NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

సినిమా ఛాన్స్‌ అంటూ ఎర.. ఆడిషన్స్‌ అంటూ లాడ్జికి పిలిచి…
సోషల్‌ మీడియాలో కుప్పకుప్పలుగా కేటుగాళ్లు ఉన్నారు.. కొందరి బలహీనతనే పెట్టుబడిగా మార్చుకుని.. మోసాలకు పాల్పడుతున్నారు.. మరి కొందరు ఎర వేసి.. అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.. తాజాగా విజయవాడలో సినిమా పేరుతో ఓ యువతికి సోషల్‌ మీడియా వేదికగా ఆశపెట్టిన ఓ యువకుడు.. ఆ తర్వాత తన అసలు రూపాన్ని బయటపెట్టాడు.. సినిమా ఆడిషన్స్‌ అంటూ పిలిచాడు.. ఓ లాడ్జిలోకి తీసుకెళ్లి యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.. బాధితురాలు, ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది..విజయవాడలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సినిమా ఆడిషన్స్ పేరుతో మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.. సినిమా ఛాన్స్ ఇప్పిస్తానంటూ యువతికి ఇన్ స్టాలో పరిచయం చేసుకున్నాడు విజయవాడకు చెందిన సాయితేజ.. బీసెంట్ రోడ్ లోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్న సాయి తేజ.. విజయవాడకు చెందిన యువతికి సినిమాలో అవకాశం అంటూ ఎర వేశాడు.. ఇక, సినిమా ఆడిషన్స్ జరుగుతున్నాయని నమ్మబలికాడు.. తన ప్లాన్‌ ప్రకారం.. యువతిని లాడ్జికి రప్పించాడు.. లాడ్జిలో ఆ యువతిపై అత్యాచారయత్నం చేశాడు.. అయితే, సాయితేజ నుంచి తప్పించుకున్న బాధితురాలు.. ఇంటికి వెళ్లి.. జరిగిన ఘటనకు తన తల్లికి చెప్పి గోడున విలపించింది.. ఆ తర్వాత బాధితురాలు, ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.. బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన గవర్నర్ పేట పోలీసులు.. నిందితుడు సాయిని అరెస్ట్‌ చేశారు. సోషల్‌ మీడియాలో ఎవ్వరినీ పడితేవారిని నమ్మి.. మోసపోవద్దు అని సూచిస్తున్నారు పోలీసులు.

నేడు లీలా పవిత్ర అంత్యక్రియలు.. వెలుగులోకి షాకింగ్‌ విషయాలు..
మంగళవారం బెంగళూరులో లీలా పవిత్రను కిరాతకంగా కత్తితో పొడిచి ఉన్మాది దినకర్ హత్య చేయడం కలకలం రేపింది.. అయితే.. ఇవాళ బెంగళూరులోనే లీలా పవిత్ర మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు కుటుంబ సభ్యులు.. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జగన్నాథపురంలో నివాసం ఉంటున్నారు లీలా పవిత్ర తల్లిదండ్రులు.. ఇప్పటికే కుమార్తె మృతదేహాన్ని తల్లిదండ్రులుగా అప్పగించారు బెంగళూరు పోలీసులు.. తల్లిదండ్రులకు లీలా పవిత్ర (28) ఏకైక కుమార్తె కావడంతో.. వారిని అదుపుచేయడం ఎవరి తరం కావడంలేదు.. కాగా, పెళ్లికి అంగీకరించడం లేదని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రియుడు దినకర్ (29) అత్యంత దారుణంగా లీలా పవిత్రను హత్య చేసిన విషయం విదితమే.. లీలా పవిత్ర అలియాస్ లీలా ఎమ్మెస్సీ పూర్తి చేసింది. బెంగళూరు మురగేశ్ పాళ్యలోని ఓమెగా మెడిసిన్ కంపెనీలో ల్యాబ్ లో ఉద్యోగం చేస్తున్నది. మంచి ఉద్యోగం చేస్తున్న లీలా పవిత్రా నిత్యం ఆమె కుటుంబ సభ్యులతో టచ్ లో ఉండేది. ఇక, శ్రీకాకుళానికి దినకర్ కూడా బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు.. ఐదు సంవత్సరాల నుంచి లీలా పవిత్రా, దినకర్ ప్రేమించుకుంటున్నారు. కొన్ని నెలల క్రితం దినకర్, లీలా పవిత్రా వారి ప్రేమ విషయం వాళ్లవాళ్ల కుటుంబ సభ్యులకు చెప్పారు.వారి కులాలు వేరు కావడంతో వారు పెళ్లి చేసుకోవడానికి వీలులేదని లీలా పవిత్రా కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. అయితే పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ప్రేమికులు దినకర్, లీలా పవిత్రా అనేక ప్రయత్నాలు చేశారని తెలిసింది. దినకర్ తో పెళ్లికి తాము అంగీకరించమని లీలా పవిత్రా కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారని తెలిసింది. దినకర్ తో ఇక ముందు నువ్వు మాట్లాడకూడదని లీలా పవిత్రాకు ఆమె కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. కుటుంబ సభ్యుల ఒత్తిడితో కొంతకాలం నుంచి లీలా పవిత్రా ఆమె ప్రియుడు దినకర్ ను దూరం పెట్టి అతన్ని కలవడం మానేసింది. ప్రియురాలికి దగ్గర కావాలని దినకర్ చాలా ప్రయత్నాలు చేసాడు కానీ, లీలా పవిత్ర మాత్రం మాజీ ప్రియుడు దినకర్ ను కలవకూడదని డిసైడ్ అయ్యింది. ఇక మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో దినకర్ అతని ప్రియురాలు లీలా పవిత్రా ఉద్యోగం చేస్తున్న మురగేశ్ పాళ్యలోని కంపెనీ దగ్గరకు వెళ్లాడు. రాత్రి పని ముగించుకుని లీలా పవిత్రా కంపెనీలో నుంచి బయటకు వచ్చింది. నీతో మాట్లాడాలని దినకర్ చెప్పడంతో లీలా పవిత్రా కొంచెం పక్కకు వచ్చింది. తనను ఎందుకు దూరం పెడుతున్నావని అడుగుతూ దినకర్ తన జేబులో ఉన్న కత్తి తీసుకొని మొదట లీలా పవిత్రా కడుపులో పదేపదే పొడిచాడు. లీలా పవిత్రా కేకలు వెయ్యడంతో ఇంకా రగిలిపోయిన దినకర్ ఆమె ఛాతీ ముఖం, గొంతు తదితర చోట్ల ఇష్టం వచ్చిన 16 సార్లు పొడిచేశాడు. తీవ్రగాయాలైన లీలా పవిత్రా అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ఘటన కలకలం సృష్టించింది.

త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
మూడు ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో ఓట్ల లెక్కింపు ఈరోజు ప్రారంభమైంది. త్రిపురకు ఫిబ్రవరి 16న, మేఘాలయ, నాగాలాండ్‌లకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరిగాయి. ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒక్కొక్కటి 60 సీట్లు ఉన్నాయి. తొలిదశలో నాగాలాండ్‌లో బీజేపీ-ఎన్‌డీపీపీ కూటమి మెజారిటీ సాధించింది. త్రిపురలో బీజేపీ 28 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, మేఘాలయలో ఎన్‌పీపీ 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఈ ఎన్నికల్లో త్రిపుర, నాగాలాండ్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవడం బీజేపీకి సవాలుగా మారింది. నాగాలాండ్‌లో ఎన్‌డిపిపితో పొత్తు ఉంది. మేఘాలయలో ఎన్‌పీపీ, బీజేపీ, కాంగ్రెస్‌లతోపాటు కాన్రాడ్ సంగ్మా పార్టీ పోటీలో ఉంది. ఎంత ఓటింగ్ జరిగింది? మేఘాలయలో 74.3 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. నాగాలాండ్‌లో 83 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా, త్రిపురలో దాదాపు 88 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగాలాండ్ శాసనసభ పదవీ కాలం మార్చి 12తో ముగియనుంది. కాగా, మేఘాలయలో శాసనసభ పదవీకాలం మార్చి 15న, త్రిపురలో మార్చి 22న ముగుస్తుంది. ఇక్కడ, పోస్ట్ పోల్ ఎగ్జిట్ పోల్స్ త్రిపుర-నాగాలాండ్‌లో బిజెపి కూటమికి మెజారిటీని అంచనా వేసింది. మేఘాలయలో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం లేదు. అంటే హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉంది.

కుక్కపై అత్యాచారం చేసిన వ్యక్తి అరెస్ట్.. విచారణలో షాకింగ్ విషయాలు
పశ్చిమ ఢిల్లీలోని హరి నగర్ ప్రాంతంలోని ఓ పార్కులో ఆడ కుక్కపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యక్తి ఆ ప్రాంతంలో నివాసముంటున్నాడని, అతనికి వివాహమై పిల్లలు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. భారతీయ శిక్షాస్మృతి, జంతు హింస చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద గత వారం ఫిర్యాదు అందడంతో ఆదివారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ఈ దారుణానికి పాల్పడుతుండగా, అతడిని ఎవరో వీడియో తీశారని పోలీసులు తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులకు చేరింది. ఈ వీడియో ఆధారంగా నిందితుడి కోసం గాలింపు ప్రారంభించిన పోలీసులు నిందితులను గుర్తించారు. ప్రస్తుతం నిందితుడు గతంలో కూడా ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ట్విట్టర్‌లో ఈ విషయంపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు, ఆందోళనలు వెల్లువెత్తాయి. సిగ్గుమాలిన పని చేసిన అలాంటి వ్యక్తులను వదిలేయవద్దని మండిపడ్డారు. మానవమృగంపై కేసు పెట్టమంటూ జంతు ప్రేమికులు, పోలీసులకు చూపించడంతో సీరియస్‌గా తీసుకోకపోవడంతో పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. వాట్సాప్‌ చాటింగ్‌, స్క్రీన్‌ షాట్‌ ఫోటోల ఆధారంగా కుక్కపై అత్యాచారం జరిగినట్లుగా నిర్ధారించలేమని ..విచారించి చర్యలు తీసుకుంటామని చెప్పి పంపడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఢిల్లీ పోలీసులపై నెటిజన్లు దుర్భాషలాడారు.

అచ్చం సినిమా మాదిరి.. ఫౌడర్ చల్లారు పట్టుకున్నారు
లంచం డిమాండ్ చేసిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని ఈస్ట్ షాలిమార్ బాగ్‌లో ఓ ఇంటి నిర్మాణానికి బదులుగా లంచం డిమాండ్ చేసినందుకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) అధికారిని అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఢిల్లీలోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) హెడ్‌ జాయింట్‌ కమీషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (జేసీపీ) మధుర్‌ వర్మ తెలిపిన వివరాలు, తూర్పు షాలిమార్‌ బాగ్‌లో నివాసం ఉంటున్న సౌరభ్‌ జైన్‌ అనే వ్యక్తి ఇంటిని నిర్మించాలనుకున్నాడు. ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్మాణానికి అనుమతి కోసం మున్సిపల్ అధికారి నారాయణ్ ను ఆశ్రయించాడు. దీంతో అతడు రూ. లక్ష డిమాండ్ చేశాడు. లంచం ఇచ్చేందుకు ఇష్ట పడని సౌరభ్ అన్నయ్య రాజీవ్ మంగళవారం అవినీతి నిరోధక శాఖ కార్యాలయాన్ని సందర్శించారు. తగిన బేరసారాల తర్వాత రూ.10వేలకు నారాయణ ఒప్పుకున్నట్లు రాజీవ్ చెప్పినట్లు జేసీపీ తెలిపారు.