NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు పల్నాడు జిల్లాకు డిప్యూటీ సీఎం.. సరస్వతి పవర్ భూములపై ఫోకస్‌..
ఈ రోజు పల్నాడు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి జిల్లాకు రానుండటంతో అధికారులు, నేతలు ఏర్పాట్లు చేశారు. నేడు మధ్యాహ్నం 12 గంటలకు మాచవరం మండలంలోని సరస్వతి పవర్ భూములను పవన్ కల్యాణ్ పరిశీలిస్తారు. ఇప్పటికే సరస్వతి భూములను సర్వే చేయాలని అధికారులను పవన్ ఆదేశించిన విషయం విదితమే కాగా.. వారం రోజుల క్రితమే అధికారులు సర్వే పూర్తి చేశారు. దీంతో నేడు స్వయంగా భూములను పరిశీంచనున్నారు పవన్ కల్యాణ్‌.. అయితే, వైఎస్ హయాంలో కేటాయించిన 15 వందల ఎకరాల భూముల్లో అటవీ భూములున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

పవన్‌ కల్యాణ్‌ కామెంట్లపై స్పందించిన హోం మంత్రి అనిత.. ఆసక్తికర వ్యాఖ్యలు..
డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. ఆసక్తికర కామెంట్లు చేశారు. తాను హోంమంత్రిగా ఫెయిలయ్యానని పవన్ కల్యాణ్‌ అనలేదన్నారు హోం మంత్రి అనిత. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను పాజిటివ్‌గా తీసుకుంటున్నామన్నారు. పవన్ వ్యాఖ్యలను కట్‌ చేసి తప్పుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో భయంకరమైన పోస్టులు పెడుతున్నారని ఫైర్‌ అయ్యారు అనిత. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో అసభ్య మెసేజ్‌లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ కూతుళ్లు, నారా బ్రాహ్మణి, భువనేశ్వరిపై అనుచిత పోస్టింగ్స్ పెడుతున్నారన్నారు హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.. అయితే, ఈ నేపథ్యంలోనే ఆవేదనతోనే పవన్ కల్యాణ్‌ అలా మాట్లాడారు అని తెలిపారు.. నేటికీ నేను సోషల్ మీడియా బాధితురాలినేన్న ఆమె.. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపై జిల్లాల వారీగా సమీక్ష చేస్తున్నాం అన్నారు.. పోలీసు శాఖ నిర్లిప్తత నుంచి బయటకు రావాలి అని హితవు చెప్పారు.. గంజాయి మత్తులో ఉన్న వారు పోలీసులపై ఛాలెంజ్ చేసి వెళ్తున్నారు అంటూ విపక్షంపై కౌంటర్‌ ఎటాక్‌కు దిగారు ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత..

ఉచిత గ్యాస్‌కి సూపర్‌ రెస్పాన్స్‌.. భారీగా బుకింగ్స్‌.. అదే స్థాయిలో డెలివరీ
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. దీపావళి సందర్భంగా దీపం-2 పథకం కింద ఫ్రీ గ్యాస్ సిలెండర్లు పంపిణీ చేస్తున్న విషయం విదితమే కాగా.. ఈ స్కీమ్‌ కింద గ్యాస్‌ బుకింగ్స్‌కి భారీ స్పందన వస్తుందు.. అదే స్థాయిలో డెలివరీ చేస్తోంది కూటమి ప్రభుత్వం.. దీపం-2 పథకం కింద మహిళల జీవితాల్లో వెలుగులు నింపేలా కూటమి ప్రభుత్వం చేపట్టిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి భారీ స్పందన లభిస్తోంది. దీపావళి కానుకగా లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించే కార్యక్రమానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టగా.. ఇప్పటివరకు అంటే 04.11.2024 తేదీ వరకు మొత్తం 16,82,646 సిలిండర్లు బుకింగ్ చేసుకున్నారు.. ఇదే సమయంలో ఇప్పటి వరకు 6,46,350 సిలిండర్లు డెలివరీ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది.. ఇప్పటివరకు సిలిండర్స్ బుక్ చేసుకున్న లబ్ధిదారులకు రూ.38.07 కోట్ల సబ్సిడీ అందించాల్సి ఉండగా.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.16.97 కోట్ల సబ్సిడీ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది. ఇక, 04.11.2024 తేదీన ఒక్కరోజే దీపం-2 పథకం కింద 64,980 గ్యాస్ సిలిండర్లు బుక్ కాగా.. 17,313 సిలిండర్లు డెలివరీ చేశారు. 03.11.2024 తేదీన ఒక్కరోజే 6,29,037 సిలిండర్లు డెలివరీ చేసినట్టు అధికారులు చెబుతున్నారు.. ఉచిత గ్యాస్ సిలిండర్ల నిమిత్తం ఏర్పాటు చేసిన 1967 టోల్ ఫ్రీ నంబర్ కు ఇప్పటి వరకు 3660 కాల్స్ రాగా వాటికి పరిష్కారం చూపడం జరిగినట్టు వెల్లడించారు జరిగింది.

నేడు హైదరాబాద్కు రాహుల్ గాంధీ.. కులగణనపై చర్చ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈరోజు (మంగళవారం) సాయంత్రం హైదరాబాద్ కు వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి తెలంగాణలో ప్రారంభించనున్న కులగణనపై ప్రజలు, మేధావులు, వివిధ సామాజిక వర్గాల వారి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ఆయన ఇక్కడకు రానున్నారు. పీసీసీ ఆధ్వర్యంలో బోయిన్ పల్లిలోని గాంధీ ఐడియాలాజీ సెంటర్​లో నిర్వహిస్తున్న మీటింగ్​లో రాహుల్ పాల్గొననున్నారు. సాయంత్రం 4.45 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుని.. 5 గంటలకు అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా 5.20 గంటలకు బోయిన్ పల్లిలోని గాంధీ ఐడియాలాజీ సెంటర్ కు వెళ్లనున్నారు. సాయంత్రం 5. 30 గంటలకు కుల గణనపై నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. సరిగ్గా గంట పాటు కొనసాగనున్న ఈ మీటింగ్ తర్వాత ఆయన తిరిగి 7. 10 గంటలకు రోడ్డు మార్గంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోని తిరిగి ఢిల్లీకి రాహుల్ గాంధీ పయనం కానున్నారు.

నేడు అమెరికా అధ్యక్ష ఎన్నికలు..
అమెరికాలో ప్రతి ప్రతి నాలుగేళ్లకు జరిగే లీఫ్ ఇయర్ నవంబర్ ఫస్ట్ మంగళవారం ఇక్కడ ఎన్నికలు జరుగుతాయి. ఈ సారి ఎన్నికల్లో గెలిచిన వారు.. జనవరిలో పదవీ బాధ్యతలు తీసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. నేడు జరగనున్న ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరుపున డొనాల్డ్ ట్రంప్ బరిలో ఉండగా.. డెమాక్రాట్స్ తరుపున కమల్ హారిస్ పోటీ చేస్తున్నారు. అగ్రరాజ్యం ఎన్నికలపైనే ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. అయితే, దాదాపుగా 24.4 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. ఇప్పటికే 7.5 కోట్ల మంది ముందస్తు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు ట్రంప్, హారిస్‌ తమ ప్రచార చివరి అంకంలో ఓటర్లను ఆకట్టుకునే పనిలో నిమగ్నమైయ్యారు. మెయిల్స్, పోలింగ్‌ కేంద్రాల ద్వారా యూఎస్ ప్రజలు తమ ఓట్లను వేస్తున్నారు. ఇక, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ నార్త్‌ కరోలినాలో మకాం వేశారు. 2016, 2020లలో తనకు సపోర్టుగా నిలిచిన ఈ రాష్ట్రంపై ఆయన ఎక్కువగా నజర్ పెట్టారు. న్యూమెక్సికో, వర్జీనియాలనూ సైతం సీరియస్‌గా తీసుకున్నారు ఆయన. అలాగే, డెమోక్రటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌ వరుస ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు. తుఫాన్ కారణంగా నార్త్‌ కరోలినా పశ్చిమ ప్రాంతంలో తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో ఈ ప్రాంత ఓటర్లు ఎటు వైపు మొగ్గుతారనే దానిపై సందిగ్ధత కొనసాగుతుంది. అయితే, శుక్రవారం నాటికి నార్త్‌ కరోలినాలో 78 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మరో ప్రయోగానికి సిద్ధమైన ‘నథింగ్‌’!
‘నథింగ్‌’ ఫోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. ట్రాన్స్‌పరెంట్‌ లుక్‌తో మొబైల్ మార్కెట్‌లో సంచలనం రేపింది. స్మార్ట్‌ఫోన్‌ అంటే ఇలానే ఉండాలనే కట్టుబాట్లకు తన ట్రాన్స్‌పరెంట్‌ లుక్‌తో నథింగ్‌ చెక్‌ పెట్టింది. ఇక ఇప్పుడు మరో నథింగ్‌ ప్రయోగానికి సిద్ధమైంది. ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (ఓఎస్‌)లో ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ల ఆధిపత్యం కొనసాగుతున్న ఈ సమయంలో సొంతంగానే ఓ ఓఎస్‌ను రూపొందించాలని ప్లాన్ చేస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ వ్యవస్థాపకుడు కార్ల్‌ పై వెల్లడించారు. ఓ సదస్సులో కార్ల్‌ పై మాట్లాడుతూ… ‘కొత్త ఆపరేటింగ్‌ సిస్టమ్‌ రూపొందించేందుకు కావాల్సిన అవకాశాలను పరిశీలిస్తున్నాం. తద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలనుకుంటున్నాం. ఇందులో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్లను కూడా జోడిస్తాం. సొంత ఓఎస్‌ ద్వారా మెరుగైన యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌ను అందించడానికి సాధ్యపడుతుంది. నిధుల కొరత ఉన్నప్పటికీ కంపెనీ దీనిపై పనిచేయగలదు’ అని తెలిపారు. ప్రస్తుతం మొబైల్‌ మార్కెట్‌లో ఆండ్రాయిడ్‌దే హవా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా స్మార్ట్‌ఫోన్లు ఆండ్రాయిడ్‌ ఓఎస్‌పై పనిచేస్తుంటాయి. యాపిల్‌ మాత్రం సొంతగా ఐఓఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను రూపొందించుకుంది. హువావే కంపెనీ హర్మనీ ఓఎస్‌ను తయారు చేసింది. ఇప్పుడు నథింగ్‌ సొంతగా ఐఓఎస్‌ను రూపొందించాలను చూస్తోంది. చూడాలి నథింగ్‌ ప్లాన్‌ ఎంత వరకు సక్సెస్ అవుతుందో.

టీమిండియా ఆటగాళ్లు కూడా అందరిలాగే: డౌల్‌
స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత్ 3-0 తేడాతో ఓడిపోయింది. టెస్టు చరిత్రలో భారత గడ్డపై రెండో వైట్‌వాష్‌ను ఎదుర్కొంది. దీనికి కారణం స్పిన్‌లో మనోళ్లు తేలిపోవడమే. స్వదేశంలో స్పిన్‌ పిచ్‌లపై ప్రత్యర్థి జట్లను చిత్తు చేయడం టీమిండియాకు అలవాటు. ఇప్పుడు మన బలమే బలహీనతగా మారింది. మన స్పిన్ ఉచ్చు మన మెడకే చుట్టుకుంటోంది. దాంతో రోహిత్ సేనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో న్యూజిలాండ్‌ మాజీ బౌలర్‌ సైమన్‌ డౌల్‌ స్పందించాడు. స్పిన్‌ను భారత్ బాగా ఆడుతుందనే తప్పుడు అభిప్రాయం ఉందని కామెంటేటర్ సైమన్‌ డౌల్‌ పేర్కొన్నాడు. ‘స్పిన్‌ను భారత్ బాగా ఆడుతుందనే తప్పుడు అభిప్రాయం ఉంది. టీమిండియా ఆటగాళ్లు కూడా అందరిలాగే. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్‌, వీవీఎస్ లక్ష్మణ్‌ రోజులు వెళ్లిపోయాయి. ఇప్పుడు భారత్ ఆటగాళ్లు స్పిన్‌ ఆడలేక తడబడుతున్నారు. ఐపీఎల్‌లోనూ బంతి కాస్త తిరగగానే కుప్పకూలుతున్నారు. భారత్ తయారు చేస్తున్న పిచ్‌ల కారణంగా సగటు స్పిన్నర్లు కూడా టాప్ ఇండియన్ ఆటగాళ్లను అవుట్ చేస్తున్నారు’ అని సైమన్‌ డౌల్‌ అన్నాడు. ‘న్యూజిలాండ్‌పై ఓటమి అనంతరం భారత్ ఇప్పుడు ఆస్ట్రేలియాకు వెళుతుంది. అక్కడ బౌన్సీ పిచ్‌లపై మంచి ప్రదర్శన చేయడం అంత తేలిక కాదు. అయితే మునుపటి రెండు సిరీస్ విజయాలు భారత జట్టుకు సానుకూలం అని చెప్పాలి. న్యూజిలాండ్‌పై భారీ ఓటమి కారణంగా ఆసీస్‌పై బలంగా పుంజుకుంటుందని భావిస్తున్నా. అందరూ ఆస్ట్రేలియా-భారత్ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు’ అని సైమన్‌ డౌల్‌ తెలిపాడు.

తొలిసారి అక్కడ మిలియన్ క్లబ్ లో శివ కార్తికేయన్
శివ కార్తికేయన్ లేటెస్ట్ రిలీజ్ ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి దర్శకతంలో వహించిన ఈ సినిమా ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా తెరక్కెక్కింది. మలయాళ భామ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. రాజ్ కమల్ బ్యానర్ పై కమల్ హాసన్ , సోనీ పిచర్స్ సంయుక్తంగా ‘అమరన్’ ను నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా తెలుగు, తమిళ్, మళయాళం లో రిలీజ్ అయిన ఈ సినిమా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో ఈ సినిమాను హీరో నితిన్ శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై రిలీజ్ చేసారు. కాగా ఈ సినిమాతో కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందుకున్నాడు శివ కార్తికేయన్. ఇప్పటికి విడుదలైన అన్ని ఏరియాస్ లో బ్రేక్ ఈవెన్ సాధించి లాభల బాటలో పయనిస్తోంది. అటు ఓవర్సీస్ లో అమరన్ మరో మైల్ స్టోన్ చేరుకుంది. ఓవర్సీస్ లోని నార్త్ అమెరికాలో 1 మిలియన్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. మొదటి సారి శివ కార్తికేయన్ సినిమా నార్త్ అమెరికాలో వన్ మిలియన్ రాబట్టిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. బయోపిక్ కావడం ముకుంద్, ఇందూల ప్రేమ ప్రతిఒక్క ప్రేక్షుకుడిని మనసుని హత్తుకునెలా చేసింది. మరో పది రోజులు పాటు బడా సినిమాలు ఏవి లేకపోవడంతో అమరన్ కు ఓవర్సీస్ లో లాంగ్ రన్ వుండే అవకాశం ఉంది. ఇటు సౌత్ లోను అమరన్ విడుదలైన అన్ని చోట్ల రికార్డు స్థాయి కలక్షన్స్ తో శివకార్తికేయన్ కెరిర బెస్ట్ సినిమాగా నిలవనుంది అమరన్.

తెలుగు రాజకీయాల్లోకి నటి కస్తూరి.. ఏ పార్టీ అంటే..?
సినీ నటి కస్తూరి తెలుగు వారిపై ‘ రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన వారే తెలుగు వారని, అలా వచ్చిన వారంతా ఇపుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు చేసిన సంగతి తెలిసిందే. కస్తూరి వ్యాఖ్యలపై చెన్నైలోని తెలుగు సంఘాలు మండిపడ్డాయి. దీంతో కస్తూరి వివరణ ఇస్తూ ” తెలుగుప్రజల గురించి నేను తప్పుగా మాట్లాడినట్లు ప్రచారం చేస్తున్నారు. డీఎంకే వాళ్లు కావాలని నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నాపై నెగిటివిటీ తీసుకొచ్చి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ ప్రజలు నాపై ఎంతో అభిమానం చూపుతున్నారు. నన్ను వారు ఎంతగానో ఆదరించారు. ఆ ప్రేమను దూరం చేసేందుకు డీఎంకే వాళ్లు నాపై కుట్ర చేస్తున్నారు” అని అన్నారు. అలాగే తెలుగు నా మెట్టినిల్లు, తెలుగు వారంతా నా కుటుంబం అంటూ వివరణ ఇచ్చిన కస్తూరిశంకర్ మరికొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. తమిళనాడులో అధికార డీఎంకే నేతల టార్చర్ భరించలేకపోతున్నానని, తనకు హైదరాబాద్ అభయం ఇచ్చిందన్నారు. ఇప్పటివరకూ తమిళ రాజకీయాలపై మాట్లాడాను, కానీ ఇప్పుడు చెబుతున్నా  ఇక నుండి తెలుగు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాను, ఇది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నేను చేసిన వ్యాఖ్యలపై ఇక్కడి వారు కనీసం వివరణ కూడా అడగకుండా తిట్టారు, కానీ తెలుగు ప్రజలు మాత్రం మీరు ఇలా అన్నారంటే నమ్మలేకున్నాం అని  వివరణ కోరారు, దటీజ్ తెలుగు ప్రజలు, త్వరలో తెలంగాణా పాలిటిక్స్ వస్తాను,  పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు రాయబారిగా పని చేస్తాను ” అని అన్నారు.

Show comments