ఎమ్మెల్యేలకు మరోసారి చంద్రబాబు సీరియస్ వార్నింగ్..
అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్-సూపర్ హిట్ సభ వేదికగా ఎమ్మెల్యేలకు మరోసారి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న నేను కామన్ మ్యాన్ గా ఉన్నాను.. ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా అలాగే ఉండాలని స్పష్టం చేశారు.. మనం ప్రజలకు సేవకులం.. పాలకులం కాదన్న ఆయన.. దర్జాలు, ఆర్భాటాలకు దూరంగా ఉండాలని సూచించారు.. ఇష్టమొచ్చినట్లు చేయడం సరికాదు అని హితవుచెప్పారు.. ఒక ఎమ్మెల్యే తప్పు చేసినా, అధికారి తప్పు చేసినా.. అది ప్రభుత్వానికే చెడ్డ పేరు తెస్తుందని హెచ్చరించారు. రాజకీయాల్లో ఉండే మనం చిత్తశుద్ధిగా ఉండి ప్రజలు అభినందించేలా, మనల్ని ఆచరించే విధంగా ఉండాలని అని హితవు చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
రప్పా.. రప్పా.. అని రంకెలేస్తున్నారు.. ఇక్కడున్నది సీబీఎన్, పవన్ కల్యాణ్..
అసెంబ్లీకి రాకుండా ‘రప్పా.. రప్పా..’ అంటూ బయట రంకెలేస్తున్నారు.. మీ బెదిరింపులకు ఎవరూ భయపడరు.. ఇక్కడున్నది సీబీఎన్, పవన్ కల్యాణ్ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు.. అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ – సూపర్ హిట్ సభలో ఆయన మాట్లాడుతూ.. పులివెందుల, ఒంటిమిట్ట జెట్పీటీసీ ఎన్నికల్లో రప్పా రప్పా అని బెండుతీశారని ఎద్దేవా చేశారు.. వైసీపీ నాయకుడిది ధృతరాష్ట్ర కౌగిలి. ఎవరైనా పొరపాటున ఫేక్ మాటలు నమ్మి దగ్గరికి వెళితే ధృతరాష్ట్ర కౌగిలికి బలి అవుతారని హెచ్చరించారు.. ఐదేళ్లు ఆ ధృతరాష్ట్ర కౌగిలిలోనే ఉన్నారు… 2024 ఎన్నికల్లో ప్రజలకు విముక్తి కలిగింది. తెలుగుదేశం ఆవిర్భావంతో సీమ ప్రజల జీవితాల్లో మార్పు మొదలైందన్నారు.. ఇక, సీమ ప్రజల జీవితాలు మార్చేందుకు సాగునీటి ప్రాజెక్టులకు నాడు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారు. హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగ ప్రాజెక్టులు తెలుగుదేశం హయాంలో వచ్చినవే. సీమ పల్లెల్లో ఫ్యాక్షనిజం అంతం చేసినా… నీళ్లు తెచ్చినా ఆ ఘనత మనదే అన్నారు..
నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారు.. రంగంలోకి మంత్రి లోకేష్..
నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి రంగంలోకి దిగారు మంత్రి నారా లోకేష్.. అనంతపురంలో సూపర్ సిక్స్ – సూపర్ హిట్ సభకు కూడా వెళ్లకుండా.. నేపాల్ నుంచి ఏపీవారిని సురక్షితంగా రాష్ట్రానికి రప్పించడానికి అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తున్నారు మంత్రి నారా లోకేష్.. కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీలోని ఏపీ భవన్, రాష్ట్రానికి చెందిన వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.. ఈ సమీక్షలో హోంమంత్రి అనిత, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.. నేపాల్ రాజధాని ఖాట్మండు విమానాశ్రయానికి సమీపంలోనే 165 మంది తెలుగువారు ఉన్నారని తెలిపారు అధికారులు. సిమిల్ కోట్ సమీపంలో మరో 12 మంది తలదాచుకున్నారని లోకేష్‌కి వివరించారు అధికారులు. పరిస్థితులు అనుకూలించిన వెంటనే ప్రత్యేక విమానం ద్వారా వీరందరినీ దేశానికి తీసుకురావడంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు మంత్రి లోకేష్. ఇందుకు కావాల్సిన అనుమతులను వివరించిన అధికారులు, కేంద్రంతో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు చేపట్టాలని లోకేష్ ఆదేశించారు.. బాధితులతో ప్రతి రెండు గంటలకోసారి ఫోన్ లో మాట్లాడుతూ వారిలో ధైర్యం నింపుతున్నారు లోకేష్.. ఆహారం, నీరు, ఇతర సౌకర్యాలు అందుతున్నాయా అని బాధితులను వాకబు చేసిన ఆయన.. సురక్షితంగానే ఉన్నామని, అక్కడ ఉన్న పరిస్థితులను లోకేష్ కు వివరించారు నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారు. ఏ సాయం కావాలన్నా ఫోన్ ద్వారా సంప్రదించాలని తెలుగువారికి సూచించారు.. రాష్ట్రానికి సురక్షితంగా తీసుకురావడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని బాధితులకు భరోసా ఇస్తున్నారు మంత్రి నారా లోకేష్..
ఉండవల్లికి సోమీ వీర్రాజు సవాల్.. బహిరంగ చర్చకు సిద్ధమా..?
ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి ఓటు వేయాలంటూ తెలుగు రాష్ట్రాల ఎంపీలకు పిలుపునిచ్చిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.. ఇదే సమయంలో ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేయొద్దని సూచించారు.. ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేస్తే.. ఆర్ఎస్ఎస్ భావజాలాన్నీ అంగీకరించినట్టే.. అది చాలా ప్రమాదమని హెచ్చరించారు.. ఇక, ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి విషయం సాధించిన విషయం విదితమే కాగా.. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌పై ఫైర్ అయ్యారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఉండవల్లితో బహిరంగ చర్చకు సిద్ధం అంటూ సవాల్ చేశారు.. ఆర్ఎస్ఎస్ పై ఉండవల్లి నోటికొచ్చినట్లు మాట్లాడటం తగదు అని సూచించారు.. రాజమండ్రి సుబ్రహ్మణ్యం మైదానంలో ఉండవల్లితో ఎప్పుడైనా బహిరంగ చేర్చుకు నేను సిద్ధంగా ఉన్నాను అన్నారు.. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ గెలుపులో క్రాస్ ఓటింగ్ కూడా జరిగింది అని గుర్తుచేశారు.. దేశభక్తుడైన రాధాకృష్ణన్ కు ఓటు వేయొద్దని ఉండవల్లి అన్నారు.. సామాన్యులను చంపుతున్న నక్సలైట్లకు మద్దతు ఇచ్చిన వారికి ఓటు వేయమని సెలవిచ్చారు అని దుయ్యబట్టారు.. ఆర్ఎస్ఎస్ ఒక ఫాసిస్టు సంస్థని ఉండవల్లి అన్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మాకు ఓట్లేసినందుకు వైఎస్ జగన్ ని షర్మిల విమర్శిస్తుంది.. ఆమెకి ఆస్తిలో వాటా ఇస్తే జగన్ వెనకాలే షర్మిల ఉండేది అని సెటైర్లు వేశారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు..
బోధన్‌లో ఉగ్రలింకుల కలకలం..
బోధన్‌లో ఉగ్రలింకుల కలకలం సృష్టించింది.. అదుపులో అనీసనగర్ వాసి మహమ్మద్ ఉజైఫా యామన్ ఢల్లీ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఐసీస్‌తో సంబంధం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడి నుంచి తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. ఉగ్ర మూలాలు సంబంధాలపై విచారణ చేపడుతున్నారు. పోలీసులు నిందితున్ని బోధన్ కోర్టులో హాజరు పరిచారు. అనంతరం కస్టడీకి తీసుకున్నారు. మహమ్మద్ ఉజైఫా యామన్ బీ ఫార్మసీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో ఇటీవల అరెస్ట్ చేసిన ఉగ్రవాది డానిష్ ఇచ్చిన సమాచారం మేరకు యామన్‌ను అదుపులో తీసుకున్నారు.
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా “సుశీలా కర్కీ”.. ఎవరు ఈమె..?
సోషల్ మీడియా బ్యాన్‌కు వ్యతిరేకంగా జెన్-జెడ్ యువతి చేసిన నిరసనలు నేపాల్‌లో హోరెత్తాయి. సోమవారం జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న వారిపైకి భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో 19 మంది మరణించారు. దీంతో, ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ప్రధాని కేపీ శర్మ ఓలీతో పాటు ఆయన ప్రభుత్వంలో మంత్రులు ఒక్కొక్కరిగా రాజీనామా చేశారు. ప్రస్తుతం, దేశాన్ని ఆర్మీ తన కంట్రోల్‌కి తీసుకుంది. ఇదిలా ఉంటే, నేపాల్‌కు కాబోయే తదుపరి ప్రధానమంత్రిపై చర్చించడానికి 5000 మందికి పైగా యువకులు వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. నేపాల్ మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కీ వైపే యువత ఎంపికగా నిలిచారు. మొదట ఖాట్మాండు మేయర్ బాలెన్ షా వైపు యువత ఆసక్తి చూపించినప్పటికీ, ఆయనను సంప్రదించడానికి పదేపదే చేసిన ప్రయత్నాలకు ఆయన స్పందించలేదని నిరసనకు నేతృత్వం వహించిన ప్రతినిధులు మీడియాకు చెప్పారు.
సిగ్గుచేటు.. సూర్యకుమార్ యాదవ్‌పై ఇండియన్ ఫాన్స్ ఫైర్!
ఆసియా కప్ 2025లో భారత్ తన ప్రయాణంను నేడు మొదలెట్టనుంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య యూఏఈని టీమిండియా ఢీకొట్టనుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్.. ఈసారీ హాట్ ఫేవరెట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. టోర్నీలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నా.. భారత్ మాదిరి పటిష్టంగా లేవు. నేడు యూఏఈపై భారత్ భారీ విజయం సాదిస్తుందని అందరూ భావిస్తున్నారు. అయితే టోర్నీ ఆరంభానికి ముందే టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చిక్కుల్లో పడ్డాడు. ఆసియా కప్ 2025 ఆరంభం సందర్భంగా మంగళవారం 8 జట్ల కెప్టెన్లతో ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. ప్రెస్ కాన్ఫరెన్స్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన ఇండియన్ ఫాన్స్ సూర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఆపరేషన్ సిందూర్ తర్వాత భారతదేశానికి వార్నింగ్ ఇచ్చిన పాకిస్తాన్ అంతర్గత మంత్రి మొహ్సిన్ నఖ్వీతో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కరచాలనం చేశాడు. ఈ వ్యక్తులు తమ ముఖాలను అద్దంలో ఎలా చేసుకుంటారో అర్ధం కావడం లేదు. వాళ్లు మన అమాయక ప్రజలను చంపుతారు. ఇక్కడ మన కెప్టెన్ వారితో కరచాలనం చేశాడు. ఇది సిగ్గుచేటు’ అని ఓ నెటిజన్ మండిపడ్డాడు.
షూటింగ్ లో తేజసజ్జాకు గాయాలు.. బయటపెట్టిన హీరోయిన్
తేజసజ్జా హీరోగా వస్తున్న మూవీ మిరాయ్. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. సెప్టెంబర్ 12న మూవీ రిలీజ్ అవుతోంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె కొన్ని విషయాలను బయట పెట్టింది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. తేజకు అయితే షూటింగ్ లో గాయాలయ్యాయి. అయినా సరే ఆయన రెస్ట్ తీసుకోకుండా షూటింగ్ కు వచ్చాడు. చాలా సార్లు వెదర్ తట్టుకోలేక అతనికి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అయినా సరే అతను టైమ్ కు లొకేషన్ లో ఉండేవాడు. మేం ఈ మూవీ షూటింగ్ ను చాలా ఏరియాల్లో తిరుగుతూ షూట్ చేశాం. 80 శాతం షూటింగ్ డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్లలో చేశాం. నేచురల్ గా ఉండాలనే ఉద్దేశంతోనే అలాంటి చోట్ల షూట్ చేశాం. అది మీకకు థియేటర్లలో కనిపిస్తుంది. మిగతా సినిమాలకు ఈ సినిమాకు చాలా తేడా ఉంది. తేజ నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలి. అతని డెడికేషన్ చూస్తే చాలా ముచ్చటేస్తుంది. అందుకే ఆయన ఈ స్థాయిలో ఉన్నారేమో అనిపిస్తుంది. ఇప్పటికీ తేజ చాలా కష్టపడుతూనే ఉన్నాడు అంటూ తెలిపింది రితిక.
తమిళ తంబీల జేబులే టార్గెట్ !
2025 సంక్రాంతి కోలీవుడ్‌లో థియేటర్లలో పెద్ద సినిమాలేమీ రాలేదు. శంకర్- రామ్ చరణ్ కాంబోలో వచ్చిన గేమ్ ఛేంజరే ఒక్కటే చెప్పుకోదగ్గ ఫిల్మ్. దీనికి రీజన్ అజిత్. విదాముయర్చిని జనవరి 10న ఎనౌన్స్ చేయగా.. కొన్ని ఆటైంకి తీసుకురావాలనుకున్న చిత్రాలు ఫిబ్రవరికి వాయిదా వేసుకున్నాయి. కానీ కాపీ రైట్స్ ఇష్యూ వల్ల విదాముయర్చి చివరి నిమిషంలో తప్పుకుంది. దీంతో సంక్రాంతికి సందడి మిస్సైంది. అజిత్ ఇలా రేసు నుండి క్విట్ అయ్యాడో లేదో.. సడెన్లీ వచ్చేశాడు విశాల్. బాలా వనంగాన్, మదగరాజా, జయం రవి కాదలక్కే నేరమిల్లే సినిమాల్లో విశాల్ ఫిల్మ్స్ మాత్రమే మెప్పించగలిగింది. ఈ సంక్రాంతికి ఫీస్ట్ మిస్సైన తమిళ తంబీలకు నెక్ట్స్ పొంగల్ డల్‌గా ఉండదని ప్రామిస్ చేస్తోంది కోలీవుడ్.భారీ ఫీస్ట్ రెడీ చేస్తోంది. ఇప్పటికే విజయ్ దళపతి జననాయగన్ జనవరి9న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. విజయ్ లాస్ట్ మూవీ అంటూ ఊదరగొట్టడంతో సింపథీ గట్టిగానే వర్కౌటై… అడ్వాన్స్ బుకింగ్ రూపంలో టికెట్లు బాగానే తెగెట్టుగానే కనిపిస్తున్నాయి. సంక్రాంతి ముగిసే వరకు థియేరట్లను తనే రూల్ చేద్దామని అనుకుంటే.. ఇద్దరు హీరోలు బ్రేకులేసేట్లుగానే ఉన్నారు.
