతిసారి డైట్ స్ట్రిక్ట్ గా ఫాలో అవుతా. జిమ్, వ్యాయామాలు చేస్తాను. కానీ రేసింగ్ ఉన్న టైమ్ లో సినిమాలకు న్యాయం చేయలేకపోతున్నాను. అందుకే కార్ రేసింగ్ ఉన్న సమయంలో సినిమాలకు బ్రేక్ ఇస్తాను. సినిమాలకు నేను కచ్చితంగా ఉండాలి అనుకున్నప్పుడు కార్ రేసింగ్ కు బ్రేక్ ఇస్తాను.
