హైటెక్ సిటీ రాక ముందు హైదరాబాద్‌లో ఎకరం రూ.లక్ష.. ఇప్పుడు రూ.100 కోట్లు..
హైటెక్ సిటీ రాక ముందు హైదరాబాద్ ఎకరం రూ.లక్ష ఉండేది.. ఇప్పుడు రూ.100 కోట్లకు చేరిందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వే టూ న్యూస్ కాంక్లేవ్ లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. అమరావతి అభివృద్ధి నిరంతర ప్రక్రియ.. హైదరాబాద్ తరహాలోనే అభివృద్ధి జరుగుతూ ఉంటుందన్నారు.. పోలవరం వచ్చే రెండేళ్లలో పూర్తి చేస్తాం.. అమరావతిలో మొత్తం ప్రైవేట్ భూములే.. పరిశ్రమలు, అభివృద్ధితో భూమి విలువ పెరుగుతుంది… అమరావతి రైతులకు అన్యాయం జరగదు. అమరావతి అభివృద్ధి అనేది కంటిన్యూగా ఉంటుంది. అభివృద్ధిని కొంత మేరకే పరిమితం చేస్తే… అమరావతి ఓ చిన్న మున్సిపాల్టీగా మిగిలిపోతుంది. హైదరాబాద్ తరహాలో అమరావతి కూడా మహానగరంగా మారుతుంది. గుంటూరు -విజయవాడ – తెనాలి – గ్రామాలు కలిస్తేనే మహానగరంగా మారుతుందన్నారు.. భూములిచ్చిన వారిని ఆదుకుంటాం… విస్తరణ విషయంలోనూ ఏ మాత్రం ఇబ్బంది లేకుండా అభివృద్ధి చేస్తాం అన్నారు చంద్రబాబు.. ఇప్పుడు ఉండే భూమి ఇప్పటికే సరిపోతుంది.. అవసరమైన మేరకు రైతులతో మాట్లాడి అమరావతిని అభివృద్ధి చేస్తాం అన్నారు.. క్వాంటం వ్యాలీకి శ్రీకారం చుట్టాం… క్వాంటం కంప్యూటింగ్ కు అవసరమైన అనుబంధ సంస్థలు పెట్టడానికి పలు సంస్థలు ముందుకు వచ్చాయి. అలాగే జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ విద్యా సంస్థలు కొన్ని ఉన్నాయి… ఇంకొన్ని రాబోతున్నాయని వెల్లడించారు.. ఒకప్పుడు రాయలసీమలో 10 ఏళ్లల్లో 8 ఏళ్లు కరవు ఉండేది. ట్యాంకర్లల్లో నీళ్లు తీసుకెళ్లాల్సిన పరిస్థితి రాయలసీమలో ఉండేది. దేశంలో ఇప్పటికీ అతి తక్కువ వర్షపాతం ఉన్న జిల్లా అనంతపురం… కానీ, నీళ్లను ఇవ్వడంతో అక్కడ పరిస్థితి మారిందని తెలిపారు.. కోస్తా జిల్లాల కంటే అనంతపురం జిల్లానే జీఎస్డీపీలో టాప్ పొజిషన్లో ఉంది. హార్టికల్చర్ సాగు వల్లే ఇది సాధ్యం. నీళ్లు లేకపోయినా ఫర్వాలేదు.. రోడ్లు లేకపోయినా ఫర్వాలేదంటే… మనం ఇక్కడే ఉంటాం అన్నారు చంద్రబాబు.
అమరావతి రాజధానిపై సజ్జల కీలక వ్యాఖ్యలు.. మా విధానం అదే..!
అమరావతిపై వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని పెడితే ఖర్చు తక్కువ అవుతుందన్నారు.. అయితే, ఇంతకు ముందు అమరావతిని రాజధానిగా తీసేస్తామని మేం అనలేదన్నారు.. అమరావతిని కలుపుకొని ఢీసెంట్రలైజ్ అన్నాం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం అన్నాం.. మూడు రాజధానులు అని తప్పుడు ప్రచారం చేశారన్నారు.. విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని పెడితే శాశ్వత పరిష్కారం అవుతుందున్నారు.. చంద్రబాబు తాను, తన కొఠారి జేబులు నింపుకునే ఆలోచన చేస్తున్నారు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు.. అమరావతిని మాయా బజారులాగా కట్టాలని అంటే లక్ష ల కోట్లు ఖర్చు అవుతుంది.. రాష్ట్రం భరించలేనంత ఖర్చు రాజధానికి అవుతుంది.. చంద్రబాబు రాజధానిని అప్పులు పాలు కాకుండా చూడాలని సలహా ఇచ్చారు. కేంద్రం రాజధానికి డబ్బు ఇస్తే ఎవరికి అభ్యంతరం లేదు.. కానీ, చంద్రబాబు లోను తీసుకోని రాజధాని కడుతున్నారని విమర్శించారు సజ్జల.. అమరావతిని జగన్ అభివృద్ధి చేశారన్న ఆయన… మేం పరిపాలన రాజధాని విశాఖ, న్యాయ రాజధాని కర్నూల్ అనుకున్నాం.. కానీ, మేం అనుకున్నది జరగలేదు.. అమరావతి ప్రాంతంలో రాజధాని కంటిన్యూ అవుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు.. అయితే, రాజధాని నిర్మాణం చంద్రబాబు చేతిలో ఉంది.. రాజధాని పూర్తి కాకపోతే వేరే ఆలోచన వచ్చే అవకాశం ఉందన్నారు.. మరోవైపు, రాజధాని మీద శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు సజ్జల.. విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని పెడితే మహా నగరం తయారు అవుతుంది.. 500 ఎకరాల్లో రాజధాని సరిపోతుందని వైఎస్ జగన్ గతంలోనే చెప్పారు.. ఈ ప్రాంతంలో ఇప్పటికే పశ్చిమ బైపాస్ అందుబాటులో ఉంది.. తూర్పు బైపాస్ కూడా అందుబాటులోకి వస్తుంది.. దగ్గరలోనే బందరు పోర్టు కూడా ఉంది.. ఇటువైపు అయితే త్వరగా ఒక మహానగరం రెడీ అవుతుందన్నారు సజ్జల..
వైసీపీ సీనియర్ నేత తోపుదుర్తి భాస్కర్ రెడ్డి మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తోపుదుర్తి భాస్కర్ రెడ్డి కన్నుమూశారు. ఈ రోజు మధ్యాహ్నం పొలంలో పనులు చేస్తుండగా.. కళ్లు తిరిగి కింద పడిపోయిన భాస్కర్ రెడ్డిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.. అయితే, వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. అప్పటికే భాస్కర్ రెడ్డి మృతిచెందినట్టుగా నిర్ధారించారు. భాస్కర్ రెడ్డి మృతిపట్ల.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మా పార్టీకి చెందిన అనంతపురం జిల్లా సీనియర్ నాయకుడు తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి ఆకస్మిక మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందని ట్వీట్ చేశారు వైఎస్ జగన్.. క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా పార్టీకి ఆయన అందించిన సేవలు మరిచిపోలేనివి అని పేర్కొన్నారు.. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలి.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు వైఎస్ జగన్ .. ఇక, తన చిన్నాన్న తోపుదుర్తి భాస్కర్ రెడ్డి మృతికి సంతాపం తెలియజేశారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.. అనంతపురం వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి.. భాస్కర్ రెడ్డి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. భాస్కర్ రెడ్డితో తనకు ఆత్మీయ అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు.. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు..
లిక్కర్ కేసులో కీలక పరిణామం.. తెరపైకి కొత్త పేర్లు..!
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది.. ఈ కేసులో కొత్తగా నిందితుల పేర్లు సిట్ చేర్చనుందా అనే చర్చ మొదలైంది. గత 15 రోజుల కాలంలో సిట్ విచారణలో భాగంగా సేకరించిన ఆధారాలు సహాయంతో మరికొందరి పేర్లు కేసులో చేర్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి 48 మంది మీద కేసు నమోదు అయింది. ఇందులో 29 మంది వ్యక్తులు 19 సంస్థలు ఉన్నాయి. కేసులో నిందితులుగా ఉన్న వారిలో 12 మందిని సీట్ అరెస్టు చేయగా.. అందులో నలుగురు బెయిల్ పై విడుదలయ్యారు. ఇంకా ఎనిమిది మంది రిమాండ్‌లో కొనసాగుతున్నారు. ఇదే సమయంలో మరి కొంతమంది అరెస్టులు చేసేందుకు సిట్ సిద్ధం అవుతోంది అని ప్రచారం జరిగినా అది జరగలేదు. అయితే, కేసు విచారణ తుది దశకు వచ్చింది అని చిట్ అధికారులు చెబుతున్న నేపథ్యంలో విశాఖ, తిరుపతి, హైదరాబాద్ ప్రాంతాల్లో వరసగా చేపట్టిన సోదాలు కొత్త నిందితుల పేర్లు చేరనున్నాయి అనే అంశానికి బలాన్ని చేకూరుస్తున్నాయి.
ఇన్‌స్టాగ్రామ్ ఐడీతో వరుడికి కుచ్చుటోపీ.. 25 లక్షలు గుంజిన సైబర్ దొంగలు
హైదరాబాద్ మహా నగరంలో మరోసారి సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. మ్యాట్రిమోనియల్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఓ వరుడిని మోసగించి రూ.25 లక్షలు వసూలు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. khoobsurat.rishte అనే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ద్వారా నిందితులు మ్యాట్రిమోనియల్ మోసాలకు పాల్పడ్డారు. పాకిస్తాన్‌కు చెందిన ఓ యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఫోటోలను ఉపయోగించి బాధితుడిని నమ్మించి, పెళ్లి పేరుతో భారీగా డబ్బులు తీసుకున్నారు. అయితే, ఈ మోసంలో అబ్దుల్ ఆమర్, అనీసా మొహమ్మద్యాసీన్ అనే ఇద్దరు నిందితులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేయగా.. మరో నిందితురాలు జోహర్ ఫాతిమా పరార్ అయిందని పోలీసులు చెప్పుకొచ్చారు.
అక్టోబర్‌లో నింగిలోకి తేజస్ మార్క్.. ఇక శత్రు దేశాలకు వణుకే..
శత్రుదేశాల గుండెల్లో గుబులు పుట్టించే పేరు.. తేజస్-మార్క్ 1A ఫైటర్ జెట్. తాజాగా ఈ యుద్ధ విమానం వార్తల్లో నిలిచింది. తేలికపాటి యుద్ధ విమానం (LCA) తేజస్-మార్క్ 1A కోసం హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) అమెరికా నుంచి మూడవ GE-404 ఇంజిన్‌ను అందుకుంది. సెప్టెంబర్ చివరి నాటికి మరో ఇంజిన్ అందుతుందని HAL పేర్కొంది. 2025 అక్టోబర్‌లో రెండు తేజస్-మార్క్ 1A ఫైటర్ జెట్‌లను భారత వైమానిక దళానికి అప్పగిస్తామని HAL అధికారిక వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబర్‌లో యుద్ధ విమానం (LCA) తేజస్-మార్క్ 1A పరీక్షలు నిర్వహించనున్నట్లు హెచ్ఏఎల్ వర్గాలు పేర్కొన్నాయి. ఆస్ట్రా బియాండ్ విజువల్ రేంజ్ క్షిపణి, ASRAAM షార్ట్ రేంజ్ క్షిపణి, లేజర్ గైడెడ్ బాంబులను తేజస్-మార్క్ 1A ద్వారా ప్రయోగించనున్నారు. గతంలో నిర్వహించిన రెండు పరీక్షలలో ఒక విజయం, ఒక వైఫల్యం నమోదు అయ్యాయి. దీని తర్వాత HAL సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసింది. తాజాగా నిర్వహించే పరీక్షలు విజయవంతం అయిన తర్వాతే విమానాలను భారత వైమానిక దళానికి అప్పగించనున్నారు.
‘‘భారత వృద్ధిని చూసి భయపడుతున్నారు’’..ట్రంప్‌పై ఆర్ఎస్ఎస్ చీఫ్..
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ శుక్రవారం భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలపై స్పందించారు. పరోక్షంగా స్పందిస్తూ.. భారత వృద్ధికి భయపడే వారు అలాంటి చర్యలు తీసుకుంటారని అన్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నిరాశ నుంచి ఈ చర్యలు వచ్చాయని అన్నారు. గత నెలలో ట్రంప్ సర్కార్ భారత్‌పై 50 శాతం సుంకాలను విధించారు. ఇందులో 25 శాతం పరిస్పర సుంకాలు కాగా, రష్యా నుంచి ఆయిల్ కొంటూ ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా రష్యాకు సహకరిస్తున్నారని చెబుతూ మరో 25 శాతం సుంకాలు ప్రకటించారు. ఈ సుంకాలను భారత్ అన్యాయం, అసమంజసమైనవిగా పేర్కొంది.
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కీ..
నేపాల్‌లో అవినీతికి వ్యతిరేకంగా యువతి చేపట్టిన ఆందోళనల తర్వాత ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా చేశారు. ఆయన మంత్రి వర్గంలో చాలా మంది రాజీనామాలు సమర్పించారు. అయితే, నేపాల్‌కు ప్రస్తుతం తాత్కాలిక ప్రధానిగా మాజీ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన సుశీల కర్కీ ప్రమాణస్వీకారం చేయబోతున్నట్లు తెలిసింది. జెన్-జెడ్ యువ ప్రతినిధులు ఈమె పేరును ప్రధానిగా సిఫారసు చేశారు. ఆర్మీ, అధ్యక్షుడితో జరిగిన చర్చల్లో అత్యున్నత పదవి కోసం కర్కీని ఎంచుకున్నారు. జెన్-జెడ్ నిరసనకారులు, అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్, ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగ్డెల్ మధ్య ఏకాభిప్రాయం తర్వాత కర్కీని తాత్కాలిక ప్రధానిగా ఎంచుకోవాలనే నిర్ణయం తీసుకున్నారు. కేర్ టేకర్ ప్రభుత్వానికి చిన్న మంత్రివర్గం ఉంటుందని, మొదటి సమావేశం శుక్రవారం రాత్రి జరుగుతుందని సంబంధిత వర్గాలు చెప్పాయి. ఏడు ప్రాంతీయ పార్లమెంట్‌లతో పాటు ఫెడరల్ పార్లమెంట్‌ను రద్దు చేయాలని మంత్రి వర్గం సిఫారసు చేసే అవకాశం ఉంది.
మూడు రోజుల్లో ముగియనున్న బీఎస్ఎన్ఎల్ సూపర్ ఆఫర్.. ప్లాన్ ఏంటో తెలుసా!
టెలికాం సంస్థలకు ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ సాధ్యమైనంత గట్టి పోటీ ఇస్తుంది. తనకంటూ బలమైన నెట్‌వర్క్‌ను బిల్డ్ చేసుకుంటూ రోజురోజుకు యూజర్ ఫ్రెండ్‌లీ మారుతుంది. ఇటీవల కాలంలో బీఎస్ఎన్ఎల్ కస్టమర్లను ఆకర్షించేందుకు మార్కెట్‌లోకి సూపర్ ప్లాన్‌లను తీసుకువస్తుంది. అలా తీసుకొచ్చిన ఫ్రీడమ్ ఆఫర్ మరో మూడు రోజుల్లో ముగియనుంది. సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. చూసుకోండి మరి.. ఇంతకీ ఈ ప్లాన్ బెనిఫిట్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.. ఈ ప్లాన్ కొత్త సిమ్ తీసుకునేవారికి మాత్రమే అందుబాటులో ఉండనుంది. కేవలం రూ.1 తోనే సిమ్ కొనుగోలు చేసి 30 రోజుల వ్యాలిడిటీ, ప్రతి రోజు 2జీబీ డేటా, అపరిమిత కాల్స్, ఎస్‌ఎంఎస్‌లను పొందవచ్చు. బీఎస్‌ఎన్‌ఎల్ ఈ ప్రత్యేక ఆఫర్‌లో తన వినియోగదారులకు అద్భుతమైన సౌకర్యాలను అందిస్తోంది. ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటా, అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత వాయిస్ కాలింగ్, 100 ఉచిత SMSలను ఇస్తుంది. దీనితో పాటు కస్టమర్లకు ఉచిత బీఎస్‌ఎన్‌ఎల్ ట్యూన్‌లు, రీఛార్జ్ బోనస్, MyBSNL యాప్ లేదా BSNL సెల్ఫ్‌కేర్ పోర్టల్ నుంచి సులభమైన యాక్టివేషన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.
భారత్- పాకిస్థాన్ మ్యాచ్.. యువత రక్తం మరుగుతోంది..?
ఆసియా కప్ 2025లో భాగంగా సెప్టెంబర్ 14న దుబాయ్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఈ మ్యాచ్ రద్దు చేయాలంటూ కొందరు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. దేశంలోని క్రికెట్ అభిమానులు సైతం ఈ మ్యాచ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకులు అమరులయ్యారు. అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. శత్రుదేశం పాక్ కాల్పుల్లో మన దేశానికి చెందని 20 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అమరవీరుల కుటుంబాల కళ్లు చెమ్మ ఆరలేదు. అంతలోనే శత్రువుతో మ్యాచ్ ఆడటం పట్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం కావడం సహజం. గతంలో ఉగ్రవాదం, వాణిజ్యం కలిసి సాగలేవని, రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని ప్రధాన మంత్రి మోడీ చెప్పిన మాటలను నెటిజన్లు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. ఆ మాటలు ఏమయ్యాయని.. రక్తం, క్రికెట్ ఎలా కలిసి సాగగలవని ప్రభుత్వం, బీసీసీఐని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.
పొలిటికల్ ఎంట్రీపై బ్రహ్మానందం సంచలన ప్రకటన..
ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం ME and मैं పేరుతో రాసిన ఆయన ఆత్మకథ పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నేడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ.. నేను ఈ పుస్తకం రాయడానికి ఎంతో మంది స్ఫూర్తిగా ఉన్నారు. ఎందుకు రాశాను అంటే అదో పెద్ద చర్చ. ఎంతో మంది మహానుభావులు చిన్న స్థాయి నుంచి ఎంతో ఎత్తుకు ఎదిగారు. నేను కూడా చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చాను. లెక్చరర్ గా పనిచేశాను. నటనమీద ఆసక్తితోనే సినిమాల్లోకి వచ్చాను. ఇప్పటికీ 1200 సినిమాలు చేశానంటే అది ఆ నటరాజ ఆశీర్వాదంతో పాటు ప్రేక్షకుల ప్రేమనే కారణం. నా జీవితం గురించి మాత్రమే పుస్తకంలో రాశాను. నాకు ఎలాంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేదు. నేను రాజకీయాల్లోకి రాను. సినిమాలకే నా జీవితం అంకితం. నా పదవికి రిటైర్మెంట్ ఇవ్వచ్చేమో గానీ.. నా పెదవికి ఇవ్వలేదు. బురద నుంచి కమలం పుడుతుంది. కష్టపడి పనిచేస్తే విజయం వరిస్తుంది. ఈ విషయంలో వెంకయ్య నాయుడు నాకు ఎంతో స్ఫూర్తిగా ఉంటారు. ఈ మధ్య గ్లోబల్ కమెడియన్ అవార్డ్ ఇచ్చారు. నన్ను కేవలం సినిమాకే పరిమితం కాకుండా మీమ్స్ బాయ్ గా చేశారు. ఏం చేసినా సరే పదిమందిని నవ్వించడమే నా ప్రధాన ఉద్దేశం అంటూ తెలిపారు బ్రహ్మానందం.
మిరాయ్ చూసి.. ఆదిపురుష్ ట్రామా మర్చిపోయిన ప్రభాస్ ఫ్యాన్స్!
తాజాగా విడుదలైన తేజ సజ్జ ‘మిరాయ్’ సినిమా చూసి ప్రభాస్ ఫ్యాన్స్ ఆ ట్రామా మర్చిపోయి ఊపిరి పీల్చుకుంటున్నారు. అదేంటి, తేజ సినిమా చూసి ప్రభాస్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోవడం ఏంటి అని మీకు అనుమానం కలగవచ్చు. అసలు విషయం ఏమిటంటే, తేజ సజ్జ ‘మిరాయ్’ సినిమా కోసం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ అధినేత విశ్వప్రసాద్ స్వయంగా ఒక సీజీ కంపెనీ ప్రారంభించారు. ప్రొడక్షన్ కాస్ట్స్ తగ్గించుకునే పనిలో భాగంగా, ఆయనకు ఉన్న టెక్నికల్ స్కిల్స్ వాడుకొని ఒక సీజీ కంపెనీ సెటప్ చేశారు. ఈ కంపెనీే ‘మిరాయ్’ సినిమాకి సంబంధించిన సీజీ వర్క్స్ మొత్తం చూసుకుంది.