రైతులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్.. ఇవాళే ఆ సొమ్ము పంపిణీ
రైతులకు మరోసారి శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇవాళ గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించనున్న ఆయన.. నాలుగో ఏడాది మూడో విడత వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ నిధులు పంపిణీ చేయనున్నారు.. అంతేకాకుండా.. ఇటీవల పంటలు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీ కూడా చేపట్టబోతున్నారు.. ఇక, మంగళగిరి పర్యటన కోసం .. ఉదయం 9.50 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరనున్న ముఖ్యమంత్రి.. ఉదయం10.35 గంటలకు తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలోని బహిరంగ సభా వేదికకు చేరుకుంటారు.. నాలుగో ఏడాది మూడో విడత వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ నిధుల పంపిణీకి బటన్ నొక్కనున్నారు.. ఇటీవల పంటలు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీకి కూడా శ్రీకారడం చుడతారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ నొక్కడం ద్వారా.. వర్చువల్ గా రైతుల ఖాతాల్లో సంబంధిత సొమ్ము జమ కాబోతోంది. ఇక, తెనాలి పర్యటన ముగించుకుని.. మధ్యాహ్నం 1.10 గంటలకు తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు సీఎం వైఎస్ జగన్..
నేడు అమిత్ షాతో రాష్ట్ర బీజేపీ నేతల భేటీ
బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ నేడు కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. బీజేపీ నేతలు లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల రాజేందర్, వివేక్, జితేందర్రెడ్డితో కలిసి ఆయన మధ్యాహ్నం 12 గంటలకు అమిత్ షాను కలుస్తారు. ఈ సమావేశంలో బీజేపీ మిషన్ 30, ఎన్నికల ప్రణాళికపై రాష్ట్ర నేతలకు షా సూచనలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే.. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతోంది బీజేపీ. కర్ణాటక తర్వాత తెలంగాణలో అనుకూల పవనాలు వీస్తున్నాయని బీజేపీ అధిష్ఠానం భానిస్తున్న నేపథ్యంలో.. బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే.. రాష్ట్రానికి ఏం చేస్తున్నామో.. ఆ పార్టీ నేతలు ప్రజలకు వివరిస్తున్నారు. అయితే.. పార్లమెంట్ ప్రవాస్ యోజన, ప్రజా గోస-బీజేపీ భరోసా వంటి కార్యక్రమాలు చేపట్టారు. మార్చి నుంచి పోలింగ్ బూత్ స్వశక్తికరణ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు బీజేపీ నేతలు.ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నేతలకు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు ఢిల్లీకి రావాలని అధిష్ఠానం నుంచి పిలుపొచ్చింది. ఈ క్రమంలోనే.. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు అమిత్‌షాతో రాష్ట్ర నేతలు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే.అరుణ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, విజయశాంతి, గరికపాటి మోహన్‌రావు, వివేక్, జితేందర్‌రెడ్డి పాల్గొనున్నారు.
పొట్టి క్రికెట్‌లో మరీ ఇంత చెత్త రికార్డా..?
పొట్టి క్రికెట్ ఫార్మాట్ అదేనండి టీ-20లు ప్రారంభం అయిన తర్వాత.. బ్యాటింగ్‌లు ఎక్కడలేని దూకుడు చూస్తున్నాం.. కళ్లు చెదిరే బ్యాటింగ్ విన్యాసాలు, హిట్టర్ల విధ్వంసక ఇన్నింగ్స్‌లకు ఈ మ్యాచ్‌లు వేదిక అవుతున్నాయి.. అప్పడప్పుడు బౌలర్లు మెరిసినా.. పైచేయి మాత్రం బ్యాటింగ్‌దే అని చెప్పాలి.. కానీ, అలాంటి ఫార్మాట్‌లో ఓ చెత్త రికార్డు నమోదైంది.. చెత్త రికార్డు కంటే దానిని పరమ చెత్త రికార్డుగా చెప్పుకోవాలి.. ఎందుకంటే టీ20లో సంచలనాన్ని సమోదు చేస్తూ.. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు కేవలం 10 పరుగులకే ఆలౌట్ అయింది.. ఇక, 11 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన మరో జట్టు రెండు బంతుల్లోనే మ్యాచ్ ముగించింది. ఇంతకీ.. ఈ రికార్డు నమోదైన మ్యాచ్ విషయానికి వెళ్తే.. పొట్టి క్రికెట్‌లో ఇప్పటివరకూ అత్యల్ప స్కోర్ సిడ్నీ థండర్స్ పేరు మీద ఉంది.. బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్స్ జట్టు 15 పరుగులకే పెవిలియన్ చేరింది.. అడిలైడ్ స్ట్రయికర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు టీ20ల్లో అత్యల్ప స్కోర్ నమోదు చేసింది… అయితే, ఇప్పుడు స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇస్లే ఆఫ్ మ్యాన్ జట్టు.. ఆ రికార్డును తిరగరాస్తూ.. కేవలం 10 పరుగులకే ఆలౌట్ అయ్యింది.. దీంతో, ఈ ఫార్మాట్‌లో అత్యల్ప స్కోర్ చేసిన జట్టుగా రికార్డుల్లోకి ఎక్కింది. ‘ఇస్లే ఆఫ్ మ్యాన్’ -‘స్పెయిన్’ జట్ల మధ్య ఆదివారం లా మంగా క్లబ్ బోటమ్ గ్రౌండ్‌లో ఈ మ్యాచ్ జరిగింది.. ఇస్లే ఆఫ్ మ్యాన్ జట్టు 8.4 ఓవర్లు ఆడి 10 పరుగులకే కుప్పకూలింది. టీ20 క్రికెట్‌లో అతి తక్కువ స్కోరు సాధించిన చెత్త రికార్డు ఇప్పటి వరకు సిడ్నీ థండర్స్ పేరున ఉండగా.. ఇప్పుడా రికార్డును ఇస్లే ఆఫ్ మ్యాన్ జట్టు చెడిపేసింది..
కష్టాల్లో మరో భారత వ్యాపార దిగ్గజం.. అప్పుల కుప్పగా వేదాంత ..!
ఈ మధ్య అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీకి సంబంధించిన వార్తలు ప్రముఖంగా వస్తున్నాయి.. ఆయన సంస్థలు గడ్డుకాలాన్ని ఎదుర్కుంటున్నాయని.. అప్పుల కుప్పలుగా మారిపోయాయని వాటి సారాంశం.. అధిక పరపతి కలిగిన భారతీయ వ్యాపారవేత్తలు గడ్డు సమయాన్ని ఎదుర్కొంటున్నారు. గౌతమ్ అదానీ యొక్క 236 బిలియన్ డాలర్ల మౌలిక సదుపాయాల సామ్రాజ్యం ఒక నెలలో మూడు వంతుల కంటే ఎక్కువ తగ్గిపోయింది. అయితే, మరొక ప్రసిద్ధ వ్యక్తి కోసం చిన్న తుఫాన్ ఏర్పడవచ్చు అనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.. ఆయనే వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్.. గౌతమ్ అదానీ తరహాలోనే పీకల్లోతు అప్పులతో సతమతమవుతున్నారు. ఈ సంవత్సరం సెప్టెంబరు నుంచి వచ్చే జనవరి లోపు ఈయన నిర్వహణలోని వేదాంత రీసోర్సెస్ 150 కోట్ల డాలర్ల (రూ.12,400 కోట్లు) రుణ పత్రాల అప్పులు చెల్లించాల్సి ఉంది.. అయితే, కొత్త అప్పుల ద్వారా ఈ మొత్తం సేకరించేందుకు అగర్వాల్ చేసిన ప్రయత్నాలు సఫలప్రదం కాలేదు.. అనిల్ అగర్వాల్ యొక్క.. లండన్-లిస్టెడ్ వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ జనవరిలో చెల్లించాల్సిన 1 బిలియన్ డాలర్ల బాండ్‌తో సహా అప్పుల కుప్పగా మారిపోయింది.. అయినప్పటికీ, భారాన్ని తగ్గించడానికి ఇటీవల చేసిన ప్రయత్నాలు అన్నీ బెడిసికొట్టాయి.. హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్‌జెడ్‌ఎల్) ఈక్విటీలో అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని వేదాంత లిమిటెడ్‌కు 65 శాతం వాటా ఉండగా.. ఈ కంపెనీ ప్రతి త్రైమాసికానికి 30 నుంచి 60 కోట్ల డాలర్ల స్థూల లాభం ఆర్జిస్తోంది. అన్నిటి కంటే ముఖ్యంగా ఈ కంపెనీ వద్ద దాదాపు 200 కోట్ల డాలర్ల అంటే దాదాపు రూ.16,500 కోట్లు మిగులు నిధులు ఉన్నాయి. విదేశాల్లోని వేదాంత జింక్ గనుల కొనుగోలు ద్వారా.. ఈ మిగులు నిధులను, వేదాంత లిమిటెడ్ ఖాతాలోకి మళ్లించేందుకు అనిల్ అగర్వాల్ తీవ్రంగానే ప్రయత్నించారు.. కానీ, హెచ్‌జెడ్‌ఎల్ ఈక్విటీలో ఇంకా 30 శాతం వాటా ఉన్న ప్రభుత్వం ఇందుకు నిరాకరించడంతో ఆ ప్రయత్నాలు ముందుకు సాగలేదు.. అయితే, వేదాంత రిసోర్సెస్ తన నికర-రుణ భారాన్ని గత ఏడాది మార్చిలో దాదాపు 10 బిలియన్ల డాలర్ల నుండి 8 బిలియన్ల డాలర్ల కంటే తక్కువగా తగ్గించుకోగలిగింది. లిస్టెడ్ యూనిట్ గత నెలలో డివిడెండ్ ప్రకటించడంతో, దాని పేరెంట్ మరియు మెజారిటీ షేర్‌హోల్డర్ సెప్టెంబర్ 2023 వరకు దాని బాధ్యతలను నెరవేర్చడానికి అవకాశం ఉందని చెబుతున్నారు.. అయితే అగర్వాల్ ఈ ఏడాది సెప్టెంబర్ మరియు జనవరి 2024 మధ్య 1.5 బిలియన్ డాలర్ల రుణం మరియు బాండ్ రీపేమెంట్‌ల కోసం ఫైనాన్స్‌ను పొందేందుకు ప్రయత్నించినప్పుడు అది సాధ్యపడలేదు.
ఎన్టీఆర్ ని పిలిచాము కానీ రాలేదు – హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్
హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ప్రెజెంట్ చేసే అవార్డ్స్ లో ఆర్ ఆర్ ఆర్ సినిమా నాలుగు కేటగిరిల్లో అవార్డ్స్ ని సొంతం చేసుకోని ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో కొత్త చరిత్రని సృష్టించింది. స్పాట్ లైట్ అవార్డుని కూడా గెలుచుకున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా ముందెన్నడూ చూడని ఒక హిస్టీరియా క్రియేట్ చేస్తోంది. ఈ HCA అవార్డ్స్ ఈవెంట్ లో రామ్ చరణ్, అవార్డ్ ప్రెజెంట్ చేసి ఆ ఘనత సాదించిన మొదటి భారతీయ నటుడిగా చరిత్రకెక్కాడు. అయితే ఈ విషయంలో ఎన్టీఆర్ కి అన్యాయం జరిగింది, తారక్ ని ఎందుకు పిలవలేదు అంటూ సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఇది కాస్త చిలికి చిలికి గాలి వానగా మారడంతో హకస్వయంగా స్పందించింది. ఎన్టీఆర్ ని ఎందుకు పిలవలేదు అనే విషయంలో క్లారిటీ ఇస్తూ “స్పాట్ లైట్ అవార్డ్ అనేది ఒక యాక్టర్ ని వచ్చింది కాదు, అది ఆర్ ఆర్ ఆర్ సినిమాకి వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ ని మేము ఇన్వైట్ చేశాము కానీ అతను ఒక సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అందుకే HCA ఈవెంట్ కి రాలేదు. ఎన్టీఆర్ అవార్డ్ త్వరలోనే అందుకుంటాడు” అంటూ HCA వాళ్లు ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ సినిమా షూటింగ్ లో బిజీగా లేడు, తన బ్రదర్ చనిపోయి, పర్సనల్ లాస్ లో ఉన్నాడు అందుకే రాలేదు అని ఎన్టీఆర్ ఫ్యాన్ ఒకరు HCA ట్వీట్ కి రిప్లై ఇచ్చాడు. ఈ ట్వీట్ కి కూడా హాలీవుడ్ క్రిటిక్స్ స్పందించింది. “ఎన్టీఆర్ తన సినిమా పనుల్లో ఉండే అవార్డ్స్ ఈవెంట్ కి రాలేదు, ఆ తర్వాతే తన బ్రదర్ చనిపోయాడు. ఈ విషయం మాకు ఎన్టీఆర్ పబ్లిసిస్ట్ చెప్పాడు” అని క్లారిటీ ఇచ్చారు. ఫిబ్రవరి 24న ఎన్టీఆర్ 30 సినిమా పూజా కార్యక్రమాలు జరగాల్సి ఉంది, తారకరత్న మరణంతో ఎన్టీఆర్ 30 ఓపెనింగ్ సెరిమొని వాయిదా పడింది. దీంతో ఎలాంటి అనౌన్స్మెంట్ ఈవెంట్స్ లేకుండానే ఎన్టీఆర్, కొరటాల శివ షూటింగ్ కి వెళ్లడానికి రెడీ అవుతున్నారు. మార్క్ 5న ఎన్టీఆర్ మళ్లీ యూఎస్ వెళ్తాడు, ఆ సమయంలో తన అవార్డుని HCA నుంచి ఎన్టీఆర్ అందుకోనున్నాడు.