NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు విడుదల
కలియు ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రతీరోజూ వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.. ఇక, వైకుంఠ ఏకాదశి వచ్చిందంటే.. తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతుంటాయి.. అయితే, భక్తుల రద్దీ దృష్ట్యా.. వైకుంఠ ద్వార దర్శనానికి ప్రత్యేకంగా టికెట్లు తీసుకొచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. శ్రీవారి ఆలయంలో జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కోసం శ్రీవాణి టికెట్ల ఆన్‌లైన్‌ కోటాను విడుదల చేసేందుకు సిద్ధమైంది.. ఇవాళ ఉదయం 9 గంటలకు విడుదల చేశారు.. రోజుకు రెండు వేల టికెట్ల చొప్పున ఆన్‌లైన్‌లో విడుదల చేశారు అధికారులు.. భక్తులు శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేలు విరాళం ఇవ్వడంతో పాటు రూ.300 దర్శన టికెట్‌ కొనుగోలు చేయాలి… ఆన్‌లైన్‌లో ఈ టికెట్లను బుక్‌ చేసుకున్న భక్తులకు మహాలఘు దర్శనం కల్పించనున్నారు.. మరోవైపు కొత్త ఏడాది ప్రారంభంలోనూ తిరుమలకు భక్తులు పోటెత్తుతారు.. ఆ రద్దీని కూడా దృష్టిలో ఉంచుకుని.. జనవరి 1 మరియు వైకుంఠ ద్వార దర్శనానికి జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు ప్రత్యేక కోటాకు సంభందించిన టికెట్లను ఒకేసారి ఆన్‌లైన్‌లో పెట్టారు..

ఏపీలో మూడు రోజులు వర్షాలు
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి అల్పపీడనంగా మారింది.. ఈ అల్పపీడనం వాయువ్య దిశగా పయనిస్తూ గురువారం నాటికి వాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఈ వాయుగుండం పశ్చిమ నైరుతి దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది.. అయితే, దీని ప్రబాశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖాధికారులు చెబుతున్నారు.. ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడు రాష్ట్రంలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.. ఇవాళ్టి నుంచి ఏపీలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. రాయలసీమ, దక్షిణ కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని.. తమిళనాడు రాష్ట్రంలో ఈ వాయుగుండం ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది ఐఎండీ.. ఈ మధ్యే అటు తమిళనాడుతో పాటు.. ఇటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలో తుఫాన్‌ బీభత్సం సృష్టించింది.. ఇక, మరో అల్పపీడనం ఇప్పుడు టెన్షన్‌ పెడుతోంది.

తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలోని దేవతా విగ్రహాలకు నిత్యం ప్రార్థనలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించిన వారణాసి కోర్టు సవాల్ చేస్తూ జ్ఞాన్‌వాపి మసీదు కమిటీ దాఖలు చేసిన సివిల్ రివిజన్ పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు శుక్రవారం తన తీర్పును రిజర్వ్ చేసింది. ఇరుపక్షాల వాదనలు సుదీర్ఘంగా విన్న తర్వాత జస్టిస్ జేజే మునీర్ తన ఉత్తర్వులను రిజర్వ్ చేశారు. 1993 సంవత్సరంలో జ్ఞానవాపి వెలుపలి గోడలపై భక్తులను శృంగార గౌరీ, ఇతర దేవతలను పూజించకుండా నిషేధించారనే హిందూ పక్షం వాదన కృత్రిమమని కోర్టు ముందు పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్‌ఎఫ్‌ఎ నఖ్వీ వాదించారు. 1993లో మౌఖిక ఉత్తర్వు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పూజను నిలిపివేసిందన్న హిందూ పక్షం వాదనను ప్రార్థనా స్థలాల చట్టాన్ని దాటవేసే కల్పిత వాదన అని నఖ్వీ కోర్టులో వాదించారు. రాష్ట్ర ప్రభుత్వం మౌఖిక ఉత్తర్వులు ఇవ్వదని.. అది వ్రాతపూర్వకంగా ఉండాలన్నారు ఆయన ప్రకారం, 1993లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. హిందూ పక్షం వాదనను అంగీకరించినప్పటికీ, 1993లో వారు ఎందుకు దావా వేయలేదని ఆయన ఎత్తి చూపారు. అందువల్ల, వారణాసి కోర్టులో దాఖలు చేసిన ఈ దావా పరిమితి చట్టం కింద నిషేధించబడింది.

ఈ రోజు కైకాల అంత్యక్రియలు
టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ (87) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇంటి వద్దే చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మృతిపై టాలీవుడ్ సినీ లోకం ఆవేదన చెందుతోంది. ఇప్పటికే రాజకీయ, సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. ఇవాళ మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు అధికారికంగా జరపనున్నారు. వయోభారంతోపాటు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌‌‌‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. అయితే.. నేడు ఉదయం 10.30 గంటలకు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో సత్యనారాయణ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరగనున్నాయి.

శబరిమల యాత్రలో విషాదం
శబరిమల యాత్రలో విషాదం చోటుచేసుకుంది. శబరిమల యాత్రికులు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి లోయలో పడి ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. తమిళనాడు నుంచి యాత్రికులు ప్రయాణిస్తున్న వాహనం ఇడుక్కి జిల్లా కుమిలి-కంబం రహదారిపై వెళ్తుండగా వాగులోకి బోల్తా పడింది. కొందరు ఆప్రమాదాన్ని గుర్తించి పోలీసులకు సమచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనంలో ఓ చిన్నారి సహా తొమ్మిది మంది ఉన్నారు. గాయపడిన ఇద్దరిని కుమిలిలోని ఆసుపత్రికి తరలించారు. వాహనంలో ఇంకా ముగ్గురు చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. వారిని వాహనం నుంచి బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈఘటన ఇడుక్కి జిల్లా కలెక్టర్ కు సమాచారం అందడంతో.. అర్థరాత్రి అక్కడకు చేరుకున్న కలెక్టర్‌ రెస్క్యూ ఆపరేషన్‌ చేసి క్షతగాత్రులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.

తగ్గని ట్రిపుల్ఆర్ క్రేజ్.. జపాన్ బెస్ట్ చిత్రాల జాబితాలో చోటు
విడుదలై పదినెలలవుతున్నా ట్రిపుల్ఆర్ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన చోటల్లా రికార్డులు సృష్టిస్తూ సెన్సేషన్ సృష్టిస్తోంది. ఆస్కార్ అవార్డు గడపదాకా వెళ్లిన ట్రిపుల్ఆర్ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. చిత్రంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల నటనకు జనం నీరాజనం పలుకుతున్నారు. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన తీరుకు హెట్సాఫ్ అంటున్నారు ప్రేక్షకులు. మరి ప్రపంచ వ్యాప్తంగా కూడా సెన్సేషన్ ని రేపిన ఈ చిత్రం గ్లోబల్ గా ఇంకా ఎన్ని రికార్డులు సృష్టిస్తోందో చూడాలి. ఇది ఇలా ఉంటే, ఇక గత కొన్నాళ్ల కితమే జపాన్ దేశంలో భారీ హైప్ తో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం అక్కడ అయితే ఇండియా సినిమాల నుంచి బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచి ఆల్ టైం రికార్డు నెలకొల్పింది. మరి అక్కడ హైయెస్ట్ గ్రాసర్ గా నిలవడమే కాకుండా జపాన్ ఫేమస్ అండ్ లార్జెస్ట్ మూవీ సైట్ లో కూడా సత్తా చాటింది. అక్కడ హాలీవుడ్ చిత్రాల సరసన ట్రిపుల్‎ఆర్ టాప్ 3 చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. దీనితో మేకర్స్ ఈ విషయాన్ని పంచుకొని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ భారీ చిత్రంలో సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి ఇచ్చిన సంగీతం కూడా గ్లోబల్ వైడ్ భారీ ఆదరణ అందుకొని ఆస్కార్ వరకు వెళ్లిన సంగతి తెలిసిందే.

ఇండిగో స్పెషల్‌ ఆఫర్‌..
విమాన ప్రయాణికుల కోసం బంపరాఫర్‌ తీసుకొచ్చింది ఇండిగో ఎయిర్‌లైన్స్‌.. వింటర్‌ సేల్‌ పేరుతో ప్రత్యేక ఆఫర్‌ ప్రకటించింది.. అయితే, ఇది పరిమిత కాలపు ఆఫర్‌.. మూడు రోజుల పాటు దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై తగ్గింపు ధరకు టికెట్లు అందించనున్నట్లు పేర్కొంది.. ఈ ఆఫర్‌లో దేశీయ విమానాలకు రూ. 2,023కు మరియు అంతర్జాతీయ విమానాలకు రూ. 4,999 నుండి విమాన ఛార్జీలు అందుబాటులో ఉంటాయి.. 55 శాతం మార్కెట్ వాటాతో భారతదేశపు అతిపెద్ద దేశీయ విమానయాన సంస్థగా ఉన్న ఇండిగో దేశీయ మరియు అంతర్జాతీయ విమానాల కోసం మూడు రోజుల ప్రత్యేక వింటర్ సేల్‌ ద్వారా తక్కువ ధరకే టికెట్లను అందిస్తోంది.. ఈ ఆఫర్ కింద, భారతీయ విమానయాన సంస్థ 2023 సంవత్సరపు ఆగమనాన్ని పురస్కరించుకుని రూ. 2,023 నుండి విమాన టిక్కెట్లను అందిస్తోంది. ఈ రోజు డిసెంబర్ 23 – 25 మధ్య మూడు రోజుల పాటు ఈ సేల్ నడుస్తుంది. దేశీయ విమానాల కోసం ఛార్జీలు రూ. 2,023 నుండి ప్రారంభమవుతాయి., అంతర్జాతీయ విమానాలకు విమాన ఛార్జీలు రూ. 4,999 నుండి ప్రారంభమవుతాయి. ఈ ప్రత్యేక సేల్‌లో బుక్‌చేసుకున్న టికెట్లపై వచ్చే ఏడాది జనవరి 15 నుండి ఏప్రిల్ 14 వరకు ప్రయాణించేందుకు వెలుసులుబాటు ఉంటుంది.. తగ్గింపుతో కూడిన విమాన ఛార్జీలతో పాటు, టిక్కెట్‌లను బుక్ చేసుకోవడంపై అదనపు ప్రయోజనాలను పొందడానికి కస్టమర్లు ఇండిగో యొక్క బ్యాంకింగ్ భాగస్వామి అయిన హెచ్‌ఎస్బీసీ నుండి క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు.

చందా కొచ్చర్‌ అరెస్ట్
ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు ఆమె భర్త దీపక్ కొచ్చర్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీడియోకాన్‌ గ్రూపునకు రుణాలు మంజూరు చేయడంలో అవకతవకలు, అవినీతికి పాల్పడినట్లు నమోదైన కేసులో విచారణ జరిపిన సీబీఐ వీరిద్దరినీ అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో వీరిని సీబీఐ అధికారులు ఇప్పటికే పలుమార్లు విచారించారు. తాజాగా వీరిద్దరినీ ఢిల్లీలో అరెస్టు చేశారు. ఈ కేసులో దీపక్ కొచ్చర్ 2020లోనే ఒకసారి అరెస్టయ్యారు. వీడియోకాన్ గ్రూపునకు అనుకూలంగా వ్యవహరించి, అవినీతికి పాల్పడారనే అభియోగాలపై ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ పదవి నుంచి చందా కొచ్చర్‌ 2018లో వైదొలిగారు. 2012లో బ్యాంకు సీఈవో హోదాలో రూ. 3,250 కోట్ల రుణం మంజూరు చేశారని.. అది ఎన్‌పీఏగా మారడంతో తద్వారా చందా కొచ్చర్ కుటుంబం లబ్ధి పొందిందని సీబీఐ అభియోగాల్లో పేర్కొన్నారు.

మళ్లీ పెళ్లిచేసుకున్న ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ మళ్లీ పెళ్లి చేసుకున్నారు. అమెరికా సినీ నటుడు, మోడల్ మీర్జా బిలాల్ బేగ్‌ని తాను వివాహం చేసుకున్నట్లు ఆమె శుక్రవారం ట్విటర్ ద్వారా వెల్లడించారు. 49 ఏళ్ల రెహమ్ ఖాన్‌కి ఇది మూడో పెళ్లి. “తల్లిదండ్రులు, కొడుకు సమక్షంలోనే నేను మీర్జా బిలాల్‌ను చంపాను” అని ఆమె ట్విట్టర్‌లో పేర్కొంది. ‘చివరిగా నేను నమ్మగలిగే వ్యక్తిని కనుగొన్నాను’ అంటూ ఓ ఫోటోను షేర్ చేశాడు. తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు గతంలోనే సోషల్ మీడియాలో వెల్లడించింది. రెండు చేతులు పట్టుకుని ఉన్న ఫోటోను పోస్ట్ చేస్తూ ‘జస్ట్ మ్యారీడ్’ అని రాసింది. తాజాగా ఆమె తన ఫోటోను పోస్ట్ చేసింది. మరోవైపు, 39 ఏళ్ల మీర్జా బిలాల్‌కి ఇది మూడో వివాహం కూడా. జర్నలిస్ట్ రెహమ్ ఖాన్ 2015లో ఇమ్రాన్ ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. రెహమ్ ఖాన్ 1973లో లిబియాలో జన్మించారు. పాకిస్థాన్‌లో విద్యాభ్యాసం అనంతరం ఇంగ్లండ్‌లో బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్టుగా పని చేయడం ప్రారంభించాడు. రెహమ్ ఖాన్ 1990ల్లో బ్రిటన్‌లో బ్రాడ్‌కాస్ట్‌ జర్నలిస్ట్‌గా కెరీర్‌ను మొదలుపెట్టారు. 2012లో పాకిస్థాన్‌లో పర్యటించిన తర్వాత ఇమ్రాన్‌ఖాన్‌ను ఓ ఇంటర్వ్యూలో కలిశారు. ఇద్దరూ మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకున్నారు. అయితే 10 నెలల్లోనే ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు మిర్జా బిలాల్‌ను మూడో పెండ్లి చేసుకున్నారు. ప్రస్తుతం రేహమ్‌ ఖాన్‌ వయసు 49 సంవత్సరాలు కాగా, మిర్జా బిలాల్‌ వయసు 36 సంవత్సరాలు. అంటే ఇద్దరి మధ్య 13 సంవత్సరాల వ్యత్యాసం ఉన్నది. కాగా, రేహమ్‌ ఖాన్‌తో విడిపోయిన అనంతరం ఇమ్రాన్‌ ఖాన్‌ కూడా మూడో పెండ్లి చేసుకున్నారు. 2018లోనే ఇమ్రాన్‌ మూడో వివాహం జరిగింది.