NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడే తెలంగాణ సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు.. రాష్ట్ర వ్యాప్తంగా సందడి
టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కే చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ ఇవాళ 69వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా సీఎం కేసీఆర్‌కు ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ జన్మదిన వేడుకలను టీఆర్‌ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా సర్వమత ప్రార్థనలు, మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పక్క రాష్ట్రాల్లో కూడా కేసీఆర్ అభిమానులు కటౌట్లు ఏర్పాటు చేసి శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా కేసీఆర్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ తన అభిమానాన్ని చాటుకున్నాడు. రాష్ట్రంలో అమలవుతున్న 100 సంక్షేమ పథకాలు, 2500 ముఖాలతో భారీ చిత్రపటాన్ని రూపొందించారు. వారం రోజుల పాటు కష్టపడి చేసిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సీఎం కేసీఆర్ 1954 ఫిబ్రవరి 17న సిద్దిపేటలోని చింతమడకలో రాఘవరావు-వెంకటమ్మ దంపతులకు జన్మించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ పోరాడారు. ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ 2021లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించి..2009లో స్వరాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆ తర్వాత కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించినట్లు ప్రకటించింది. నాలుగున్నరేళ్ల తర్వాత తెలంగాణ కల సాకారమైంది. ఏపీ విభజన తర్వాత 2014లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నికయ్యారు. రెండోసారి సీఎంగా ఎన్నికైన తర్వాత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

హైదరాబాద్ పేలుళ్ల కేసులో ట్విస్ట్ ..
హైదరాబాద్ పేలుళ్ల కుట్రకేసులో నిర్ఘాంతపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. నగరంలో ఉగ్రవాదులు ఉండటానికి ఓల్డ్ సిటీలోని ఓ వ్యక్తి ఆర్థిక సహాయం అందించినట్లు అధికారులు గుర్తించి షాక్ కు గురయ్యారు. పాతబస్తీకి చెందిన అబ్దుల్ కలీమ్ అనే వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు అతన్ని రిమాండ్ తరలించారు. ఇంకా ఎవరైనా ఈకుట్రలో వున్నారా అనే కోణంలో విచారణ చేపట్టారు. హైదరాబాద్ లో నర మేధం సృష్టించేందుకు ముగ్గురు ఉగ్రవాదులు కుట్రపడిన జాహీద్ తో పాటు ముగ్గురిని గతంలోనే పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. జాహీద్ కు అబ్దుల్ కలీం 40 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసినట్లు గుర్తించారు. కలీం ఇచ్చిన 40 లక్షల రూపాయలతో జాహీద్ కార్లు బైకులు కొనుగోలు చేసినట్లు.. దీంతో జాహీద్ ముఠా విదేశాలను వచ్చిన హ్యాండ్ గ్రానైట్లతో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు.. కార్లు బైకులు హ్యాండ్ గ్రానైట్ల పెట్టి పేల్చడానికి కుట్ర పన్నినట్లు గుర్తించారు. దసరా ఉత్సవాలతో పాటు హైదరాబాదులో జరిగే ఉత్సవాల్లో పేలుడు కు కుట్ర చేసినట్లు పేర్కొన్నారు. గతంలోని కుట్రని పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పటికే భాగ్యనగర్‌లో పేలుళ్లకు కుట్ర పన్నిన జాహెద్‌ ముఠాపై ఎన్‌ఐఏ కేసు నమోదు చేసింది. ఈ కేసును ఎన్‌ఐఏ విచారణ చేపట్టింది.

స్కూటీపై పసిబిడ్డ మృతదేహంతో 120 కిలోమీటర్లు తీసుకెళ్లిన తల్లిదండ్రులు
పండింటి కూతుర్ని కాపాడుకోవాలన్న ఆ దంపతులు ఆశ తీరలేదు. కంటిపాప కన్నుమూసిందని దుఃఖంలో ఉంటే , ఆసుపత్రి సిబ్బంది దుర్మార్గంగా ప్రవర్తించారు. పసిగుడ్డు మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ అడిగితే మానవత్వం లేకుండా తిరస్కరించారు. మరోదారి లేక ద్విచక్ర వాహనంపై బిడ్డ శవాన్ని మధ్యలో కూర్చో బెట్టుకుని, ఒకట్రెండు కాదు ఏకంగా 120 కిలోమీటర్లు ప్రయాణించారు. ఈ అమానవీయ ఘటన ఉమ్మడి విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది. అల్లారు ముద్దుగా పెంచుకుందామని అనుకున్న తల్లిదండ్రులకు, తాము అనుభవిస్తున్న కష్టం కంటే.. కేజీహెచ్‌లో ఎదురైన నిర్లక్ష్యం తీరని వేదనను మిగిలించింది. అల్లూరి జిల్లా కేంద్రమైన పాడేరుకు చేరుకున్న బాధితులు, జరిగిన ఘోరం గురించి కుటుంబ సభ్యులకు చెప్పడంతో వెలుగులోకి వచ్చింది. అల్లూరి సీతారామరాజు జిల్లా, కుమడ గ్రామానికి చెందిన మహేశ్వరి, మత్య కొండబాబు దంపతులకు ఈనెల 2న నవజాత శిశువు జన్మించింది. బిడ్డకు శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నట్టు గుర్తించిన పాడేరు ఆ సుపత్రి వైద్యులు మెరుగైన సేవలు కోసం కేజీహెచ్‌కు తరలించారు. అప్పటి నుంచి ఎన్‌ఐసీయూ వార్డులో చికిత్స పొందుతూ గురువారం ఉదయం 7 గంటల సమయంలో ప్రాణాలు కోల్పోయింది. డెత్ నిర్ధారించిన వైద్యులు ఆ మేరకు నిర్ధారణ పత్రం తల్లిదండ్రులకు అప్పగించారు. విశాఖకు సుమారు 200 కిలో మీటర్ల దూరంలో ఉన్న కుముడ గ్రామానికి, చిన్నారి మృతదేహాన్ని తీసుకుని వెళ్ళేందుకు అంబులెన్స్ కోసం ప్రయత్నించగా తీవ్ర నిర్లక్ష్యం ఎదురైంది. గిరిజనుల కోసమే ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఒకవైపు బిడ్డను పోగొట్టుకున్న దుఃఖం, సుదూరం వెళ్లాలనే తొందరపాటుతో తల్లిదండ్రులు ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకున్నారు. తాము బిడ్డను తీసుకుని వచ్చిన టూవీలర్ పైనే, మధ్యలో మృతదేహం పెట్టుకుని ప్రయాణం ప్రారంభించారు. చిన్నారి మృత దేహంతో కేజీహెచ్‌ కాంపౌండ్ దాటుకుని.. తల్లిదండ్రులు మోసుకునిపోతున్నా పట్టించుకునే దిక్కు లేకపోయింది.

ఒక్కసారిగా పడిపోయిన ఉల్లి ధరలు.. రైతుకు కన్నీళ్లు
ఊహించని విధంగా ఉల్లి ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు. కొందరు ధర గిట్టుబాటు కావటం లేదని దేవరకద్ర మార్కె ట్లో విక్రయానికి తెచ్చిన ఉల్లిని, అదే వాహనంలో తిరిగి ఇంటికి తీసుకెళ్ళిన దుస్థితి. మార్కెట్లోకి వివిధ ప్రాంతాల నుంచి కొత్త ఉల్లి ఒక్క సారిగా వచ్చిపడింది. 2 వేల వరకు ఉండే క్వింటాల్‍ ఉల్లి ధర ఒక్కసారిగా 600 నుంచి 1000 రూపాయలకు పడి పోయింది. మార్కెట్ కమిటి చైర్మన్ తో పాటు దళారులు , వ్యాపారులు కుమ్మక్కై ధర రాకుండా చేస్తున్నారని రైతులు మండి పడుతున్నారు. దేవరకద్ర మార్కెట్‍ లో ఉల్లికి మంచి డిమాండ్ ఉంటుంది. మహబూబ్ నగర్, నారాయ ణపేట, ఆత్మకూర్, మక్తల్, కోస్గి, జడ్చర్ల, కొత్తకోట మండలాల రైతులు, పెద్ద ఎత్తున పంటను తీసుకొస్తున్నారు. అయితే వారం రోజులుగా నాణ్యతను బట్టి క్వింటా ఉల్లికి కనిష్ఠంగా 600 , గరిష్ఠంగా 1000 ధర పలుకుతోంది. ధరల పతనం తమను ముంచేస్తుందని ఉల్లి రైతులు గగ్గోలు పెడుతున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు.. దూకుడు పెంచిన ఈడీ
ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని ప్రశ్నించారు ఈడీ అధికారులు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొందరిని కూడా పిలిచి విచారణ జరిపారు. రాఘవరెడ్డికి ఎదురుగా అరుణ్‌ రామచంద్రపిళ్లైని కూర్చోబెట్టి ఇద్దరిని ప్రశ్నించారు. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఐదుగురు నిందితులకు బెయిల్ నిరాకరించింది… ఢిల్లీలోని రౌస్ అవెన్యూ స్పెషల్‌ కోర్టు. బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. లిక్కర్‌ స్కామ్‌ కేసులో అభిషేక్ బోయిన్ పల్లి, శరత్ చంద్రారెడ్డితో పాటు విజయ్‌నాయర్, బినయ్ బాబు, సమీర్‌ మహేంద్రులది కీలక పాత్ర అని ఈడీ వాదించింది. వీరిపై ఆరోపణలు చాలా తీవ్రమైనవని, మనీలాండరింగ్ చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని అధికారులు కోర్టులో వాదించారు. ఈడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు… ఐదుగురి బెయిల్‌ పిటిషన్లను తిరస్కరిస్తూ… 123 పేజీల తీర్పు వెలువరించింది. మొత్తానికి ఢిల్లీ లిక్కర్‌ పాలసీలో కేసులో ఈడీ అధికారులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు.

భారత్‌, ఆస్ట్రేలియా మధ్య నేటి నుంచి రెండో టెస్ట్‌..
భారత్‌, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ఇవాళ ప్రారంభం కానుంది. నాలుగు టెస్టుల బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో…భారత్‌ తొలి టెస్టుల విజయం సాధించింది. ఢిల్లీలోనూ విజయం సాధించి.. ఆధిక్యతను కంటిన్యూ చేయాలని రోహిత్ సేన వ్యూహాలు రచిస్తోంది. మొదటి టెస్టులోని జట్టును.. రెండో టెస్టులోనూ కంటిన్యూ చేయనుంది. బ్యాటర్లు, బౌలర్లు ఫామ్‌లో ఉండటంతో.. టీమిండియా రెట్టించిన ఉత్సాహంలో బరిలోకి దిగుతోంది. ఐదేళ్ల తర్వాత ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ మైదానంలో టెస్టు మ్యాచ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మైదానంలో భారత్‌ను ఓడించడం.. పర్యాటక జట్టుకు అంత సులువైన విషయం కాదు. 1959లో చివరిసారి ఇక్కడ గెలిచిన ఆసీస్‌.. మళ్లీ విజయం సాధించలేకపోయింది. ఛతేశ్వర్ పుజారా, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్, అశ్విన్‌, నాథన్‌ లయన్, స్టీవ్‌ స్మిత్‌లు అరుదైన రికార్డులను సొంతం చేసుకునే ఛాన్స్‌ లభించింది. వందో టెస్టు ఆడుతున్న ఛతేశ్వర్‌ పుజారా…13వ భారతీయ క్రికెటర్‌గా రికార్డు సృష్టించనున్నాడు. మరో వంద పరుగులు చేస్తే.. ఆసీస్‌పై 2వేల పరుగులు చేసిన బ్యాటర్‌గానూ పుజారా రికార్డు సృష్టిస్తాడు. జడేజా ఒక వికెట్‌ తీస్తే టెస్టుల్లో 250 మార్క్‌ను తాకుతాడు. 2వేల 500 పరుగులు, 250 వికెట్లు తీసిన రెండో వేగవంతమైన ఇండియన్ ప్లేయర్‌గా ఘనత దక్కించుకోనున్నాడు. రవిచంద్రన్ అశ్విన్‌ మూడు వికెట్లు తీస్తే.. ఆస్ట్రేలియాపై వంద వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రికార్డు సృష్టించనున్నాడు.

Show comments