Site icon NTV Telugu

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్ నేతృత్వంలో ఏపీకి విజనరీ నాయకత్వం ఉంది
ఇక్కడ అనంతమైన అవకాశాలు ఉన్నాయి.. ఏపీకి చంద్రబాబు, పవన్‌ కల్యాణ్ నేతృత్వంలో విజనరీ నాయకత్వం ఉంది.. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ ఆధ్వర్యంలో రాష్ట్రం ప్రగతిలో దూసుకెళ్తోంది అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. కర్నూలులో ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ పేరుతో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. అహోబిలం నరసింహస్వామి, మహానందీశ్వరుడికి నమస్కరిస్తున్నా.. మంత్రాలయం రాఘవేంద్రస్వామి అందరినీ ఆశీర్వదించాలని కోరుతున్నా.. జ్యోతిర్లింగం సోమనాథుడి నేల అయిన గుజరాత్‌లో నేను జన్మించాను.. విశ్వనాథుడి భూమి అయిన కాశీకి సేవ చేసే అవకాశం లభించింది.. ఇవాళ శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆశీస్సులు పొందాను.. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండోదైన శ్రీశైలం మల్లిఖార్జునుడిని దర్శించుకున్నాను.. ఆ తర్వాత శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించాను అని వెల్లడించారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, హరిసర్వోత్తమరావుకి శ్రద్ధాంజలి అని పేర్కొన్న పవన్‌ కల్యాణ్.. ఏపీకి చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలో విజనరీ నాయకత్వం ఉంది. ఇక్కడ అనంతమైన అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీ, అమరావతి కలిసి పనిచేస్తున్నాయి. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ ఆధ్వర్యంలో రాష్ట్రం ప్రగతిలో దూసుకెళ్తోందన్నారు.. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. ఈ 21 శతాబ్ధం భారత్‌దే అని స్పష్టం చేశారు.. రోడ్లు, రైల్వేలతో సహా అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసుకుంటున్నాం. కాంగ్రెస్‌ పాలనలో కరెంట్‌ కోతలు ఉండేవి.. కనీసం కొన్ని గ్రామాల్లో కరెంట్‌ పోల్స్‌ కూడా ఉండేవి కావన్న ఆయన.. ఇప్పుడు దేశంలో కరెంట్‌ లేని గ్రామం లేదన్నారు..

ఆంధ్రప్రదేశ్‌ ముఖచిత్రం మారుతోంది.. ప్రధాని కీలక వ్యాఖ్యలు..
దేశాన్ని ముందుకు నడిపించే శక్తి ఆంధ్రప్రదేశ్‌కి ఉంది.. ఎన్‌డీఏ హయాంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖచిత్రం మారుతోంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. కర్నూలు శివారులో ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ పేరుతో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఏపీలో అనంతమైన అవకాశాలు ఉన్నాయి.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ నేతృత్వంలో విజనరీ నాయకత్వం ఏపీలో ఉందన్నానరు.. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ ఆధ్వర్యంలో రాష్ట్రం ప్రగతిలో దూసుకెళ్తోందన్న ఆయన.. ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో కనెక్టివిటీ బలోపేతం అవుతుందని.. ప్రాజెక్టులతో పరిశ్రమలకు ఊతంతో పాటు జీవన ప్రమాణాలు మెరుగవుతాయని వెల్లడించారు.. ఏ దేశమైనా.. రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ఇంధన భద్రత కీలకం అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. ట్రాన్స్‌మిషన్‌ ప్రాజెక్టులతో దేశం ఇంధన సామర్థ్యం పెరుగుతుందన్న ఆయన… గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌ ద్వారా సబ్‌ సీ గేట్‌వేగా ఆంధ్రప్రదేశ్‌ మారుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. ఈ ప్రాజెక్టు విశాఖను ఏఐ, కనెక్టివిటీ హబ్‌గా మారుస్తుందని.. తద్వారా భారత్‌తో పాటు యావత్‌ ప్రపంచానికి సేవలు అందుతాయన్నారు.. భారత్‌ అభివృద్ధికి ఆంప్రదేశ్‌ అభివృద్ధి చాలా అవసరం.. అలాగే ఏపీ అభివృద్ధికి.. రాయలసీమ అభివృద్ధి అంతే అవసరం అన్నారు భారత ప్రధాని.. అయితే, ఈ ప్రాజెక్టులు రాయలసీమలోని ప్రతి జిల్లాలో ఉద్యోగాలు సృష్టిస్తాయి.. రాయలసీమ ప్రగతికి సరికొత్త ద్వారాలు తెరుస్తాయని వెల్లడించారు.. ఇక, ఏపీ పర్యటనలో కర్నూలు శివారులో ఏర్పాటు చేసిన ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ భారీ బహిరంగ సభ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..

త్యాగానికి చిహ్నం కర్నూలు.. ఇది ఒక నగరం మాత్రమే కాదు.. ఒకప్పటి రాజధాని..
త్యాగానికి చిహ్నం కర్నూలు.. కర్నూలు ఒక నగరం మాత్రమే కాదు.. ఒకప్పటి రాజధాని అని గుర్తు చేశారు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ.. ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటన సందర్భంగా కర్నూలు శిశారులో ‘సూపర్‌ జీఎస్టీ – సూపర్‌ సేవింగ్స్‌’ పేరుతో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కర్నూలు నగరం మాత్రమే కాదు.. ఒకప్పటి రాజధాని.. త్యాగానికి చిహ్నం కర్నూలు అన్నారు.. జీఎస్టీ సంస్కరణలపై ఇచ్చిన హామీని ప్రధాని నరేంద్ర మోడీ నిలబెట్టుకున్నారన్న ఆయన.. 4 స్లాబుల నుంచి 2 స్లాబులకు పరిమితం చేశారు.. అప్పుల్లో వున్నా.. ఎన్డీఏ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు అమలు చేసిందన్నారు..

ఏపీకి పెట్టుబడులు తేవడమే లక్ష్యం.. మరోసారి విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడం.. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇప్పటికే పలు దేశాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌.. రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, కల్పించే వసతులపై వివరిస్తూ.. ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా దిగ్గజ సంస్థలను ఆహ్వానిస్తున్నారు.. ఇక, మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధం అయ్యారు సీఎం చంద్రబాఉ.. వచ్చే నెల 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.. రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా లండన్ లో పర్యటించనున్నారు.. అయితే, వచ్చే నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సు కోసం లండన్ లో పలువురు పారిశ్రామిక వేత్తలతో సమావేశం కానున్నారు సీఎం చంద్రబాబు.. విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు రావాలని పారిశ్రామిక వేత్తలను కోరనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలను పారిశ్రామిక వేత్తలకు వివరించనున్నారు.. సీఎం చంద్రబాబుతో పాటు లండన్ వెళ్లనున్నారు.. సీఎం కార్యదర్శి కార్తికేయమిశ్ర.. సీఎం లండన్ టూర్ కు సంబంధించి జీఎడీ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు.

అందుకే మౌనంగా ఉంటున్నా.. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ హాట్‌ కామెంట్స్..
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అడపాదడపా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్‌ నేత వర్మ వ్యవహారం తెరపైకి వస్తూనే ఉంది.. పవన్‌ కల్యాణ్‌ కోసం తన సీటును త్యాగం చేసిన ఆయన కొన్ని సార్లు ఓపెన్‌ కావడం.. దీనికి ఆయనకు కౌంటర్లు పడిన సందర్భాలు లేకపోలేదు.. అయితే, తాజాగా మంత్రి నారయణ టెలీకాన్ఫరెన్స్‌లో చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారిపోయి. ఈ పరిణామాలతో పాటు.. గతంలో చేసిన కామెంట్లపై స్పందించారు వర్మ.. ఎవడో కర్మ ,గడ్డి పరక అంటే తనకేంటని అన్నారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ… గతంలో జనసేన ప్లీనరీలో నాగబాబు చేసిన కామెంట్స్ పై రిప్లై ఇచ్చారు వర్మ.. కూటమి బలోపేతం గురించి తాను మౌనంగా ఉంటున్నాను అన్నారు.. అయితే, మంత్రి నారా లోకేష్ కి ప్రమోషన్ రావాలని కోరుకుంటున్నానని తెలిపారు.. తానేంటో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలుసు అని స్పష్టం చేశారు.. మరోవైపు, మంత్రి నారాయణ తన గురించి మాట్లాడిన వీడియో ఉంటే చూపించాలని సవాల్‌ చేశారు.. అయితే, సందర్భాన్ని బట్టి ఆడియో బయటికి వచ్చిందని తెలిపారు.. సీఎం చంద్రబాబు ఆగమంటే ఆగాను.. ఎన్నికల్లో పనిచేయమంటే చేశానని తెలిపారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే శ్రీవత్సవాయి సత్యనారాయణ వర్మ (ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ)..

వీసీ సజ్జనార్ సూపర్ షాట్.. దెబ్బకు వీడియోలు తొలగించిన యూట్యూబర్లు
రోజురోజుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ప్రజల్లో పాపులారిటీ సాధించేందుకు వేదికగా మారాయి. అయితే, కొందరు యూట్యూబర్లు, సోషల్ మీడియా క్రియేటర్లు ఈ అవకాశాన్ని అశ్లీల కంటెంట్ ప్రసారం చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మాస్ వార్నింగ్ ఇవ్వడంతో యూట్యూబ్ ఛానెళ్లు, ఇన్‌స్టాగ్రాం రీల్స్‌లో క్రమంగా వీడియోలను తొలగించాయి. వీసీ సజ్జనార్ ఇటీవల సోషల్ మీడియాలో చేసిన ట్వీట్‌లో, ముఖ్యంగా మైనర్‌లను జోడించి అసభ్య కంటెంట్ రూపొందించే క్రియేటర్లను లక్ష్యంగా చేసారు. ట్వీట్‌లో “ఇలాంటి కంటెంట్ త్వరలో తొలగించబడకుంటే భవిష్యత్‌లో చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తాము” అని స్పష్టమైన హెచ్చరిక ఇచ్చారు. సజ్జనార్ హెచ్చరిక తర్వాత.. అనేక యూట్యూబ్ ఛానెళ్లు తమ వీడియోలను తక్షణమే డిలీట్ చేసాయి. వాటితోపాటు, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ కూడా డిలీట్ చేయడం ప్రారంభించారు. సజ్జనార్ ఇచ్చిన హెచ్చరిక.. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై పరిమితులు, బాధ్యతలపై స్పష్టత కలిగించింది. క్రియేటర్లకు, సామాజిక బాధ్యతను గుర్తించి, చట్టాన్ని గౌరవించమని ఈ హెచ్చరిక సూచిస్తోంది.

మీరు బహిరంగ చర్చకు సిద్ధమా.. మంత్రి అడ్లూరి సవాల్‌
సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ధర్మపురి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, “మా ప్రభుత్వం రెండేళ్లు కూడా పూర్తవ్వకముందే బీఆర్‌ఎస్‌ నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారు” అని వ్యాఖ్యానించారు. మంత్రి అడ్లూరి మాట్లాడుతూ.. “బీఆర్‌ఎస్‌ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నా తమ వాగ్దానాలను అమలు చేయలేదు. 2014, 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారు. ఇప్పుడు మా ప్రభుత్వంపై బోగస్ ఆరోపణలు చేయడం తప్ప మరేం చేయడం లేదు” అని అన్నారు. మేము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం.. మీరు నిజంగా ప్రజల కోసం పనిచేస్తే రండి, ప్రజల ముందే చర్చిద్దాం అని మంత్రి అడ్లూరి లక్మణ్ బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. తనపై విమర్శలు చేస్తున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను ఉద్దేశించి మాట్లాడుతూ.. నాకు మంత్రి పదవి వచ్చి మూడు నెలలు మాత్రమే అయ్యింది. అప్పుడే నా మీద విమర్శలు చేస్తున్నారు. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో ప్రజలకే తెలుసు అని తీవ్రంగా విమర్శించారు.

వెలుగులోకి మరో క్రిప్టోకరెన్సీ మోసం
క్రిప్టోకరెన్సీ, బిట్‌కాయిన్ పేర్లతో కోట్ల రూపాయల మోసం చేసిన మెటాఫండ్ కింగ్ పిన్ వరాల లోకేశ్వర్‌రావును కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వివరాలను కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలం మీడియాకు వెల్లడించారు. కరీంనగర్ కు చెందిన తులసీ ప్రకాష్ తో స్నేహం ఏర్పడిన తర్వాత 2024లో ఈ మోసం ప్రారంభమైంది. మెటాఫండ్, యూబిట్ పేర్లతో నకిలీ యాప్‌లు సృష్టించి, పెట్టుబడిదారులను మోసం చేశారు. ఒక్కొక్క వ్యక్తికి 90,000 రూపాయలకు 1,000 కాయిన్లు ఇస్తామని, నెల రోజులలో మూడు రెట్లు రాబడి వస్తుందని నమ్మించారు. ఈ మోసానికి వరాల లోకేశ్వర్‌రావు కింగ్ పిన్ గా ఉండగా, తులసీ ప్రకాష్, బూర శ్రీధర్, దాసరి రాజు, దాసరి రమేష్, కట్ల సతీష్ ప్రధాన పాత్రధారులుగా వ్యవహరించారు. హైదరాబాద్‌లోని ఒక రిసార్ట్‌లో ఘనంగా మెటాఫండ్ యూబిట్ కాయిన్స్ లాంచింగ్ కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రజల నమ్మకాన్ని పొందారు. దేశవ్యాప్తంగా 450 మందికి పైగా బాధితులు, సుమారు 25 నుండి 30 కోట్ల రూపాయల మోసం జరిగిందని సీపీ తెలిపారు.

కీలక నిర్ణయం.. తొలిసారిగా ట్రాన్స్‌జెండర్లను పోలీస్ కానిస్టేబుళ్లుగా నియామించనున్న ప్రభుత్వం
మధ్యప్రదేశ్ పోలీసులు ట్రాన్స్‌జెండర్లకు కానిస్టేబుళ్లుగా మారే అవకాశాన్ని అందిస్తున్నారు. ఈ మేరకు, స్టాఫ్ సెలక్షన్ బోర్డు నిర్వహించే కానిస్టేబుల్ నియామక పరీక్ష నోటిఫికేషన్‌లో మార్పులు చేశారు. బుధవారం సాయంత్రం జారీ చేసిన నోటిఫికేషన్‌లో పురుష, స్త్రీలతో పాటు ఇతర జెండర్ ఆప్షన్స్ ను చేర్చారు. వీరికి దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 22 వరకు గడువు ఇచ్చారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 6 గడువు ఉండేది. 2014లో, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తన తీర్పులో, ట్రాన్స్‌జెండర్లను మూడవ లింగంగా గుర్తించి, ప్రభుత్వ సర్వీసుల్లో నియామకాలకు మార్గం సుగమం చేసింది. OBC రిజర్వేషన్ ప్రయోజనాలను వారికి మంజూరు చేయడం ద్వారా అనేక ఇతర సేవలలో వారికి అవకాశాలు సృష్టించారు. కానీ ఇది ఇంకా పోలీసు నియామకంలో అమలు కాలేదు. 2023లో జరిగిన పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్షలో కూడా ఏ ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులను చేర్చలేదు. ఈసారి సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రపంచంలోనే అత్యంత చెత్త పాస్‌పోర్ట్ పాకిస్థాన్ సొంతం.. భారత్ ర్యాంక్ ఎంత అంటే?
ప్రపంచవ్యాప్తంగా పాస్‌పోర్ట్‌ల ర్యాంకింగ్ కొలిచే ప్రతిష్టాత్మక హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ తాజాగా ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్ అనేది ఒక దేశ పౌరుడు ముందస్తు వీసా లేకుండా ఎన్ని ఇతర దేశాలలోకి ప్రవేశించవచ్చో వెల్లడిస్తుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే ప్రపంచంలోనే అత్యంత చెత్త పాస్‌పోర్ట్‌గా పాకిస్థాన్ నిలిచింది. ఈ ర్యాంకింగ్స్ చివరి నుంచి నాలుగో స్థానంలో గత నాలుగు ఏళ్లుగా నిలుస్తూ వస్తుంది. కొత్త ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సింగపూర్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ దేశ పౌరులు వీసా లేకుండా ప్రపంచంలోని దాదాపు ప్రతి మూలకు ప్రయాణించగలరు. ఈ సంవత్సరం ర్యాంకింగ్‌లో పాకిస్థాన్ పాస్‌పోర్ట్ 103వ స్థానంలో ఉంది. ఈ ర్యాంక్ యెమెన్‌తో సమానంగా ఉంది. వాస్తవానికి ఈ ర్యాంకింగ్ అనేది పాకిస్థాన్‌కు పెద్ద దెబ్బ అని, ఇది ప్రపంచంలో నాలుగవ బలహీనమైన పాస్‌పోర్ట్‌గా నిలిచిందని విశ్లేషకులు పేర్కొన్నారు. తాజా జాబితా ప్రకారం.. 227 ప్రపంచ గమ్యస్థానాలలో పాకిస్థాన్ పాస్‌పోర్ట్ హోల్డర్లకు 31 దేశాలకు మాత్రమే వీసా-రహిత యాక్సెస్ ఉన్నట్లు వెల్లడైంది. ఈ జాబితాలో దాయాది దేశం కంటే మూడు దేశాలు మాత్రమే దిగువన ఉన్నాయి. 104వ స్థానంలో ఉన్న ఇరాక్ పౌరులు వీసా లేకుండా కేవలం 29 దేశాలకు మాత్రమే ప్రయాణించడానికి వీలు ఉంది. 105వ స్థానంలో ఉన్న సిరియా 26 గమ్యస్థానాలకు మాత్రమే వీసా రహిత ప్రవేశాన్ని కలిగి ఉంది. జాబితాలో అట్టడుగు స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ (106వ స్థానం) ఉంది. ఈ దేశ పాస్‌పోర్ట్ హోల్డర్లు వీసా లేకుండా కేవలం 24 దేశాలకు మాత్రమే ప్రయాణించగలరు. హెన్లీ ఇండెక్స్‌లో పాక్ ప్రపంచంలోనే నాలుగవ చెత్త పాస్‌పోర్ట్‌గా నిలిచిపోవడం ఇది వరుసగా నాలుగో ఏడాది.

వాళ్లను చూసి పవన్ కల్యాణ్‌ సిగ్గుపడ్డారు.. సమంత షాకింగ్ కామెంట్స్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ ప్రస్తుతం ఓజీ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆయన తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో రాబోతున్నారు. అయితే పవన్ కల్యాణ్‌ బయట ఎంత పవర్ స్టార్ అయినా.. బయట చాలా మొహమాటంగానే కనిపిస్తుంటారు. ఇదే విషయాన్ని సమంత చెప్పింది. ఆమె గతంలో ఓ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్‌ గురించి చెప్పిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నేను పవన్ కల్యాణ్‌ తో అత్తారింటికి దారేది సినిమాలో నటించాను. ఆ మూవీ కోసం మేం స్విట్జర్ ల్యాండ్ వెళ్లాం. అక్కడ ఓ సాంగ్ షూటింగ్ చేయడానికి పవన్ కల్యాణ్‌ గారు చాలా సిగ్గుపడ్డారు. అక్కడ జనాలు ఉన్నారు నేను చేయలేను అని కారవాన్ లోకి వచ్చి కూర్చున్నారు. వెంటనే త్రివిక్రమ్ వెళ్లి నువ్వు చేయగలవు, యూ కమ్ అంటూ చెప్పారు. నేను చేయలనంటారా అని పవన్ కల్యాణ్‌ అడగడం చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంత పెద్ద పవర్ స్టార్ అయినా కూడా అంత సింపుల్ గా ఎలా ఉంటున్నారు అనుకున్నాను. ఆయన బయటకు అలా కనిపిస్తారు గానీ.. పది మందిలో ఏదైనా చేయాల్సి వస్తే చాలా సిగ్గుపడుతారు అంటూ తెలిపింది సమంత. ఆమె చేసిన కామెంట్లు మరోసారి వైరల్ అవుతున్నాయి.

ఆ విషయంలో చిరు గ్రేట్.. మనసున్న మెగాస్టార్..
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటున్నారు. మనకు తెలిసిందే కదా చిరంజీవి ఎక్కడ ట్యాలెంట్ ఉన్నా సరే ఎంకరేజ్ చేయకుండా ఉండలేరు. సినిమాల్లో ఆయన ఎదుగుతున్న టైమ్ నుంచే ఎంతో మంది నటులను ఎంకరేజ్ చేశారు. చిరు ప్రోత్సాహంతో ఎదిగిన హీరోలు ఎంతో మంది ఉన్నారు. నటీనటులు, డైరెక్టర్లు కూడా ఉన్నారు. కేవలం సినిమాల్లోనే కాదు ఆటల్లో ట్యాలెంట్ చూపించిన వారికి కూడా చిరు ఎంకరేజ్ మెంట్ ఉంటుంది. గతంలో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఒలంపిక్స్ లో సిల్వర్ మెడల్ గెలిస్తే.. చిరంజీవి పెద్ద పార్టీ ఏర్పాటు చేసి ఆమెను అభినందించారు. ఇండస్ట్రీ ప్రముఖులను పిలిచి మరీ సింధును సన్మానించి మెచ్చుకున్నారు. ఇప్పుడు తాజాగా తిలక్ వర్మను తన సినిమా సెట్స్ కు ఆహ్వానించి మరీ సన్మానించారు. ప్లేయర్స్ లేదా యాక్టర్లకు కావాల్సింది ఒక ఎంకరేజ్ మెంట్. అదే చిరంజీవి ఇస్తున్నది. చిరంజీవి మిగతా హీరోల్లాగా తన సినిమాలు తాను చేసుకుంటూ ఉండిపోవచ్చు. ఇలా పనిగట్టుకుని ట్యాలెంట్ ఉన్న వారిని పిలిచి సన్మానాలు చేయాల్సిన అవసరం లేదు కదా.. కానీ ఆయన అలా అనుకోవట్లేదు. తాను కష్టపడి ఎదిగిన వ్యక్తి కాబట్టే ట్యాలెంట్ ఉన్న వారికి ఎంకరేజ్ మెంట్ అనేది ఎంత అవసరమో ఆయనకు బాగా తెలుసు. అగ్ర హీరోగా ఉన్న తన నుంచి ప్రశంసలు వస్తే ఆ ప్లేయర్లు మరింత ధీటుగా ఆడేందుకు ఎంతో కొంత అవకాశం ఉంటుందనేది చిరంజీవి ఆలోచన. అందుకే ట్యాలెంట్ ఉన్న వారిని తన వద్దకు ఆహ్వానించి మరీ ప్రశంసిస్తున్నారు. వారికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. అందుకే ఈ విషయంలో మెగాస్టార్ గ్రేట్ అంటున్నారు ఫ్యాన్స్.

Exit mobile version