అర్ధరాత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ.. ఈ అంశాలపై చర్చ
హస్తిన పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. బుధవారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిశారు.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.. రాత్రి 10.45 గంటల సమయంలో అమిత్‌షాతో సమావేశం అయ్యారు సీఎం జగన్.. దాదాపు 40 నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చించారు.. రాష్ట్రంలోని సమస్యలు, రాష్ట్రవిభజన సందర్భంగా ఇచ్చిన హామీల అమలుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ముందస్తుగా పదివేల కోట్లు మంజూరు చేయాలని అమిత్‌షాను కోరినట్టుగా పేర్కొన్నారు.. మొత్తంగా ఈ నెలలోనే సీఎం ఢిల్లీ వెళ్లడం ఇది రెండోసారి కావడంతో ఈ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.. రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ తీవ్రంగానష్టపోయింది. అశాస్త్రీయ విభజన కారణంగా ఆర్థికంగా, ఆదాయాలపరంగా, అభివృద్ధి పరంగా, వివిధ సంస్థల రూపేణా తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ నష్టాలనుంచి కాపాడేందుకు, రక్షణగా విభజన చట్టంలో కేంద్రం ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది. పార్లమెంటు సాక్షిగా కూడా ఈ హామీలు ఇచ్చింది. విభజన జరిగి 9 సంవత్సరాలు కావొస్తున్నా రాష్ట్రానికి నెరవేర్చాల్సిన అనేక అంశాలు ఇంకా పెండింగులోనే ఉన్నాయి. వీటిపై వెంటనే దృష్టిసారించమని కోరుతున్నాను. పోలవరం ప్రాజెక్టును మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అడహాక్‌గా రూ.10 వేల కోట్లు మంజూరుచేయాలని కోరుతున్నాను అంటూ పలు కీలక అంశాలను షా దృష్టికి తీసుకెళ్లారు సీఎం జగన్.
బొలెరోను ఢీకొట్టిన దురంతో ఎక్స్‌ప్రెస్.. భీమడోలులో నిలిచిపోయిన రైలు
దురంతో ఎక్స్‌ప్రెస్‌కు భారీ ప్రమాదం తప్పింది.. ఏలూరు జిల్లా భీమడోలు రైల్వే గేటు వద్ద బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది దురంతో ఎక్స్‌ప్రెస్.. అయితే, ప్రమదానాకి కారణమైన వాహనంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న దురంతో ఎక్స్ ప్రెస్.. భీమడోలు రైల్వే గేటు వద్దకు చేరుకుంటుంది.. అయితే, రైలు వస్తున్న సమయంలో గేటును ఢీకొని పట్టాలపైకి వచ్చి ఆగిపోయింది బొలెరో వాహనం.. దీంతో.. దురంతో ఎక్స్‌ప్రెస్ వచ్చి ఆ వాహనాన్ని ఢీకొట్టింది.. ఇక, బొలెరో వాహనంలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది.. కాగా, రైలు పట్టాలపై వాహనం నిలిచిపోవడంతో.. ఆ వాహనాన్ని వదిలిపెట్టి డ్రైవర్ పరారయ్యాడు.. అయితే, ఆ వాహనాన్ని ఢీకొన్ని రైలు మాత్రం అక్కడే నిలిచిపోయింది. ఈ రోజు తెల్లవారుజామున ప్రమాదం జరగగా.. దాదాపు నాలుగు గంటలుగా భీమడోలులోనే నిలిచిపోయింది దురంతో ఎక్స్‌ప్రెస్. ఈ ప్రమాదంలో బొలెరో వాహనం నుజ్జునుజ్జు అయ్యింది.. రైలు ముందు భాగంలో ఆ వాహనం విడి భాగాలు ఇరుక్కుపోవడంతో.. రైలు నిలిచిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్‌లో రామనవమి శోభ యాత్ర.. ఆ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత
హైదరాబాద్ లో శ్రీ రామ నవమి ఘనంగా జరుగుతున్నాయి. రామ నవమి శోభ యాత్ర సజావుగా సాగేందుకు హైదరాబాద్ పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం దాదాపు 1,500 మంది పోలీసులను శోభాయాత్రను పర్యవేక్షించేందుకు నియమించారు. రామ నవమి శోభ యాత్ర ఊరేగింపు గురువారం ఉదయం 9 గంటలకు సీతారాంబాగ్ ఆలయం నుండి ప్రారంభమై, రాత్రి 7 గంటలకు కోటిలోని హనుమాన్ వ్యామశాల మైదానంలో ముగుస్తుంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సహా సీనియర్ పోలీసు అధికారులు ఊరేగింపును పర్యవేక్షిస్తారు. సున్నితమైన ప్రదేశాలలో, పోలీసు పికెట్లను ఏర్పాటు చేస్తారు. ఊరేగింపు ప్రశాంతంగా జరిగేలా చూసేందుకు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిఘా, డ్రోన్ కెమెరాల సహాయంతో ఊరేగింపును పర్యవేక్షిస్తుంది. అదనంగా, IT సెల్ యొక్క సోషల్ మీడియా బృందం, స్మాష్ బృందం శాంతియుత వాతావరణానికి భంగం కలగకుండా చూసేందుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై నిఘా ఉంచుతుంది. ఇదిలా ఉండగా, ఊరేగింపుకు ముందు, సిద్దిఅంబర్ బజార్ మసీదు మరియు దర్గాను గుడ్డతో కప్పారు. నవమి శోభయాత్ర సందర్భంగా పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఊరేగింపు మార్గంలో ట్రాఫిక్ మళ్లించారు. వాహనదారులు, ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. గోషామహల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లేపల్లి జంక్షన్, బోయిగూడ కమాన్, అఘపురా జంక్షన్, గోడే-కి-ఖబర్, పురానాపూల్ ఎక్స్ రోడ్, MJ బ్రిడ్జి, లేబర్ అడ్డా, అలాస్కా T జంక్షన్, SA బజార్ యు టర్న్, MJ మార్కెట్ లో ట్రాఫిక్ ను మళ్లించారు. కాగా, సుల్తాన్‌బజార్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అఫ్జల్‌గంజ్ టి జంక్షన్, రంగమహల్ జంక్షన్, పుత్లిబౌలి ఎక్స్ రోడ్, ఆంధ్రా బ్యాంక్ ఎక్స్ రోడ్, డిఎమ్ & హెచ్‌ఎస్ ఎక్స్ రోడ్, సుల్తాన్ బజార్ ఎక్స్ రోడ్, చాదర్‌ఘర్ ఎక్స్ రోడ్, కాచిగూడ ఐనాక్స్, జిపిఓ అబిడ్స్, యూసుఫియాన్ & కంపెనీ ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఐపీఎల్ కు రంగం సిద్ధం.. రేపే తొలి పోరు
కరోనా నేపథ్యంలో గత మూడు సీజన్ లు పలు ఆంక్షల మధ్య జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( ఐపీఎల్ ) టీ20 క్రికెట్ టోర్నీక మళ్లీ పూర్వ వైభవం వచ్చింది. ఈ సంవత్సరం ఎలాంటి ఆంక్షలు లేకుండా అభిమానులకు పూర్తి స్థాయిలో వేసవిలో పరుగుల విందు అందించడానికి ఐపీఎల్ జట్లు సిద్దమయ్యాయి. రేపు ( శుక్రవారం ) అహ్మదాబాద్ లో ఢిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, నాలుగు సార్లు టైటిల్ విన్నర్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ తో ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం కాబోతుంది. ఈ ఐపీఎల్ టోర్నీ మొత్తం 10 జట్ల మధ్య 12 నగరాల్లో 74 మ్యాచ్ లు రెండు నెలల పాటు జరుగనున్నాయి. లీగ్ దశలో 70 మ్యాచ్ లు ఉండగా.. ప్లే ఆఫ్ దశలో నాలుగు మ్యాచ్ లతో ( క్వాలిఫయర్-1, ఎలిమినేటర్, క్వాలిఫయర్-2, ఫైనల్ ) టోర్నీ ముగుస్తుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు జైపూర్ తో పాటు గువాహటిలో.. పంజాబ్ కింగ్స్ జట్టు మొహాలితో పాటు ధర్మశాలలో కూడా మ్యాచ్ లు జరగనున్నాయి. కరోనా కంటే ముందు ఐపీఉఎల్ లో ఇంటా, బయటా పద్దతిలో ఆయా ఫ్రాంఛైజీల మధ్య మ్యాచ్ లు జరిగేవి.. కరోణా కరణంగా ఈ పద్దతికి విరామం ఇచ్చారు.. ఇప్పుడు అంతా బాగుండటంతో నిర్వహకులు మళ్లీ పాత పద్దతిలో ఐపీఎల్ నిర్వహించనున్నారు.
ప్రపంచ బ్యాంకు చీఫ్‌గా భారత సంతతికి చెందిన అజయ్ బంగా ఎన్నిక!
కొన్నేళ్లగా భారతీయులు ప్రతి రంగంలోనూ తమ సత్తాను చాటుతున్నారు. ప్రపంచదేశాల్లో నాయకులుగా, సారథులుగా ఎదుగుతున్నారు. భారత సంతతికే చెందిన సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఉన్నారు. సుందర్ పిచాయ్.. గూగుల్, దాని మాతృసంస్థ అల్పాబెట్ సీఈఓగా ఉన్నారు. ఇటీవల యూట్యూబ్ సీఈఓగా భారతీయుడు నీల్ మోహన్ పగ్గాలు చేపట్టారు. ఇంకా పెద్ద లిస్టే ఉంది. తాజాగా మరో భారత సంతతి వ్యక్తి అజయ్ బంగా ఏకంగా వరల్డ్ బ్యాంక్ అత్యున్నత పదవిని చేపట్టనున్నారు. ప్రపంచ బ్యాంక్‌కు నాయకత్వం వహించే అవకాశాన్ని అజయ్ బంగా దక్కించుకున్నారు. ఏ దేశమూ ప్రత్యామ్నాయ అభ్యర్థిని బహిరంగంగా ప్రతిపాదించక పోవడంతో బుధవారం నామినేషన్లు ముగిసిన తర్వాత తదుపరి అధ్యక్షుడిగా అజయ్ బంగా దాదాపుగా ఖరారయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ దాదాపు ఒక సంవత్సరం ముందుగానే పదవీ విరమణ చేయబోతున్నట్లు ప్రకటించిన తర్వాత మాజీ మాస్టర్ కార్డ్ ఇంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ను గత నెలలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అజయ్ బంగా పేరును ప్రతిపాదించారు. 2019లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేసిన డేవిడ్ మాల్పాస్ ఏకపక్షంగా అగ్రస్థానంలో నిలిచారు. ఇదిలా ఉంటే వరల్డ్ బ్యాంకు చీఫ్‌గా అమెరికా ప్రతిపాదించిన వారికే అవకాశం రావడం సహజమే. యూఎస్‌తో పాటు ఏ దేశాలు అభ్యర్థులను ప్రకటించనప్పటికీ, ప్రపంచ బ్యాంక్ నియమాలు సభ్య దేశాలు బుధవారం మధ్యాహ్నం మూసివేసిన విండోలో నామినేషన్లు వేయడానికి అనుమతిస్తాయి.
పోప్ ఫ్రాన్సిస్‌కు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స
పోప్ ఫ్రాన్సిస్ అస్వస్థతతో బుధవారం ఆస్పత్రిలో చేరారు. పోప్ ఫ్రాన్సిస్ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ బాధపడుతూ రోమ్‌లోని చికిత్స పొందుతున్నారని సమాచారం. శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న పోప్ ఫ్రాన్సిస్ (86) బుధవారం రోమ్‌లోని జెమెల్లీ ఆసుపత్రిలో చేరారు. దీనికి కొన్ని రోజులు ఉండవలసి ఉంటుందని వాటికన్ తెలిపింది. ఇటీవలి రోజుల్లో పోప్ ఫ్రాన్సిస్ శ్వాస తీసుకోవడంలో కొన్ని ఇబ్బందుల గురించి ఫిర్యాదు చేశారని వాటికన్ ప్రతినిధి మాటియో బ్రూనీ ఒక ప్రకటనలో తెలిపారు. మరికొన్ని రోజులు ఆయన ఆస్పత్రిలోనే ఉంటారని తెలుస్తోంది. అయితే శ్వాస కోశ సంబంధిత సమస్యలే అయినప్పటికీ.. ఆయనకు కొవిడ్ సోకలేదని బ్రూనీ చెప్పారు. ఆయన అనారోగ్యంపై వార్తలు బయటకు రాగానే.. త్వరగా కోలుకోవాలంటూ పలువురు సందేశాలు పంపుతున్నారు. గత కొంతకాలంగా ఆయన పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఏడాదికాలంగా పలు ముఖ్యకార్యక్రమాలకు ఆయన గైర్హాజరు అవుతున్నారు. ఈ నెలలో కాథలిక్ చర్చికి అధిపతిగా 10 సంవత్సరాలు నిండిన పోప్, అంతకుముందు వాటికన్‌లో తన వారపు ప్రేక్షకుల వద్ద మంచి ఉత్సాహంతో కనిపించారు. ఆయన తన “పోప్‌మొబైల్” నుంచి విశ్వాసులను పలకరిస్తూ నవ్వుతూ కనిపించాడు. గురువారం ఉదయం పోప్ అపాయింట్‌మెంట్‌లను రద్దు చేసినట్లు వాటికన్ పేర్కొంది. ఆయన ఇటీవల దీర్ఘకాలిక మోకాలి నొప్పితో బాధపడుతున్నారు. దీనివల్ల ఇటీవలి నెలల్లో వీల్ చైర్‌పై ఆధారపడవలసి వచ్చింది. దీంతో పాటు జెమెల్లి ఆసుపత్రిలోనే జూలై 2021లో ఒక రకమైన డైవర్టికులిటిస్‌తో బాధపడుతూ తన పెద్దప్రేగు ఆపరేషన్ చేయించుకున్నారు. పోప్ ఫ్రాన్సిస్ తన మోకాలి నొప్పి కారణంగా గత సంవత్సరం అనేక సార్లు కార్యకలాపాలను రద్దు చేయవలసి వచ్చింది. పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ విస్తృతంగా ప్రయాణం చేస్తూనే ఉన్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో దక్షిణ సూడాన్, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సందర్శనలో భారీ జనాలు ఆయనకు స్వాగతం పలికారు. వచ్చే నెల, పోప్ ఫ్రాన్సిస్ హంగేరీని సందర్శించి ప్రధాన మంత్రి విక్టర్ ఓర్బన్‌ను కలవనున్నారు.
అందుకే కార్లు అమ్మేసిన విరాట్..
మరో 24 గంటల్లో ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అందరు ఎదురు చూస్తున్నారు. అయితే ఆదివారం ( ఏప్రిల్ 2) న రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ తో తొలి మ్యాచ్ ఆడనుంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి విరాట్ కోహ్లీపైనే ఉంటుంది. అయితే ఇప్పటి వరకు IPL గెలవని నాలుగు జట్లలో RCB ఒకటి. ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ కోహ్లీ బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ జట్టుకు టైటిల్ అందించలేకపోయాడు. అయినప్పటికీ, ఫ్రాంచైజీ లీగ్‌లకు నాయకత్వం వహించడం నుంచి, RCB అభిమానులు విరాట్ నుంచి బ్యాటింగ్ ను అస్వాదిస్తారు. రెండు నెలల సుదీర్ఘ టోర్నమెంట్‌కు ముందు, కోహ్లీ సరదాగా పరస్పరం మాట్లాడాడు, దాని వీడియో RCB యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో అప్‌లోడ్ చేసింది. మీరు ఉపయోగించని హఠాత్తుగా కొనుగోళ్లు ఏమైనా ఉన్నాయా?” RCB బోల్డ్ డైరీస్‌లో ప్రెజెంటర్ అడిగాడు. దానికి విరాట్ కోహ్లీ తాన దగ్గర చాలా కార్లు ఉన్నాయి.. అవన్నీ హఠాత్తుగా కొనుగోలు చేసినవి. నేను వాటిని నడపడం లేదు వాటిలో ప్రయాణించడం చాలా కష్టంగా ఉంది అని తెలిపాడు. వాటిలో చాలా వరకు అమ్మివేస్తున్నాను.. ఇప్పుడు మనం పూర్తిగా వాడేవాటిని ఉపయోగిస్తాము. అవసరం లేని వాటిని అమ్మకానికి పెట్టాను అని విరాట్ వెల్లడించాడు. మీకు బొమ్మలు లేదా అలాంటి వస్తువులను సొంతం చేసుకోవాలని అనిపించడం లేదా అనే ప్రశ్నకు.. మాకు ఇది ఆచరణాత్మకంగా ఉండటం వల్ల ఉపయోగం ఏమిటి” అని విరాట్ కోహ్లి బదులిచ్చారు.