NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

ఎంపీ అసదుద్దీన్‌ సంచలన వ్యాఖ్యలు..
హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చే శారు.. హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. భారతదేశ పార్లమెంట్‌లో అన్ని వర్గాల ఎంపీలు ఎన్నికై వస్తారు.. కానీ, ముస్లింలు ఏకతాటిపైకి వచ్చి రాజకీయంగా ఓ లీడర్‌ కింద ఎదగడం రాజకీయ పార్టీలకి నచ్చదని విమర్శించారు.. దేశంలో ముస్లింలు రాజకీయ పార్టీలకి బానిసలుగా ఉండాలని పార్టీల నేతలు భావిస్తున్నారని మండిపడ్డారు.. 70 ఏళ్లుగా మమ్మల్ని ఇదే విధంగా దోచుకున్నారని ఆరోపించారు.. ఈ దేశంలో అగ్రకులస్తులే రాజకీయాల్లో ఉండాలని భావిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఒవైసీ.. మైనార్టీ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, దళితులు ఏకితాటిపైకి రావడం రాజకీయ పార్టీలకి నచ్చదని పేర్కొన్నారు.. ఇక, హైదరాబాద్ నగర పోలీస్‌ కమిషనర్‌కి నా విజ్ఞప్తి.. మీరు ప్రత్యేకంగా ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి.. తల్వార్లు, కత్తులతో దాడులు చేస్తున్న వారిని ఉక్కు పాదంతో అణిచివేయండి అని విజ్ఞప్తి చేశారు ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ.. వారికి శాశ్వతంగా బెల్ రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.. మరోవైపు.. భారతదేశంలో బీబీసీ కార్యక్రమాన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ పై నిషేధించారు.. గుజరాత్ అల్లర్ల సమయంలో ముఖ్యమంత్రి మీరే ఉన్నారు కదా..! గాడ్సే.. గాంధీ హంతకుడు.. అసలు గాడ్సే పైన మీ నిర్ణయం ఏంటి..? అని ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించారు. గాడ్సే పై సినిమాని చిత్రకరిస్తున్నారు.. గాంధీ హంతకుడుపై తీయబోతున్న సినిమాని మీరు భారతదేశంలో బ్యాన్‌ చేస్తారా? లేదా? అని నిలదీశారు.. మీ గురించి, బీజేపీ గురించి ప్రచారం చేస్తోన్న వార్తని బ్యాన్‌ చేస్తున్నారు.. మరి గాడ్సేపై తీయబోతున్న సినిమాని భారత దేశంలో బ్యాన్‌ చేస్తారా? లేదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ.

జీవో నంబర్‌ 1పై నేడు హైకోర్టులో విచారణ
ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఇవాళ జీవో నంబర్‌ 1పై విచారణ జరగనుంది.. హైకోర్టు డివిజన్ బెంచ్ లో విచారణ జరపాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ విచారణ జరగబోతోంది.. హైకోర్టులో సీపీఐ రామకృష్ణ, జర్నలిస్ట్ బాలగంగాధర తిలక్ లు వేసిన పిటిషన్లను కలిపి ఇవాళ విచారించనుంది హైకోర్టు.. జీవో నంబర్‌ వన్‌పై ఇరు వర్గాల వాదనలు విననుంది హైకోర్టు.. కాగా.. జీవో నెంబర్ 1 పై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై శుక్రవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. జీవో నంబర్ 1 పై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో జోక్యం చేసుకోం అంటూ తేల్చి చెప్పింది. అనంతరం ఈ కేసును ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జనవరి 23న విచారణ జరిపించాలని ఆదేశించిన విషయం విదితమే. ఇక, సుప్రీంకోర్టు ఆదేశంతో మరోసారి జీవో నంబర్‌ 1పై తిరిగి ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతుంది.. అలాగే ఏపీ హైకోర్టు తీర్పు మెరిట్స్ పై ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదని సీజే వ్యాఖ్యానించారు. అలాగే జీవో నెంబర్ 1పై ఇచ్చిన స్టేను ఎత్తివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరిస్తూ.. ఇటువంటి సమయంలో ఈ కేసుపై తాము జోక్యం చేసుకోలేమని దేశ అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.. కాగా, ప్రకాశం జిల్లా కందుకూరు.. గుంటూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన సభల్లో తొక్కిసలాటలు జరిగాయి. ఈ తొక్కిసలాటల్లో మొత్తం 11మంది ప్రాణాలు కోల్పోయారు.. ఆ తర్వాత రోడ్ షోలు, ర్యాలీలు, సభలు నిర్వహించడంపై నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1ని జారీ చేయగా.. ఈ జీవోపై విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తు్నాయి..

అధికార పార్టీలో వర్గ విభేదాలు.. ఫ్లెక్సీల్లో ప్రొటోకాల్ రగడ
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌ నియోజక వర్గ అధికార పార్టీ బీఆర్‌ఎస్‌లో నెలకొన్న వర్గ విభేదాలు భగ్గు మన్నాయి. ఇవాళ జరగాల్సిన నిడమనూరు మార్కెట్‌ చైర్మన్‌ ప్రమాణస్వీకారానికి ముందే ఏర్పాటు ఫెక్సీలను చింపుకొని వీధిన పడ్డారు. రోడ్ల పైనే పరస్పరం వాగ్వివాదాలకు దిగడం కలకలం రేపింది. నిడమనూరు, త్రిపురారం రెండు మండలాల పరిధిలోని నిడమనూరు మార్కెట్ కమిటీ.. వరుసగా మూడు పర్యాయాలు త్రిపురారం మండలానికి చెందిన వ్యక్తికి చైర్మన్ పదవిని అప్పగించడంపై గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో త్రిపురారం మండల కేంద్రానికి చెందిన వ్యక్తికి మరోసారి చైర్మన్ పదవి దక్కగా, నిడమనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిపై కన్నేసిన నియోజకవర్గానికి చెందిన ప్రముఖ ప్రజాప్రతినిధి అనుచరులు ఈవివాదం వెనుక ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. నేడు నిడమనూరు మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి జగదీశ్‌రెడ్డి స్వాగతం పలికేందుకు ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలో ఎంపీపీ, సర్పంచ్ ఫోటోలు లేవని నిరసిస్తూ ఎంపీపీ సంఘం నాయకులు ఫ్లెక్సీలను చించివేశారు. ఫ్లెక్సీల్లో ప్రొటోకాల్ ప్రకారం నిడమనూరు ఎంపీపీ బొల్లం జయమ్మ, స్థానిక సర్పంచ్ మేరెడ్డి పుష్పలత ఫొటోలు ఫ్లెక్సీల్లో ప్రచురించకపోవడంతో ఎంపీపీ కుమారుడు, ఎంపీపీ సలహాదారు తన అనుచరులతో నిరసనకు తెలిపారు. అనంతరం మార్కెట్‌ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మార్కెట్‌ చైర్మన్‌ మర్ల చంద్రారెడ్డి, వైస్‌ చైర్మన్‌ ములుగు రామలింగయ్య, బీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు సత్యపాల్‌ చూస్తుండగానే చించివేశారు. అయితే.. ఫ్లెక్సీలలో ఎంపీపీ ఫొటో ఎందుకు పెట్టలేదంటూ లేక పోవడం పద్దతేనా? అంటూ వారితో వాగ్వాదానికి దిగారు.

ప్రధాని మోదీపై అంతర్జాతీయ కుట్ర.. విచారణ కోరిన ఆల్ ఇండియా బార్ అసోసియేషన్
ప్రధాని నరేంద్రమోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ వివాదాస్పదం అయింది. దీనిపై ఇండియన్ గవర్నమెంట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది వలసవాద మనస్తత్వాన్ని తెలియజేస్తుందని ఘాటుగానే సమాధానం ఇచ్చింది. ఇక బ్రిటన్ రాజకీయ వర్గాల్లో కూడా ఇది చర్చనీయాంశంగా మారింది. పాక్ మూలాలు ఉన్న ఎంపీ బ్రిటన్ పార్లమెంట్ లో ఈ అంశాన్ని తేలనెత్తాడు. 2002 గుజరాత్ అల్లర్లలో ప్రధాని హస్తం ఉందని ఆరోపించాడు. దీన్ని యూకే ప్రధాని రిషి సునాక్ తో పాటు పలువురు ఇతర ఎంపీలు ఖండించారు. ఇదిలా ఉంటే ఈ వీడియో లింకును షేర్ చేయకుండా ట్విట్టర్, యూట్యూబ్ లకు ఆదేశాలు జారీ చేసింది భారతప్రభుత్వం. ఇదిలా ఉంటే ఈ అంశంపై మాజీ న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్లు ప్రధానికి మద్దతుగా లేఖను విడుదల చేశారు. తాజాగా బీబీసీ డాక్యుమెంటరీలో ‘అంతర్జాతీయ కుట్ర’దాగి ఉందని ఆల్ ఇండియా బార్ అసోసియేషన్ విచారణ కోరింది. ఊహాజనిత సాక్ష్యాలతో కొన్ని అదృశ్య శక్తులు ప్రధానిని అపఖ్యాతి చేయాలని చూస్తోందని అసోసియేషన్ ఆరోపించింది.

టీమిండియా క్రికెటర్‌ కొత్త ఇన్నింగ్స్‌.. నేడే అతియాతో కేఎల్‌ రాహుల్‌ పెళ్లి
టీమిండియా క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ కొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభించనున్నాడు.. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టిని పెళ్లి చేసుకోబోతున్నాడు.. నాలుగేళ్లుగా వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. కేఎల్‌ రాహుల్ మరియు అతియా శెట్టి ఎప్పుడూ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు ఒప్పుకోలేదు.. కానీ, వారి ఫొటోలు, వారి డేటింగ్‌కు సంబంధించిన వార్తలు మాత్రం ఎప్పుడూ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తూ వచ్చాయి.. మొత్తంగా పెళ్లి పీటలు ఎక్కెందుకు ఇద్దరూ సిద్ధమయ్యారు.. ఇవాళ శెట్టి ఖండాలా ఫామ్‌హౌస్‌లో వీరి పెళ్లి జరగనుంది.. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు మధ్యాహ్నం తర్వాత వీరిద్దరూ ఒక్కటికాబోతున్నారు.. అతియా మరియు కేఎల్‌ రాహుల్ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు వివాహ ప్రమాణం చేస్తారని తెలుస్తోంది.. మొత్తంగా టీమిండియా స్టార్ బ్యాట్‌మెన్‌ కే ఎల్ రాహుల్‌తో అతియ శెట్టి వివాహం ఇవాళ అంగరంగ వైభవంగా జరగబోతోంది.. మహారాష్ట్రలోని ఖండాలలో సునీల్ శెట్టి ఫామ్ హౌస్‌లో శనివారం ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.. పెళ్లి తర్వాత బెంగళూరు, ముంబైలో రిసెప్షన్ పార్టీలు జరుపుకోనున్నట్లు తెలుస్తోంది.. దీనికి టీమిండియా ప్లేయర్లతో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు సమాచారం.. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు వివాహ ప్రమాణం చేయనున్నారని.. వారి కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల సమక్షంలో. ఆచారాలను అనుసరించి సాయంత్రం 6:30 గంటలకు పెళ్లి తంతు ఉంటుందని తెలుస్తోంది.. అయితే, 21 సాయంత్రం ఇంటిమేట్ కాక్‌టెయిల్ పార్టీతో ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యాయి.. దీని తర్వాత జనవరి 22న మెహందీ మరియు హల్దీ వేడుకలు జరిగాయి. ఇక, ఇవాళ పెళ్లి జరగనుండగా.. ముంబై మరియు బెంగళూరులో తమ స్నేహితులు మరియు క్రికెట్‌ ప్రముఖులు, సినీ ప్రముఖుల కోసం వెడ్డింగ్ రిసెప్షన్‌ను నిర్వహించనున్నారు.

రికార్డ్ క్రియేట్ చేసిన ఆపిల్.. ఒక నెలలో భారత్ నుంచి అత్యధిక ఎగుమతులు
ఎగుమతుల్లో ఆపిల్ సంస్థ రికార్డ్ క్రియేట్ చేసింది. భారతదేశం నుంచి రికార్డ్ స్థాయిలో ఐఫోన్లను ఎగుమతి చేసి చరిత్ర సృష్టించింది. ఏకంగా భారత్ నుంచి 1 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను ఎగుమతి చేసింది. ఆపిల్ 2022 డిసెంబర్ నెలలో రూ. 8100 కోట్ల విలువైన ఐఫోన్లను ఎగుమతి చేసి సత్తా చాటింది. మొత్తం భారత్ తో స్మార్ట్ ఫోన్ల ఎగుమతులను రూ. 10,000 కోట్లకు తీసుకెళ్లింది. 2023 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి స్మార్ట్ ఫోన్ల ఎగుమతులు 9 బిలియన్ డాలర్లను దాటే అవకాశం ఉంది. బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఊతం ఇచ్చేలా ఒకే నెలలో 1బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్ ఫోన్లను ఎగుమతి చేసిన మొదటి కంపెనీగా ఆపిల్ నిలిచింది. భారత్ నుంచి మొబైల్ ఫోన్లు ఎగుమతి చేయడంలో ఆపిల్, శాంసంగ్ అగ్రగామిగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఆపిల్ దేశంలో టాప్ మొబైల్ ఫోన్ ఎగుమతిదారుగా శాంసంగ్ ను అధిగమించింది. ఇండియాలో ఆపిల్ ఐఫోన్ 12, 13, 14, 14 ప్లస్ సహా అనేక ఐఫోన్ మోడళ్లనున ఉత్పత్తి చేసి, ఎగుమతి చేస్తోంది. ప్రస్తుతం తమిళనాడు, కర్ణాటకలో తయారీ యూనిట్లు ఉన్నాయి. ఏప్రిల్ 2020లో భారత ప్రభుత్వ స్మార్ట్ ఫోన్ ఉత్పత్తి లింక్డ్ ఇన్సెంటివ్(పీఎల్ఐ) పథకంలో భాగస్వామిగా ఆపిల్ ఉంది. ఈ పథకం కింద భారత్ స్మార్ట్‌ఫోన్‌లు మరియు ఇతర ఎలక్ట్రానిక్‌ల తయారీ కేంద్రంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది. పథకంలో భాగంగా, తయారీదారులు ఉత్పత్తి, ఎగుమతులు, పెట్టుబడులు మరియు ఉద్యోగాలకు సంబంధించిన డేటాను ప్రభుత్వానికి క్రమం తప్పకుండా సమర్పించాలి.

సక్సస్ పార్టీలో బాలయ్య ఎంజాయ్మెంట్ మాములుగా లేదుగా
నటసింహం నందమూరి బాలకృష్ణ వైట్ అండ్ వైట్ వేసి ఫ్యాక్షన్ లీడర్ గా నటించిన సినిమా ‘వీర సింహా రెడ్డి’. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ మూవీలో బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్ కి ఎవరినా ఫిదా అవ్వాల్సిందే. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో నెవర్ బిఫోర్ అనే రేంజులో కనిపించిన బాలయ్య, వీర సింహా రెడ్డి సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. జనవరి 12న ఆడియన్స్ ముందుకి వచ్చిన వీర సింహా రెడ్డి సినిమా కేవలం ఎనిమిది రోజుల్లో బాలయ్య కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది అంటే ఈ మూవీని ఆడియన్స్ ఎంతగా ఆదరిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. నైజాం, సీడెడ్ ఏరియాల్లో బాలయ్య ర్యాంపేజ్ సెకండ్ వీక్ లో కొనసాగుతుంది. అఖండ లైఫ్ టైమ్ బిజినెస్ ని కేవలం మొదటివారంలోని బీట్ చేసిన వీర సింహా రెడ్డి సినిమాన్ని రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ ని టచ్ చేసింది. బయ్యర్స్ అందరికీ ప్రాఫిట్స్ ఇస్తున్న వీర సింహా రెడ్డి సినిమా సక్సస్ మీట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. హరీష్ శంకర్, శివ నిర్వాణ, హను రాఘవపూడి, అనీల్ రావిపూడి, విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ స్పెషల్ గెస్టులుగా వచ్చిన ఈ సక్సస్ మీట్ ఫుల్ జోష్ లో సాగింది. చిత్ర యూనిట్ అంతా పాల్గొన్న ఈ సక్సస్ మీట్ అయ్యాకా బాలయ్య అండ్ టీమ్ పార్టీ చేసుకున్నారు. హానీ రోజ్, బాలయ్యల ఫోటో ఒకటి ఈ సక్సస్ పార్టీ నుంచి బయటకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలయ్య ఫుల్ ఆన్ లో ఉన్నాడు, ఇది NBK సీజన్ అంటూ నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సంక్రాంతి సీజన్ అయిపొయింది కాబట్టి వీర సింహా రెడ్డి సినిమా కలెక్షన్స్ లో డ్రాప్ కనిపిస్తుంది కానీ సీడెడ్ ఏరియాలో మాత్రం మరికొన్ని రోజుల పాటు బాలయ్య హవా కొనసాగనుంది.

Show comments